pending wages
-
తుంపాల చక్కెర పరిశ్రమ కార్మికులకు గుడ్‌న్యూస్
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని తుంపాల చక్కెర కర్మాగారం కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కార్మికుల ఇవ్వాల్సిన బకాయిల విడుదలకు ఏపీ ప్రభుత్వం శనివారం చర్యలు చేపట్టింది. ఎమ్మల్యే అమర్నాథ్ కార్మికుల సమస్యలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు వారం రోజుల్లో పరిష్కారం లభిస్తుందనికార్మికులకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి కన్నబాబు హామి ఇచ్చినట్లు అమర్నాథ్ వెల్లడించారు. కాగా రూ. 4 కోట్ల వేతన బకాయిలు త్వరలోనే కార్మికులకు అందనుండడంపై ఎమ్మెల్యే అమర్నాథ్ హర్షం వ్యక్తం చేశారు. చదవండి: నాగార్జున కొండ.. బౌద్ధ ఆనవాళ్లే నిండా -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం లో భాగంగా రాష్ట్రంలో రూ.200 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్న కూలీల వేతనాలను వెంటనే చెల్లించేం దుకు చర్యలు తీసుకోవాలని సీపీఎం విజ్ఞప్తి చేసింది. హరితహారం పనులు చేసి 4 నెలలు గడుస్తున్నా కూలీలకు డబ్బులు విడుదల కాలేదంది. ప్రస్తుతం జరుగుతున్న అవకతవకలను సరిదిద్ది, ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని సోమవారం సీఎంకు రాసిన లేఖలో ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ఈ పథకానికి బడ్జెట్లో రాష్ట్రం కేటాయిస్తున్న 10శాతం నిధులను ఖర్చు చేయడం లేదన్నారు. 90 శాతం కేంద్రం నిధులను కూడా ఇతర శాఖల్లోని అవసరాలకు ప్రభుత్వం వాడుకుంటోందన్నారు. అందువల్ల ఉపాధి కూలీలకు చట్టంలో పేర్కొన్న విధంగా వేతనాలు చెల్లించడంలో జాప్యం జరుగుతోందన్నారు. -
వేతనాలు ఇచ్చే వరకు నీటి సరఫరా బంద్
ఖానాపురం : మండల కేంద్రంలోని ఫిల్టర్‌బెడ్‌లో పని చేసే కార్మికులకు వేతనాలు ఇచ్చే వరకు తాగునీటి సరఫరా బంద్ చేస్తున్నట్లు ఫిల్టర్‌బెడ్ లైన్మెన్ పంతంగి యాదగిరి తెలిపారు. ఈ మేరకు ఫిల్టర్‌బెడ్ ఆవరణలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గత ఎనిమిది నెలలుగా సుమారు రూ.2.5లక్షల వేతనాలు తమకు రావాల్సి ఉందన్నారు. ఎన్నిమార్లు డీఈ వెంకట్రాంరెడ్డి దృష్టికి తీసుకువెళ్లినా బిల్లులు విషయాన్ని సాకుగా చూపుతున్నారని తెలిపారు. నిధుల విడుదల కాన ప్పుడు తానేం చేయాలంటూ సమాధానమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వేతనాలు ఇచ్చే వరకు ఫిల్టర్‌బెడ్ ద్వారా నీటి సరఫరా బంద్ చేయడంతో పాటు విధులకు హాజరుకావొద్దని నిర్ణయించుకున్నట్లు యాదగిరి తెలిపారు. సమావేశంలో సిబ్బంది అమ్మ అశోక్, పంతంగి వేణు, శ్యాం, జలీల్ పాల్గొన్నారు. -
బడ్జెట్ విడుదల అరకొరే
♦ పెండింగ్ వేతనాలకు నోచుకోని అంగన్వాడీలు ♦ తీవ్ర నిరాశలో కార్యకర్తలు, ఆయాలు ♦ అధికారుల అవసరాలకు మాత్రం దండిగా నిధులు ప్రొద్దుటూరు: అంగన్వాడీలకు మళ్లీ నిరాశే ఎదురైంది. పెరిగిన వేతనాలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి పీతల సుజాత ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని తన కార్యాలయంలో ప్రకటించారు. దీంతో అంగన్వాడీలు తమకు పెరిగిన వేతనాలతోపాటు పెండింగ్ వేతనాలు వచ్చినట్లేనని ఎంతగానో ఆశపడ్డారు. తీరా బడ్జెట్‌ను చూస్తే అరకొరగా విడుదల చేయడంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. జిల్లాకు సంబంధించి స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలో మొత్తం 15 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. అంగన్వాడీలకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెరిగిన వేతనాలు చెల్లించాల్సి ఉంది. అలాగే నెలల తరబడి ఇంటి అద్దెలు, పాల కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్లులు, ఇతర బకాయిలు చెల్లించాల్సి ఉంది. అయితే ఒకటి రెండు నెలలకు మాత్రమే బడ్జెట్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రొద్దుటూరు రూరల్ ప్రాజెక్టు పరిధిలో ప్రొద్దుటూరు, మైదుకూరు, చాపాడు, దువ్వూరు మండలాలకు సంబంధించి 328 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో పనిచేసే కార్యకర్తలు, ఆయాలకు కలిపి నెలకు రూ.35లక్షల వరకు వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఈ ప్రకారం ఏప్రిల్, మే, జూన్ నెలలకుగాను రూ.కోటికిపైగా నిధులు అవసరం కాగా ప్రస్తుతం రూ.46,09,500 మాత్రమే మంజూరైంది. జిల్లావ్యాప్తంగా 15 ప్రాజెక్టులకు సంబంధించి 3,625 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. ఈ ప్రకారం ఖాళీలు పోను 7వేలమంది వరకు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పనిచేస్తున్నారు. మళ్లీ ప్రభుత్వం ఎప్పుడు బడ్జెట్ విడుదల చేస్తుందోనని అంగన్వాడీలు చర్చించుకుంటున్నారు. అలాగే అధికారులకు మాత్రం వాహనాల బాడుగలు, ప్రాజెక్టు కార్యాలయాల్లోని డాటా ఎంట్రీ ఆపరేటర్లకు వేతనాలు మంజూరు చేశారు. -
ఏపీ విద్యుత్ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్: ఏపీ విద్యుత్ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది.1200మంది ఉద్యోగులను తెలంగాణలోనే కొనసాగించాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. బకాయిలు 58 శాతం ఏపీ, 42 శాతం తెలంగాణ ప్రభుత్వాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లోగా బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.