janachaitanya yatra
-
చంద్రబాబు యాత్ర అట్టర్ ఫ్లాప్
-
చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు
-
‘ప్రతిపక్షంలో కూడా అదే పనిచేస్తున్నారు’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒక విఫల నాయకుడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఐదేళ్ల పాలనపై చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు చేసిన విమర్శలను ఆయన తప్పుబట్టారు. చంద్రబాబును భస్మాసురుడి పెద్దన్నగా అభివర్ణించారు. చంద్రబాబు సీఎం గా ఉన్న గత ఐదేళ్లు.. రాష్ట్రం మొత్తం తగలబడిపోయిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు చేసే అర్హత ఆయనకు లేదని ధ్వజమెత్తారు. (‘ఆయనకు అందుకే మతి భ్రమించింది’) చైతన్యయాత్రలు వెలవెల.. చంద్రబాబు చేస్తున్న చైతన్య యాత్రలు జనాలు లేక వెలవెల బోతున్నాయని కోటంరెడ్డి ఎద్దేవా చేశారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి నాలుగు మంచి సలహాలు చెప్పారా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి.. ఎన్నికల వాయిదా వేయించేందుకు ఆయన సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. టీడీపీకి అభ్యర్థులు లేక స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. లిటికేషన్లు పెట్టి కోర్టుల్లో వాయిదాలు వేయిస్తున్నారని కోటంరెడ్డి మండిపడ్డారు. ఏపీ ఇమేజ్ డామేజ్ చేస్తున్నారు.. ‘ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఏపీ ఇమేజ్ను డామేజ్ చేస్తున్నారు. ఏ తప్పు చేయకపోతే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు. సిట్ ఏర్పాటుతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరుగెడుతున్నాయి. ఆయన అధికారంలో ఉంటే రాష్ట్రం కరువు కటాకలతో ఉండేది. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని’ కోటంరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీలను అణగదొక్కారని, ప్రతిపక్షంలో కూడా చంద్రబాబు అదే పని చేస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తాం
సాక్షి, వరంగల్ : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగా పోటీచేస్తామని, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. అవినీతి రహిత పాలనే అజెండాగా వచ్చే ఎన్నికలకు వెళుతామని చెప్పారు. తెలంగాణలో అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీచేస్తామని వెల్లడించారు. వరంగల్‌లో జనచైతన్యయాత్ర సాగుతున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి టీవీ’తో మాట్లాడారు. రాష్ట్రంలో మార్పు కోసం చేపట్టిన జన చైతన్యయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు. తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని ఆయన మండిపడ్డారు. సొంత సర్వేలతో బలంగా ఉన్నామని కేసీఆర్ భావిస్తే.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉపఎన్నికలకు వెళ్ళాలని లక్ష్మణ్ సవాల్ విసిరారు. బీజేపీలో గ్రూప్ రాజకీయాలు, కుటుంబపాలనకు తావు లేదని, కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో టీఆర్ఎస్ లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని అన్నారు. -
‘కామారెడ్డి నుంచే మార్పు.. ’
సాక్షి, కామారెడ్డి: టీఆర్ఎస్ పాలనలో ప్రజస్వా మ్యం అపహాస్యమైందని, నాలుగేళ్ల పాలన నలుగురి పాలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. మాయమాటలతో మోసపోయిన ప్రజలు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారని, రానున్న ఎన్నికల్లో దగాకోరు ప్రభుత్వానికి బుద్ధి చెబుతారన్నారు. మార్పు కామారెడ్డి నుంచే మొదలైందని తెలిపారు. బీజేపీ జన చైతన్య యాత్రలో భాగంగా శనివారం కామారెడ్డికి వచ్చిన లక్ష్మణ్‌కు మహిళలు బో నాలతో మహిళలు స్వా గతం పలికారు. బైక్ ర్యాలీతో యువకులు ముం దుకు సాగారు. అనంతరం సీఎస్ఐ గ్రౌండ్స్‌లో ని ర్వహించిన బహిరంగ సభలో డాక్టర్ లక్ష్మ ణ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం పాలైందని ఆరోపించారు. నాలుగేళ్లుగా ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆవేదనకు గురవుతున్నారని, ఇళ్ల కోసం నిరుపేదలు తపిస్తున్నారని, భూమి కోసం దళితులు ఆశగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. కానీ ఏ ఒక్కరికి టీఆర్ఎస్ హయాంలో న్యాయం జరుగలేదన్నారు. కనీసం మంత్రి మండలిలో మహిళలకు అవకాశం లేకుం డా పోయిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కోసం బోనమెత్తిన మహిళలు ఇప్పుడు కేసిఆర్‌ను గద్దెదింపడానికి బోనమెత్తారని తెలిపారు. దగా పడ్డ దళితులకు ధైర్యం నింపడానికి, మోసపోయిన మహిళలకు ఆత్మవిశ్వాసం నింపడానికి, అభాసుపాలైన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, అసువులు బాసిన అమరుల ఆశయాలను సాధించడానికి, తెలంగా ణ నుదుటి తలరాతను మార్చడానికి జన చైతన్య యాత్ర చేపట్టినట్లు వివరించారు. మిషన్ కాకతీ య, మిషన్ భగీరథ కమీషన్ల కోసం, కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకోసమేనని విమర్శించారు. బీజేపీ వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్లు లేని పేదలందరికి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పిన సీఎం ఎంత మందికి కట్టించాడో వెల్లడించాలని డిమాండ్ చేశా రు. రాష్ట్రంలో సామాజిక న్యాయమే లేదని విమర్శించారు. గల్ఫ్ బాధితులకు టీఆర్ఎస్ పాలనలో తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు. సీఎం కూతురు కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ జిల్లాలో గల్ఫ్ బాధితులు అనేక కష్టాలు పడుతున్నారని వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గల్ఫ్ బాధితుల కుటుంబాలకు రూ.10 లక్షల సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు బీడీ కట్టలపై పుర్రెగుర్తు తీసుకొచ్చి బీడీ కార్మికులకు తీవ్ర అన్యాయం చేశాడన్నారు. 2019 లో బీజేపీ అధికారంలోకి రాగానే బీడీ కార్మికులను ఆదుకుంటుందన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల విషయంలో సీఎం బెది రింపులకు పాల్పడడం, ప్రలోభాలకు గురిచేయడం వంటి వాటితో మాయచేశాడని ఆరోపించా రు. యూపీఏ హాయాంలో సీపీఎస్ విధానం వస్తే సీఎం కేసీఆర్ దానిని అమలు చేయాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. అక్రమ బదిలీలతో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని, సీపీఎస్ విధానానికి స్వస్తి చెబుతామన్నారు. రుణమాఫీని గుదిబండగా మార్చి రైతులపై వడ్డీల భారం పడుతుందన్నారు. రైతుబంధులో కౌలు రైతులను మినాహాయించి వారికి అన్యా యం చేయడమే కాకుండా వారిని అవహేళన చేస్తున్నాడని విమర్శించారు. బీజేపీ అ«ధికారంలోకి రాగానే కౌలు రైతులను, పోడు రైతులను గౌరవిస్తామని, రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రైతులందరికి ఉచితంగా బోర్లు తవ్విస్తామన్నారు. రాష్ట్రంలో మజ్లిస్‌తో కుమ్మక్కై నిజాం పాలన సాగిస్తున్న కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ల్యాండ్, స్యాండ్, వైన్ మాఫియా పేట్రేగిపోయాయని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు, రేషన్ డీలర్లు, వారి కుటుంబాలు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతాయన్నారు. రామమందిర నిర్మాణం అనేది దేశ ప్రజల మనోభిప్రాయమని, దీనిని టీఆర్ఎస్ మతపరమైన ఆంశంగా పేర్కొనడం సరికాదన్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. దేశంలో ఇలాంటి కుటుంబ పాలన ఎక్కడా లేదని దుయ్యబట్టారు. సభ అనంతరం బీజేపీ నేతలు కామారెడ్డిలో రాత్రి బస చేశారు. ఆదివారం మద్నూర్‌లో నిర్వహించే జన చైతన్యయాత్రలో పాల్గొననున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రేమేందర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, మనోç ßæర్, ఆచారి, ధర్మారావు, యెండల లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి, కేపీ వెంకట్రమణారెడ్డి, మురళీధర్‌గౌడ్, మోతే కృషా గౌడ్, మర్రి రాంరెడ్డి, నీలం చిన్నరాజులు, చింతల రమేశ్, పోతంగల్ కిషన్‌రావు, జూలూరి సుధాకర్, తేలు శ్రీను తదితరులు పాల్గొన్నారు. పెద్ద చెరువును రిజర్వాయర్‌గా మారుస్తాం బీబీపేట: బీజేపీ అధికారంలోకి వస్తే బీబీపేట పెద్ద చెరువును రిజర్వాయర్‌గా మారుస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హామీ ఇచ్చారు. బీజేపీ రథయాత్రలో భాగంగా సిద్దిపేట నుంచి శనివారం మండల కేంద్రానికి చేరుకున్న ఆయనకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే బీబీపేట మండలం ప్రసిద్ది గాంచినటువంటి తమలపాకు తోటల సాగును ప్రోత్సహిస్తామని చెప్పారు. మండలానికి ప్రభు త్వ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. -
బీజేపీతోనే గరీబోళ్ల రాజ్యం
సాక్షి, సిద్దిపేట: ‘తెలంగాణ వస్తే ఇక్కడి ప్రజల బతుకులు మారతాయని, ఉద్యోగాలు వస్తాయని భావించి శ్రీకాంతాచారి, యాదిరెడ్డి, కిష్టయ్య, వేణుగోపాల్‌రెడ్డి ప్రాణాలు త్యాగం చేశారు. కానీ వచ్చిన తెలంగాణను ఆ నలుగురే పాలిస్తున్నారు. గరీబోళ్ల రాజ్యం రావాలంటే భారతీయ జనతాపార్టీ అధికారంలోకి రావాలి’అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. బీజేపీ తలపెట్టిన జనచైతన్య యాత్రలో భాగంగా శుక్రవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణలో అణచివేతలు, నిర్బంధాలు, బెదిరిం పుల పర్వం నడుస్తోందని ధ్వజమెత్తారు. నిజాంను తలదన్నేలా కేసీఆర్ పాలన సాగుతోందని, ఈ పాలనకు చరమగీతం పాడేం దుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో ఇసుక, ల్యాండ్మాఫియాలు రా జ్యం ఏలుతున్నాయని.. ఇదేంటని ప్రశ్నించినందుకు నేరెళ్లలో దళితులను చితక బాది కేసులు పెట్టారని ఆరోపించారు. పంటకు గిట్టుబాటు ధర అడిగిన పాపానికి ఖమ్మంలో రైతులకు బేడీలు వేసి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని త్యాగాలు చేసిన వారిని విస్మరించి, తెలంగాణను వ్యతిరేకించిన వారికి మంత్రి పదవులు అప్పగించి అందలం ఎక్కించారని విమర్శించారు. గల్లీలకే పరిమితమైన మజ్లిస్ పార్టీని టీఆర్ఎస్ నెత్తిన పెట్టుకొని ఊరేగిస్తోందని మండిపడ్డారు. ఇదంతా కేసీఆర్ ఓట్ల కోసం ఆడే నాటకం అన్నారు. హిందువుల కోరిక రామ మందిరం నిర్మాణమని.., దానిని ఎవ్వరూ ఆపలేరని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్కు దమ్ముంటే మందిరంపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని సవాల్ విసిరారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి.. ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు 63 సీట్లతో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు 90 మంది ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వచ్చారని లక్ష్మణ్ ప్రశ్నించారు. నిజంగా టీఆర్ఎస్కు ప్రజాబలం ఉంటే.. ఫిరాయింపులకు పాల్పడిన వారిచే రాజీనామాలు చేయించి మళ్లీ గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. తెలంగాణ రాకముందు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, కాంగ్రెస్ నాయకులను జైల్లో పెడతామని చెప్పిన కేసీఆర్ తర్వాత ఎందుకు చల్లబడ్డారని ప్రశ్నించారు. సూరత్‌లో చీరె రూ.50 చొప్పున కొనుగోలు చేసి బతుకమ్మ కానుక అంటూ ఆడపడుచుల ఆత్మగౌరవం దెబ్బతీశారని విమర్శించారు. రాష్ట్రంలో సచివాలయానికి వెళ్లడానికి తీరిక లేదని చెప్పే ముఖ్యమంత్రి థర్డ్‌ఫ్రంట్ పెట్టి ఢిల్లీకి వెళ్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక్క తాను ముక్కలే అనే విషయం కర్ణాటక ఎన్నికల్లో తేలిపోయిందని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు నాలుగు సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారని, కేసీఆర్ గడీల రాజ్యం కూలదోసే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ప్రజల కష్టాలు తెలిసిన మహా నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని కొనియాడారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు మోదీ పలు పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. పేద మహిళలకు ఇబ్బంది కలగకుండా ఉజ్వల గ్యాస్, మహిళల ఆత్మగౌరవం కోసం ఇంటింటికీ మరుగుదొడ్లు, ఆడపిల్ల పుడితే రూ. 6వేలు.. ఇలా పేదలకు ఉపయోగపడే పథకాలు ప్రవేశపెట్టిన నరేంద్ర మోదీ ప్రజల పక్షపాతిగా ఉన్నారన్నారు. కాంగ్రెస్‌లో కుటుంబ పాలన నడుతోందని విమర్శించారు. ఇప్పటికే 20 రాష్ట్రాల్లో బీజేపీ పాలన సాగుతోందని, తెలంగాణలో కూడా భారతీ య జనతాపార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఈ యాత్ర చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో యాత్ర ఇన్చార్జి ధర్మారావు, పార్టీ రాష్ట్ర నాయకులు యాదగిరిరెడ్డి, పూనం రాజిరెడ్డి, సుధాకర్‌శర్మ, ఆకుల రాజయ్య, బుచ్చిరెడ్డి, మనోహర్‌రెడ్డి, జిల్లా అ«ధ్యక్షుడు నరోత్తంరెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు తోకల ఉమారాణి పాల్గొన్నారు. -
‘జన చైతన్య’ను బస్సు యాత్ర
కోస్గి(కొడంగల్) : టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టి రానున్న ఎన్నికల్లో రాజన్న కలలుగన్న ప్రజాసంక్షేమ ప్రభుత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టనున్న జన చైతన్య బస్సు యాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రపుల్లారెడ్డి పిలుపునిచ్చారు. జూన్ మొదటి వారంలో నిర్వహించే ఈ యాత్రకు సంబంధించి గురువారం కొడంగల్ నియోజకవర్గంలో రూట్ మ్యాప్‌ను నిర్ణయించేందుకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తమ్మలి బాల్‌రాజ్ సమక్షంలో ఆయా మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ.. ఈ యాత్రను చేవేళ్ల నుంచి ప్రారంభించేందుకు పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు. ఆనాడు ప్రజా సంక్షేమం కోసం వైఎస్సార్ అమలు చేసిన పథకాలను వివరిస్తూ.. ప్రజలతో మమేకమై పార్టీని గ్రామీణ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు చేపడుతున్న ఈ జన చైతన్య బస్సు యాత్రకు వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. బస్సు యాత్ర కమిటీ సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సాయినాథ్‌రెడ్డి, నాయకులు మల్లేష్, కిష్టప్ప, జావీద్, రవిగౌడ్, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
బద్వేలు టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
కడప: వైఎస్సార్‌జిల్లా బద్వేల్ టీడీపీలో మరోమారు విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే జయరాములు చేపట్టిన జన చైతన్య యాత్రను అడ్డుకునేందుకు మరో నేత విజయమ్మ యత్నించారు. ఎమ్మెల్యే బైక్ ర్యాలీ చేయాలనుకున్నరోడ్డుపై జేసీబీతో అడ్డంగా కాల్వ తీశారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే జయరాములు, ముందు నుంచి పార్టీలో ఉన్న విజయమ్మ మధ్య కొంతకాలంగా వార్ నడుస్తోంది. నిన్నమొన్నటి వరకు ఒకే గ్రామలో పోటాపోటీగా యాత్రలు చేసిన ఇరువర్గాలు ఇప్పుడు బహిరంగంగా వివాదాలకు దిగుతున్నారు. మున్సిపల్ చైర్మన్ పార్థసారథి ఎమ్మెల్యే యాత్రను అడ్డుకునేందుకు జేసీబీ అడ్డుపెట్టించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి జేసీబీని తొలగించారు -
ఎడ్లబండిపై నుంచి కిందపడ్డ మంత్రి
-
ఎడ్లబండిపై నుంచి కిందపడ్డ మంత్రి
విశాఖపట్టణం: జిల్లాలోని అనకాపల్లి మండలం తుంపాల గ్రామం జనచైతన్య యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. కార్యక్రమంలో భాగంగా ఎడ్లబండి ఎక్కిన మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే పీలా గోవింద్ లు అకస్మాత్తుగా జారీ కిందపడిపోయారు. బండిని లాగుతున్న ఎడ్లు బెదిరిపోవడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది, కార్యకర్తలు మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే పీలా గోవింద్ లను లేపారు. ఈ ఘటనలో మంత్రి, ఎమ్మెల్యేలకు చిన్నపాటి గాయాలైనట్లు సమాచారం. -
తెగనమ్ముకున్నారు.. దగా చేశారు
రూ.20 వేలు దండుకుని ఇళ్లున్న వారికే ఇళ్లు జనచైతన్య యాత్రలో గోరంట్లను నిలదీసిన మహిళ ఎక్కువ మాట్లాడితే ఏ పథకమూ రాదని బెదిరించిన ఎమ్మెల్యే సాక్షి, రాజమహేంద్రవరం : ‘20 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. ఇళ్ల కోసం ఎన్నో సార్లు దరఖాస్తులు పెట్టుకున్నాం. ఇప్పటి వరకూ రాలేదు. ఇళ్లు ఉన్నవారికే ఇళ్లు ఇచ్చారు. ఒక్కొక్కరి వద్దా రూ.20 వేలు తీసుకున్నారు. అర్హులమైన మాకు అన్యాయం చేశారు’ అంటూ ఓ మహిళ రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నిలదీశారు. టీడీపీ జనచైతన్య యాత్రల్లో భాగంగా ఎమ్మెల్యే గోరంట్ల శుక్రవారం 20వ డివిజ¯ŒS ఆల్కాట్‌తోటలో పర్యటించారు. ఉదయం 11 గంటలకు యాత్ర ప్రారంభించిన గోరంట్ల అనుచరులతో సందుగొందుల్లో నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ ఎమ్మెల్యేకు ఎదురుగా వచ్చి 20 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నామని, ఎన్ని సార్లు దరఖాస్తులు పెట్టినా ఇళ్లు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇళ్లు ఉన్న వారి వద్ద డబ్బులు తీసుకుని ఇళ్లు ఇచ్చారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. తన హయాంలో 30 వేల ఇళ్లు నిర్మించానని గోరంట్ల చెప్పబోతుండగా అడ్డుకున్న ఆ మహిâ¶ళ అనర్హులకే ఎక్కువగా ఇచ్చారని వ్యాఖ్యానించారు. దీంతో రెచ్చిపోయిన గోరంట్ల ‘ఎక్కువగా మాట్లాడితే భవిష్యత్‌లో ఏ ప్రభుత్వ పథకాలూ రావు. చదువుకున్నదానివి పద్ధతిగా మాట్లాడు. అనర్హులు ఎవరో చెప్పు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారెవరో అందరికీ తెలుసని, మీరు తెలుసుకోవాలంటే ఆధార్, విద్యుత్ బిల్లులు పరిశీలించవచ్చని ఆ మహిళ సమాధానమిచ్చారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలంటూ ఎమ్మెల్యే అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరో వృద్ధురాలు తాను టీడీపీకే ఓటు వేశానని, ఇల్లు వచ్చిందంటూ చెప్పి తనతో డ్యాన్సులు చేయించి, ఫొటోలు కూడా తీశారని, కానీ ఇల్లు ఇవ్వలేదని ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో ఉక్కిరిబిక్కిరైన ఎమ్మెల్యే త్వరలో మరో మూడువేల ఇళ్లు వస్తున్నాయని, వాటిలో ఇస్తానంటూ యాత్రను ముగించారు. రెండు నెలల నుంచి రేష¯ŒS దూరప్రాంతం నుంచి తెచ్చుకోవాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. డివిజ¯ŒSలోని డ్రైనేజీల్లో సిల్ట్‌ను తరచూ తొలగించక మురుగు రోడ్లపై పారుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. -
జనచైతన్య యాత్రలో బుక్కైన చినబాబు
-
అధికార ‘యాత్ర’
నంద్యాల: జనచైతన్య యాత్రలో అధికారులు, సిబ్బంది పాల్గొనాలని మున్సిపల్ కమిషనర్ విజయభాస్కరనాయుడు పరోక్షంగా హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి షెడ్యూల్ ప్రకారం రోజూ వార్డు పర్యటనలో పాల్గొనాలని ఆదేశించారు. కానీ ఈ సర్కు్యలర్ వివాదాస్పదమవుతుందని భావించి చివరి నిమిషంలో వెనక్కి తీసుకున్నారు. సర్కూలర్ జారీ చేసిన విషయం వాస్తవమేనని, ఎమ్మెల్యే భూమా కార్యాలయం నుంచి సరైన సమాచారం రాకపోవడంతో పొరపాటు జరిగిందని విజయభాస్కరనాయుడు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 1 నుంచి 25 వరకు టీడీపీ జనచైతన్య యాత్రలను చేపట్టింది. పట్టణంలో ఈ షెడ్యూల్ ప్రకారమే జనచైతన్య యాత్రలు జరుగుతున్నాయి. కమిషనర్ విజయభాస్కరనాయుడు ఈ జనచైతన్య యాత్రలకు అనుకూలంగా గత నెల 30న సర్కు్యలర్ను జారీ చేశారు. ఎమ్మెల్యే భూమా నవంబర్ 1 నుంచి 25 వరకు వార్డు పర్యటనలో పాల్గొంటారని, సర్కు్యలర్తో పాటు పర్యటన తేదీలు, వార్డుల వివరాలను జతపరుస్తున్నామని ఆయన సర్కు్యలర్ను తయారు చేశారు. ఈ జాబితా ప్రకారం సిబ్బంది పర్యటనలో పాల్గొనాలని ఆదేశించారు. అయితే ఎమ్మెల్యే వార్డు పర్యటన పేరిట జనచైతన్య యాత్రలో పాల్గొనాలని ఆయన పరోక్షంగా ఆదేశించినట్లు తెలిసింది. జనచైతన్య యాత్ర నిర్వహించే తేదీలు, కమిషనర్ జారీ చేసిన తేదీలు, ప్రస్తుతం ఎమ్మెల్యే భూమా నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రల షెడ్యూల్, వార్డు పర్యటనల పేరిట కమిషనర్ జారీ చేసిన షెడ్యూల్ కూడా ఒకే విధంగా ఉన్నాయి. ఈ సర్కు్యలర్ సిబ్బందికి, కౌన్సిలర్లకు అందకముందే వివాదం చెలరేగింది. ఎమ్మెల్యే భూమా, చైర్పర్సన్ దేశం సులోచన వేర్వేరు వర్గాలుగా జనచైతన్య యాత్రలను నిర్వహిస్తున్నారు. కమిషనర్ పరోక్షంగా భూమా వర్గానికి అనుకూలంగా సర్కు్యలర్ జారీ చేయడం విమర్శలకు దారి తీసింది. దీంతో సర్కు్యలర్ పంపిణీ గాక మునుపే వెనక్కి తీసుకున్నారు. కమిషనర్ విజయభాస్కరనాయుడు భూమా వర్గానికి అనుకూలంగా జారీ చేసిన సర్కు్యలర్ టీడీపీ ఇన్చార్జి శిల్పామోహన్‌రెడ్డి వర్గం ఆగ్రహానికి గురి చేసింది. కానీ కమిషనర్ విజయభాస్కరనాయుడు జారీ చేసిన సర్కు్యలర్ సిబ్బంది పట్టించుకున్నట్లు లేదురు. జనచైతన్య యాత్రలో ఎవరూ పాల్గొనకపోవడంమే అందుకు నిదర్శనం. సరైన సమాచారం లేకనే: విజయభాస్కరనాయుడు, కమిషనర్ ఎమ్మెల్యే భూమా కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు వార్డు పర్యటనలుగా భావించి సర్కు్యలర్ను జారీ చేశాం. అయితే ఇది పార్టీకి సంబంధించిన కార్యక్రమమని తెలుసుకొని రద్దు చేశాం -
రాళ్లు రువ్వుకున్న పరిటాల వర్గీయులు
సీకేపల్లి : అనంతపురం జిల్లా సీకేపల్లి మండలం ఓబులాపురంలో జరిగిన జనచైతన్య యాత్రలో రభస చోటుచేసుకుంది. పౌరసర ఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలుగా చీలిపోయిన టీడీపీ కార్యకర్తలు వాళ్లలో వాళ్లే రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు. -
అమృత పథకం ప్రారంభం
కర్నూలు (టౌన్): జనచైతన్య యాత్రల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం.. నగరంలోని కిడ్స్ వరల్డ్ వద్ద అమృత్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం క్రింద రూ. 54.35 కోట్లతో పైపులైన్ నిర్మాణం, రూ. 12 కోట్లతో సిటీ పార్కు ఏర్పాటు చేయనున్నారు. వాటి శిలాఫలకాలను సీఎం అవిష్కరించారు. పాతబస్తీలో పాదయాత్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నగరంలోని పాతబస్తీలో పాదయాత్ర నిర్వహించారు. కిడ్స్ వరల్డ్ నుంచి ఉస్మానియా కళశాల రహదారి మీదుగా నెహ్రూ రోడ్డు వరకు ఓకటిన్నర కిలోమీటర్ పాదయాత్ర గంటకుపైగా కొనసాగింది. ఉస్మానియా కళశాల విద్యార్థులు, ముస్లిం మహిళలతో సీఎం కొద్ది సేపు మాట్లాడారు. కర్నూలు నగరం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు.కర్నూలులో ఉర్దూ యూనివర్సీటిని ఏర్పాటు చేశామని, త్వరలోనే ప్రత్యేక డీఎస్పీ నిర్వహించి పోస్టులు భర్తీ చేస్తామన్నారు. కర్నూలులో రూ.210 కోట్లు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పాదయాత్రలో సీఎం చంద్రబాబుకు తమ సమస్యలు తెలియజేసేందుకు ప్రయత్నించే అవకాశం రాకపోవడంతో మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ హబ్ ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ హబ్‌ను ఏర్పాటు చేసి చెన్నై కారిడార్‌కు అనుసంధానం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శనివారం ఔట్‌డోర్ స్టేడియంలో ఆడబిడ్డ పసుపు– కుంకుమ రెండో విడత పెట్టుబడి నిధి కింద రూ. 126 కోట్లు చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కర్నూలును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. రూ. 15 వేల కోట్లతో 1000 మెగావాట్ల సోలార్ ప్లాంటు త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరో రూ. 14 వేల కోట్లతో వివిధ పరిశ్రమలు నెలకొల్పి 15 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. ఓర్వకల్లు వద్ద విమానాశ్రయం, ఇండస్ట్రియల్ హబ్, కొలిమిగుండ్ల ప్రాంతంలో సిమెంట్ హబ్ పనులు జరుగుతున్నాయన్నారు. -
మంత్రి గంటాకు చేదు అనుభవం
-
మంత్రి అనుచరుల హల్ చల్.. రైతులపై దాడి
-
మంత్రి అనుచరుల హల్ చల్.. రైతులపై దాడి
కృష్ణా: కృష్ణా జిల్లాలో టీడీపీ నిర్వహించిన జనచైతన్య యాత్ర గందరగోళానికి దారి తీసింది. ఈ యాత్రలోని టీడీపీ కార్యకర్తలు పెద్దకర అగ్రహారం రైతులపై దాడులకు పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పోర్టు అనుబంధ సంస్థలకు తమ భూములు కేటాయించకుండా మినహాయింపు ఇవ్వాలని ఇక్కడి రైతులు గత కొద్ది రోజులుగా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని కోరుతూ వస్తున్నారు. అయినా ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతోపాటు తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర ఆద్వర్యంలో మంగళవారం తమ ప్రాంతంలో జరుగుతున్న జన చైతన్య యాత్రలో తమ వాణిని వినిపించేందుకు భారీ సంఖ్యలో రైతులు చేరుకున్నారు. కానీ, అందుకు మంత్రి అనుమతించకపోవడంతో వారు నిరసన ప్లకార్డులు ప్రదర్శిస్తూ వాటిల్లో తమ డిమాండ్ పేర్కొన్నారు. దీంతో తమ యాత్రను అడ్డుకుంటారా అంటూ టీడీపీ కార్యకర్తలు వారిపై ఒక్కసారిగా దాడులకు దిగారు. ఈ దాడుల్లో తమ మెడలోని బంగారు గొలుసులు టీడీపీ కార్యకర్తలు లాక్కున్నారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తానికి తొలిరోజే టీడీపీ జన చైతన్యయాత్ర ప్రజాగ్రహానికి గురైంది.