MLC Deepakreddy
-
కోర్టు తీర్పుల్నీ సృష్టించారు!
- వీటి ఆధారంగానే న్యాయస్థానాల నుంచి సర్టిఫైడ్ కాపీలు - ఈ సీసీలను చూపించి కింది కోర్టుల నుంచి ఉత్తర్వులు - వెలుగులోకి వస్తున్న ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, సక్సేనా వ్యవహారాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని ఖరీదైన స్థలాలపై కన్నేసి బోగస్ డాక్యుమెంట్లు, వ్యక్తులతో వాటిని కబ్జా చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి, న్యాయవాది శైలేష్ సక్సేనా వ్యవహా రాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. లేని వ్యక్తుల పేర్లతో వ్యాజ్యాలు దాఖలు చేసిన వ్యవహారాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించిన విషయం విదితమే. వీరిని అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో మరిన్ని విస్తుగొలిపే అంశాలు బయపడుతున్నాయి. న్యాయస్థానాల అంతర్గత సిబ్బంది సహకారంతో దీపక్‌రెడ్డి ముఠా లేని తీర్పుల్ని సృష్టించినట్లు పోలీసులు ప్రాథమికంగా ఆధారాలు సేక రించారు. వీటి ఆధారంగా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. శివభూషణం, ఇక్బాల్ ఇస్లాం ఖాన్, షకీల్ ఇస్లాం ఖాన్ పేర్లతో సృష్టించిన బోగస్ వ్యక్తుల సాయంతో, నకిలీ డాక్యుమెంట్లతో న్యాయస్థానాల్లో కేసులు వేయించి స్థలాల అసలు యజమానుల్ని ఇబ్బందులకు గురి చేసింది. కింది కోర్టుల నుంచి తమకు అనుకూలంగా తీర్పులు తెచ్చుకో వడానికి న్యాయస్థానాల్నీ తప్పుదారి పట్టించిందని పోలీ సులు చెబుతున్నారు. ఏదైనా స్థలానికి సంబంధించి కింది కోర్టులో వ్యాజ్యం నడుస్తుంటే.. దానికి సంబంధించి పైకో ర్టు అప్పటికే తీర్పులు ఇచ్చినట్లు దీపక్ రెడ్డి, సక్సేనా కథలు నడిపారని తెలుస్తోంది. సక్సేనా పాత తేదీలతో కొన్ని కోర్టు తీర్పుల్ని తయారు చేసేవాడు. వాటిని న్యాయస్థానా ల అంతర్గత సిబ్బంది సహకారంతో రికార్డుల్లోకి చొప్పిం చేవాడు. ఆపై సక్సేనా ద్వారా ఆ తీర్పుల సర్టిఫైడ్ కాపీలు (సీసీ) కావాలంటూ అదే న్యాయస్థానంలో పిటిషన్ దాఖ లు చేయించేవారు. ఇలా సీసీలు పొందాక తాము చొప్పిం చిన బోగస్ తీర్పు ప్రతుల్నీ అంతర్గత సిబ్బంది సాయం తోనే బయటకు తీయించేసేవారు. దీనికి కొందరు సిబ్బం దికి వారు భారీగా నజరానాగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సీసీలను కింది కోర్టుల్లో దాఖలు చేసి న్యాయస్థానాలనూ తప్పుదారి పట్టిస్తూ తమకు అనుకూలంగా తీర్పులు పొందేవారని చెబుతున్నారు. వీరికి సహకరించిన సిబ్బం ది ఎవరనేది ఆరా తీయాలని పోలీసులు నిర్ణయించారు. -
హైకోర్టునే మోసగించే కుట్ర
- లేని వ్యక్తుల పేర్లతో భూమిని కాజేసేందుకు దీపక్‌రెడ్డి, సక్సేనా యత్నం - వరుసగా తప్పుడు పిటిషన్లు దాఖలు - అనుమానంతో వారి హాజరుకు కోర్టు ఆదేశం - వారెవరూ రాకపోవడంతో మోసం గ్రహించిన హైకోర్టు - 14 పిటిషన్ల కొట్టివేత.. సక్సేనాపై ఫిర్యాదు చేయాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: విలువైన భూములు కాజేసేందుకు ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, ఆయన అనుచరుడు బి.శైలేష్ సక్సేనాల బండారం హైకోర్టు సాక్షిగా బట్టబయలైంది. లేని వ్యక్తుల పేర్లను తెరపైకి తీసుకొచ్చి, వారి పేర్లతో తప్పుడు పిటిషన్లు వేసి నడిపించిన కుట్ర భగ్నమైంది. దీపక్‌రెడ్డి, సక్సేనాల చర్యలపై సందేహం వచ్చిన హైకోర్టు.. భూము ల హక్కుదారులుగా పిటిషన్లు వేసిన వారిని స్వయంగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. వారెవరూ కోర్టు ఎదుట హాజరు కాకపోవడంతో ఇదంతా మోసమని గ్రహించి.. లేని వ్యక్తుల పేర్లతో దాఖలైన 14 పిటిషన్లను కొట్టివేసింది. తప్పుడు పిటిషన్లు దాఖలు చేసిన సక్సేనాపై పోలీసులకు ఫిర్యాదు చేయా లని రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) వెంకటేశ్వర రెడ్డిని ఆదేశించింది. ఈ కేసులకు సంబంధిం చిన ఫైళ్లు మాయమైపోవడంలో హైకోర్టు సిబ్బంది ప్రమేయంపైనా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వర రావు మంగళవారం తీర్పు వెలువరించారు. విలువైన భూములపై కన్ను హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్, భోజగుట్ట ప్రాంతంలోని భూమిని ప్రభుత్వం అయోధ్య నగర్ మ్యూచువల్ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌కి కేటాయిస్తూ 2008లో జీవో 455 జారీ చేసింది. అయితే ఆ భూమిపై కన్నేసిన దీపక్‌రెడ్డి, సక్సేనాలు.. కాజేసేందుకు కుట్రకు తెరలేపారు. ఆ భూమి అసలు యజ మాని జస్టిస్ సర్దార్ అలీఖాన్ వారసులంటూ ఇక్బాల్ ఇస్లాంఖాన్, నజీముద్దీన్ ఇస్లాంఖాన్, హబీద్ ఇస్లాంఖాన్, ఇప్తేకర్ ఇస్లాంఖాన్, షకీల్ ఇస్లాంఖాన్ పేర్లతో కొందరిని తెరపైకి తెచ్చా రు. శివభూషణం అనే వ్యక్తిని ఇక్బాల్ ఇస్లాం ఖాన్‌గా నటించేందుకు ఒప్పించి.. భోజగుట్ట భూమికి సంబంధించి భూ ఆక్రమణల నిరోదక న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. తర్వాత ఇక్బాల్ వారసుడిగా షకీల్ ఇస్లాంఖాన్‌ను తెర పైకి తెచ్చారు. బషీర్ అనే వ్యక్తిని షకీల్‌గా నటింపజేశారు. అతడితో భోజగుట్ట భూమి తనదంటూ 2008, 2009, 2012లో హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేయించారు. తరువాత షకీల్ తమకు భూమిని విక్రయిం చాడని, అందువల్ల అయోధ్య సొసైటీకి జరి పిన కేటాయింపులు రద్దు చేయాలంటూ... సక్సేనా తండ్రికి చెందిన జై హనుమాన్ ఎస్టేట్స్ సంస్థ, దీపక్‌రెడ్డి, మరొకరు 2014లో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ కొనసాగింది. ఆ పిటిషనర్లు లేనే లేరు.. ఇటీవల దీపక్‌రెడ్డి, శైలేష్ సక్సేనాల భూ భాగోతాలపై పత్రికల్లో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. దీంతో విచారణ జరిపిన అయోధ్యనగర్ సొసైటీ ప్రతినిధులు.. వాస్తవాలను తమ న్యాయవాది ద్వారా కోర్టు ముందుంచారు. అసలు పిటిషన్లు దాఖలు చేసిన ఇక్బాల్, షకీల్ తదితర వ్యక్తులెవరూ లేరని, వారంతా దీపక్‌రెడ్డి, శైలేష్ సక్సేనాల సృష్టి అని కోర్టుకు నివేదించారు. కావాలంటే ఆయా పిటిషనర్లను ఆధార్‌కార్డులతో సహా కోర్టు ముందు హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... షకీల్, నజీముద్దీన్, హబీద్, ఇప్తేకర్ తదితరులు స్వయంగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించారు. వారికి నోటీసులు పంపాలని రిజిస్ట్రీకి సూచించారు. ఈ మేరకు నోటీసులు అందచేయడానికి వెళ్లిన హైకోర్టు ఉద్యోగులకు పిటిషనర్ల పేరిట ఇచ్చిన చిరునామాలు నకిలీవని తెలిసింది. తాజాగా మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు రిజిస్ట్రీ ఈ విషయాన్ని న్యాయమూర్తికి వివరించారు. దీంతో దీపక్‌రెడ్డి, శైలేష్ సక్సేనాల కుట్రను గుర్తించిన న్యాయమూర్తి.. షకీల్, ఇక్బాల్ తదితర పేర్లతో దాఖలు చేసిన వ్యాజ్యాలన్నింటినీ కొట్టివేశారు. తప్పుడు పేర్లతో పిటిషన్లు దాఖలు చేసిన శైలేష్ సక్సేనాపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. -
భూ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు
వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ 22న తెలంగాణ పార్టీ ప్లీనరీ.. సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రారంభించిన ఎనీవేర్ రిజిస్ట్రే షన్ కాస్త ఎనీవేర్ కరప్షన్గా మారిందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాల వల్లే ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి భూ కుంభకోణా లకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నెల 22న ప్లీనరీ.. ఈ నెల 22న హైదరాబాద్‌లోని నాగోలు ఫంక్షన్ హాలులో వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ ప్లీనరీ నిర్వహించనున్నట్లు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరవుతారని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు 8 వేల మందితో ప్లీనరీ నిర్వహిస్తా మన్నారు. పార్టీ బలోపేతం, కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు.. నీళ్లు, నిధులు, నియామకాలు, రాబోయే రెండేళ్లలో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ ఉంటుందన్నారు. కోటి ఎకరాలకు నీళ్లిస్తామన్న వాగ్దానం అమలు ఏ దశలో ఉంది, నిరుద్యోగ యువతకు లక్ష ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారో సమీక్షి స్తామని చెప్పారు. పాలమూరు–రంగా రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల అంశం కోర్టుకు వెళ్లిందని.. ఈ విషయమై ప్రభుత్వ న్యాయ నిపుణులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఈసీ సభ్యుడిగా సింగిరెడ్డి.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సింగిరెడ్డి భాస్కరరెడ్డిని పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యు డిగా నియమించినట్లు శ్రీకాంత్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం.. దీపక్‌రెడ్డి!
కబ్జాలకు భారీ కథలే నడిపిన టీడీపీ ఎమ్మెల్సీ - ముస్తఫానగర్ వాసులపై హత్య, కిడ్నాప్ కేసులు - రాజీకి రావాలంటే ఒక్కో ఇంటికి రూ.లక్ష డిమాండ్ సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి తాను కన్నేసిన స్థలాన్నల్లా కబ్జా చేయడానికి న్యాయవాది శైలేష్ సక్సేనాతో కలసి నడిపిన కథలు అన్నీ ఇన్నీ కావు. భోజగుట్ట స్థలాన్ని కైకర్యం చేసుకోవడానికి ముస్తఫానగర్ వాసులపై హత్య, కిడ్నాప్ కేసులు సైతం నమోదు చేయించారు. దీపక్‌రెడ్డి, శైలేష్‌లను గత మంగళవారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. వీరిని తదుపరి విచారణ నిమిత్తం నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోపక్క ఇది భారీ భూ కుంభకోణం కావడంతో పూర్తి వివరాలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి లేఖ రాయాలని నిర్ణయించామని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు సైతం ఈ కేసుల ఆరాకై సీసీఎస్ అధికారుల్ని సంప్రదిస్తున్నారని తెలిసింది. నకిలీ యజమానుల మధ్య వ్యాజ్యం..! గుడిమల్కాపూర్‌లోని భోజగుట్టలో 78.22 ఎకరాలపై కన్నేసిన దీపక్‌రెడ్డి అండ్ కో దీన్ని కైవసం చేసుకోవడానికి భారీ కథే నడిపింది. మావూరి శివభూషణంను ఇక్బాల్ ఇస్లాంఖాన్‌గా చూపిస్తూ అతడి నుంచి ఆ స్థలం ఖరీదు చేసినట్లు దీపక్‌రెడ్డి జీపీఏ చేయించుకున్నారు. స్థలం పూర్తిగా తన ఆధీనం కావడానికి... ఇక్బాల్‌కు ఓ నకిలీ సోదరినీ రంగంలోకి దింపారు. సదరు స్థలం దీపక్‌రెడ్డికి విక్రయించడంపై తనకు అభ్యంతరం ఉందని ఆమె ద్వారా రంగారెడ్డి జిల్లా కోర్టులో సివిల్ పిటిషన్ వేయించారు. కొన్ని రోజులు వ్యాజ్యం నడిచిన తర్వాత రాజీ పడతామని ‘అన్నా చెల్లెళ్లు’లోక్‌అదాలత్‌ను ఆశ్రయించగా... సదరు స్థలాన్ని దీపక్‌రెడ్డికి విక్రయించవచ్చంటూ తీర్పు వచ్చింది. దీని ఆధారంగా దీపక్‌రెడ్డి ఆ స్థలాన్ని తన పేరుకి మార్చుకున్నాడు. ముస్తఫానగర్ వాసులకు ముప్పుతిప్పలు భోజగుట్టలో ఉన్న 78.22 ఎకరాల్లో దాదాపు ఆరు ఎకరాలను ప్రభుత్వం ముస్తఫానగర్ వాసులకు కేటాయించింది. దానికి సంబంధిం చి ఈ బస్తీ వాసులకు, దీపక్‌రెడ్డికి మధ్య వ్యాజ్యాలు నడుస్తున్నాయి. వీరందరినీ భయభ్రాంతులతో కేసులు ఉపసంహరించుకునేలా చేయాలని దీపక్‌రెడ్డి, శైలేష్ భావించారు. ఇందుకు ఇక్బాల్ పాత్రను 2012లో చంపేశారు. సదరు ఇక్బాల్‌ను ముస్తఫానగర్ వాసులే హత్య చేశారని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించాలం టూ శైలేష్ తండ్రి ప్రకాష్ సక్సేనా కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆసిఫ్‌నగర్ పోలీసుస్టేషన్లో ముస్తఫానగర్ వాసులపై హత్య కేసు సైతం నమోదైంది. తన వాచ్‌మెన్‌ను ముస్తఫానగర్ వాసులు కిడ్నాప్ చేశారంటూ రెండు నెలల క్రితం తాడిపత్రిలో మరో కేసు నమోదు చేయించారు. రాజీకి రావాలంటే ...: శివారు ప్రాంతాల్లోనూ ఖరీదైన, ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించే దీపక్‌రెడ్డి అండ్ కో వాటికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి, బోగస్ వ్యక్తుల్ని వాటికి యజమానులుగా చూపుతుం ది. వారి జీపీఏల ఆధారంగా న్యాయస్థానాల్లో కేసులు వేసి స్థలాల యజమానులను ఇబ్బందులకు గురి చేస్తుంది. కేసుల భారం భరించలేక ఎవరైనా రాజీకి వస్తే భారీ మొత్తం డిమాండ్ చేస్తుంది. బంజారాహిల్స్‌లో ఉన్న స్థలానికి దాని యజమానికి రూ.10 కోట్లు డిమాండ్ చేసినట్లు సీసీఎస్ పోలీసుల విచారణలో తేలింది. భోజగుట్ట వాసులు రాజీ కోరగా... ఒక్కో ఇంటికి రూ.70వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లిస్తేనే ఆలోచిస్తామంటూ దీపక్‌రెడ్డి చెప్పినట్లు తెలిసింది. మరోపక్క దీపక్‌రెడ్డి కబ్జా చేసి, తాను ఖరీదు చేసినట్లు రికార్డులు రూపొందించిన బంజారాహిల్స్ రోడ్ నెం.2 లోని 3.37 ఎకరాల స్థలం ఎవరి నుంచి, ఎంతకు ఖరీదు చేశారని ప్రశ్నించగా... తనకు ‘గుర్తులేదు’అని దీపక్‌రెడ్డి చెప్పాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. బంజారాహిల్స్ కేసులో దీపక్‌రెడ్డి అరెస్టు... బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.2లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న సర్వే నెం.129/71లోని 3.37 ఎకరాల స్థలానికి సంబంధించిన కేసులో దీపక్‌రెడ్డికి గతంలో న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇచ్చింది. సీసీఎస్ పోలీసుల అభ్యర్థన మేరకు దీన్ని న్యాయస్థానం రద్దు చేసింది. దీంతో జ్యుడీషి యల్ రిమాండ్‌లో ఉన్న దీపక్‌రెడ్డిని ఈ కేసులో పీటీ వారెంట్‌పై సోమవారం అరెస్టు చేశారు. అలాగే... దీపక్‌రెడ్డితో పాటు శైలేష్ సక్సేనా, శ్రీని వాస్‌లను తదుపరి విచారణ నిమిత్తం నాలుగు రోజుల కస్టడీకి అప్పగి స్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. బోగస్ డాక్యుమెంట్ల సృష్టికి సంబంధిం చి చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఫిర్యాదుతో 2011 లో దీపక్‌రెడ్డిపై అబిడ్స్ ఠాణాలో నమోదైన కేసును ఉన్నతాధికారులు తాజాగా సీసీఎస్‌కు బదిలీ చేశారు. -
అఫిడవిట్టే అడ్డంగా పట్టించింది!
- టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి బుక్కైంది దాంతోనే.. - నోటీసులిస్తే సంబంధం లేదంటూ సమాధానం - ఈసీ నుంచి అఫిడవిట్ తీసుకున్న సీసీఎస్ - అందులో ‘ఆ స్థలాలు’ తనవేనంటూ స్పష్టీకరణ - షకీల్ ఇస్లాం ఖాన్‌గా నటించిన బషీర్ అరెస్ట్ సాక్షి, హైదరాబాద్: అసలే ఎమ్మెల్సీ.. అందునా పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేత.. దీంతో దీపక్‌రెడ్డి అరెస్టు విషయంలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వ్మూహాత్మకంగా వ్యవహరించారు. నోటీసులు ఇచ్చినప్పుడు సంబంధం లేదంటూ తప్పించుకోజూసిన దీపక్‌రెడ్డి బండారం బయట పెట్టింది ఆయన దాఖలు చేసిన అఫిడవిట్టే. దీపక్‌రెడ్డితో పాటు కబ్జా వ్యవహారాల్లో సహ నిందితుడు న్యాయవాది శైలేష్ సక్సేనా వ్యవ హారాలను పోలీసులు లోతుగా ఆరా తీస్తు న్నారు. వీరు బినామీలుగా వినియోగిం చుకున్న వారికోసం గాలిస్తున్నారు. కాగా, భోజగుట్ట భూమిని కబ్జా చేయడానికి షకీల్ ఇస్లాం ఖాన్‌గా నటించిన బషీర్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్ట్ చేసిన పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. నోటీసులిస్తే సంబంధంలేదంటూ.. దీపక్‌రెడ్డిపై ఉన్న కేసులకు సంబంధించి సీసీఎస్ పోలీసుల తొలుత ఆయనకు మూడు నోటీసులు జారీ చేశారు. తనకు ఆ కేసులతో సంబంధాలు లేవని, ఎవరో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ దీపక్‌రెడ్డి ప్రచారం మొదలెట్టారు. ఓ కేసులో ఆయన న్యాయస్థానం నుంచి ముందస్తు బెయిల్ సైతం పొందారు. మిగిలిన కేసుల్లో మరిన్ని ఆధారాలు సేకరించాలని నిర్ణయించుకు న్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో దీపక్ రెడ్డి నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌పై కన్నేశారు. ఎన్నికల సంఘానికి లేఖ రాయడం ద్వారా అధికారికంగా దీన్ని తీసుకున్న సీసీఎస్ పోలీసులు అధ్యయనం చేశారు. ఏ స్థలాలకు సంబంధించి దీపక్‌రెడ్డి తన సంతకాలు ఫోర్జరీ చేశారని, కబ్జాలతో తనకు సంబంధం లేదని చెప్తున్నారో.. అవే వివరాలు అఫిడవిట్లలో కనిపించాయి. అవన్నీ తన స్థలాలే అని, అనివార్య కారణాల వల్ల కేసులు ఉన్నాయంటూ పిటిషన్ నంబర్లతో పాటు దీపక్‌రెడ్డి పేర్కొన్నారు. అప్పటికే బోగస్ డాక్యుమెంట్ల సృష్టికి సంబంధించి తిరుగులేని ఆధారాలు సేకరించిన సీసీఎస్ పోలీసులు ప్రధానంగా ఆ అఫిడవిట్ ఆధారం గానే దీపక్‌రెడ్డిపై చర్యలు తీసుకున్నారు. ఆయుధ లైసెన్సులపై సీసీఎస్ దృష్టి.. దీపక్‌రెడ్డి, శైలేష్ సక్సేనాలకు సంబంధించిన ఆయుధ లైసెన్సులపై సీసీఎస్ పోలీసులు దృష్టి పెట్టారు. పాతబస్తీలో నివసించే శైలేష్ సక్సేనాకు 2011లో ఆయుధ లైసెన్సు మంజూరైంది. దీనిపై రెండు ఆయుధాలు ఖరీదు చేసిన ఆయన మొఘల్‌పుర ఠాణాలో రిజిస్టర్ చేయించారు. నిబంధనల ప్రకారం నేరచరితులకు ఆయుధ లైసెన్సులు జారీ చేయకూడదు. ఉన్న లైసెన్సులు రద్దు చేయాలి. దీంతో సీసీఎస్ పోలీసులు శైలేష్ సక్సేనా ఆయుధ లైసెన్సు రద్దు చేయాల్సిందిగా మొఘల్‌పుర ఠాణాకు సిఫార్సు చేస్తూ శుక్రవారం లేఖ రాశారు. దీపక్‌రెడ్డికి సైతం ఆయుధ లైసెన్సు ఉందా? అనేది ఆరా తీస్తున్నారు. మరోవైపు దీపక్‌రెడ్డి, శైలేష్ సక్సేనాపై వచ్చిన మరో రెండు ఫిర్యాదులకు సంబంధించి కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేశారు. దీపక్‌రెడ్డి, శైలేష్ సక్సేనాపై మరో ఫిర్యాదు ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి అండ్ కోపై సీసీఎస్ పోలీసులకు శుక్రవారం మరో ఫిర్యాదు అందింది. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దీన్ని ఇచ్చారు. ఎమ్మెల్యే కాలనీలో ఉన్న 898.3 చదరపు గజాల స్థలంపై బోగస్ డాక్యుమెంట్లు తీసుకున్న దీపక్‌రెడ్డి, శైలేష్ సక్సేనా దాన్ని తమ పేరుపై మార్చుకున్నట్లు బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ స్థలానికి బాలయ్య అనే వ్యక్తి యజమాని అంటూ శైలేష్ సక్సేనా బోగస్ డాక్యుమెంట్లు సృష్టించారు. ఆ స్థలాన్ని బాలయ్య మరో వ్యక్తి అయిన రాధాకృష్ణ ఠాకూర్‌కు 16.4.1987లో అమ్మినట్లు సేల్ డీడ్ రూపొందించారు. ఇక్కడ మావూరి శివభూషణాన్ని రాధాకృష్ణ ఠాకూర్‌గా పేర్కొన్నారు. 8.11.2006లో ఠాకూర్ ఈ స్థలాన్ని దీపక్‌రెడ్డి పేరుతో సేల్ కమ్ జీపీఏ చేశారు. కొన్ని మార్పులు అవసరం కావడంతో 2008 మార్చ్ 3న దీపక్‌రెడ్డి పేరుతోనే మరో రాటిఫికేషన్ డీడ్ చేయించారు. ఈ సందర్భంలో శైలేష్ సక్సేనా సాక్షి సంతకం చేశాడు. ఇలా సృష్టించిన పత్రాల ఆధారంగా దీపక్‌రెడ్డి సైనిక్‌పురిలోని ఓ బ్యాంకు నుంచి రూ.6 కోట్ల రుణం తీసుకున్నట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ ఫిర్యాదు స్వీకరించిన సీసీఎస్ పోలీసులు ప్రాథమిక విచారణ చేస్తున్నారు.