
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని తుంపాల చక్కెర కర్మాగారం కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కార్మికుల ఇవ్వాల్సిన బకాయిల విడుదలకు ఏపీ ప్రభుత్వం శనివారం చర్యలు చేపట్టింది. ఎమ్మల్యే అమర్నాథ్ కార్మికుల సమస్యలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు వారం రోజుల్లో పరిష్కారం లభిస్తుందనికార్మికులకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి కన్నబాబు హామి ఇచ్చినట్లు అమర్నాథ్ వెల్లడించారు. కాగా రూ. 4 కోట్ల వేతన బకాయిలు త్వరలోనే కార్మికులకు అందనుండడంపై ఎమ్మెల్యే అమర్నాథ్ హర్షం వ్యక్తం చేశారు.
చదవండి: నాగార్జున కొండ.. బౌద్ధ ఆనవాళ్లే నిండా
Comments
Please login to add a commentAdd a comment