
సాక్షి,హైదరాబాద్: భూముల కేటాయింపుల వ్యవహారంలో తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారి అమోయ్‌కుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించింది. బుధవారం(అక్టోబర్ 23) ఈడీ కార్యాలయంలో అమోయ్‌కుమార్‌ను సుదీర్ఘంగా 8 గంటల పాటు విచారించిన అధికారులు ఆయన స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. రంగారెడ్డిజిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో జిల్లాలో భూదాన్ భూముల్లో జరిగిన అవకతవకలపై అమోయ్‌కుమార్‌ను ఈడీ ప్రశ్నించినట్లు తెలిసింది.
ఇదే అంశంలో తహసిల్దార్ జ్యోతి, ఆర్డీవో ఇతర సిబ్బంది చేసిన అవకతవకలపైనా ఈడీ ఆరా తీసినట్లు సమాచారం. భూదాన్ భూముల్లో జరిగిన అవకతవకలపై మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వాలని అమోయ్‌కుమార్‌ను ఈడీ కోరినట్లు తెలిసింది.
కాగా, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అమోయ్‌కుమార్ రంగారెడ్డి కలెక్టర్‌గా పనిచేశారు. ఆయన కలెక్టర్‌గా ఉన్న సమయంలో భూ కేటాయింపుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై విచారించేందుకు ఈడీ అమోయ్‌కుమార్‌కు నోటీసులిచ్చి విచారణకు పిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment