బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో మైసూర్ అర్బర్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా) భూ కుంభకోణం వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై లోకాయుక్త పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో సిద్ధరామయ్యను మొదటి ముద్దాయిగా పేర్కొనగా.. ఆయన సతీమణి పార్వతి, బావమరిది మల్లికార్జున్ స్వామి, దేవరాజ్, మల్లికార్జున స్వామిలను వరుస నిందితులుగా చేర్చింది.
మూడా భూ కుంభకోణానికి సంబంధించి సిద్ధరామయ్యపై కేసు నమోదు చేయాలని ట్రయల్ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే లోకాయుక్త పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.
మరోవైపు ముడా భూ కుంభకోణం కేసులో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతివ్వడాన్ని బుధవారం హైకోర్టు సమర్ధించిన విషయం తెలిసిందే. ఈ అనుమతిని సవాల్ చేస్తూ సీఎం వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. గవర్నర్ చర్యలుచట్ట ప్రకారం ఉన్నాయని తెలిపింది.
చదవండి: రాహుల్ ధైర్యవంతుడు, నిజాయితీ కలిగిన నేత: సైఫ్ ప్రశంసలు
Comments
Please login to add a commentAdd a comment