
వైఎస్సార్‌సీపీ తెలంగాణ ప్లీనరీకి ఏర్పాట్లు
రాజధానిలో ఈ నెల 22న జరగనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్లీనరీ సమావేశానికి భారీ ఏర్పాట్లు చేసున్నారు.
22న జరిగే ప్లీనరీకి 10 మందితో కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో ఈ నెల 22న జరగనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్లీనరీ సమావేశానికి భారీ ఏర్పాట్లు చేసున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఈ ప్లీనరీకి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు వేలాదిగా తరలిరానున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలపై ఇందులో చర్చించి, తీర్మానం చేస్తారు. ఈ సమావేశాల నిర్వహణకు పది మంది సభ్యులతో ప్లీనరీ కమిటీ వేశారు.
ఈ కమిటీలో పార్టీ తెలంగాణ నాయకులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్, జి.మహేందర్ రెడ్డి, భవంత్‌రెడ్డి, ఎస్.భాస్కర్‌రెడ్డి, బొడ్డు సాయినాథ్‌రెడ్డి, ఎన్.రవికుమార్, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి తదితరులున్నారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు కృషిచేస్తున్నాయి. కాగా, నగరంలో ప్లీనరీ వేదికను మంగళవారం ప్రకటిస్తామని పార్టీ ముఖ్యులు ఒకరు తెలిపారు.