
భూ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు
వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్
22న తెలంగాణ పార్టీ ప్లీనరీ..
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రారంభించిన ఎనీవేర్ రిజిస్ట్రే షన్ కాస్త ఎనీవేర్ కరప్షన్‌గా మారిందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాల వల్లే ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి భూ కుంభకోణా లకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఈ నెల 22న ప్లీనరీ..
ఈ నెల 22న హైదరాబాద్‌లోని నాగోలు ఫంక్షన్ హాలులో వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ ప్లీనరీ నిర్వహించనున్నట్లు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతారని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు 8 వేల మందితో ప్లీనరీ నిర్వహిస్తా మన్నారు. పార్టీ బలోపేతం, కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు.. నీళ్లు, నిధులు, నియామకాలు, రాబోయే రెండేళ్లలో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ ఉంటుందన్నారు. కోటి ఎకరాలకు నీళ్లిస్తామన్న వాగ్దానం అమలు ఏ దశలో ఉంది, నిరుద్యోగ యువతకు లక్ష ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారో సమీక్షి స్తామని చెప్పారు. పాలమూరు–రంగా రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల అంశం కోర్టుకు వెళ్లిందని.. ఈ విషయమై ప్రభుత్వ న్యాయ నిపుణులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
సీఈసీ సభ్యుడిగా సింగిరెడ్డి..
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సింగిరెడ్డి భాస్కరరెడ్డిని పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యు డిగా నియమించినట్లు శ్రీకాంత్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.