
సాక్షి, వరంగల్ : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగా పోటీచేస్తామని, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. అవినీతి రహిత పాలనే అజెండాగా వచ్చే ఎన్నికలకు వెళుతామని చెప్పారు. తెలంగాణలో అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీచేస్తామని వెల్లడించారు. వరంగల్‌లో జనచైతన్యయాత్ర సాగుతున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి టీవీ’తో మాట్లాడారు.
రాష్ట్రంలో మార్పు కోసం చేపట్టిన జన చైతన్యయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు. తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని ఆయన మండిపడ్డారు. సొంత సర్వేలతో బలంగా ఉన్నామని కేసీఆర్ భావిస్తే.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉపఎన్నికలకు వెళ్ళాలని లక్ష్మణ్ సవాల్ విసిరారు. బీజేపీలో గ్రూప్ రాజకీయాలు, కుటుంబపాలనకు తావు లేదని, కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో టీఆర్ఎస్ లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment