
సాక్షి,హైదరాబాద్: ఐఏఎస్ అమోయ్‌కుమార్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసుల విచారణలో కీలక మలుపు తిరిగింది.నాగారం ల్యాండ్ స్కామ్ ఈడీ పోలీసుల నుంచి సమాచారం తీసుకుంది. అమోయ్‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై వివరాల కోసం తెలంగాణ డీజీపీకి తాజాగా ఈడీ లేఖ రాసింది.
భూ అక్రమాలపై ఇప్పటి వరకు 12 ఫిర్యాదులు వచ్చాయని లేఖలో డీజీపీకి ఈడీ తెలిపింది. ఈడీ లేఖకు తెలంగాణ డీజీపీ స్పందించారు. నాగారం తో పాటు పలు కేసులకు సంబంధించిన వివరాలను ఈడీకి అందజేశారు. ఈడీకి చేరిన శంకరాహిల్స్ సొసైటీ, బాలసాయిబాబా ట్రస్ట్, నాగారం,రాయదుర్గం ల్యాండ్‌ల వివరాలిచ్చారు.పోలీసుల నుంచి వివరాలు రావడంతో ఈడీ విచారణ వేగవంతం చేయనుంది.
ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. ప్రభాకర్‌రావుకు గ్రీన్‌కార్డు..?
Comments
Please login to add a commentAdd a comment