‘కామారెడ్డి నుంచే మార్పు.. ’ | BJP Leader Laxman Fires On TRS | Sakshi
Sakshi News home page

‘కామారెడ్డి నుంచే మార్పు.. ’

Published Sun, Jul 1 2018 9:04 AM | Last Updated on Sun, Jul 1 2018 9:11 AM

BJP Leader Laxman Fires On TRS - Sakshi

కామారెడ్డి బహిరంగ సభలో వేదికపై నుంచి అభివాదం చేస్తున్న బీజేపీ నేతలు 

సాక్షి, కామారెడ్డి: టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజస్వా మ్యం అపహాస్యమైందని, నాలుగేళ్ల పాలన నలుగురి పాలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ విమర్శించారు. మాయమాటలతో మోసపోయిన ప్రజలు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారని, రానున్న ఎన్నికల్లో దగాకోరు ప్రభుత్వానికి బుద్ధి చెబుతారన్నారు. మార్పు కామారెడ్డి నుంచే మొదలైందని తెలిపారు. బీజేపీ జన చైతన్య యాత్రలో భాగంగా శనివారం కామారెడ్డికి వచ్చిన లక్ష్మణ్‌కు మహిళలు బో నాలతో మహిళలు స్వా గతం పలికారు. బైక్‌ ర్యాలీతో యువకులు ముం దుకు సాగారు.

అనంతరం  సీఎస్‌ఐ గ్రౌండ్స్‌లో ని ర్వహించిన బహిరంగ సభలో డాక్టర్‌ లక్ష్మ ణ్‌ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ కుటుంబం పాలైందని  ఆరోపించారు. నాలుగేళ్లుగా ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆవేదనకు గురవుతున్నారని, ఇళ్ల కోసం నిరుపేదలు తపిస్తున్నారని, భూమి కోసం దళితులు ఆశగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. కానీ ఏ ఒక్కరికి టీఆర్‌ఎస్‌ హయాంలో న్యాయం జరుగలేదన్నారు. కనీసం మంత్రి మండలిలో మహిళలకు అవకాశం లేకుం డా పోయిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కోసం బోనమెత్తిన మహిళలు ఇప్పుడు కేసిఆర్‌ను గద్దెదింపడానికి బోనమెత్తారని తెలిపారు.  దగా పడ్డ దళితులకు ధైర్యం నింపడానికి, మోసపోయిన మహిళలకు ఆత్మవిశ్వాసం నింపడానికి, అభాసుపాలైన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, అసువులు బాసిన అమరుల ఆశయాలను సాధించడానికి, తెలంగా ణ నుదుటి తలరాతను మార్చడానికి జన చైతన్య యాత్ర చేపట్టినట్లు వివరించారు. మిషన్‌ కాకతీ య, మిషన్‌ భగీరథ కమీషన్ల కోసం, కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకోసమేనని విమర్శించారు. 

బీజేపీ వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారని లక్ష్మణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్లు లేని పేదలందరికి డబుల్‌ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పిన సీఎం ఎంత మందికి కట్టించాడో వెల్లడించాలని డిమాండ్‌ చేశా రు. రాష్ట్రంలో సామాజిక న్యాయమే లేదని విమర్శించారు. గల్ఫ్‌ బాధితులకు టీఆర్‌ఎస్‌ పాలనలో తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు. సీఎం కూతురు కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్‌ జిల్లాలో గల్ఫ్‌ బాధితులు అనేక కష్టాలు పడుతున్నారని వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

గల్ఫ్‌ బాధితుల కుటుంబాలకు రూ.10 లక్షల సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు బీడీ కట్టలపై పుర్రెగుర్తు తీసుకొచ్చి బీడీ కార్మికులకు తీవ్ర అన్యాయం చేశాడన్నారు. 2019 లో బీజేపీ అధికారంలోకి రాగానే బీడీ కార్మికులను ఆదుకుంటుందన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల విషయంలో సీఎం బెది రింపులకు పాల్పడడం, ప్రలోభాలకు గురిచేయడం వంటి వాటితో మాయచేశాడని ఆరోపించా రు. యూపీఏ హాయాంలో సీపీఎస్‌ విధానం వస్తే సీఎం కేసీఆర్‌ దానిని అమలు చేయాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. అక్రమ బదిలీలతో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని, సీపీఎస్‌ విధానానికి స్వస్తి చెబుతామన్నారు. 

రుణమాఫీని గుదిబండగా మార్చి రైతులపై వడ్డీల భారం పడుతుందన్నారు. రైతుబంధులో కౌలు రైతులను మినాహాయించి వారికి అన్యా యం చేయడమే కాకుండా వారిని అవహేళన చేస్తున్నాడని విమర్శించారు. బీజేపీ అ«ధికారంలోకి రాగానే కౌలు రైతులను, పోడు రైతులను గౌరవిస్తామని, రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రైతులందరికి ఉచితంగా బోర్లు తవ్విస్తామన్నారు. రాష్ట్రంలో మజ్లిస్‌తో కుమ్మక్కై నిజాం పాలన సాగిస్తున్న కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ల్యాండ్, స్యాండ్, వైన్‌ మాఫియా పేట్రేగిపోయాయని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు, రేషన్‌ డీలర్లు, వారి కుటుంబాలు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతాయన్నారు. రామమందిర నిర్మాణం అనేది దేశ ప్రజల మనోభిప్రాయమని, దీనిని టీఆర్‌ఎస్‌ మతపరమైన ఆంశంగా పేర్కొనడం సరికాదన్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు మాట్లాడుతూ.. దేశంలో ఇలాంటి కుటుంబ పాలన ఎక్కడా లేదని దుయ్యబట్టారు. సభ అనంతరం బీజేపీ నేతలు కామారెడ్డిలో రాత్రి బస చేశారు. ఆదివారం మద్నూర్‌లో నిర్వహించే జన చైతన్యయాత్రలో పాల్గొననున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రేమేందర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, మనోç ßæర్, ఆచారి, ధర్మారావు, యెండల లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి, కేపీ వెంకట్‌రమణారెడ్డి, మురళీధర్‌గౌడ్, మోతే కృషా గౌడ్, మర్రి రాంరెడ్డి, నీలం చిన్నరాజులు, చింతల రమేశ్, పోతంగల్‌ కిషన్‌రావు, జూలూరి సుధాకర్, తేలు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

పెద్ద చెరువును రిజర్వాయర్‌గా మారుస్తాం 
బీబీపేట: బీజేపీ అధికారంలోకి వస్తే బీబీపేట పెద్ద చెరువును రిజర్వాయర్‌గా మారుస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ హామీ ఇచ్చారు. బీజేపీ రథయాత్రలో భాగంగా సిద్దిపేట నుంచి శనివారం మండల కేంద్రానికి చేరుకున్న ఆయనకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే బీబీపేట మండలం ప్రసిద్ది గాంచినటువంటి తమలపాకు తోటల సాగును ప్రోత్సహిస్తామని చెప్పారు. మండలానికి ప్రభు త్వ జూనియర్‌ కాలేజ్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement