జిల్లాలోని అనకాపల్లి మండలం తుంపాల గ్రామం జనచైతన్య యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. కార్యక్రమంలో భాగంగా ఎడ్లబండి ఎక్కిన మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే పీలా గోవింద్ లు అకస్మాత్తుగా జారీ కిందపడిపోయారు. బండిని లాగుతున్న ఎడ్లు బెదిరిపోవడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలిసింది.