
మాట్లాడుతున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రపుల్లారెడ్డి
కోస్గి(కొడంగల్) : టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టి రానున్న ఎన్నికల్లో రాజన్న కలలుగన్న ప్రజాసంక్షేమ ప్రభుత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టనున్న జన చైతన్య బస్సు యాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రపుల్లారెడ్డి పిలుపునిచ్చారు. జూన్ మొదటి వారంలో నిర్వహించే ఈ యాత్రకు సంబంధించి గురువారం కొడంగల్ నియోజకవర్గంలో రూట్ మ్యాప్‌ను నిర్ణయించేందుకు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తమ్మలి బాల్‌రాజ్ సమక్షంలో ఆయా మండలాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ.. ఈ యాత్రను చేవేళ్ల నుంచి ప్రారంభించేందుకు పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు. ఆనాడు ప్రజా సంక్షేమం కోసం వైఎస్సార్ అమలు చేసిన పథకాలను వివరిస్తూ.. ప్రజలతో మమేకమై పార్టీని గ్రామీణ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు చేపడుతున్న ఈ జన చైతన్య బస్సు యాత్రకు వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. బస్సు యాత్ర కమిటీ సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సాయినాథ్‌రెడ్డి, నాయకులు మల్లేష్, కిష్టప్ప, జావీద్, రవిగౌడ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment