tumpala
-
తుంపాల చక్కెర పరిశ్రమ కార్మికులకు గుడ్న్యూస్
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని తుంపాల చక్కెర కర్మాగారం కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కార్మికుల ఇవ్వాల్సిన బకాయిల విడుదలకు ఏపీ ప్రభుత్వం శనివారం చర్యలు చేపట్టింది. ఎమ్మల్యే అమర్నాథ్ కార్మికుల సమస్యలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు వారం రోజుల్లో పరిష్కారం లభిస్తుందనికార్మికులకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి కన్నబాబు హామి ఇచ్చినట్లు అమర్నాథ్ వెల్లడించారు. కాగా రూ. 4 కోట్ల వేతన బకాయిలు త్వరలోనే కార్మికులకు అందనుండడంపై ఎమ్మెల్యే అమర్నాథ్ హర్షం వ్యక్తం చేశారు. చదవండి: నాగార్జున కొండ.. బౌద్ధ ఆనవాళ్లే నిండా -
ఎడ్లబండిపై నుంచి కిందపడ్డ మంత్రి
-
ఎడ్లబండిపై నుంచి కిందపడ్డ మంత్రి
విశాఖపట్టణం: జిల్లాలోని అనకాపల్లి మండలం తుంపాల గ్రామం జనచైతన్య యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. కార్యక్రమంలో భాగంగా ఎడ్లబండి ఎక్కిన మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే పీలా గోవింద్ లు అకస్మాత్తుగా జారీ కిందపడిపోయారు. బండిని లాగుతున్న ఎడ్లు బెదిరిపోవడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది, కార్యకర్తలు మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే పీలా గోవింద్ లను లేపారు. ఈ ఘటనలో మంత్రి, ఎమ్మెల్యేలకు చిన్నపాటి గాయాలైనట్లు సమాచారం.