సాక్షి, విశాఖపట్నం: అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే దేశంలోనే అత్యున్నత ముఖ్యమంత్రులలో ఒకరిగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తింపు పొందారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. రెండున్నర లక్షల కోట్ల అప్పులతో పాటు 66 వేల కోట్ల పెండింగ్ బిల్లులను కొత్త ప్రభుత్వానికి చంద్రబాబు ఇచ్చారని మండిపడ్డారు. ఏపీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కూడా పలు సంక్షేమ పథకాలు అమలు చేయడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నదే సీఎం జగన్ తపనని ఆయన తెలిపారు.
ఆ ఘనత సీఎం జగన్‌దే..
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం పదవులు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. బీసీ రేజర్వేషన్లను చంద్రబాబు కుట్రపూరితంగా అడ్డుకుంటే.. పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని సీఎం జగన్ కీలక నిర్ణయం ప్రకటించారని పేర్కొన్నారు. పార్టీ పరంగా బీసీలకు అదనంగా పదిశాతం రిజర్వేషన్లు ఇవ్వబోతున్నామని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు
విషం చిమ్ముతున్నారు..
తన కులం కోసమే విశాఖపై చంద్రబాబు విషం చిమ్ముతున్నారని కన్నబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని మూడు రాజధానుల ప్రతిపాదనలపైనా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తన సామాజిక వర్గానికి మేలు చేయడానికి అమరావతి రాజధాని పేరుతో చేస్తోన్న కుట్రలను తిప్పికొట్టాలని మంత్రి కన్నబాబు పిలుపునిచ్చారు.
(వారిపై నీదెప్పుడూ కపట ప్రేమే కదా)
Comments
Please login to add a commentAdd a comment