SUGAR FACTORY
-
చంద్రబాబు హయాంలో.. సుగర్ ఫ్యాక్టరీ సర్వనాశనం!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయరామ కోఆపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీ... నాడు చంద్రబాబు విషకౌగిలిలో చిక్కి సమాధి అయిపోయింది. రైతుల భాగస్వామ్యంతో సహకార రంగంలో ఉన్నా ప్రైవేట్‌పరం చేయాలనే కుట్రతో క్రమక్రమంగా నిర్వీర్యం చేస్తూ వచ్చారు. నాటి ఘోరాలను దాచిపెట్టి ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నెట్టేయడానికి టీడీపీ నాయకులు దుష్ప్రచారానికి తెరతీశారు. ఇందుకు పచ్చ మీడియా వంతపాడుతోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో ఇప్పుడీ నెపం నెట్టేసే కొత్తనాటకం మొదలెట్టారు. వాస్తవానికి ఈ ఫ్యాక్టరీని గట్టెక్కించడానికి నాడు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాలే కృషి చేశాయి. ఈ విషయం రైతులకు తెలుసు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశవ్యాప్తంగా చక్కెర పరిశ్రమ సంక్షోభంలో ఉంది. రైతులు కూడా మొక్కజొన్న, పామాయిల్ తదితర లాభసాటి పంటల వైపు మరలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏటా చెరకు సాగు విస్తీర్ణం తగ్గిపోతూ వస్తోంది. సుగర్ ఫ్యాక్టరీల మనుగడ దినదిన గండంగా ఉందనే విషయాన్ని మరుగునపెట్టి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు టీడీపీ నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కె.ఎ.నాయుడి ఘనకార్యం... ఫ్యాక్టరీ కోసం వినియోగించాల్సిన రూ.5 కోట్ల నిధిని దుర్వినియోగం చేయడంలో టీడీపీ నాయకుడు కె.ఎ.నాయుడి ఘనకార్యం ఉంది. 2014 సంవత్సరంలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఎప్పటిలాగే పాత వైఖరినే మరలా కొనసాగించారు. అప్పట్లో గజపతినగరం ఎమ్మెల్యేగా ఉన్న కె.ఎ.నాయుడు ఫ్యాక్టరీ సర్వసభ్య సమావేశాన్ని తూతూమంత్రంగా నడిపించేవారు. అశోక్ గజపతిరాజైతే ఏనాడూ హాజరైన దాఖలాలు లేవు. ఇదే అదనుగా ఫ్యాక్టరీ ఆధునికీకరణకు బ్యాంకులో ఉన్న రూ.5 కోట్ల నిధిని కె.ఎ.నాయుడు దుర్వినియోగం చేశారు. రైతులు అడగకపోయినా ఆ డిపాజిట్లను పంచేశారు. దీంతో ఆధునికీకరణ ప్రతిపాదనను ఉద్దేశపూర్వకంగానే తెరవెనుకకు పంపించేశారు. కర్మాగారం కమిటీ చైర్మన్‌గా గంట్యాడ మండలానికి చెందిన గుల్లిపల్లి లలితను నియమించినప్పటికీ నెల తిరగకముందే ఆమె పదవికి స్వయంగా టీడీపీ నాయకులే ఎసరుపెట్టారు. వర్గపోరుతో కోర్టుకెళ్లి ఆమె పదవిని రద్దు చేయించారు. రైతుల పొట్టకొట్టింది టీడీపీ... భీమసింగి కోఆపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీ 1976–77 సంవత్సరంలో తొలిసారి క్రషింగ్‌ను ప్రారంభించింది. దీనిలో 16,873 మంది రైతులు షేర్ హోల్డర్స్ కాగా, 3500 మంది నాన్ షేర్ హోల్డర్స్‌గా ఉన్నారు. తొలుత 543 గ్రామాల్లో ఆరు వేల మంది రైతులకు ఉపయోగపడేది. ఆ సమయంలో 8 వేల ఎకరాల్లో చెరకు సాగు చేసేవారు. టీడీపీ పాలనలో జరిగిన తప్పిదాలు, వరుస నష్టాలతో రైతులు చెరకు సాగును క్రమేపీ తగ్గించేశారు. ఇప్పుడీ సుగర్ ఫ్యాక్టరీ పరిధిలో రైతులు 500 ఎకరాలకు మించి చెరకు సాగుచేయట్లేదు. ప్రమాదకర స్థితిలోకి ఫ్యాక్టరీ... గత టీడీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాల ఫలితంగా ఫ్యాక్టరీ సుమారు రూ.47.88 కోట్లు నష్టాల్లోకి వెళ్లింది. ఆప్కాబ్ నుంచి తెచ్చిన రూ.25 కోట్ల రుణంపై ఏటా రూ.3.2 కోట్ల వరకూ వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి. మరోవైపు యంత్రాలన్నీ పనిచేయకుండాపోయాయి. గత టీడీపీ ప్రభుత్వం మొసలికన్నీరు కారుస్తూ రూ.12 కోట్లు మంజూరుచేసినట్లు ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితిలో ఉంది. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి... ఫ్యాక్టరీపై ఆధారపడిన రైతులకు నష్టం లేకుండా జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య ప్రభుత్వంతో చర్చించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఫలితంగా రైతులు గత నాలుగేళ్లుగా రేగిడి మండలం సంకిలి వద్దనున్న ఈఐడీ ప్యారీ సుగర్ ఫ్యాక్టరీకి చెరకును విక్రయిస్తున్నారు. చంద్రబాబుదే ఆ పాపం... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు తొలిదఫా పాలన సాగిన 1995 నుంచి 2003 వరకూ రాష్ట్రంలోని 18 సహకార చక్కెర కర్మాగారాల్లో ఎనిమిది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. భీమసింగి సుగర్ ఫ్యాక్టరీకి అదేగతి పట్టించేందుకు కత్తి వేలాడదీశారు. 2003–04 సీజన్లో క్రషింగ్ చేయకూడదని అప్పటి టీడీపీ ప్రభుత్వమే ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఫ్యాక్టరీ తాత్కాలికంగా మూతపడింది. నాటి ప్రతిపక్ష నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తన పాదయాత్రను 2003 ఏప్రిల్‌లో భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ ముందుగానే సాగింది. అప్పుడు చెరకు రైతులు ఆయన వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారికి ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఫ్యాక్టరీని తెరిపించారు. ప్రభుత్వ గ్యారెంటీతో రూ.3.50 కోట్ల రుణం అందించారు. ఫ్యాక్టరీకి గుదిబండగా మారిన అప్పులు రూ.18.04 కోట్లను ప్రభుత్వం షేరు ధనంగా మార్చారు. ఆధునికీకరణకు రూ.36.18 కోట్లు మంజూరు చేశారు. తద్వారా క్రషింగ్ సామర్థ్యాన్ని 1205 మెట్రిక్ టన్నుల నుంచి 2 వేల మెట్రిక్ టన్నులకు పెంచడం, పవర్ ప్లాంట్ ఉత్పత్తి కూడా 1.5 కిలోవాట్ల నుంచి 12 కిలోవాట్లకు పెంచడం లక్ష్యాలుగా నిర్దేశించారు. మిగులు విద్యుత్తును ప్రభుత్వానికి విక్రయించడం ద్వారా ఫ్యాక్టరీ కొంత లాభపడటం అనేదీ ఇందులో భాగం. మరోవైపు ఫ్యాక్టరీ ఆధునికీకరణకు తమ వంతు సహకారంగా రైతులు నుంచి రూ.3 కోట్ల వరకూ పెట్టుబడి నిధి కూడా సేకరించారు. దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే అది వడ్డీతో రూ.5 కోట్లు అయ్యింది. ఫ్యాక్టరీని ముంచేసిందెవరో రైతులకు తెలుసు... చెరకు రైతులను మభ్యపెట్టడానికి టీడీపీ నాయకులు మొసలికన్నీరు కార్చుతున్నారు. చంద్రబాబు పాలన ఒక శాపం. 2003 నాటికి భీమసింగి సుగర్ ఫ్యాక్టరీకి మూతవేసేశారు. సీతానగరం మండలంలోనున్న మరో సుగర్ ఫ్యాక్టరీని కమీషన్ల కోసం తక్కువ మొత్తానికే ప్రైవేట్‌పరం చేసేశారు. 2004లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత భీమసింగి ఫ్యాక్టరీకి జీవం పోశారు. లాభాల బాట పట్టించారు. మళ్లీ 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత యథావిధిగా నష్టాల్లో ముంచారు. ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం రైతుల వంతుగా సేకరించిన రూ.5 కోట్ల సొమ్మును అప్పటి టీడీపీ ఎమ్మెల్యే కేఏ నాయుడు దుర్వినియోగం చేశారు. చంద్రబాబు కుర్చీ దిగిపోయేనాటికి చెరకు సాగువిస్తీర్ణం నాలుగో వంతుకు పడిపోయింది. ఈ సీజన్లో ఇప్పటివరకూ 9,795 మెట్రిక్ టన్నుల చెరకు ప్యారీకి వెళ్లింది. ఇంకా 600 టన్నుల వరకూ ఉండవచ్చు. ఇంత తక్కువ క్రషింగ్‌తో ఫ్యాక్టరీని నడపడం ఆర్థికంగా మరింత నష్టమే తప్ప లాభంలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులకు ఉపయోగపడేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను అక్కడ ఏర్పాటుచేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాం. – బొత్స అప్పలనర్సయ్య, గజపతినగరం ఎమ్మెల్యే -
చోడవరం చక్కెర కర్మాగారం రైతులకు ఏపీ సర్కార్ శుభవార్త
సాక్షి, అనకాపల్లి జిల్లా: చోడవరం చక్కెర కర్మాగారం రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. షుగర్ ఫ్యాక్టరీకి గ్రాంట్ రూపంలో రూ.12 కోట్ల 30 లక్షల రూపాయల నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. చెరుకు రైతుల బాకీల నిమిత్తం రూ.9 కోట్ల 30 లక్షల రూపాయలు, కార్మికుల జీతాల పెండింగ్ బిల్లుల కోసం మూడు కోట్ల రూపాయలు గ్రాండ్ రూపంలో ప్రభుత్వం విడుదల చేసింది. నిధులు విడుదల పట్ల రైతులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ధన్యవాదాలు తెలిపారు. -
అది కూడా తెలియదా?.. రాహుల్‌పై ఎమ్మెల్సీ కవిత సెటైర్లు..
సాక్షి, జగిత్యాల: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ తన స్క్రిప్ట్ రైటర్ మార్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణతో కాంగ్రెస్ పార్టీకి విద్రోహ అనుబంధం ఉంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాగా, ఎమ్మెల్సీ కవిత శనివారం మెట్పల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన పెద్దరికాన్ని మరిచి బతుకమ్మపై కామెంట్స్ చేశారు. తన పేరుతో(కవిత) ఎలిజిబెత్ రాణి అని మాట్లాడి ఆయన పెద్దరికాన్ని కోల్పోయారు. రాహుల్ గాంధీకి తెలివికి లేదు. తెలంగాణలో బీసీ గణన చేయాలనుకుంటున్నాడు అంటా. ఇలా అవగాహన లేకుండా మాట్లాడటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పెట్టారని చెబుతున్నారు. కానీ, 1937లోనే నిజాం రాజు ఫ్యాక్టరీని నెలకొల్పాడు. ఇలా అవగాహన లేకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. గల్ఫ్ కార్మికులు తెలంగాణకు వచ్చేయాలి. ఇక్కడ ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. తెలంగాణతో కాంగ్రెస్ పార్టీకి విద్రోహ అనుబంధం ఉంది. ఎప్పుడు తెలంగాణ గురించి మాట్లాడని నాయకులు ఇప్పుడు తెలంగాణకు అనుబంధం ఉంది అని చెప్పడం హాస్యాస్పదం. చక్కర కర్మాగారం ప్రైవేటీకరణ చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏం చేశారు?. ఆ తర్వాత చక్కర కర్మాగారాన్ని పట్టించుకోకపోవడంతో మూతపడే పరిస్థితి వచ్చింది. 2015లో బీఆర్ఎస్ పార్టీ కర్మాగారం తెరిపిస్తానంటే.. బీజేపి ఎంపీ లీగల్ సమస్య తీసుకువచ్చాడు. అందుకే కర్మాగారం తెరిపించలేదు. చక్కర కర్మాగారం తెరిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎంతో కృషి చేసింది. కానీ లీగల్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: బీజేపీ నుంచి బరిలో ఎంపీలు.. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు -
కాకినాడ ప్యారీ షుగర్స్ పరిశ్రమలో పేలుడు.. ఇద్దరు మృతి
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లా వాకలపూడిలోని ప్యారీ షుగర్స్ (ప్యారీ షుగర్స్ రిఫైనరీ ఇండియా ప్రైవేట్ లిమిటెట్) పరిశ్రమలో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు రాయుడు వీరవెంకట సత్యనారాయణ (35), వీరమళ్ళ రాజేశ్వరరావు(45) మృతిచెందారు. మరో 9 మంది కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. విదేశాల నుంచి ఓడలు ద్వారా కాకినాడ సీ పోర్టుకు ముడి సరుకును దిగుమతి చేసుకుని ఇక్కడ శుద్ధిచేసి బస్తాల్లో ప్యాకింగ్ చేసి తిరిగి విదేశాలకు పంపుతుంటారు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం లోడింగ్ కోసం వచ్చిన జట్టు ఉ.9గంటల సమయంలో ఒక లారీని లోడుచేశారు. మరో లారీలోకి సరుకు లోడు చేసేందుకు కన్వెయర్ బెల్ట్ పవర్ సప్లై కోసం ఎంసీబీ (మెయిన్ సర్క్యూట్ బ్రేకర్) వద్ద సాకెట్లో వైర్లు కలిపి ఎంసీబీ ఆన్‌చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు వాటిల్లినట్లు చెబుతున్నారు. ఇలా పేలుడు రావడం.. మంటలు వ్యాపించడంతో సత్యనారాయణ శరీర భాగాలు ఛిద్రమై అక్కడికక్కడే మరణించాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా రాజేశ్వరరావు మృతిచెందాడు. మరోవైపు.. గాయపడిన వీరబాబు, గర్లంవల సూర్య సుబ్రహ్మణ్యం, మోరుకుర్తి జగన్నాథం, గండి వీరబాబులను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. వీరిలో వీరబాబు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇతరుల వివరాలు తెలియాల్సి ఉంది. ఓవర్ లోడు విద్యుత్ సరఫరాతోనే ప్రమాదం? ఎంసీబీ నుంచి ఒక్కసారిగా అధిక విద్యుత్ రావడంవల్లే మోటారు పేలిపోయి ఉంటుందని దీంతో కార్మికులు తీవ్రగాయాలపాలై ఉంటారని అనుమానిస్తున్నారు. దీనికితోడు కాలే స్వభావం గల పంచదార కూడా మంటలకు ఆజ్యంపోసి ఉండవచ్చునంటున్నారు. కానీ, ప్రమాద కారణాలను విద్యుత్, అగ్ని మాపక సిబ్బంది చెప్పలేకపోవడం మిస్టరీగా మారింది. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ప్రమాద స్థలిని పరిశీలించి కార్మికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత సంస్థ మేనేజరు ఎం.బాలాజీతోనూ చర్చించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సంఘటనపై అగ్నిమాపక, విద్యుత్ అధికారులతో విచారణ జరిపిస్తామని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు చెప్పారు. బాధ్యులుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. సర్పవరం పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే సానుభూతి ప్రమాదం గురించి తెలిసిన వెంటనే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలన్నారు. సీఎం వైస్ జగన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లామన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, దీనిపై యాజమాన్యంతో మాట్లాడతున్నామని ఎమ్మెల్యే చెప్పారు. రూ.40లక్షల చొప్పున పరిహారం ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే కన్నబాబు, ఎంపీ వంగా గీత చర్చలు జరపడంతో మృతుల కుటుంబాలకు రూ.40లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు సంస్థ యాజమాన్యం అంగీకారం తెలిపింది. అలాగే, మృతుల కుటుంబాల్లో చదువుకున్న వారుంటే వారికి ఉద్యోగాలు.. కార్మికుల చట్టం ప్రకారం రావాల్సిన బెనిఫిట్స్ చెల్లిస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు.. గాయపడ్డ వారికి వైద్య ఖర్చులు, చికిత్స కాలానికి వేతనం కూడా ఇవ్వనున్నారు. ఇదీ చదవండి: షాకింగ్: ప్రియుడితో భార్య పరార్.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి భర్త ఆత్మహత్య -
‘రైతుల ఆందోళనపై బాబు రాజకీయం మానుకోవాలి’
సాక్షి, విజయనగరం: ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీతో రైతుల బకాయిల వివాదంపై మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రైతుల డిమాండ్, యాజమాన్య వైఖరిపై చర్చించారు. ఈ సందర్భంగా పోలీసులపై దాడి, పోలీస్ సిబ్బందికి గాయాల విషయాన్ని జిల్లా ఎస్పీ దీపికా మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి రైతులకు త్వరగా న్యాయం జరిగేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యాజమాన్యంతో చర్చలు జరిపి చర్యలు తీసుకోవాలని మంత్రి బొత్స పేర్కొన్నారు. షుగర్ ఫ్యాక్టరీ రైతుల ఆందోళనపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజకీయం చేయడం మానుకోవాలని రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ప్రేమ ఉందని పేర్కొన్నారు. రైతుల ఆందోళనను ప్రభుత్వం అర్ధం చేసుకుందని తెలిపారు. రైతులపై లాఠీచార్జ్ చేశారని అసత్యప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల ముసుగులో వామపక్షనాయకలు పోలీసులపై రాళ్లు రువ్వారని అన్నారు. పోలీసులకు గాయాలు అయ్యాయని అయినా పోలీసులు సంయమనం పాటించారని గుర్తుచేశారు. ఏ ఒక్క రైతుపై చేయిచేసుకోలేదన్నారు. ఎన్సీఎస్ యాజమన్యానికి చెందిన 24 ఎకరాల భూమి వేలం వేయడానికి న్యాయపరమైన అంశాలు పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అదుపులో 34వేల బస్తాల పంచదార ఉందని, వీటిని విక్రయించి రైతుల బకాయి రూ. 16కోట్ల చెల్లిస్తామని అన్నారు. 2013-2014 రైతుల బకాయిలు రూ. 20 కోట్లు 2019లో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక సెటిల్ చేశామని తెలిపారు. చదవండి: 14 ఏళ్లు సీఎంగా ఉండి కనీసం మంచి నీళ్లు ఇవ్వలేకపోయారు: పెద్దిరెడ్డి చంద్రబాబు తన 5 ఏళ్ల కాలంలో ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. యాజమాన్యంపై ప్రభుత్వానికి నమ్మకం లేదని, 2019-20కి సంబంధించిన బకాయిలు ప్రతి రైతుకు పైసాతో సహా చెల్లింపులు జరపాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.సాగు చేసిన చెరుకును ఇతర ఫ్యాక్టరీలకు మళ్లించే ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడే గంజాయి సాగు జరుగుతోందని చంద్రబాబు అంటున్నారని, కానీ ఆయన పాలనా కాలంలోనే ఇక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా గంజాయి ఎగుమతి అవుతోందని అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు అనడం నిజం కాదా అని నిలదీశారు. అమరావతి రైతులు ఎక్కడున్నారు అది టీడీపీ రాజకీయ పాదయాత్ర అని ఎద్దేవా చేశారు. విశాఖ రాజధాని కాకుండా న్యాయస్థానాలను ఆశ్రయించి జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు మేలు చేయండని పవన్ కళ్యాణ్ అడగడం లేదని, బిర్యానీ, భోజనం పెడతా ఆందోళన చేద్దాం రండని పిలుపు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. చదవండి: CM YS Jagan: సీఎం జగన్‌ని కలిసిన అజేంద్ర బహదూర్‌సింగ్ -
ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించాలి
మెట్పల్లి: ముత్యంపేట నిజాం దక్కన్ చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించాలని కోరుతూ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో రైతులు కదం తొక్కారు. మొక్కజొన్న, వరి పంటలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పసుపు క్వింటాలుకు రూ.15వేల మద్దతు ధర కల్పించాలని కోరారు. రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం మహాధర్నా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాతోపాటుగా జిల్లా నలుమూలలనుంచి ఈ మహాధర్నాకు రైతులు తరలివచ్చి అక్కడి జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ..అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, సక్రమంగా నిర్వహిస్తుందని హామీ ఇచ్చిన టీఆర్ఎస్..గద్దెనెక్కిన తర్వాత ఆ హామీని నిలబెట్టుకోకపోగా మూసివేసిందని దుయ్యబట్టారు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెబుతున్న రాష్ట్రప్రభుత్వం.. చక్కెర ఫ్యాక్టరీని తెరిస్తే వరి స్థానంలో చెరుకు పంటను సాగు చేయడానికి ఇక్కడి రైతాంగం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రైతుల ధర్నా సమాచారం అందుకున్న కోరుట్ల ఆర్డీవో వినోద్‌కుమార్ వారి వద్దకు చేరుకున్నారు. రైతులు ఆయనకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. -
తుంపాల చక్కెర పరిశ్రమ కార్మికులకు గుడ్‌న్యూస్
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని తుంపాల చక్కెర కర్మాగారం కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కార్మికుల ఇవ్వాల్సిన బకాయిల విడుదలకు ఏపీ ప్రభుత్వం శనివారం చర్యలు చేపట్టింది. ఎమ్మల్యే అమర్నాథ్ కార్మికుల సమస్యలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు వారం రోజుల్లో పరిష్కారం లభిస్తుందనికార్మికులకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి కన్నబాబు హామి ఇచ్చినట్లు అమర్నాథ్ వెల్లడించారు. కాగా రూ. 4 కోట్ల వేతన బకాయిలు త్వరలోనే కార్మికులకు అందనుండడంపై ఎమ్మెల్యే అమర్నాథ్ హర్షం వ్యక్తం చేశారు. చదవండి: నాగార్జున కొండ.. బౌద్ధ ఆనవాళ్లే నిండా -
రైతులకు ఉపయోగపడే విధంగా సీఎం నిర్ణయం
సాక్షి, విశాఖపట్నం: తాండవ షుగర్ ఫ్యాక్టరీలో మంగళవారం మంత్రులబృందం రైతులతో సమావేశమయ్యింది. తాండవ షుగర్ ఫ్యాక్టరీపై రైతుల అభిప్రాయాలను మంత్రుల బృందం అడిగి తెలుసుకుంది. అనంతరం మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి. సీఎం జగన్ చంద్రబాబులాగా ఎన్నికల కోసం పనిచేయరు. షుగర్ పరిశ్రమల్లో స్థితిగతులు ప్రత్యక్షంగా తెలుసుకోమని సీఎం కమిటీ వేశారు. రైతులకు నష్టం చేయడం కోసం కమిటీ వేయలేదు. మీరు చెప్పిన అభిప్రాయాలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం. అందరికి మేలు జరిగే నిర్ణయం సీఎం జగన్ తీసుకుంటారు’ అని వెల్లడించారు. అనంతరం పరిశ్రమల శాఖ మంత్రి గౌతం రెడ్డి మాట్లాడుతూ, ‘ రాష్ట్రంలో 12 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. రైతులకు ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకోమని సీఎం చెప్పారు. రైతులకు సీఎం జగన్ మేలు చేస్తారు. రైతులకు మేలు జరగాలన్నదే సీఎం జగన్ ఉద్దేశం’ అని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, ‘నాన్న ఒక అడుగు ముందుకు వేస్తే నేను రెండు అడుగులు ముందుకు వేస్తానని సీఎం జగన్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు అన్యాయం జరిగింది. రైతులకు మంచే జరుగుతుంది. మీ అభిప్రాయాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాం’ అని పేర్కొన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి ఉన్నపుడు రైతులకు మేలు జరిగింది. రైతులకు సీఎం జగన్ ఏం చేశారో, చంద్రబాబు ఏం చేశారో అందరికి తెలుసు. రైతుల అభిప్రాయాలన్నింటిని సీఎం దృష్టికి తీసుకువెళ్తాం. రైతులకు మేలు చేయాలన్నదే సీఎం జనగ్ ఆలోచన. టీడీపీ హయాంలో చెరుకు రైతులకు బకాయి ఉన్న రూ.54 కోట్లును సీఎం జగన్ విడుదల చేశారు’ అని చెప్పారు. ఎంపీ వంగ గీత మాట్లాడుతూ, ‘ షుగర్ పరిశ్రమల స్థితిగతులు తెలుసుకోవాలని సీఎం కమిటీ వేశారు. నష్టం వస్తే ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై కమిటి చర్చిస్తోంది. చరిత్రలో ఎన్నడూలేని విధంగా చెరుకు రైతులకు బకాయిలు చెల్లించారు. రైతులకు మేలు జరగేలా మంత్రుల కమిటీ నిర్ణయం ఉంటుంది’ అని అన్నారు. చదవండి: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ -
చెరకు రైతుల బకాయిలు తీర్చాలి
సాక్షి, అమరావతి: చెరకు రైతులకు ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా తీర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రూ.54.6 కోట్ల బకాయిలను ఈ నెల 8న రైతు దినోత్సవం సందర్భంగా చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దీని వల్ల దాదాపు 15 వేల మంది చెరకు రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సహకార చక్కెర ఫ్యాక్టరీలపై మరింతగా అధ్యయనానికి మంత్రుల బృందం ఏర్పాటు చేస్తున్నామని, ఈ బృందం లోతుగా అధ్యయనం చేసి ఆగస్టు 15వ తేదీలోగా సమగ్ర నివేదికను సమర్పించాలన్నారు. ఈ సమీక్ష వివరాలు ఇంకా ఇలా ఉన్నాయి. ► రాష్ట్రంలో సహకార చక్కెర ఫ్యాక్టరీల పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు. రైతులకు చెల్లించాల్సిన బకాయిల వివరాలపై సీఎం ఆరా తీశారు. ► ప్రస్తుతం సహకార చక్కెర కర్మాగారాల వద్ద ఉన్న నిల్వలను ప్రభుత్వ పరంగా ఎంత వరకు వినియోగించగలమో ఆలోచించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. టీటీడీతో పాటు, ప్రధాన దేవాలయాలు, ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్వాడీలు.. ఇలా ఎక్కడ వీలైతే అక్కడ వినియోగించుకునేలా ఆలోచించాలన్నారు. దీని వల్ల ఆ ఫ్యాక్టరీలకు కొంతైనా మేలు జరుగుతుంది. ► ఈ సమీక్షలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
తిరుపతిలో మయూరా షుగర్ ఫ్యాక్టరీ బాధితుల నిరసన
-
సహకార రంగానికి ఊతం
సాక్షి, అమరావతి: సహకార రంగానికి జవసత్వాలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సన్న, చిన్నకారు రైతుల అభ్యున్నతికి దోహదపడే ఈ రంగం మోడువారకూడదనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్.. బడ్జెట్లో నిధుల కేటాయింపు, చక్కెర కర్మాగారాల్లోని పరిస్థితుల అధ్యయనానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదికను ఆధారంగా చేసుకుని దశల వారీగా వీటిని పునరుద్ధరించనున్నారు. తొలిదశలో రెండు కర్మాగారాల పునరుద్ధరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ అంశంపై త్వరలోనే ఉన్నతస్థాయి సమీక్ష జరగనుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. నష్టాల ఊబిలో కర్మాగారాలు ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి పంచదార దిగుమతులు పెరగడం, గత ప్రభుత్వాల ప్రోత్సాహం లేకపోవడంతో సహకార రంగంలో కొనసాగుతున్న రాష్ట్రంలోని పది చక్కెర కర్మాగారాలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయి. రేణిగుంటలోని ఎస్వీ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, గుంటూరు జిల్లాలోని జంపని షుగర్ ఫ్యాక్టరీ, వైఎస్సార్ జిల్లాలోని కడప కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, విజయనగరం జిల్లాలోని భీమ్‌సింగ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. దీంతో ఈ రంగంపై ఆధారపడిన చెరుకు రైతులు, రైతు కూలీలు, కర్మాగారాల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనకాపల్లి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, చోడవరం కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, తాండవ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, ఏటికొప్పాక కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలో నష్టాల్లో కూరుకుపోయినప్పటికీ ఉత్పాదక రంగంలో కొనసాగుతున్నాయి. చక్కెర కర్మాగారాలకు వాటిల్లిన నష్టాలు.. అవి ప్రభుత్వానికి, ఆర్థిక సంస్థలు, ఉద్యోగుల జీతాలకు చెల్లించాల్సిన మొత్తాలు దాదాపు రూ. 1,475 కోట్లు ఉన్నాయి. కర్మాగారాలకు వచ్చిన నష్టాలు రూ. 683 కోట్లు, ప్రభుత్వం నుంచి తీసుకున్న అప్పులు రూ. 271.14 కోట్లు, ఆప్కాబ్, ఎన్సీడీసీల నుంచి తీసుకున్న అప్పులు రూ. 416.58 కోట్లు, ఉద్యోగుల జీతాల బకాయిలు రూ. 105 కోట్లు ఉన్నాయి. భారమైనా ఈ రంగాన్ని బతికించాలని... ప్రస్తుత పరిస్థితిలో చక్కెర కర్మాగారాల పరిస్థితి ఆశాజనకంగా లేదు. వీటికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించినా, భవిష్యత్‌లో అవి లాభాల బాటలో కొనసాగే పరిస్థితులు లేవు. ఏటా ప్రభుత్వంపై ఆర్థిక భారం పడే అవకాశాలు లేకపోలేదని నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. అయితే భారమైనా ఈ రంగాన్ని బతికించాలని, ఆయా కర్మాగారాలు ఉత్పాదక రంగంలో కొనసాగితే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, అక్కడి రైతులు, రైతు కూలీలకు ఉపాధి లభిస్తుందనే ఉద్దేశంతోనే సీఎం వైఎస్ జగన్ వీటికి దశల వారీగా నిధులు కేటాయింపునకు చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్ జిల్లాలోని కడప కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలను తొలిదశలో ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిగా సొంత జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో డిసెంబరులోపు అక్కడి కర్మాగారాన్ని పునరుద్ధరిస్తామని జగన్ రైతులకు హామీ ఇచ్చారు. ఆ మేరకు బడ్జెట్లో దాదాపు రూ. 100 కోట్లు కేటాయించారు. పాడి రైతులకు లీటరుకు రూ. 4 బోనస్ ప్రైవేట్ డెయిరీల గుత్తాధిపత్యాన్ని నిలువరించేందుకు మూతపడిన పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను తెరిపించి, రైతుల నుంచి నేరుగా పాలను కొనుగోలు చేసి లీటరుకు రూ. 4లను బోనస్‌గా ఇస్తానని ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రూ. 100 కోట్లు కేటాయించారు. ఒక ఏడాదిలోపు ఇవన్నీ సక్రమంగా నడిచే విధంగా చర్యలు తీసుకుని, ఆ తరువాత రైతుల నుంచి నేరుగా పాలను కొనుగోలు చేసే ఏర్పాటు చేస్తున్నారు. -
షుగర్ ఫ్యాక్టరీకి పూర్వవైభవం!
సాక్షి, కోవూరు(నెల్లూరు) : కోవూరు చక్కెర కర్మాగారంతోపాటు రాష్ట్రంలో ఉన్న చిత్తూరు, రేణిగుంట, కడప ప్రాంతాల్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీల్ని పరిశీలించి నివేదికను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని అమరావతి నుంచి వచ్చిన ప్రత్యేక బృందం సభ్యులు చీఫ్ ఇంజినీర్ ప్రసాద్‌రావు, చీఫ్ కెమిస్ట్ రవికుమార్, ప్రధాన వ్యవసాయాధికారి కె.వి.రమణ, ఇన్చార్జి షుగర్స్ ఏడీ తిరుపాలురెడ్డి తెలిపారు. శుక్రవారం కోవూరు చక్కెర కర్మాగారంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఫ్యాక్టరీలో ఏయే పరికరాలు పనికివస్తాయి.. ఎంత నిధులు అవసరమో పరిశీలించామన్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ పరిధిలో చెరకు సాగు ఏమాత్రం చేస్తున్నారు.. ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభిస్తే వారంతా కోవూరు షుగర్స్‌కు చెరకు సరఫరా చేస్తారా లేదా అనే అంశాలపై చర్చించారు. చక్కెర కర్మాగార కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో 6 చక్కెర కర్మాగారాల పరిస్థితి తదితర అంశాలను 6వ తేదీ లోపు పరిశీలించి నివేదిక అందజేస్తామన్నారు. గత నెల 28వ తేదీ నుంచి ఈ షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితుల్ని అధ్యాయనం చేస్తున్నామన్నారు. అనంతరం పలువురు రైతు నాయకులు, కర్మాగార ఉద్యోగులు మాట్లాడుతూ గతంలో జాతీయ స్థాయిలో అనేక అవార్డులు సాధించిన కోవూరు షుగర్ ఫ్యాక్టరీకి మరలా పూర్వవైభవం కల్పించేలా చూడాలని పరిశీలనకు వచ్చిన కమిటీని కోరారు. కోవూరు చక్కెర కర్మాగారానికి సంబంధించిన వాటాదారులైన తమతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని రైతు నాయకులు కోరారు. ప్రధానంగా ఫ్యాక్టరీ పట్ల రైతులకు నమ్మకం పెంచాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చాలని కోరారు. ఇప్పటివరకు కోవూరు చక్కెర కర్మాగారాన్ని నాలుగు సర్వే బృందాలు పరిశీలించి పోయాయన్నారు. సర్వే బృందాలు ఇచ్చిన నివేదికలు బుట్టదాఖలాలు అయ్యాయే తప్ప వాటి వల్ల ఉపయోగం లేదన్నారు. కర్మాగారాన్ని నమ్ముకొని జీవిస్తున్న కార్మికులు ఎంతో మంది అప్పులపాలై విగతజీవులుగా మృతిచెందిన సందర్భాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 21 చక్కెర కర్మాగారాలు ఉన్నాయన్నారు. కర్మాగారానికి సంబంధించి వందల కోట్ల రూపాయలు ఉన్నా వాటిని విడుదల చేసి బకాయిలు చెల్లించాలన్న ఆలోచన గత ప్రభుత్వాలు చేయలేదన్నారు. గతంలో రోడ్డు నిర్మాణ సమయంలో కర్మాగారానికి సంబంధించిన స్థలాన్ని బేరం పెట్టుకొని వాటిని అమ్మకాలు చేపట్టడం చాలా బాధకరమన్నారు. రైతులను సంప్రదించకుండా అమ్మకాలు చేపట్టడం చాలా బాధకరమన్నారు. ఫ్యాక్టరీ స్థితిగతుల్ని పరిష్కరించడానికి వచ్చిన సభ్యులు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ప్రస్తుతం వరిసాగు రైతులకు ఇబ్బందిగా ఉన్న విధి లేని పక్షంలో వరిసాగు చేయాల్సి వస్తుందన్నారు. చెరకు సాగుపై దృష్టి సారించే అవకాశం కోవూరు చక్కెర కర్మాగారం అందుబాటులోకి వస్తే ఆరుతడి పంట అయిన చెరకు సాగుపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందని రైతులు తెలిపారు. దీనిపై ఆధారపడి 4600 మంది రైతులు ఉన్నారని, 2020 నాటికి అయినా ఫ్యాక్టరీని ప్రారంభించేలా కమిటీ ప్రభుత్వానికి సూచించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 9.5 శాతం క్రషింగ్ ఉందన్న విషయాన్ని సర్వే బృందం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిందన్నారు. రాష్ట్రంలోనే ఈ కర్మాగారానికి ఎంతో ఘన చర్రిత ఉందన్న విషయం కూడా మరచిపోవద్దన్నారు. అనంతరం సర్వే బృందం కర్మాగారం మొత్తాన్ని పరిశీలించారు. సమావేశంలో రైతు సంఘం నాయకులు వెంకమరాజు, శ్రీనివాసరావు, నిరంజన్‌రెడ్డి, శ్రీరాములు, డానియల్, ఎంవీ రమణయ్య, శ్రీనివాసులురెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు. -
చిత్తూరుకు ‘తియ్యటి’ కబురు..!
గత ఐదేళ్లుగా ఖాయిలాపడ్డ కర్మాగారానికి పూర్వవైభవం ఎప్పుడొస్తుందా.. అని ఎదురుచూసిన వేలాది వెతల జీవుల్లో కొంగొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చెరకు రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా అడుగులు పడుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే గత ప్రభుత్వంలో మూతపడిన ఆరు సహకార చక్కెర కర్మాగారాల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ఓ టెక్నికల్ కమిటీని నియమించారు. ఆ కమిటీ సభ్యులు మంగళవారం గాజులమండ్యం ఎస్వీ షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించారు. సాక్షి, రేణిగుంట: చక్కెర కర్మాగారాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తోంది. దీంతో మోడువారిన రైతులు, ఫ్యాక్టరీ కార్మికుల జీవితాల్లో కొత్త ఆశలు చిగురించాయి. ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీలోని చీఫ్ ఇంజినీరు పి.ప్రసాద్‌రావు, చీఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్ కెవి రమణ, అడ్వైజర్ కె.రవికుమార్‌తో కూడిన సభ్యులు మంగళవారం గాజులమండ్యం ఎస్వీ షుగర్ ఫ్యాక్టరీకి చేరుకున్నారు. అక్కడ ఫ్యాక్టరీలోని భవనాలు, యంత్ర పరికరాలను పరిశీలించారు. మిల్‌హౌస్, బ్రాయలర్, గ్రావర్ సెక్షన్, పవర్ హౌస్, బాయిలింగ్ సెక్షన్, మొలాసిస్ ట్యాంకులను, స్ప్రే బాండ్, ఈటీ ప్లాంటులను చూశారు. ప్రస్తుతం యంత్ర పరికరాలు పనిచేసే స్థితిలో ఉన్నా యా అని అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చక్కెర నిల్వ చేసే గిడ్డంగులను పరిశీలించారు. ఫ్యాక్టరీ సిబ్బందితో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. తమకు ఐదేళ్లుగా వేతనాలను చెల్లించలేదని, ప్రభుత్వం బకాయిలను చెల్లించి ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తే ఫ్యాక్టరీకి పూర్వవైభవాన్ని తీసుకొచ్చే దిశగా శ్రమిస్తామని సిబ్బంది వారి దృష్టికి తీసుకెళ్లారు. తాము ఈ సీజన్లోనే లక్ష టన్నుల చెరకు తరలించేందుకు సిద్ధమని కొందరు రైతులు కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. సుమారు 50మంది ఫ్యాక్టరీ సిబ్బందితో పాటు రైతులతోనూ కర్మాగారం స్థితిగతులపై చర్చించి కమిటీ సభ్యులు వారి అభిప్రాయాలను తీసుకున్నారు. రాష్ట్రంలో ఆరు కర్మాగారాలపై నివేదిక రాష్ట్రంలో చిత్తూరు జిల్లా గాజులమండ్యం ఎస్వీ షుగర్ ఫ్యాక్టరీ, చిత్తూరు కో–ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, కడప జిల్లా చెన్నూరు మండలంలోని సహకార షుగర్ ఫ్యాక్టరీ, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు షుగర్ ఫ్యాక్టరీ, తెనాలి, అనకాపల్లి షుగర్ ప్యాక్టరీలను ఈ బృంద సభ్యులు పరిశీలించి ఫ్యాక్టరీ స్థితిగతులపై ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించనున్నట్లు కమిటీ బృందం వివరించింది. ఈ నెల 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందిస్తామని వివరించింది. నేడు చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీకి టెక్నికల్ కమిటీ చిత్తూరు అగ్రికల్చర్: చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక టెక్నికల్ కమిటీ బుధవారం రానుంది. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలను పునఃçప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ముం దస్తుగా ఆయా ఫ్యాక్టరీల స్థితిగతులు, యంత్రాల పరిస్థితులను పరిశీలించేందుకు గాను టెక్నికల్ కమిటీని నియమించింది. ఈ కమిటీ మంగళవారం జిల్లాలోని గాజులమండ్యం ఫ్యాక్టరీని పరిశీలించింది. అదేవిధంగా బుధవారం చిత్తూరులో మూతపడిన సహకార షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించనుంది. ఉదయం 8.30 గంటలకు ఫ్యాక్టరీ వద్దకు కమిటీ సభ్యులు రానున్నారని ఫ్యాక్టరీ జనరల్ మేనేజరు వెంకటరమణరావు తెలిపారు. -
శ్రీకాకుళం జిల్లాలో ప్యారీ చక్కెర ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
-
అయోమయంలో క్రషింగ్
భీమసింగి చక్కెర కర్మాగారంపై ఈ సర్కారు మొదటినుంచీ నిర్లక్ష్యమే ప్రదర్శిస్తోంది. రైతుల సంక్షేమం... కార్మికుల భవిష్యత్తును కనీసం పట్టించుకోకుండా... పరిశ్రమ అవసరాలు తీర్చడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. పాతబడిన యంత్రాల పుణ్యమాని తరచూ మొరాయిస్తూ రైతాంగం సహనాన్ని పరీక్షిస్తోంది. అసలే ప్రకృతి సహకరించక పంట నష్టం చవిచూస్తున్న రైతాంగానికి క్రషింగ్ ఆలస్యం అవుతుండటంతో రికవరీ శాతం తగ్గి మరింత నష్టపోవాల్సి వస్తోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. విజయనగరం, జామి(శృంగవరపుకోట): జిల్లాలో ఏకైక విజయ రామ సహకార చక్కెర కర్మాగారం క్రషింగ్ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఎప్పటి కప్పుడు కర్మాగారం మొరాయిస్తోంది. యంత్రాలు పురాతనమైననవి కావడంతో తరచూ పాడైపోయి ఎప్పటికప్పుడు క్రషింగ్ నిలిచిపోతోంది. గడచిన నాలుగున్నరేళ్లుగా ఈ సర్కారు పరిశ్రమను నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్న ఆందోళన రైతుల్లో పెల్లుబుకుతోంది. కర్మాగారానికి ఆయువు పట్టు వంటి మిల్లు టర్బయిన్ మళ్లీ పాడవడంతో గురువారం రాత్రి 8 గంటల నుంచి క్రషింగ్ నిలిచిపోయింది. దీనిని బాగు చేసేందుకు హైదరాబాద్ పంపించారు. దానిని తీసుసుకువచ్చి పునరుద్ధరించడానికి కనీసం ఐదు రోజులైనా సమయం పడుతుంది. యార్డులో గుట్టలుగా చెరకు పేరుకుపోవడంతో ఎండకు ఎండిపోవడంతో రికవరీ శాతం తగ్గిపోతుందని రైతాంగం ఆందోళన చెందుతోంది. చెరకు తరలింపు అడ్డగింత కర్మాగారం యాజమాన్యం యార్డులో ఉన్న చెరకును సంకిలి చెరకు ఫ్యాక్టరీకి తరలించాలని యత్నించడంతో దానిని చెరకు రైతులు అడ్డుకున్నారు. నష్టాలైనా భరిస్తాం గానీ... ఇక్కడే క్రషింగ్ చేయాలని వారు పరిశ్రమ ఎండీ వి.వి.రమణారావుకు ఖరాఖండీగా చెప్పడంతో చేసేది లేక చెరకు తరలింపు యోచన విరమించుకున్నారు. వేరొక కర్మాగారానికి చెరకు తరలిస్తే క్రషింగ్ తగ్గి నిబంధనల ప్రకారం వచ్చే సీజన్‌కు క్రషింగ్‌కు అనుమతులు ఉండవేమోనని రైతులు భయపడుతున్నారు. పట్టించుకోని ప్రభుత్వం గడిచిన నాలుగున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీని పట్టించుకున్న పాపాన పోలేదు. 40 సంవత్సరాల క్రితం నాటి యంత్రాలను ఆధునికీకరించడానికి ఏమాత్రం చొరవ చూపడం లేదు. ఇప్పటికే రూ. 38 కోట్లు నష్టాల్లో కూరుకుపోయినా ఆదుకునేందుకు ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే జాతీయ సహకార సంస్థ 9శాతం వడ్డీకి రుణం అందిస్తుంది. తద్వారా పరిశ్రమను ఆధునికీకరించుకోవచ్చు. తద్వారా మళ్లీ కష్టాలనుంచి గట్టెక్కే అవకాశం ఉంది. కానీ ఇక్కడి నాయకులు ఆ ప్రయత్నమేదీ ఇన్నాళ్లూ చేయకుండా... ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏదో హడావుడిగా ఒత్తిడి తేవడంతో గ్యారంటీ ఇస్తామని హడావుడిగా ప్రకటించింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. క్రషింగ్ సీజన్ కూడ ముగిసిపోవచ్చింది. ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వక పోవడంతో కర్మగారంలో ఉన్న పంచదారను ఆప్కాబ్‌కు తాకట్టు పెట్టి 12శాతం వడ్డీకి రుణం తెచ్చి చెరకు రైతులకు అరకొరగా బకాయిలు చెల్లించారు. దీనివల్ల రైతాంగం ఇబ్బందులు పడింది. కార్మికులకు కూడా ఇటీవలే రెండు నెలలు వేతనాలు ఇచ్చారు. మళ్లీ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉన్నా సర్కారు కనీసం ఇటువైపు కన్నెత్తి చూడట్లేదు. అరకొర చెల్లింపు జాతీయ సహకార సంస్థ నుంచి రావాల్సిన రుణం రూ. 30కోట్లు రాకపోవడంతో జనవరి 15వ తేదీవరకూ సరఫరా చేసిన చెరకునకే బిల్లులు అందించారు. అదీ టన్ను చెరకుకు రూ. 2,625లు కాగా రూ. 2,200లే చెల్లించారు. గతంలో 15రోజులకోసారి చెల్లించేవారని ఇప్పుడు ఆ స్థాయిలో డబ్బులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తగ్గిపోయిన రికవరి కర్మగారం క్రషింగ్‌కు ఎప్పటికప్పుడు అవాంతరాలు ఎదురవడం, పురాతన యంత్రాలతోనే కాలం గడిపేయడంతో రికవరీ శాతం భారీగా పడిపోయి 8.85శాతం మాత్రమే వచ్చింది. ఇప్పటివరకు 55వేల మెట్రిక్ టన్నులు క్రషింగ్ చేసి 46,305 బస్తాల పంచదారను ఉత్పత్తి చేయగలిగింది. పురాతన యంత్రాలు కావడంతో కర్మాగారంలో బెగాస్ మిగలక బయట కర్మగారాల నుంచి బెగాస్ కూడా కొనుక్కోవాల్సి వస్తోంది. దీనివల్ల మరింత ఆర్థిక సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తోంది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం కర్మాగారం క్రషింగ్ ఎప్పటికప్పుడు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పాలకులు ఎవ్వరూ పట్టించుకోలేదు. చెరకు వేరొక ప్రాంతానికి తరలిస్తే వచ్చే ఏడాది క్రషింగ్‌కు అనుమతులు రావు. అందువల్ల ఇక్కడే క్రషింగ్ చేయాలి. అధికార పార్టీ నాయకులు పట్టించుకోకపోవడం అన్యాయం. – సీహెచ్.వెంకటరావు,రైతు సంఘం నేత, జామి -
చక్కెర ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృతి
సాక్షి, బళ్లారి: కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోట జిల్లా కుళలి సమీపంలోని ఒక చక్కెర ఫ్యాక్టరీలో ఆదివారం సంభవించిన పేలుడులో ఆరుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ నేత, మాజీ మంత్రి మురుగేష్ నిరాణికి చెందిన ఈ ఫ్యాక్టరీలో వృథా నీటిని ఫిల్టర్ చేసే బాయిలర్ సేఫ్టీ వాల్వ్ మూసుకుపోవడంతో ఒత్తిడికి బాయిలర్ పెద్ద శబ్ధంతో పేలిపోయింది. బాయిలర్ ఉన్న కట్టడం నామరూపాల్లేకుండా ధ్వంసమయింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఒక ఇంజినీరు, ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు గాయపడ్డారు. ఘటనాస్థలిని ఉన్నతాధికారులు పరిశీలించి, సహాయక చర్యలు చేపట్టారు. -
కర్ణాటకలో బాయిలర్ పేలి ఆరుగురు మృతి
బెంగళూరు: కర్ణాటకలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. బాగల్కోట్ జిల్లా కులాలి గ్రామంలోని ఓ షుగర్ ప్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటనలో ఆరుగురు కార్మికులు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ప్యాక్టరీలో 20 మంది కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. పేలుడు దాటికి మూడంతస్తుల భవనం కుప్పకూలింది. సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది శిథిలాల నుంచి ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. అధికారులు ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. పేలుడు జరిగిన సమయంలో పెద్ద ఎత్తున శబ్దం రావడంతో చుట్టుపక్కల ఉన్నవారు భయబ్రాంతులకు గురయ్యారు. ప్యాక్టరీలో వాటర్ ఫిల్టర్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ కంపెనీ బీజేపీకి చెందిన మాజీ మంత్రి మురుగేశ్ నిరాని సోదరులకు చెందినదిగా గుర్తించారు. -
నిజాంషుగర్స్ చుట్టూ రాజకీయాలు
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ చుట్టూ రాజకీయాలు పెనవేసుకుంటున్నాయి. ఫ్యాక్టరీ మూసివేతను ప్రతిపక్షాలు ఆయుధంగా మలుచుకునేందుకు ప్రయత్నం చేస్తుండగా, అధికార పార్టీ టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా కదులుతోంది. బకాయి వేతనాలు చెల్లించడం ద్వారా ఫ్యాక్టరీ కార్మికుల్లో ఉన్న నిరసన జ్వాలలను చల్లబర్చాలని చూస్తోంది. ఈ మేరకు ఎంపీ కవిత ఐదు రోజుల క్రితం ఫ్యాక్టరీ కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమై 27 నెలల బకాయి వేతనాలు చెల్లించేందుకు హామీ ఇచ్చారు. బోధన్ (నిజామాబాద్): మూతపడిన నిజాం షుగర్స్ ఫ్యా క్టరీ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నా యి. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఫ్యా క్టరీ సమస్య ప్రధాన అంశంగా మారనుంది. ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలు దీని ని ఆయుధంగా మరల్చుకునే ప్రయత్నం చేస్తుండగా, అధికార పార్టీ టీఆర్ఎస్కు ఇరకాట పరిస్థితి ఎదురుకానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, శివసేన పార్టీలు ఫ్యాక్టరీ సమస్యపై రోడ్డె క్కి ఆందోళనకు దిగాయి. మలి దశ తెలంగాణ ఉద్యమం, ఎన్నికల్లో సమయంలో నూ అధికారంలోకి రాగానే షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ రద్దు చేసి స్వాధీనం చేసుకు ని పూర్వవైభవం తెస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం హామీని నిలబెట్టుకోలేక పోయింది. ప్రభుత్వ భాగస్వామ్యంతో ఫ్యాక్టరీని నడిపించిన ప్రైవేటు యాజమాన్యం బోధన్ తో పాటు ముత్యంపేట (జగిత్యాల) ముంబోజిపల్లి (మెదక్) యూనిట్లను 2015 డిసెంబర్ 23న లేఆఫ్ ప్రకటించి మూసివేసింది. మూడు ఫ్యాక్టరీల పరిధిలో వందలాది మంది కార్మికులు రోడ్డున న పడ్డారు. ఆనాటి నుంచి నిజాం షుగర్స్ రక్షణ కమిటీ, కార్మిక, ప్రజా సంఘాలు, చెరుకు రైతులు, వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్, బీజేపీ, శివసేన, ఎంఐఎం, వైఎస్ఆర్ సీపీ, తెలంగాణ సా మాజిక పోరాట సమితి ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం అనేక రూపాల్లో ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్నాయి. అయితే ఫ్యాక్టరీ పునరుద్ధర ణ, స్వాధీన అంశాల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎటూ తేల్చలేకపోయింది. ప్రస్తుతం ఎన్సీఎల్టీ ( నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ), లేబర్ కోర్టుల్లో షుగర్ ఫ్యాక్టరీ సమ స్య విచారణలో ఉంది. ఫ్యాక్టరీ భవిష్యత్తు అయోమయంగా మారింది. ఫలించని అధికార పక్షం ఆలోచన షుగర్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారానికి 2015 జనవరిలో సీఎం కేసీఆర్ చెరుకు రైతులతో రాష్ట్ర సచి వాలయంలో చర్చించారు. రైతులు ముం దుకొస్తే సహకార రంగంలో నడిపిస్తామని స్పష్టత ఇచ్చారు. రైతులు తమతో అయ్యే పని కాదని తేల్చి చెప్పారు. దీంతో ఫ్యాక్టరీ సమస్య మొదటి కొచ్చింది. 2015 ఏప్రిల్ 29న ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని జీవో నంబర్ 28ను ప్రభుత్వం జారీ చేసింది. మరో ముందడుగు వేసి ఫ్యాక్టరీ స్వాధీనంలో సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు అధిగమించేందుకు ఆరుగురు ఐఏఎస్ ఉన్న తాధికారులతో అధ్యయన కమిటీని వేసింది. ఈ కమిటీ నివేదిక బహిర్గతం చేయలేదు. సమస్య మాత్రం యథాతథంగా ఉంది. పెండింగ్‌లో బకాయిలు.. ఫ్యాక్టరీ మూతపడిన నాటి నుంచి కార్మికుల నెలసరి వేతనాలు అటు ఫ్యాక్టరీ యాజమాన్యం, ఇటు ప్రభుత్వం చెల్లించలేదు. ఇప్పటి వరకు 33 నెలల బకాయి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. కార్మికులు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కార్మికులు ఆగ్రహంతో ఉన్నారనే విషయా న్ని అధికార పక్షం గుర్తించి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. తాజాగా ఎంపీ కవిత ఐదు రోజుల క్రితం బోధన్ షుగర్ ఫ్యాక్టరీ వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులతో సమావేశమై కార్మికుల ఇబ్బందులపై చర్చించారు. 2015 డిసెంబర్ నుంచి 2018 మార్చి వరకు 27 నెలల బకాయి వేతనాలు చెల్లించేందుకు హామీ ఇచ్చారు. ఏది ఏమైనా షుగర్ ఫ్యాక్టరీ సమస్య ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశంగా మార నుందని స్పష్టమవుతోంది. ప్రతిపక్షాల, అధికార పార్టీ వ్యూహప్రతివ్యూహాలతో బోధన్ నియోజక వర్గం ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయని అంటున్నారు. ఎంపీ కవిత ప్రత్యేక దృష్టి పెట్టారు షుగర్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారంపై ప్రభు త్వం సీరియస్‌గా దృష్టిసారించింది. ఎంపీ కవిత చొరవ తీసుకుని కార్మికుల బకాయి వేతనాలు ఇప్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. త్వర లోనే కార్మికుల బకాయి వేతనాలు చెల్లిస్తారు. బకాయిల చెల్లింపుతో కార్మికులకు న్యాయం జరుగుతుంది. వేతనాలు వస్తే ఉపశమనం పొందుతారు. ఎంఏ రజాక్, టీఆర్ఎస్ నాయకుడు, బోధన్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారంలో విఫలం షుగర్ ఫ్యాక్టరీ సమస్యను పరిష్కరించడం లో టీఆర్ఎస్ ప్రభు త్వం విఫలమైంది. ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని ఎన్నికల హామీని అమలు చేయకుండా మోసగించింది. మరో వైపు ఫ్యాక్టరీ మూతపడినా పట్టించుకోలేదు, మభ్యపెట్టే మాటలతో కాలం వెళ్లదీసింది. ఫ్యాక్టరీ మూసి వేత, టీఆర్ఎస్ ఎన్నికల హామీ, మోసపూరిత వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్తాం. గుణ ప్రసాద్, కాంగ్రెస్ బోధన్ అధ్యక్షుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. షుగర్ ఫ్యాక్టరీ మూసి వేత వల్ల ఈ ప్రాంత చెరుకు రైతులు, కార్మికులకు తీరని అన్యా యం జరిగింది. టీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయలేక చేతులెత్తేసింది. ఫ్యాక్టరీ సమస్యపై అనేక రూపాల్లో ఆందోళనలు చేసిన టీఆర్ఎస్ ప్రభు త్వం పట్టించుకోలేదు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కాకపోవడంతో కార్మికుల కష్టాలు తీరలేదు. దుర్భర బతుకులను అనుభవిస్తున్నారు. రామరాజు, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, బోధన్ ఫ్యాక్టరీ మూసివేత బాధకరం ఘన చరిత్ర కలిగిన నిజాంషుగర్ ఫ్యాక్టరీ మూసివేత బాధకరం. ఫ్యాక్టరీని తెరిపించే విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపలేదు. ఫ్యాక్టరీ తెరిపించి రైతులు, కార్మికులను ఆదుకోవాలి.మా పార్టీ రైతులు, కార్మికుల పక్షాన పోరాడుతోంది. ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని ప్రభు త్వం నడిపితేనే రైతులు, కార్మికులకు మేలు జరుగుతోంది. సయ్యద్ ముక్తార్ పాషా, వైఎస్ఆర్ సీపీ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బోధన్ -
వైఎస్ జగన్‌ను కలిసిన ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు
-
డీఎస్ తనయుడి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, నిజామాబాద్ : సీనియర్ నేత, టీఆర్ఎస్ ఎంపీ డీ శ్రీనివాస్‌పై ఆయన తనయుడు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి.. జిల్లా అభివృద్ధి కోసం ఆలోచన చేయాలని డీఎస్‌ను అరవింద్ కోరుతున్నారు. బీజేపీ నేత అయిన అరవింద్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... జిల్లా అభివృద్ధిపై దృష్టిసారించాలని డీ శ్రీనివాస్‌ను కోరారు. ‘నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ పాపం చంద్రబాబుదే. అయితే దాని విషయంలో ఇప్పుడు నిజామాబాద్ ఎంపీగా ఉన్న కవిత పట్టించుకోవటం లేదు. మీరు(డీ శ్రీనివాస్) టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి. కాబట్టి, చొరవ తీసుకుని ఫ్యాక్టరీ తెరిపించేందుకు కృషి చెయ్యండి. సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది’ అని అరవింద్ పేర్కొన్నారు. పనిలో పనిగా ఎంపీ కవితపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘చెరుకు ఫ్యాక్టరీలను తెరిపించకుండా కవిత అడ్డుకుంటున్నారు. రైతులు చెరుకు పంటకు దూరంగా ఉంటున్నారని.. ఉద్యోగాల విషయంలో యువత ఆసక్తి చూపటం లేదని ఆమె ఏవో సాకులు చెబుతున్నారు. పసుపు బోర్డు విషయంలో అయితే ముందడుగే వేయలేదు. చిన్న చిన్న హామీలు ఇవ్వటం కాదు. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రజలు మీ నుంచి పెద్దవే ఆశిస్తుంటారు. ముందు పెద్ద సమస్యలపై దృష్టిసారిస్తే మంచిది’ అని అరవింద్.. ఎంపీ కవితకు సూచించారు. -
శరాఘాతం
అనకాపల్లి: అంతన్నారింతన్నారు.. చివరకు ఉద్యోగాలు ఊడగొట్టారు.. తుమ్మపాల చక్కెర కర్మాగారంలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్ కార్మికులను ఇక నుంచి విధులకు హాజరు కాకుండా నిలిపివేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించడంతో ఒక్కసారిగా స్తబ్ధత నెలకొంది. కర్మాగారంలో ప్రస్తుతం 140 మంది ఎన్ఎంఆర్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరికీ 40 నెలల నుంచి జీతాలు ఇవ్వడంలేదు. వీరితోపాటు రెగ్యులర్ కార్మికులు 31 మంది పనిచేస్తుండగా వారికి ఒన్‌టైం సెటిల్మెంట్ కింద చెల్లిస్తామని సుగర్కేన్ రాష్ట్ర అధికారుల నుంచి గతంలో ప్రతిపాదనలు వచ్చినా ఆ లెక్క తేలడంలేదు. తాజాగా ఎన్ఎంఆర్ కార్మికులను తొలగించాలని సంబంధిత శాఖ నిర్ణయించడంతో వారందరికీ భవితవ్యం అయోమయంగా మారింది. అంతేకాకుండా కర్మాగారం పరిధిలో పని చేసిన రిటైర్డ్ కార్మికులకు గ్రాట్యుటీ చెల్లించే విషయంలో కోర్టులో కేసు నడుస్తోంది. దీంతో కర్మాగారంలో ఉన్న ఉద్యోగులందరి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై మరింత స్పష్టత రెండు రోజుల్లో తేలనుంది. బకాయిలన్నీ త్వరలో సెటిల్ చేస్తామని జేసీ సృజన సహా పలు సందర్భాంల్లో అధికారులు, నేతలు హామీ ఇవ్వడంతో మంచి రోజులు వస్తాయని ఎదురుచూస్తున్న కార్మికులు తాజా పరిణామంతో ఖిన్నులయ్యారు. జేసీ అనుమతితో ఉత్తర్వులు కర్మాగార పర్సన్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న జేసీ అనుమతి మేరకు ఎన్ఎంఆర్ ఉద్యోగులను రేపటి నుంచి విధుల్లోకి రావద్దని కర్మాగార ఎండీ సన్యాసినాయుడు పేరున నోటీసులు విడుదలయ్యాయి. 2014 ఎన్నికల ముందు బాబు వస్తే ఉద్యోగాలొస్తాయని తెలుగుదేశం పార్టీ ప్రధాన మేనిఫెస్టోగా చేరుస్తూ ప్రచారం చేసుకొని అధికారం చేపట్టాక జాబుల మాట దేవుడెరుగు కాని ఉన్న ఉద్యోగులను ఇంటికి పంపించే పనిలో పడింది. ఇటీవల ఐసీడీఎస్‌లో పలు సేవలందిస్తున్న లింకువర్కర్లకు మంగళం పాడగా ఇప్పుడేమో సహకార రంగంలో కొనసాగుతున్న తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీలో విధుల్లో ఉన్న 140 మంది ఎన్ఎంఆర్ కార్మికులకు నీళ్లొదిలింది. దీంతో దేశం పార్టీ అధికారం చేపట్టినప్పుడల్లా సుగర్ ఫ్యాక్టరీపై నీలినీడలు అలుముకుంటూ వస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదికే ఫ్యాక్టరీ మూతపడడంతో ఆకలికేకలతో పదిమంది కార్మికులు మృత్యువాత పడ్డారు. -
బాబు తీరుపై మండిపడుతున్న జనం
-
చంద్రబాబుని నమ్మి మోసపోయాం
-
ఫ్యాక్టరీల మూసివేతలో కుట్ర
మెట్పల్లి/మల్లాపూర్: లాభాలతో నడిచే చక్కెర ఫ్యాక్టరీలను మూసివేయడంలో కుట్ర దాగుందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఆయన ఆదివారం సందర్శించారు. మెట్పల్లిలో కొనసాగుతున్న దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చక్కెరతోపాటు మరికొన్ని అదనపు ఉత్పత్తులను అందించే ఫ్యాక్టరీలతో నష్టాలు వచ్చే అవకాశాలుండవని, కానీ, ప్రభుత్వం నష్టాలపేరుతో వాటిని మూసివేయడం సరికాదన్నారు. ఫ్యాక్టరీలు మూసివేసిన మూడు ప్రాంతాల్లో రైతులు వేర్వేరుగా ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోందని, సంఘటితంగా పోరాడటానికి తొందరలోనే హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. ఫ్యాక్టరీలపై హామీలిచ్చి నిలబెట్టుకోని నేతలను గ్రామాల్లోకి రానివ్వబోమంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే వారి వైఖరిలో మార్పు వచ్చే అవకాశముందన్నారు. అక్రమంగా ప్రకటించిన లే ఆఫ్‌ను ఎత్తివేయించి ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడిపించేందుకు ప్రభుత్వం విధాన నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. చెరుకు రైతుల ఉద్యమానికి టీజేఏసీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రామ్‌లు, చెరకు ఉత్పత్తిదారుల సంఘం, పునరుద్ధరణ కమిటీల అధ్యక్షుడు మామిడి నారాయణ రెడ్డి, గురిజెల రాజి రెడ్డి, జేఏసీ నేతలు, రైతులు పాల్గొన్నారు. -
టీడీపీ సర్కారు పారిశ్రామికవేత్తల తొత్తు
చాగల్లు: పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాస్తూ వారికి రాష్ట్ర ప్రభుత్వం తొత్తుగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని విమర్శించారు. వేతన బకాయిల చెల్లింపులలో చాగల్లు షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం అవలంభిస్తున్న వెఖరికి నిరసనగా గత 60 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికుల శిబిరాన్ని ఆళ్ల నాని, కొవ్వూరు నియోజకవర్గ సమన్వయ కర్త తానేటి వనిత సందర్శించారు. ఈ సందర్బంగా ఆళ్ల నాని మాట్లాడుతూ రైతులు, ఉద్యోగులు, ప్రజల సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. 700 కుటుంబాలకు సంబం ధించిన ఈ సమస్యను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎంపీలు ఉన్నా కంటి తుడుపు చర్యలు తప్ప సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. కార్మికులు అనాథలు కాదని, వారికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని తెలిపారు. షుగర్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారంలో కార్మిక శాఖా మంత్రి పితాని సత్యనారాయణ చొరవ చూపడం లేదని, బాధ్యత లేనట్టు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. హెల్త్ డ్రింక్‌గా బీర్‌ను ప్రమోట్ చేస్తూ వ్యాఖ్యలు చేసిన మంత్రి జవహర్‌కు ఈ ప్రాంత రైతులు, కార్మికుల సమస్య ఏమాత్రం పట్టడం లేదని అన్నారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోతే జగన్మోహన్రెడ్డి ద్వారా అసెంబ్లీలో, శాసనమండలిలో పోరా టం చేస్తామని అన్నారు. కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత మాట్లాడుతూ వేతనాలు చెల్లింపులు లేక కార్మికుల కుటుంబాలు అప్పుల పాలయ్యాయని అన్నారు. వేతన బకాయిలను వెంటనే చెల్లించా లని ఆమె∙డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి ఆత్కూరి దొరయ్య, పార్టీ రాష్ట్ర్ర కార్యదర్శి పోతుల రామతిరుపతిరెడ్డి, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మ , జిల్లా రైతు విభాగం అధ్యక్షులు బూరుగుపల్లి సుబ్బారావు, చాగల్లు, కొవ్వూరు, తాళ్లపూడి మండలాల, నిడదవోలు పట్టణ పార్టీ కన్వీనర్లు కొఠారు ఆశోక్‌బాబా, గురుజు బాలమురళీ కృష్ణ, కుంటముక్కల కేశవనారాయణ, ఎం.ఫణీంద్ర, పార్టీ నాయకులు బండి పట్టాభి రామారావు, ముదునూరి నాగరాజు, పీకే రంగారావు, ముళ్లపూడి కాశి, జుజ్జవరపు రామచంద్రరావు, జుట్టా కొండలరావు, ఫ్యాక్టరీ ఉద్యోగ, కార్మిక సంఘం అధ్యక్షుడు నీరుకొండ కృష్ణారావు, యూనియన్ నాయకులు ఉన్నారు. -
ఆకలి పోరాటం
చాగల్లు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల ఆకలి కేకలు సర్కారును కదిలించలేకపోతున్నాయి. ఫ్యాక్టరీ మూతతో మనోవేదనకు గురై.. అనారోగ్యం పాలై.. సరైన వైద్యం చేయించుకోలేక ఆరుగురు ప్రాణాలొదిలినా.. ఆర్థిక ఇబ్బందులతో 750 కుటుంబాలు సతమతమవుతున్నా.. ప్రభుత్వం, యాజమాన్యం చలించడం లేదు. కార్మికులకు బకాయిలు చెల్లించడం లేదు. ఫ్యాక్టరీని తెరిపించే యత్నమూ చేయడం లేదు. పశ్చిమగోదావరి కొవ్వూరు: చాగల్లు వీవీఎస్ షుగర్స్ (వెలగపూడి వెంకట సుబ్బయ్య షుగర్స్) ఫ్యాక్టరీని ది జైపూర్ షుగర్స్ కంపెనీ లిమిటెడ్ 1961లో స్థాపించింది. జిల్లాలోనే అత్యధిక చెరకు క్రషింగ్ సామర్థ్యం కలిగిన ఫ్యాక్టరీ ఇది. దీనికి అనుబంధంగా చాగల్లు, జంగారెడ్డిగూడెం డిస్టిలరీలు ఉన్నాయి. పోతవరంలో మరో షుగర్ ఫ్యాక్టరీ ఉంది. మొత్తమ్మీద ఈ నాలుగు పరిశ్రమల్లో సుమారు 750 మందికిపైగా కార్మికులు, ఉద్యోగులు పనిచేసేవారు. ఫ్యాక్టరీ అధికారులే గుల్ల చేశారా! గతంలో చాగల్లు షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసిన కొందరు ఫ్యాక్టరీ అధికారులు దీనిని గుల్లచేశారు. 2009లో రైతుల టైఅప్ రుణాల కుంభకోణంలో ఆ సంస్థ యాజమాన్యం వార్తలకెక్కింది. 2010లో ఈ సంస్థలో పనిచేస్తున్న కొందరు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై పంచదార కుంభకోణానికి పాల్పడ్డారు. రూ. 1.13 కోట్ల విలువైన (అప్పటి ధర ప్రకారం) 3,792 క్వింటాళ్ల పంచదారను అక్రమంగా బయటకు తరలించి సొమ్ము చేసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న 16 మందిలో ఏడుగురు సంస్థ అధికారులు ఉన్నారు. తర్వాత మరికొంత మందిని అరెస్ట్ చేశారు. ఇలా ఈ పరిశ్రమను కొంతమంది తమ స్వార్థం కోసం వాడుకున్నారు. బకాయిలు పేరుకుపోయాయి 2014–15, 2015–16 క్రషింగ్ సీజన్‌కి సంబంధించి రైతులకు చెల్లించాల్సిన సుమారు రూ.40 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. రైతులు ఆందోళనకు దిగడంతో ఫ్యాక్టరీలోని పంచదార నిల్వలను విక్రయించి విడతల వారీగా సగం బకాయిలు చెల్లించారు. ఇంకా సుమారు రూ.19 కోట్లు చెల్లించాలి. దీంతో గత ఏడాది క్రషింగ్ ప్రక్రియ నిలిపివేశారు. రెవెన్యూ అధికారులు రైతుల బకాయిలు రాబట్టేందుకు రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది. ఫ్యాక్టరీని వేలం వేసేందుకు అధికారులు మూడు సార్లు యత్నించినా పాటదారులు రాకపోవడంతో ఫ్యాక్టరీని ఈ ఏడాది జనవరి 20న మూసివేశారు. ఆందోళన బాటలో కార్మికులు ప్రస్తుతం ది జైపూర్ షుగర్స్ కంపెనీ లిమిటెడ్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు మూడేళ్ల నుంచి వివిధ రాయితీలు, గత ఏడాది నవంబర్ నుంచి జీతాలు చెల్లించడం లేదు. ఈ అన్ని బకాయిలు కలిపి సుమారు రూ.15 కోట్ల వరకూ ఉంటాయి. దీంతో కార్మికులు ఈ ఏడాది ఆగస్టు 16 నుంచి ఆందోళన బాట పట్టారు. ఫ్యాక్టరీ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. కార్మిక, ఉద్యోగ సంఘం నేతలు కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణను పలుమార్లు కలవడంతో ఇటీవల రెండు నెలలు జీతం మాత్రం విదిల్చారు. ఆరుగురు ప్రాణాలొదిలారు సంస్థ మూతపడడం, జీతాలు, ఇతర బెనిఫిట్స్ నిలిచిపోవడంతో మనోవ్యధకు గురై.. అనారోగ్యం బారిన పడి సకాలంలో సరైన వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేక ఆరుగురు కార్మికులు మరణించారు. ఫీల్డ్ మేన్ నల్లూరి శ్రీని వాసరావు, ఫిట్టర్లు ఆలపాటి వెంకటేశ్వరరావు, వీవీఎల్ఎన్ ఆచార్యులు, క్లర్క్‌లు వల్లభనేని సత్యనారాయణ, ఎం.దుర్గారావు ఆరోగ్య సమస్యలతో ప్రాణాలొదిలారు. రిటైర్ అయిన ఆత్కూరి కృష్ణమూర్తి పీఎఫ్, ఇతర బెనిఫిట్స్ అందకుండానే మరణించారు. పట్టని ప్రభుత్వం కార్మికులు 45 రోజుల నుంచి దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.రెండేళ్లు పూర్తి కావస్తున్నా ఇంత వరకు రైతుల బకాయిలు చెల్లించలేదు. దీంతో రైతులూ కష్టాలు పడుతున్నారు. ఈయన పేరు డి.సువర్ణరాజు. చాగల్లు షుగర్ ఫ్యాక్టరీలో డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇతనిది కర్ణాటకలోని రాయగఢ్. ఉపాధి కోసం నలభై ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చారు. భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు, తల్లి ఉన్నారు. వీరంతా సువర్ణరాజుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఫ్యాక్టరీ మూత పడడంతో 11 నెలల నుంచి జీతాల్లేవు. ఇంతలో షుగర్ వ్యాధి బయటపడింది. వ్యాధి ముదరడంతో ఐదునెలల కిత్రం ఆయన కాలు సగం తొలగించారు. ఇద్దరు కుమార్తెలకూ ఇంకా వివాహాలు కాలేదు. చదువులూ పూర్తి కాలేదు. కుమారుడు సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా చేసి ఖాళీగా ఉంటున్నాడు. ఇప్పుడు సువర్ణరాజు కుటుంబం పుట్టెడు కష్టాల్లో మునిగింది. ఈ చిత్రంలో గోడ మీదున్న ఫొటోలోని వ్యక్తి పేరు వీవీఎల్ఎన్ ఆచార్యులు. చాగల్లు ఫ్యాక్టరీలో ఫిట్టర్‌గా పనిచేసేవారు. ఈ ఏడాది మే 5న గుండెపోటుతో మరణించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు, తల్లి ఉన్నారు. వీరందరికీ ఈయనే ఆధారం. ఫ్యాక్టరీ మూతపడడం, జీతాల్లేకపోవడంతో ఆచార్యులు మానసికంగా కుంగిపోయి తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. ఒత్తిడి ఎక్కువై గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు ఈయన కుటుంబం వీధిన పడింది. ఫ్యాక్టరీ నుంచి అందాల్సిన వేతన బకాయిలు, పీఎఫ్, ఇతర లబ్ధి ఏమీ అందకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇవీ ఈ రెండు కుటుంబాల కన్నీటి గాథలు.. ఇవే కాదు.. చాగల్లు షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులను కదిపి చూస్తే ఇలాంటి విషాద గాథలెన్నో వినబడతాయి. జీతాలు రాక, పీఎఫ్, ఇతర లబ్ధి అందక ఆ కుటుంబాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఫ్యాక్టరీ మూత పడి.. కుటుంబాల జీవనం గగనంగా మారడంతో మానసిక వేదనకు గురై 9 నెలల్లో ఆరుగురు కార్మికులు మరణించారు. అయినా యాజమాన్యంతోపాటు సర్కారులోనూ చలనం లేదు. ఫలితంగా కార్మికులు ఆందోళన బాట పట్టారు. మూడేళ్ల నుంచి ముప్పుతిప్పలు ♦ ఫ్యాక్టరీ సంక్షోభంలో ఉండడంతో మూడేళ్ల నుంచి యాజమాన్యం కార్మికులను ముప్పుతిప్పలు పెడుతోంది. ♦ గత రెండున్నరేళ్ల నుంచి బోనస్‌లు ఇవ్వడం లేదు. ఈ బకాయిలు సుమారు రూ.2 కోట్ల వరకూ ఉంటాయి. ♦ వైద్య ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి ఏడాదికి ఇచ్చే రూ.10వేలను మూడేళ్ల నుంచి చెల్లించడం లేదు. ♦ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ , ఓవర్ టైమ్ వేతనాలను 2014–15 నుంచి చెల్లించడం లేదు. ♦ ఫ్యాక్టరీ నడవని కాలంలో కార్మికులు, ఉద్యోగులకు చెల్లించే రిటర్నింగ్ అలవెన్స్‌లు చెల్లించడం లేదు. ఫీల్డ్ సిబ్బందికి ఆదివారం, సెలవు దినాల్లో చెల్లించే అలవెన్స్లదీ అదే పరిస్థితి. ♦ 2014 మార్చి నుంచి యాజమాన్యం కోటా కింద చెల్లించాల్సిన ప్రావిడెంట్ ఫండ్ కట్టటం లేదు. ఉద్యోగులు, కార్మికుల వాటాగా చెల్లించేది మాత్రం 2016 ఆగస్టు వరకు మాత్రమే చెల్లిస్తూ వచ్చారు. దీంతో రిటైర్డు ఉద్యోగులకు ఫీఎఫ్ రావటం లేదు. ఫ్యాక్టరీ యాజమాన్యం వాటా చెల్లిస్తేగానీ ఫీఎఫ్ సొమ్ము కార్మికులకు అందే వీలు లేదు. ♦ కార్మికులు, ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న కో–ఆపరేటివ్ క్రిడెట్ సోసైటీలో నిల్వలో ఉన్న రూ.80 లక్షలు యాజమాన్యం వినియోగించుకుంది. దీనిపై కార్మిక సంఘం నాయకులు కో–ఆపరేటివ్ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. నెలకు రూ.10 లక్షల చొçప్పున 2016 నవంబర్ నుంచి 2017 నవంబర్‌లోపు ఆ సొమ్ములు తిరిగి జమ చేస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. ఇప్పటివరకూ రూ.10లక్షలు మాత్రమే జమ చేసింది. ఆర్థిక ఇబ్బందులున్న సమయంలో ఈ సొమ్ములు కార్మికులు, ఉద్యోగులు రుణాలు తీసుకునేవారు. యాజమాన్యం తీసుకున్న సొమ్ములు జమ చేయకపోవడంతో ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. -
కేసీఆర్ కుటుంబానికే సంబరాలు
► మెట్పల్లి సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద చెరుకు రైతుల ఆందోళన ► చక్కెర ఫ్యాక్టరీ తెరవాలని డిమాండ్ మెట్పల్లి(జగిత్యాల): తెలంగాణ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని శుక్రవారం మెట్‌పల్లిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద చెరుకు రైతులు నిరసన వ్యక్తం చేశారు. ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని తెరవడంతో పాటు గత సీజన్‌కు సంబంధించిన రవాణా చార్జీలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ డివిజన్‌కు చెందిన రైతులు ఆర్టీసీ డిపో నుంచి ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెరుకు రైతుల సమస్యలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. నిజాందక్కన్ చక్కెర ఫ్యాక్టరీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆ తర్వాత వాటిని మూసివేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రాప్రాంతానికి చెందిన వ్యక్తి ఫ్యాక్టరీకి ప్రయోజనం కలిగించడానికే ఎన్‌డీసీఎల్ ఫ్యాక్టరీలు మూసివేశారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుతో రాష్ట్రంలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే సంతోషంగా ఉందని.. ప్రభుత్వ విధానాలతో ఉన్న ఫ్యాక్టరీలు మూతబడడంతో రైతాంగం తీవ్రంగా ఆందోళన చెందుతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆవిర్భావ వేడుకల పేరుతో సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా కేసీఆర్ మేల్కొని ఫ్యాక్టరీలు తెరవాలని.. లేకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లతో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ధర్నా సందర్భంగా కేసీఆర్, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కార్యాలయ ఏవో సత్యనారాయణకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు నారాయణరెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ కంది బుచ్చిరెడ్డితో పాటు రైతు సంఘం నాయకులు నల్ల గంగారెడ్డి, బాపురెడ్డి, లింగారెడ్డి, లింబారెడ్డి, మల్లారెడ్డి, ధర్మారెడ్డి, రాజేందర్ తదితరులు ఉన్నారు. -
ఉద్యోగాల పేరిట టోకరా ..
చిత్తూరు: ప్రైవేటు ఎగుమతుల కంపెనీల్లో ఉద్యోగాలిపిస్తామంటూ 57 మందికి ఓ వ్యక్తి టోకరాపెట్టాడు. బాధితులంతా జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌కు మొరపెట్టుకోవడంతో వన్ టౌన్ పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. బాధితుల కథనం మేరకు చిత్తూరు నగరంలోని షుగర్ ఫ్యాక్టరికీ సమీపంలో ఓ ఎగుమతుల కంపెనీకి సంబంధించిన కార్యాలయముంది. పదోతరగతి నుంచి డిగ్రీ చదివిన యువకులకు ప్రైవేటు ఉద్యోగాలిపిస్తామంటూ నిర్వాహకుడు ఒక్కొక్కరి నుంచి రూ.17 వేలు వసూళ్లు చేశాడు. ఇలా 57 మంది నుంచి రూ. 9.69 లక్షలు వసూళ్లు చేశాడు. తీరా ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు విచారించగా బోర్డు తిప్పేసి ఆ వ్యక్తి పారిపోయాడని తెలుసుకున్నారు. దీంతో బాధితులంతా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాల మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చాగల్లులో షుగర్ ఫ్యాక్టరీ సీజ్
చాగల్లు (కొవ్వూరు) : చాగల్లులో జైపూర్ షుగర్ ఫ్యాక్టరీని శుక్రవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసిన రైతులకు రెండేళ్లగా ఫ్యాక్టరీ యాజమాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉంది. కొంతకాలంగా రైతులు తమకు రావలసిన బకాయిల కోసం పోరాటం చేస్తున్నారు. యాజమాన్యం బకాయిలు కొంతమేర చెల్లించినా ఇంకా రూ.19.04 కోట్లు రైతులకు బకాయి పడింది. దీంతో రైతులు రెవిన్యూ అధికారులను ఆశ్రయించడంతో ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం ఫ్యాక్టరీ అస్తులు వేలం వేయటానికి పలు దఫాలు నోటీసులు జారీ చేశారు. ఐదుసార్లు వేలం నిర్వహించినా పాటదారులు ఎవరూ ముందుకురాలేదు. దీంతో ఫ్యాక్టరీని సీజ్ చేశారు. తిరిగి ఈ నెల 23వ తేదీన ఫ్యాక్టరీ అస్తులకు వేలం నిర్వహించనున్నారు. ఈ ఘటనతో ఫ్యాక్టరీలో పని చేసే 600 మంది కార్మికులు రోడ్డున పడనున్నారు. -
షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని బోధన్ బంద్
బోధన్(నిజామాబాద్ జిల్లా): నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని చక్కెర ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం పిలుపుమేరకు సోమవారం బోధన్ బంద్ జరుగుతోంది. పట్టణంలో దుకాణాలు, వ్యాపార సంస్థలు తెరుచుకోలేదు. ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. కాంగ్రెస్, శివసేన, న్యూడెమోక్రసీ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. బంద్‌కు ప్రజలు స్వచ్చందంగా సహకరిస్తున్నారు. -
మధుసూదన్‌గుప్తపై చీటింగ్ కేసు
నంద్యాల: బ్యాంకు రుణం పేరిట రైతు వెంకటరామిరెడ్డిని దగా చేసిన చక్కెర ఫ్యాక్టరీ ఎండీ, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తపై టూటౌన్ పోలీసులు శనివారం చీటింగ్ కేసు నమోదు చేశారు. గడివేముల మండలం బూజనూరు గ్రామానికి చెందిన వెంకటరామిరెడ్డికి స్థానిక సిండికేట్ బ్యాంకులో బ్యాంకు రుణాన్ని మధుసూదన్‌గుప్త ఇప్పించారు. వెంకటరామిరెడ్డి తిరిగి ఆ డబ్బు మధుసూదన్‌గుప్తకు ఇచ్చాడు. అయితే, ఈ డబ్బును ఆయన బ్యాంకులో జమ చేయకపోవడంతో వెంకటరామిరెడ్డికి బ్యాంకు రుణం కట్టాల్సిందిగా నోటీసులు అందాయి. తనకు జరిగిన మోసంపై బాధితుడు వెంకటరామిరెడ్డి టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మధుసూదన్‌గుప్త, ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ వెంగళరెడ్డి, ఉద్యోగులు కృష్ణ, గంగాధర్‌లపై చీటింగ్‌ను నమోదు చేశారు. -
షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్‌కు ప్రభుత్వ పెద్దల అండ
నంద్యాల రూరల్: రైతులను మోసం చేసిన నంద్యాల షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ మధుసూదన్ గుప్తను ప్రభుత్వ పెద్దలు కాపాడుతున్నారని వైఎస్సార్సీపీ రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. న్యాయం కోసం అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో ఐదు రోజులుగా ఫ్యాక్టరీ ఎదుట దీక్ష చేపట్టిన రైతులకు సోమవారం వైఎస్సార్సీపీ నాయకులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. రైతులను మోసగించడాన్ని నిరసిస్తూ సాయంత్రం వందలాది మంది రైతులు కర్నూలు, చిత్తూరు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఫ్యాక్టరీ చైర్మన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను మోసం చేస్తూ, ఫ్యాక్టరీ ఆస్తులను అమ్మేసిన షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్‌ను ప్రభుత్వం ఎందుకు కాపాడుతుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ దోపిడీలో తెలుగు తమ్ముళ్లు భాగస్వాములయ్యారని ఆరోపించారు. రైతుల ఆస్తిని ప్రభుత్వం కాపాడాలని, లేకుంటే ప్రజా ఉద్యమం ద్వారా ప్రజల ఆస్తులను కాపాడుకుంటామని హెచ్చరించారు. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో త్వరలో భవిష్యత్ కార్యాచరణ ఏర్పాటు చేసుకొని అమరావతి కేంద్రంగా ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆందోళనలో కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జాయింట్ సెక్రటరీ పిట్టం ప్రతాపరెడ్డి, భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి, చెరుకు రైతుల సంఘం నాయకులు బంగారురెడ్డి, ఏపీ రైతు సంఘం డివిజన్ కార్యదర్శి పుల్లా నరసింహ, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుల దీక్షలకు కాటసాని సంఘీభావం.. షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా రైతులు చేస్తున్న దీక్షలకు సోమవారం బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరానికి చేరుకొని రైతులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల ఆందోళనకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. -
షుగర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భారీ ఆస్తినష్టం
కొత్తకోట: చక్కెర కర్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించి భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. షార్ట్ సర్క్యూట్ వల్ల వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాల శివారులో శ్రీ కృష్ణవేణి చక్కె ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని విద్యుత్ ఉత్పత్తి జరిగే కన్వెరి బెల్ట్‌లో శనివారం షార్ట్‌సర్క్యూట్ వల్ల పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదాన్ని గుర్తించిన ఫ్యాక్టరీ సిబ్బంది వారి వద్ద ఉన్న అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, మంటలు అదుపుచేయడం ఆలస్యమవడంతో అగ్ని ప్రమాదం వల్ల దాదాపు రూ. 2 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ సీహెచ్ నాగేశ్వర్రావు తెలిపారు. -
షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్‌ను అరెస్ట్ చేయాలి
- చెరకు రైతుల రిలే దీక్షలు ప్రారంభం నంద్యాల రూరల్: నంద్యాల షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ మధుసూదన్ గుప్తను వెంటనే అరెస్ట్ చేయాలని చెరకు రైతులు డిమాండ్ చేశారు. అఖిల రైతు పక్షాల ఆధ్వర్యంలో గురువారం ఫ్యాక్టరీ ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. ఫ్యాక్టరీ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్‌ను సీఎం చంద్రబాబు నాయుడు కాపాడుతున్నారని ఆరోపించారు. చెరకు రైతుల పేరుతో నంద్యాల సిండికేట్ బ్యాంకులో 9.80 కోట్లు రుణం తీసుకున్నారని, రుణమాఫీ రైతులకు దక్కకుండా ఫ్యాక్టరీ ఛైర్మన్‌కు జమ అవుతోందని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల సిద్ధారెడ్డి తెలిపారు. ఈ విషయం తెలిసి కూడా ప్రజాప్రతినిధులు అడ్డుకోవడం లేదన్నారు. అధికార పార్టీ నేతలు, అధికారులు..ఫ్యాక్టరీ చైర్మన్ చెప్పినట్లు తలాడించడం శోచనీయమని సీపీఎం డివిజన్ కార్యదర్శి మస్తాన్‌వలీ, ఏపీ రైతు సంఘం డివిజన్ కార్యదర్శి పుల్లా నరసింహ అన్నారు. నంది రైతు సమాఖ్య అ«ధ్యక్షులు యరబోలు ఉమామహేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. 75 రోజులు 75 గ్రామాల రైతులు దీక్షల్లో పాల్గొంటారన్నారు. దీక్షలకు బీజేపీ నాయకుడు తూము శివారెడ్డి, సీపీఎం మండల కన్వీనర్ సద్ధాం హుసేన్ , కౌలు రైతుల సంఘం నాయకులు పుల్లయ్య, నంది రైతు సమాఖ్య చంద్రశేఖర రెడ్డి, అయ్యలూరు బసవేశ్వర రెడ్డి, చాబోలు బంగారు రెడ్డి నందిపల్లె సాగేశ్వర రెడ్డి, పొన్నాపురం పుల్లయ్య , వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు బంగారయ్య తదితరులు సంఘీభావం తెలిపారు. -
చెన్నూరులో చైన్ స్నాచింగ్
చెన్నూరు : చెన్నూరులో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగుడు సోమవారం లాక్కెళ్లాడు. పోలీసులు లె లిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారిలోని చెన్నూరు కొత్తరోడ్డులో వడ్లవీటి లక్షుమయ్య భార్య ఈశ్వరమ్మ టీ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం గుర్తు తెలియని యువకుడు వచ్చాడు. బీమా చేయాలని, మృతి చెందితే కుటుంబ సభ్యులకు రూ. 1.50 లక్షలు ఇస్తామంటూ వచ్చి ఈశ్వరమ్మతో చెప్పాడు. ఆమె భర్తను పిలిచి విషయాన్ని చెప్పింది. చెక్కర ఫ్యాక్టరీ వద్ద అధికారులు ఉన్నారని, అక్కడికి రావాలని చెప్పగా ఈశ్వరమ్మ వెళ్లేందుకు ప్రయత్నించింది. మెడలోని బంగారు గొలుసు లోపల పెట్టి వెళ్లాలని భర్త సూచించాడు. వెంటనే ఆమె ఇంటిలో పెట్టి అతని బైకుపై వెళ్లగా కొంత దూరం పోయాక మగవాళ్లు రావాలంటూ చెప్పి ఆమెను వెనక్కు తీసుకొచ్చాడు. లక్షుమయ్యను చెక్కర ఫ్యాక్టరీ సమీపం వద్దకు తీసుకెళ్లాడు. మరో వ్యక్తి వస్తాడు. ఇక్కడే ఉండండి అని చెప్పి, టీ హోటల్ వద్దకు వచ్చి బ్యాంకు పుస్తకాలివ్వాలంటూ ఈశ్వరమ్మను అడిగాడు. ఆమె అప్పటికే తిరిగి మెడలో గొలుసు వేసుకోవడంతో బ్యాంకు పుస్తకం ఇస్తుండగా.. గొలుసును లాక్కుని బైకులో పరారయ్యాడు. బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. -
చెరకు రైతుల కష్టాన్ని గుర్తించండి
ఏలూరు (మెట్రో): చాగల్లు జైపూర్ షుగర్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం 2015–16లో రైతులకు చెల్లించాల్సిన రూ.28 కోట్ల బకాయిలను రెండు వారాల్లో చెల్లించేలా చూడాలని జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావును చెరకు రైతు సంఘ సభ్యులు కోరారు. కలెక్టరేట్లో జైపూర్ షుగర్ ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్, రైతులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో కొవ్వూరు ఆర్డీవో శ్రీనివాసరావు, జేసీ పాల్గొన్నారు. రైతులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నా, వ్యయ ప్రయాసలు కోర్చి చెరకు పండిస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు ఉత్తర్వులు మేరకు గతంలో కొన్ని బకాయిలను చెల్లించారని 2015–16లో బకాయిలు కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించేలా రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారని జేసీ కోటేశ్వరరావు చెప్పారు. చాగల్లు జైపూర్ షుగర్స్ వైస్ ప్రెసిడెంట్ డి.భాస్కరరావు మాట్లాడుతూ వచ్చేనెలాఖరుకు పూర్తి బకాయిలు చెల్లించే ఏర్పాట్లు చేస్తామన్నారు. రైతులు రెండు వారాలు మాత్రమే గడువు ఇచ్చారని, ఈ విషయంలో తుది నిర్ణయాన్ని కలెక్టర్ కాటంనేని భాస్కర్ తీసుకుంటారని, కమిటీ ప్రతినిధులతో సంప్రదించి రైతులకు, షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి మధ్య సమన్వయం కుదిర్చే చర్యలు తీసుకుంటామన్నారు. ఫ్యాక్టరీ ఏజీఎం జీవీ చౌదరి, డిస్టిలరీ ఫ్యాక్టరీ ఏజీఎం శివకుమార్, చెరకు రైతు కమిటీ సభ్యులు పోసిన రాజారావు, గారపాటి శ్రీనివాసరావు, వల్లభనేని శ్రీనివాసరావు, ఉండవల్లి బుచ్చయ్య, ముళ్ళపూడి కాశీ, యనమదుల రామారావు, వట్టికూటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తపై చీటింగ్ కేసు
నంద్యాల: అనంతపురం జిల్లా గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే, నంద్యాల చక్కెర ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్‌గుప్తపై కర్నూలు జిల్లా నంద్యాలలో చీటింగ్ కేసు నమోదయింది. రూరల్ ఎస్ఐ గోపాల్‌రెడ్డి తెలిపిన వివరాలివీ.. మధుసూదన్ గుప్త నంద్యాలలోని చక్కెర ఫ్యాక్టరీని ఏడాదిన్నర క్రితం మూసివేశారు. ప్రకాశం జిల్లా ముళ్లమారు మండలం శరికరాపురం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ రామాంజనేయులు, అతని స్నేహితులు చక్కెర ఫ్యాక్టరీ ఇనుము, తుప్పును రూ.10కోట్లకు కొనుగోలు చేయడానికి గుప్తతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు రూ.52లక్షల నగదును, రూ.2కోట్ల చెక్కులను అందజేశారు. అయితే నిబంధనలను ఉల్లంఘించి ఇనుము, తుప్పును గుజరాత్‌కు చెందిన మరో సంస్థకు విక్రయించారు. దీంతో రామాంజనేయులు, అతని స్నేహితులు మధుసూదన్ గుప్తను నిలదీయగా అగ్రిమెంట్‌తో సంబంధం లేదని, అడ్వాన్స్ తిరిగిచ్చేది లేదని తేల్చి చెప్పాడు. ఈ నేపథ్యంలో బాధితులు సోమవారం స్థానిక చెరువు రైతులు బంగారురెడ్డి, నాగేశ్వరరెడ్డి, పాములేటి, శ్రీనివాసులుతో కలిసి ఫ్యాక్టరీ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వీరిచ్చిన ఫిర్యాదు మేరకు మధుసూదన్ గుప్తపై పోలీసులు 420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
ఆ ఫ్యాక్టరీలో వెయ్యి పాములు
-
ఆ ఫ్యాక్టరీలో వెయ్యి పాములు
తమిళనాడులోని కాంచీపురం జిల్లా మధురాంతకంలోని సహకార చక్కెర కర్మాగారంలో వెయ్యి పాములు పట్టుకున్నారు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో 60 ఏళ్ల క్రితం స్థాపించిన ఈ కర్మాగారం కొన్నాళ్లు పనిచేసి ఆపై మూతపడింది. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో మళ్లీ తెరిచి చక్కెర ఉత్పత్తిని ప్రారంభించారు. ఫ్యాక్టరీ మూతపడి ఉన్న సమయంలో పాముల సంచారం పెరిగిపోయింది. ఆ తరువాత కర్మాగారాన్ని తెరిచినా పాముల బెడద తప్పలేదు. మూడు షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగులు ప్రతిరోజూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధులకు హాజరవుతుంటారు. దీంతో సహకార శాఖాధికారులు వన్యప్రాణి విభాగం అధికారుల సాయంతో పాములను పట్టేవాళ్లను రప్పించారు. పది మందితో కూడిన పాములు పట్టే బృందం సోమ, మంగళవారాల్లో వివిధ జాతులకు చెందిన వెయ్యికిపైగా పాములను ఫ్యాక్టరీలో పట్టుకుంది. పట్టుబడిన పాములను గోనె సంచిలో వేసుకుని వెళ్లి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. -
చెరకు సాగు చేదు!
గిట్టుబాటుకాక రైతుల విముఖత ఏటా తగ్గుతున్న సాగు నాలుగేళ్లుగా పడిపోతున్న చక్కెర ఉత్పత్తి సుగర్ ఫ్యాక్టరీల మనుగడ ప్రశ్నార్థకం సుగర్ ఫ్యాక్టరీలు, చెరకు రైతులు ఒకరిపై ఒకరు ఆధారపడి మనుగడ సాగించడం పరిపాటి. కావలసినంత చెరకు రైతులు పండిస్తేనే ఫ్యాక్టరీలు సక్రమంగా నడుస్తాయి. అలాగే ఫ్యాక్టరీలు గిట్టుబాటు ధర కల్పించి సకాలంలో బకాయిలు చెల్లిస్తేనే రైతుల జీవనం సాఫీగా సాగుతుంది. అయితే జిల్లాలో ఇప్పుడు ఈ పరిస్థితి దారి తప్పింది. పెరిగిన పెట్టుడులకు అనుగుణంగా సుగర్ ఫ్యాక్టరీలు ధర చెల్లించలేకపోతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా కరువైంది. దీంతో గిట్టుబాటు కాక రైతులు చెరకు సాగుపై విముఖత చూపుతున్నారు. ఏటా చెరకు సాగు తగ్గుతూ ఉండటంతో చెరకు ఫ్యాక్టరీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పాయకరావుపేట: జిల్లాలో సహకార రంగంలో నడుస్తున్న నాలుగు సుగర్ ఫ్యాక్టరీల్లో ఇప్పటికే తుమ్మపాల కర్మాగారం ఈ ఏడాది మూతపడింది. మిగతా ఫ్యాక్టరీల పరిస్థితి కూడా అంతంతమాత్రమే. తాండవ సుగర్ ఫ్యాక్టరీని పరిశీలిస్తే ఇది తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల పరిధిలోని రైతుల భాగస్వామ్యంతో నడుస్తోంది. నాలుగేళ్లుగా చెరకు సాగు విసీర్ణం తగ్గుతూ వస్తుండటంతో ఈ ఫ్యాక్టరీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. చెరకు సాగు గిట్టుబాటు కాక ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృషి ్టసారించడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో నిర్దేశించిన లక్ష్యం మేరకు క్రషింగ్ జరగడం లేదు. దీంతో నిర్వహణ భారం పెరిగి ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నాయి. రైతులకు సకాలంలో చెల్లింపులు చేయలేకపోతున్నారు. తగ్గిన సాగు విస్తీర్ణం తాండవ ఫ్యాక్టరీ పరిధిలో 5389 మంది రైతులు షేర్ హోల్డర్లుగా ఉన్నారు. 2015-16 సీజన్లో రెండు లక్షల టన్నుల చెరకు క్రషింగ్ లక్ష్యం కాగా 1,57,787 టన్నులు మాత్రమే చేశారు. సుమారు 42 వేల టన్నులు తగ్గింది. 10, 500 ఎకరాల్లో ఉండే చెరకు సాగు విస్తీర్ణం 9482 కు తగ్గిపోయింది. దీంతో పూర్తిస్థాయిలో క్రషింగ్ జరగలేదు. ఉత్పత్తయిన పంచదార నిల్వలను బ్యాంకులో తాకట్టుపెట్టి రైతులకు రూ. 25 కోట్లు చెల్లించారు. 2014-15కు సంబంధించి రైతులటు రూ. 6.4 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది. పెరిగిన పెట్టుబడులు దుక్కు నుంచి విత్తనం, ఎరువులు, నీటి తడులు, కలుపు నివారణ, జడలు కట్టడం, పురుగు మందులు, నరకడం, ఫ్యాక్టరీకి సరఫరా చేసేందుకు ఎకరాకు రూ.65 వేల వరకు పెట్టుబడి అవుతుందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు దిగుబడి సాధారణ రకం 25, ఒంటి కన్ను మొక్క వేస్తే 30 టన్నులు వచ్చింది. ఫ్యాక్టరీ టన్నుకు రూ.2391 మద్దతు ధర ప్రకటించింది. 25 టన్నుల దిగబడి వచ్చిన వారికి రూ. 59,775, 30 టన్నులు వచ్చిన వారికి రూ.71,730 వచ్చింది. అంటే ఏడాదంతా కష్టపడినా పెట్టుబడిరాని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కనీస మద్దతు ధర టన్నుకు రూ. 2500 ఇవ్వాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రికవరీలో ప్రథమం తాండవ ఫ్యాక్టరీ వరసగా రెండేళ్లలో రికవరీలో ప్రథమ స్థానంలో నిలిచింది. సహకార రంగంలో తాండవ సుగర్స్ 2014-15, 2015-16లో 9.61, 9.63 శాతం రికవరీ సాధించింది. -
చక్కెర కర్మాగారంలో ప్రమాదం: ముగ్గురి మృతి
రేగిడి: శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలంలోని సంకలి చక్కెర కర్మాగారంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని ఇథనాల్ ట్యాంక్‌లో శుభ్రపరుస్తుండగా ఆక్సిజన్ అందక ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మృతులు లక్ష్మీపురానికి చెందిన కెంబూరి చంద్రరావు, ఎర్నేని సోంబాబు, ఆబోతుల తవిటి నాయుడుగా గుర్తించారు. యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని మృతదేహాలతో ఫ్యాక్టరీ గేటు ముందు బంధువులు ఆందోళనకు దిగారు. -
షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి
► అఖిలపక్ష రైతు సంఘాల నాయకుల డిమాండ్ ► నంద్యాల-నూనెపల్లి ప్రధాన రోడ్డులో చైర్మన్ దిష్టిబొమ్మ దహనం నంద్యాల రూరల్: బకాయిలు చెల్లించకుండా రైతులను బెదిరించిన షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ మధుసూదన్గుప్తను వెంటనే అరెస్ట్ చేయాలని అఖిల పక్ష రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. సోమవారం నంద్యాల టెక్కె మార్కెట్ యార్డు ఆవరణలో భారతీయ కిసాన్‌సంఘ్ ఆధ్వర్యంలో చెరుకు రైతుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అతిథిగా జాతీయ రైతు సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ రైతులు పొలాలు, షేరుధనం పోగొట్టుకొని చెరుకు ఫ్యాక్టరీ నిర్మిస్తే ప్రభుత్వం కారుచౌకగా ప్రైవేటు యాజమాన్యానికి విక్రయించడం బాధాకరమన్నారు. ప్రభుత్వంతో షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ కుమ్మక్కై నంద్యాల చెరుకు రైతులను చంపుతానని బెదిరించారని, జిల్లా కలెక్టర్, ఎస్పీలు వెంటనే జోక్యం చేసుకుని అతడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. భారతీయకిసాన్సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు వంగాల సిద్ధారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టి బాధిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అఖిల పక్ష రైతు సంఘాల నాయకులు, చెరుకు రైతులు షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ మధుసూదన్‌గుప్త దిష్టిబొమ్మను ఊరేగింపుగా తీసుకొనివచ్చి నంద్యాల-నూనెపల్లె ప్రధాన రహదారిపై దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ సిద్ధం శివరాం, నంది రైతు సమాఖ్య అధ్యక్షులు ఎంవీ కృష్ణారెడ్డి, ఎర్రబోలు ఉమామహేశ్వరరెడ్డి, ఏపీ రైతు సంఘం డివిజన్ కార్యదర్శి పుల్లా నరసింహ, టీడీపీ జిల్లా నాయకుడు జిల్లెల్ల శ్రీరాములు, బీజేపీ అసెంబ్లీ ఇన్చార్జి మేడా మురళీ, షుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘాల ఐక్య కన్వీనర్ నాగేశ్వరరావు, భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు మహేశ్వరరెడ్డి, బంగారురెడ్డి పాల్గొన్నారు. -
ఆటో అదుపు తప్పి ఢీకొట్టడంతో..
నాయుడుపేట(నెల్లూరు జిల్లా): నాయుడు పేట మండలం ఎంపీ చక్కెర కర్మాగారం వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ఆటో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న ఆటో అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. నాయుడు పేట నుంచి అపెక్స్ అనే దర్జీ పరిశ్రమకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సుగర్ ఫ్యాక్టరీల నిర్వీర్యానికి కుట్ర
30 లోగా గోవాడ రైతులకు బకాయిలు చెల్లించాలి లేకుంటే ఆ తరువాత పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి కలెక్టర్‌కు స్పష్టంచేసిన వైఎస్సార్సీపీ నేత బొత్స విశాఖపట్నం: సహకార రంగంలో ఉన్న సుగర్ ఫ్యాక్టరీలను హస్తగతం చేసుకోవాలన్న కుట్రతోనే లాభాలబాటలో ఉన్న ఫ్యాక్టరీలను సైతం నిర్వీర్యం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో తొమ్మిదేళ్ల టీడీపీ హయాంలో కూడా ఇదే రీతిలో సుగర్ ఫ్యాక్టరీలను నష్టాలపాల్జేసి మూతపడేలా చేశారని, మళ్లీ నేడు అదే రీతిలో టీడీపీ పాలకులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తుమ్మపాల ఫ్యాక్టరీలో క్రషింగ్ నిలిపేయడం, లాభాల బాటలో ఉన్న చోడవరం గోవాడ సుగర్ ఫ్యాక్టరీని నష్టాలపాల్జే యడం చూస్తుంటే దీని వెనుక భారీ కుట్ర దాగి ఉందని అర్థమవుతోందన్నారు. చోడవర ం గోవాడ సుగర్ రైతులకు పేరుకుపోయిన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ బొత్సతోపాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తదితరులు రైతులతో కలిసి బుధవారం విశాఖ కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ ఎన్. యువరాజ్‌ను వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బొత్స కలెక్టర్‌తో మాట్లాడుతూ గోవాడ ఫ్యాక్టరీ టీడీపీ అధికారంలోకి వచ్చే ముందు రూ.20 నుంచి 22 కోట్ల మిగులులో ఉండేదని, గతంలో తాను మంత్రిగా ఉన్నపుడు ఏటా క్రషింగ్ అయిన వెంటనే సకాలంలో చెల్లింపులు చేయడమే కాకుండా, రూ.200 బోనస్ కూడా ఇచ్చేవారమని గుర్తుచేశారు. పదేళ్లుగా లాభాలబాటలో ఉన్న ఈ ఫ్యాక్టరీ నేడు నష్టాల్లో కూరుకుపోతుందో అర్థం కావడం లేదన్నారు. బోనస్ మాటదేవుడెరుగు గతేడాది క్రషింగ్‌కు సంబంధించి టన్నుకు రూ.175ల చొప్పున ఇంకా రైతులకు చెల్లించాల్సి ఉందన్నారు. గతేడాది జరిగిన మహాజనసభలో ఫ్యాక్టరీలో అవినీతిపైనే కాకుండా బకాయిల కోసం రైతులు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయాన్ని గుర్తు చేశారు. అప్పట్లో ఇదే సమస్యను మీ దృష్టికితీసుకొస్తే జేసీతో విచారించి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారని ఐదు నెలలైనా నేటికీ సమస్య అలాగే ఉందని బొత్స చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ జేసీ నెలరోజుల్లోనే నివేదిక ఇచ్చారని, కానీ చెల్లించాల్సిన బకాయిలు రూ.7.5 కోట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఆ రూ.7.5 కోట్లయినా ఈ నెలాఖరు లోగా ఇచ్చేలా ఏర్పాటు చేయాలని, లేకుంటే మరోసారి రైతులు రోడ్డెక్కే పరిస్థితులు నెలకొంటాయని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని బొత్స హెచ్చరించారు. అలాగే జేసీ ఎంక్వైరీ రిపోర్టును కూడా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. హామీలు విస్మరించిన టీడీపీ ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ, సుగర్ ఫ్యాక్టరీలను బలోపేతం చేస్తాం.. తుమ్మపాల ఫ్యాక్టరీని పూర్తి స్థాయిలో ఆధునికీకరిస్తాం.. లేకుంటే రాజీనామా చేస్తాం.. అంటూ టీడీపీ నాయకులు శుష్కవాగ్దానాలు చేసి గద్దెనెక్కారని, కానీ నేడు వాటిని పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తంచేశారు. మీరేమీ రాజీనామాలు చేయనవసరం లేదు రైతుల ఆవేదనను అర్థం చేసుకోండి.. బకాయిలను వెంటనే చెల్లించి క్రషింగ్‌కు అనుమతులివ్వండి చాలు అని బొత్స కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ర్ట అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి,రాష్ర్ట కార్యదర్శి కంపా హనోక్, రాష్ర్ట ప్రచార కమిటీ కార్యదర్శి రవిరెడ్డి, రాష్ర్ట యువజన విభాగం అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్, బీసీసెల్ నాయకుడు ఫక్కి దివాకర్, డీసీఎంఎస్ చైర్మన్ మక్కా మహాలక్ష్మి నాయుడు, డీసీసీబీ డెరైక్టర్ గుమ్మిడి సత్యదేవ్, జెడ్పీ ప్లోర్ లీడర్ చిక్కాల రామారావు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గైరమ్మ సత్తిబాబు, గోవాడ సుగర్ ఫ్యాక్టరీ రైతు సంఘ నాయకులు కె.జగ్గారావు, ఓరుగంటి నెహ్రూ, ఏరువాక సత్యారావు, రాపేటి నాగేశ్వరరావు, శీలం శంకరరావు, సూరిశెట్టి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. -
చెరుకు రైతుకు చేటు కాలం!
దిగుబడికి రవాణా దెబ్బ! దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీల మూసివేత ఫలితం కోరుట్ల : షుగర్ ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకునే అంశంపై నెలకొన్న సందిగ్ధత రైతులను నష్టాలపాలు చేస్తోంది. గత సీజన్లో చెరకు క్రషింగ్ నిర్వహించిన నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీలు ఈ ఏడాది చేతులెత్తేశాయి. దక్కన్ షుగర్స్ నిర్వహణ కింద ఉన్న కరీంనగర్ జిల్లా ముత్యంపేట, నిజామాబాద్ జిల్లా బోధన్, మెదక్ ప్యాక్టరీల పరిధిలో చెరుకు సాగు చేసిన రైతులు క్రషింగ్ కోసం పంటను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 80 శాతానికి మించి చెరకు తరలింపు.. క్రషింగ్ పూర్తయింది. స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీలు మూత పడటంతో ఇతర ప్రాంతాలకు చెరకును తరలించక తప్పని పరిస్థితుల్లో రైతులు పెద్ద మొత్తంలో నష్టపాలయ్యారు. దక్కన్ షుగర్స్‌కు చెందిన మూడు ఫ్యాక్టరీలు మూత పడడంతో ఆయా ఫ్యాక్టరీల పరిధిలోని చెరకును ఇతర ఫ్యాక్టరీలకు తరలించినందుకు అయిన రవాణా ఖర్చులు ప్రస్తుతానికి రైతులే భరించాల్సి వచ్చింది. రవాణా ఖర్చులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ ఖర్చులు ఎప్పుడు ఇస్తుందోననే ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఈ ఏడాది చెరుకు క్రషింగ్ కోసం కరీంనగర్ జిల్లా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి గాయత్రి ఫ్యాక్టరీ, మాఘీ ఫ్యాక్టరీకి చెరకు తరలించారు. ఈ రెండు ఫ్యాక్టరీలు ముత్యంపేటకు 100 నుంచి 150 కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో రైతుల్లో కొందరు మహారాష్ట్రలోని చెరకు ఫ్యాక్టరీలకు 120 కిలోమీటర్ల పైగా దూరం క్రషింగ్ కోసం తీసుకెళ్లగా మరికొందరు నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని గాయత్రి ఫ్యాక్టరీకి చెరకు తరలించారు. మెదక్ జిల్లాలోని దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో రైతులు సంగారెడ్డి, జహీరాబాద్ ఫ్యాక్టరీలతోపాటు కామారెడ్డి గాయత్రి ఫ్యాక్టరీకి తరలించారు. రవాణాభారం సుదూర ప్రాంతాలకు చెరకును క్రషింగ్ కోసం తరలించిన రైతులకు రవాణా భారం మీద పడడంతోపాటు దిగుబడి నష్టపోయినట్లయింది. ముత్యంపేట, బోధన్, మెదక్ ఫ్యాక్టరీల పరిధి నుంచి 100 కిలోమీటర్ల దూరానికి మించి చెరకును తరలించిన రైతులు కనీసం పది శాతం చెరకు బరువు తగ్గిపోయి నష్టాలు ఎదుర్కొన్నారు. క్రషింగ్ చేస్తున్న ఫ్యాక్టరీకి చెరకును చేర్చినప్పటికీ అక్కడ రెండు రోజులకు మించి వెయిటింగ్లో ఉండాల్సి రావడంతో పంట ఎండిపోయి బరువు తగ్గిపోతోంది. స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీలకు చెరకును తరలించిన సమయంలో ఓ లారీకి 20 టన్నుల బరువు తూగేది. ప్రస్తుతం దూరప్రాంతాలకు తరలిస్తే లారీ చెరకు కేవలం 18 టన్నులు మాత్రమే తూగుతోందని రైతులు వాపోతున్నారు. ఈ లెక్కన రైతులు ఒక్కో లారీకి రెండు టన్నులు అంటే రూ.5 వేలు నష్టపోతున్నారు. ఎకరానికి దిగుబడి 35 నుంచి 40 టన్నులు లెక్కన రవాణా ఫలితంగా రూ.10 వేలు నష్టం జరుగుతోంది. ఈ లెక్కన ఒక్క ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో 3 వేల ఎకరాల్లో చెరకు సాగు చేసిన రైతులు రూ.3 కోట్లు నష్టపోయారు. మూతపడ్డ మూడు దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీలను లెక్కలోకి తీసుకుంటే ఈ నష్టం రూ.10 కోట్లపై మాటే. ఈ సీజన్లో రైతులకు ఎదురైన కష్టాలు దృష్టిలో ఉంచుకుని కనీసం వచ్చే ఏడాదైనా ప్రభుత్వం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీలను తెరిపించాలని రైతులు కోరుతున్నారు. -
తుమ్మపాల సుగర్స్‌ను ఆధునీకరించాలి
సుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ సభ్యులు, రైతులు ఆందోళన అనకాపల్లిరూరల్ (మునగపాక) :తుమ్మపాల సుగర్‌ఫ్యాక్టరీని ఆధునీకరించాలని.. రైతులు, కార్మికులకు న్యాయం చేయాలని వీవీ రమణ కోఆపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ సభ్యులు ఆందోళన చేశారు. మంగళవారం రైతులు, కార్మికులతో కలసి సుగర్ ఫ్యాక్టరీ నుంచి నెహ్రూచౌక్ కూడలి వరకూ ర్యాలీ తీశారు. అక్కడ మానవహారం నిర్వహించారు. అనంతరం ప్రదర్శనగా వచ్చి రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించాలన్నారు. తర్వాత తహశీల్దార్ భాస్కరరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఆందోళనకారులనుద్దేశించి సుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ దంతులూరి దిలీప్‌కుమార్ మాట్లాడుతూ రైతులు, కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకుండా తాత్సారం చేయడం బాధాకరమన్నారు. రైతులకు బకాయి పడిన రూ.రెండు కోట్లను తక్షణమే చెల్లించాలన్నారు. రూ.8 కోట్ల మేర గ్రాడ్యుటీ కింద చెల్లించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎ.బాలకృష్ణ మాట్లాడుతూ తుమ్మపాల సుగర్‌ఫ్యాక్టరీ సమస్య పరిష్కరించకుంటే ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నాకు దిగుతానని చెప్పిన అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అందుకు కట్టుబడి ఉండాలన్నారు. వైఎస్సార్ సీపీ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్ మాట్లాడుతూ రైతులు, కార్మికులకు న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని ఆపేదిలేదన్నారు. వ్యవసాయదారుల సంఘం నాయకులు పైడారావు మాట్లాడుతూ ఫ్యాక్టరీ ఆధునీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కడిమిశెట్టి రాంజీ, సీపీఐ నాయకులు వైఎన్ భద్రం, ఏఐటీయూసీ నాయకులు గనిశెట్టి సత్యనారాయణ, ఆమ్ఆద్మీపార్టీ నా యకులు ఫణిరాజు, కొణతాల హరనాథబాబు, రిపబ్లికన్ ఫార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధి అప్పారావు పాల్గొన్నారు. -
ఫ్యాక్టరీలో ప్రమాదం: ముగ్గురికి గాయాలు
చోడవరం (విశాఖపట్నం) : చక్కెర బస్తాలు లోడ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బస్తాలు జారిపడటంతో.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్లను ఆస్పత్రికి తరలించగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా చోడవరం లోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో శుక్రవారం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో చక్కెర బస్తాలను లారీలో లోడ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు జారి కూలీలపై పడ్డాయి. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. -
ఏమవుతుందో..!
రేపు తేలనున్న తుమ్మపాల సుగర్స్ భవితవ్యం సహకార కర్మాగారాలకు గడ్డుకాలమని ఐఏఎస్ అధికారి నివేదిక...? {పభుత్వ గ్యారెంటీ ఇస్తే రుణాలిస్తామన్న ఆప్కాబ్ అనకాపల్లి : తుమ్మపాల చక్కెర కర్మాగార భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. సహకార రంగానికి గడ్డుకాలం ఉందని, ప్రధానంగా చక్కెర పరిశ్రమ జాతీయస్థాయిలో ఆర్థికంగా కుదేలవుతున్నందున సహకార రంగంలో కొనసాగుతున్న కర్మాగారాలకు తగిన సహకారం అందించినా నష్టాలే పునరావృతమవుతాయని ఓ ఐఏఎస్ అధికారి ఇవ్వనున్న నివేదిక దీనిపై తీవ్ర ప్రభావం చూపనుంది. రాష్ర్టంలో సహకార రంగంలో ఉన్న 11 చక్కెర కర్మాగారాల్లో ఇప్పటికే ఐదు మూతపడగా తాజాగా తుమ్మపాల చక్కెర కర్మాగారం అదే బాటలో పయనిస్తోంది. రూ.కోట్ల అప్పులు, నష్టాలతో కుదేలైన తుమ్మపాల చక్కెర కర్మాగారానికి ఈ సీజన్‌కు సంబంధించి రుణాలు ఇవ్వాలంటే ప్రభుత్వం గ్యారంటీ తప్పనిసరి అని ఆప్కాబ్ చెప్పి తప్పించుకుంది. వ్యాట్ మినహాయింపునకు నిర్ణయం బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో వ్యాట్ నుంచి చక్కెర కర్మాగారాలకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారే తప్ప సంక్లిష్ట స్థితిలో ఉన్న తుమ్మపాల చక్కెర కర్మాగారం గురించి చర్చించిన దాఖలాలు లేవు. ఈనెల 19న చక్కెర కర్మాగారాలపై ముగ్గురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ చర్చించనుంది. ఈ సబ్ కమిటీకి కర్మాగారాల గురించి ఒక ఐఏఎస్ అధికారి సమర్పించనున్న నివేదికే కీలకం కానున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలోని చక్కెర కర్మాగారాలకు వెయ్యి కోట్ల నిధులు కేటాయించినా ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం నుంచి చక్కెర పరిశ్రమలు బయటపడడం కష్టమని ఆయన పేర్కొంటున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో సహకార చక్కెర కర్మాగారాలకు రుణాలు అందించలేమని ప్రభుత్వం చేతులెత్తేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఆర్థిక పరపతి లేని కర్మాగారాల్లో ఒకటైన తుమ్మపాల కర్మాగారానికి ఆప్కాబ్ నిధులు ఇవ్వడం కష్టమని, ఫలితంగా కర్మాగారంలో క్రషింగ్‌కు దారులు మూసుకుపోతాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జరగాల్సిన ఆలస్యం జరిగిపోవడం, చెరకు రైతుల నుంచి అగ్రిమెంట్లు తీసుకోకపోవడం, ఉన్న చెరకు ఏటికొప్పాక, తదితర కర్మాగారాలకు తరలిపోవడానికి అవకాశాలు పెరగడంతో ఇక ఈ ఏడాది క్రషింగ్ ఆశలు సన్నగిల్లినట్లేనని మరికొందరు పేర్కొంటున్నారు. అంధకారంలో కర్మాగారం... తుమ్మపాల చక్కెర కర్మాగారం ఆర్థిక వెతలు ఒక్కొక్కటికి బయటపడుతుండగా తాజాగా కర్మాగారం విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.సుమారు రూ.40 లక్షల వరకూ కర్మాగారం బకాయి పడినట్లు తెలుస్తోంది. ఎండీకి అనారోగ్యం... తుమ్మపాల చక్కెర కర్మాగారం ఎండీ సత్యప్రకాష్ గతకొద్దిరోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. కర్మాగార స్థితిగతులు దిగజారిన సమయంలోనే ఎండీ అనారోగ్యానికి గురి కావడంతో మార్కెట్‌వర్గాలు మరింత డీలా పడ్డాయి. ఆప్కాబ్పై ఆశలు పెట్టుకోగా ఆప్కాబ్ అధికారులు ప్రభుత్వం వైపు బంతిని నెట్టేసి కర్మాగార భవితవ్యాన్ని మరింత జటిలం చేశారు. జీతాలు లేక ఇబ్బందులు గత 16 నెలలుగా జీతాలు లేకపోవడంతో ఇబ్బందుల పాలవుతున్నాం. ఇంటి పోషణ సైతం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులకు జీతాలు అందేలా సహకరించాలి. - డి.పైడిరాజు, రెగ్యులర్ ఉద్యోగి ఫ్యాక్టరీకోసం పనిచేస్తున్నాం జీతాలు అందకపోయినా గానుగాట జరపాలని పని చేస్తున్నాం. ఓవర్‌హాలింగ్ పనుల్లో పస్తులు ఉండి కూడా పాల్గొంటున్నాం. కర్మాగారంలో గానుగాడితేనే మాకు కుటుంబపోషణ ఉంటుంది. -పి.ఉమామహేశ్వరరావు, ఎన్ఎంఆర్ -
బతుకంతా చేదే
రోడ్డునపడ్డ చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు 22 నెలలుగా జీతాలు ఇవ్వని యాజమాన్యం ఆటోలు తోలుతూ కొందరు, కూలి పనులకు మరికొందరు కనికరించని ప్రభుత్వం చక్కెర కర్మాగారంలో పనిచేస్తున్నా.. వారి బతుకుల్లో మాత్రం నిత్యం చేదు అనుభవాలే. జానెడు పొట్ట నింపుకోవడం కోసం వారు నానా అవస్థలు పడుతున్నారు. తమను నమ్ముకున్న వారికి పట్టెడన్నం పెట్టడానికి కొందరు ఆటోలు నడుపుతుండగా.. మరికొందరు వ్యవసాయ కూలీలుగా, చిల్లర దుకాణాల్లో గుమస్తాలుగా మారి దుర్భరజీవనం అనుభవిస్తున్నారు. ఈ వేదనంతా 22 నెలలుగా జీతాలకు నోచుకోని చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికులది. చిత్తూరు: దాదాపు రెండేళ్లుగా జీతాల్లేక చిత్తూరు సహకార చక్కెర కర్మాగారం కార్మికులు రోడ్డున పడ్డారు. కుటుంబ పోషణ కోసం నరకయాతన పడుతున్నారు. చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీలో 322 మంది కన్షాలిడేటెడ్ కార్మికులు, 65 మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నారు. కన్షాలిడేటెడ్ ఉద్యోగుల్లో రూ. 10 వేల నుంచి 20 వేలు పైచిలుకు జీతాలు వచ్చేవారు ఉన్నారు. వీరందరికీ ఫ్యాక్టరీ 22 నెలలుగా రూ. 13 కోట్ల పైచిలుకు జీతాలు చెల్లించాల్లి ఉంది. చంద్రబాబు సీఎంగా అధికారం చేపట్టాక కార్మికుల జీతం బకాయిలు ఇవ్వకపోగా ఫ్యాక్టరీలో క్రషింగ్‌ను నిలిపి వేశారు. దీంతో కార్మిక కుటుంబాలు అతలా కుతలమయ్యాయి. చాలామంది అప్పులు చేసి, ఉన్న కాస్తో కూస్తో బంగారు నగలు తాకట్టు పెట్టి పూటగడుపుకుంటూ వచ్చారు. ఇప్పుడు అప్పులిచ్చేవారూ కరువయ్యారు. పిల్లల చదువులు భారంగా మారాయి. వందలాదిమంది కార్మికులు పొట్టకూటి కోసం ఆటోలు నడుపుతున్నారు. కొందరు బెల్లం మండీల్లో, మరికొందరు చిల్లర దుకాణాల్లో గుమస్తాగిరి చేస్తున్నారు. ఇంకొందరు ఎలక్ట్రికల్ పనులకు, పెయింటింగ్ పనులకు వె ళుతున్నారు. మరికొందరు ఏ పని దొరికినా చేస్తామంటూ దొరికిన పనికల్లా వెళ్తున్నారు. ఇన్నాళ్లు ఉద్యోగాలు ఉండడంతో పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంటుకొని ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చదివించారు. ఇప్పుడు జీతాల్లేక కుటుంబ పోషణ భారంగా మరిన పరిస్థితిలో పిల్లలను ప్రైవేటు పాఠశాలలు మాన్పించి ప్రభుత్వ పాఠశాల్లలో చేర్పించారు. జీతాలు ఎప్పుడిస్తారో తెలియక కార్మికులు రోజూ ఫ్యాక్టరీ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. చైర్మన్, ఎండీలు ఉన్నా కార్మికుల సంగతి పట్టించుకోవడం లేదు. ప్రభుత్వంతో మాట్లాడుతున్నామంటూ మాటలతో సరిపెడుతున్నారు. ఒక్కో కార్మికుడికి లక్షల్లో జీతం బకాయి ఇవ్వాల్సి ఉంది. అటు ఫ్యాక్టరీ మూసివేసి ఇటు జీతం బకాయి ఇవ్వక చంద్రబాబు ప్రభుత్వం మా జీవితాలతోపాటు మాపిల్లల భవిష్యత్తును అంధకారం చేసిందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. -
షుగర్ ఫ్యాక్టరీ వద్ద రైతుల ధర్నా
విజయనగరం: విజయనగరం జిల్లా సీతానగరంలోని ఎంఎల్ఎస్ చక్కెర ఫ్యాక్టరీ వద్ద బుధవారం రైతులు ధర్నాకు దిగారు. సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన చెరుకు రైతులు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేశారు. దీంతో ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ నిలిచి పోయింది. -
చెన్నూరు చక్కెర లేదిక
చెన్నూరు : చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీని శాశ్వతంగా మూ సి వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పద వీ విరమణ చేసిన కార్మికులకు ఇవ్వాల్సిన బకాయి లు, విధుల్లో ఉన్న వారికి వీఆర్ఎస్ ఇచ్చి పంపాలని పాలకులు, అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్‌లో బుధవారం మంత్రులు, చక్కర పరిశ్రమల శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీల నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. రాష్ట్రంలోని 10 చెక్కర ఫ్యాక్టరీలు నష్టాల్లో ఉంటే వాటన్నింటికి నిధులిచ్చి నడపాలని నిర్ణయించి, ఒక్క చెన్నూరు ఫ్యాక్టరీపైనే వివక్ష చూపారు. దీనిని సహకార, ప్రైవేటు రంగాల్లో సైతం నడపడం సాధ్యం కాదంటూ తేల్చారు. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 19 మంది పర్మినెంటు, 51 మంది సీజనల్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరికీ 42నెలలుగా వేతనాలుఅందలేదు. చంద్రబాబు పాలనలోనే.. కాంగ్రెస్ ప్రభుత్వం 1977లో ఈ ఫ్యాక్టరీని ప్రారంభించింది. పరిస్థితులు అనుకూలించక ఒడిదుడుకుల మధ్య నెట్టుకొస్తున్న ఫ్యాక్టరీకి నిధులు విడుదల చేయకపోవడంతో 1995లో చంద్రబాబు పాలనలో మూత పడింది. రూ.కోటి బకాయి చెల్లించకపోవడంతో బ్యాంకులు ఈ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్నాయి. పదేళ్ల పాటు ఖాయిలా పడ్డ పరిశ్రమ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో 2006 నుంచి మూడేళ్ల పాటు సవ్యంగా నడిచింది. వైఎస్ అప్పట్లో రూ.27 కోట్లు నిధులిచ్చి ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తెచ్చారు. ఆయన మరణంతో మళ్లీ మూత పడింది. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం.. పెట్టుబడులు పెట్టాలంటూ విదేశాలు తిరుగుతున్న సీఎం చంద్రబాబునాయుడు ఈ ఫ్యాక్టరీని తెరిపించాల్సింది పోయి శాశ్వతంగా మూయాలనుకోవడం తగదని ఈ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కథ ముగియనుంది రాష్ట్రంలో రెండు చక్కర ఫ్యాక్టరీలు మినహా అన్నీ నష్టాల్లో ఉన్నప్పటికీ చెన్నూరు ఫ్యాక్టరీని మాత్రమే శాశ్వతంగా మూయాలనుకోవడం అధికార పార్టీ నాయకుల కుట్ర అని ప్రజలు, రైతులు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్యాక్టరీకి అన్ని రకాలుగా అనువైన పరిస్థితులున్నాయి. నిర్వహణ లోపం వల్లే నష్టాల్లోకి వెళ్లింది. ప్రభుత్వం నడపలేకపోతే ప్రైవేటు రంగానికైనా అప్పగించాలని కార్మిక నేతలు కోరినా ప్రయోజనం లేకపోయింది. 42 నెలలుగా వేతనాలు అందని కార్మికుల పరిస్థితి ఏమిటనేది ప్రభుత్వం వెల్లడించలేదు. జిల్లాపై వివక్ష ఫ్యాక్టరీని శాశ్వతంగా మూత వేయాలని నిర్ణయించారు. ఈ ఫ్యాక్టరీ ప్రారంభిస్తే వేలాది మందికి ప్రయోజనం కల్గుతుందని ఏన్నో ఏళ్లుగా పోరాటం చేశాం. రాష్ట్రంలో అన్ని చక్కెర ఫ్యాక్టరీలు నడపాలంటూ నిధులిచ్చిన ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీని నడపడం సాధ్యం కాదనడానికి జిల్లాపై వివక్షే కారణమనిపిస్తుంది. జిల్లాలోని నాయకులు చొరవ చూపకపోవడం వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రైతు సంఘాలు నామ మాత్రంగా స్పందించాయి. ప్రభుత్వం.. రైతులు, కార్మికులకు తీవ్ర అన్యాయం చేసింది. - పి.కృష్ణ, చెక్కర ఫ్యాక్టరీల రాష్ట్ర కార్యదర్శి ప్రైవేట్ వారికి ఇస్తుందనుకున్నాం పరిశ్రమలు స్థాపించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటూ చెబుతున్న ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీని మూత వేస్తుందనుకోలేదు. ప్రైవేటులోనైనా నడిపి ఉంటే, రైతులు, కార్మికులకు ప్రయోజనం కలిగి ఉండేది. నిరుద్యోగులకు ఉపాధి లభించేది. ఇంత దారుణ నిర్ణయం తీసుకోవడం అన్యాయం. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. - వేణుగోపాల్‌రెడ్డి, చక్కెర ఫ్యాక్టరీ పర్మినెంట్ కార్మికుడు -
చిక్కుల్లో చక్కెర
►తుమ్మపాల కర్మాగారానికి నిధులిచ్చేందుకు ఆప్కాబ్ వెనుకంజ ►చక్కెర కర్మాగారాల రుణానికి గ్యారంటీ ఇవ్వని ప్రభుత్వం ►సహకార రంగంపై సవతి తల్లి ప్రేమ ►ఇచ్చిన మాట నిలబెట్టుకోని బాబు ►ఎన్నికల హామీపై ఎమ్మెల్యే పిల్లిమొగ్గలు ►అప్పుల్లో రైతులు.. ఆందోళనలో సుగర్ ఉద్యోగులు అనకాపల్లి: చెరకు ఉత్పత్తుల్లో ఒక్కటైన బెల్లం లావాదేవీల్లో జాతీయ స్థాయి కీర్తిని ఆర్జించిన అనకాపల్లి.. చక్కెర కర్మాగారం విషయంలో మాత్రం అవస్థల పాలవుతోంది. మాటల గారడీతో గద్దెనెక్కిన పాలకులు ఇంకా రైతుల్ని మాయ మాటలతో మోసం చేస్తున్నారు. సహకార రంగానికి పూర్వవైభవం తీసుకొస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం సహకార రంగంలో కొనసాగుతున్న కర్మాగారాలకు రుణం వచ్చే విషయంలో గ్యారంటీ కూడా ఇవ్వకుండా చోద్యం చూస్తోంది. ఏడాది క్రితం స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇచ్చిన మాటకు విలువలేకుండా పోయింది. ఎన్నికల ముందు తుమ్మపాల కర్మాగారం ఆధునీకరణ తన లక్ష్యమని చెప్పుకున్న టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత హామీని గాలికొదిలేశారు. అప్పుకు సైతం నోచుకోని దయనీయ స్థితి : భవితవ్యంపై స్పష్టత లేని తుమ్మపాల కర్మాగార యాజమాన్యానికి అప్పు సైతం పుట్టడంలేదు. ఉన్న వనరులతో ఏదోలా నెట్టుకొద్దామని యాజమాన్యం భావిస్తున్నా పైసలు లేక తలలు పట్టుకుంది. ఆప్కాబ్ సహాయంతో కొద్దిగా రుణం పొందాలని అనుకున్నా ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకపోవడంతో 3 కోట్ల రుణం మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. గానుగాటకు సన్నాహాలు లేవు: 2015-16 సీజన్‌కు సంబంధించి తుమ్మపాల కర్మాగారం పరిధిలో గానుగాటకు సన్నాహాలు మొదలుకాలేదు. ఖజానాలో ఒక్క పైసా కూడా లేకపోవడంతో ఎటువంటి కదలిక లేకుండా పోయింది. గానుగాటకు ముందు ఓవర్‌హాలింగ్ చే యాల్సి ఉన్నప్పటికీ నిధుల కొరతతో యాజమాన్యం చేతులెత్తేసింది. కనీసం 70లక్షల రూపాయిల నిధులుంటేనే ఓవర్‌హాలింగ్ సాధ్యమవుతుంది. గత ఏడాది ఓవర్‌హాలింగ్ కో సం వినియోగించిన సామాగ్రి కొనుగోలుకు సంబంధించి రూ. 50 లక్షలు ఇం కా యాజమాన్యం చెల్లించాల్సి ఉంది. కమిటీలతో కాలయాపన : చంద్రబాబు ప్రభుత్వం సహకార చక్కెర కర్మాగారాల భవితవ్యం కోసం ఇప్పటికే ఒక కమిటీని నియమించగా, కమి టీ నివే దికలు ఏమయ్యాయో తెలి యదు. తాజాగా ముగ్గురు మంత్రుల తో కూడిన ఉపసంఘం సహకార కర్మాగాల భవితవ్యంపై ఎటువంటి నిర్ణయాలు తీసుకుకోకుండానే కాలయాపన చేస్తోంది. అప్పులు.. ఆందోళనలే.. : తుమ్మపాల కర్మాగారం ఆధునీకరణకు కనీసం రూ.800 కోట్లు అవసరమని యాజమాన్యం చెబుతోంది. అది కూడా కర్మాగారం ఏటా లక్ష టన్నులకు పైబడి క్రషింగ్ చేస్తేనే సుగర్కేన్ డవలప్మెంట్ ఫోరం అనుమతిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండూ సాధ్యం కాదు. ఇక కర్మాగారంలో పనిచేస్తున్న 36 మంది రెగ్యులర్ ఉద్యోగులకు రూ.60 లక్షల జీతాల బకాయిలు, తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులకు రూ.కోటి బకాయిలు, రైతులకు చెల్లించాల్సిన మద్దతు ధర బకాయిలు 3.56 కోట్ల వరకూ ఉ న్నాయి. కర్మాగారం భవితవ్యంపై స్పష్టత రాకపోవడంతో రైతులు అప్పుల్లో, ఉద్యోగలు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎమ్మెల్యే పిల్లిమొగ్గలు : ఎన్నికలకు ముందు పీలా గోవింద సత్యనారాయణ కర్మాగారం ఆధునీకరణే లక్ష్యమని చెప్పారు. పదవిలోకి వచ్చి ఏడాది దాటుతున్నా ఆయన దాటవేత వైఖరితో వ్యవహరిస్తున్నారు. ఆధునీకరణ చేయకుంటే రాజీనామా చేస్తానన్న ఎమ్మెల్యే తన మాటకు కట్టుబడాలని రైతులు అంటున్నారు. గత ఆగస్టు మొదటి వారంలో కర్మాగారంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధునీకరణకు సంబంధించిన కమిటీ వేసి త్వరలోనే తీపికబురు చెబుతామని నమ్మించినా ఇప్పటికీ ఏ కబురూ లేదు. -
అన్నదాత కడుపుమండింది..
- చెరకు పంటను పశువులకు మేతగా వేసిన రైతు - ఫ్యాక్టరీకి చెరకు తరలించి ఏడునెలలైనా అందని బిల్లులు - మెదక్ మండలం గాజిరెడ్డిపల్లి గ్రామంలో సంఘటన మెదక్ రూరల్: ఏడాది కింద పండించిన చెరకు ఫ్యాక్టరీకి తరలించిన ఆ అన్నదాతకు ఏడు నెలలు గడిచినా యాజమాన్యం బిల్లులు చెల్లించలేదు. సాగుచేసిన చెరకు పంటకు ఫ్యాక్టరీ యాజమాన్యం అగ్రిమెంట్ చేసుకోవడం లేదు. భవిష్యత్తులో చెరకు ఫ్యాక్టరీ నడుస్తుందో లేదో అనే ఆందోళన. దీంతో ఆ అన్నదాత పండించిన చెరకు పంటను పశువుల మేతగా వేశాడు. ఈ సంఘటన మెదక్ మండలం గాజిరెడ్డిపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన సాపరవి గత ఏడాది మూడెకరాల్లో చెరకు పంట సాగుచేశాడు. పంటను ఫ్యాక్టరీకి తరలించిన రవికి యాజమాన్యం రూ.60వేలు ఇవ్వాల్సి ఉండగా అందులో రూ.40వేలను మాత్రమే చెల్లించింది. మరో రూ.20వేలు ఇవ్వాల్సి ఉన్నా నేటికి చెల్లించలేదు. ఫ్యాక్టరికి చెరకు తరలించి ఏడునెలలు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో రైతు రవి ఆవేదనకు గురయ్యాడు. ప్రస్తుతం మూడెకరాల్లో చెరకు పంట మోడం అలాగే ఉంది. కాగా నేటికీ పంటను ఫ్యాక్టరీ యాజమాన్యం అగ్రిమెంట్ చేసుకోక పోవడంతో కడుపు మండిన రైతు చేనులోకి పశువులను తోలి మేపించాడు. జిల్లాలోని వేలాది మంది రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. అనంతరం రవి విలేకరులతో మాట్లాడుతూ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వం చెప్పి ఏడాది గడుస్తున్నా స్వాధీనం చేసుకోనందునే తనలాంటి రైతులకు ఈ పరిస్థితి ఎదురైందన్నారు. -
కర్షకుల పాలిట ఖర్మాగారం !
బొబ్బిలి: లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం పరిధిలోని రైతులు మరో సారి ఆందోళనకు సిద్ధమయ్యారు. శనివారం ఫ్యాక్టరీ ఎదుట మహాధర్నా చేయనున్నారు. 16 మండలాలకు చెందిన 15 వేల మంది రైతులకు ఫ్యాక్టరీ యాజమాన్యం దాదాపు రూ 50 కోట్ల బకాయి పడింది. రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నప్పుడు హామీలు ఇచ్చి తరువాత పట్టించుకోవడం లేదు. గత ఏడాది సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ఏకబిగిన 15 రోజుల పాటు భారీ ఎత్తున ఆందోళనలు, రాస్తారోకోలు, నిరాహారదీక్షలు చేశారు. బకాయిల కోసం ఇప్పటికి 52 సార్లు రైతులు రోడ్డెక్కారు. గత ఏప్రిల్ 24న మండుటెండలో ఆందోళన చేశారు. ఇలా అందోళన చేసిన ప్రతిసారీ అధికారులు, ఫ్యాక్టరీ యాజమాన్యం హామీలు ఇస్తున్నారనే తప్ప సమస్య పరిష్కరించడంలేదు. రెండేళ్లుగా బకాయిలు చెల్లించకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం వాయిదా లు వేసుకుంటూ వస్తోంది. ఉన్నతాధికారులు కూడా స్పందించ డం లేదు. ఫ్యాక్టరీ యాజమాన్యం చెరుకు రైతుల పేరిట లచ్చయ్యపేట, పార్వతీపురం తదితర ప్రాంతాల్లోని బ్యాంకుల్లో బినామీ రుణాలు తీసుకుంది. వాటికి సం బంధించి ఇంకా 25 కోట్ల రూపాయల బకాయి ఉంది. వాటిని యాజమాన్యం చెల్లించకపోవడం వల్ల ఇప్పటికీ అప్పులు తీర్చాలని బ్యాంకులు రైతులకు నోటీసులు పంపుతున్నాయి. బినామీ అప్పుల బారిన పడిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ కూడా వర్తించని పరిస్థితి ఏర్పడింది. అలాగే 2013-14 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన చెరకును సరఫరా చేసిన రైతులకు రూ.5.50కోట్ల బకాయి పడగా, గత ఏడాదికి సంబంధించి 12.70 కోట్ల బకాయి ఉంది. ఎన్సీఎస్ యాజమాన్యం నడిపితే బిల్లులు అందడం లేదని ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రషింగు జరగాలని గత ఏడాది నిర్ణయం తీసుకున్నా ఆ బకాయిలు కూడా నేటివరకూ అందలేదు. దిగుబడి అయిన పంచదారకు ధర లేదని ఫ్యాక్టరీలోనే నిల్వలు చేశారు. ప్రభుత్వం ప్రత్యేక ఖాతాలు పెట్టి క్రషింగు చేసినా ఇంకా 12 కోట్ల వరకూ ైరె తులకు చెల్లించాల్సి ఉంది. ఇవి కాకుండా టన్నుకు మమ్ము చెరుకుకు వంద రూపాయలు, మొక్క చెరకుకు 2 వందల రూపాయలు విత్తన రాయితీ ఇవ్వాల్సి ఉంది. అయితే గత రెండేళ్లుగా ఇవి కూడా ఇవ్వకపోవడంతో దాదాపు ఆరు కోట్ల రూపాయల వరకూ బకాయి ఉంది. బకాయిలు కోసం రైతులు ఆందోళన చేయడానికి ప్రకటనలు జారీ చేస్తే అటు యాజమాన్యం, ఇటు అధికారులు స్పందించడం, వెంటనే సమావేశాలు ఏర్పాటు చేయడం, రైతులు ఆందోళన చేయకుండా కట్టడి చేయడం వంటివి చేస్తున్నారు.. ఆ సమయంలో అధికారులు హామీ ఇవ్వడం, అవి గడువు తీరినా నెరవేరకపోవడం సాధారణంగా మారింది. దీంతో విసిగిపోయిన రైతులు శనివారం ఫ్యాక్టరీ ఎదురుగా మహాధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. రైతులు ధర్నాకు సిద్ధమవుతుండడంతో ఎన్సీఎస్ యాజమాన్యం బహిరంగ ప్రకటన ద్వారా చక్కెర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించింది. అయితే దానిపై కూడా రైతు సంఘం తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తుంది. మా ఖర్మకాలి ఈఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేశామని, ఇప్పుడు పడరానిపాట్లు పడుతున్నామని, జిల్లా అధికారులు, ప్రభుత్వం ఫ్యాక్టరీ యాజమాన్యానికి కొమ్ముకాస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఏపీ చెరకు రైతు సంఘం ఆధ్వర్యంలో జరగనున్న మహాధర్నా సందర్భంగా ఫ్యాక్టరీ దగ్గర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. -
తీపి కబురు అందేనా..!
♦ చక్కెర ఫ్యాక్టరీ నిర్వహణపై ప్రభుత్వం తర్జన భర్జన ♦ ప్రైవేటు రంగంలోనా.. సహకార రంగంలోనా.. ♦ భరద్వాజ్ కమిటీ సిఫార్సులు బుట్టదాఖలేనా ♦ ముఖ్యమంత్రి ప్రకటన కోసం రైతులు, కార్మికుల ఎదురుచూపు చెన్నూరు : సహకార చక్కెర ఫ్యాక్టరీలను ప్రభుత్వం బ్యాంకులకు తనఖా పెట్టే ఆలోచనలో పడింది. రాష్ట్రంలోని 10 చక్కెర ఫ్యాక్టరీల్లో ఏటికొప్పాక, చోడవరం మినహా నష్టాల్లో ఉన్న 8 చక్కెర ఫ్యాక్టరీలను సహకార రంగంలో నడపడం సాధ్యమవ్వదని నిపుణుల కమిటీలు చెబుతున్నాయి. అయినా ప్రైవేటుకు అప్పగిస్తే రైతులు, కార్మికులతో పాటు ప్రజల్లో తమకు చెడ్డపేరొస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటుకిస్తే ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారేమోననే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. లక్షలాది రూపాయలు వెచ్చించి గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రాష్ర్ట్రంలోని అన్ని సహకార చక్కెర ఫ్యాక్టరీలలో భరద్వాజ కమిటీ అధ్యయనం చేసింది. చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీకి ఫిబ్రవరి 24న భరద్వాజ్ కమిటీ రాగా కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి సహకార రంగంలోనే ఈ ఫ్యాక్టరీని నడపాలని కోరారు. ప్రజా ప్రతినిధులు, కార్మికులు, రైతుల అభిప్రాయాల ప్రకారం సహకార రంగంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చక్కెర ఫ్యాక్టరీలను నడపడం చాలా కష్టం అని వారు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. అయినా ఈ నివేదికను ప్రభుత్వం బుట్టదాఖలు చేస్తుందని ఆ శాఖ ఉన్నతాధికారులే అంటున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలన్నింటిని కష్టమైనా సహకార రంగంలోనే నడపాలనే ఆలోచనలోనే ఉన్నట్లు తెలుస్తోంది. నేడు ఖాజీపేటకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులు, కార్మికుల శేయస్సును దృష్టిలో పెట్టుకొని జిల్లాలోని ఏకైక ప్రభుత్వ రంగ ఫ్యాక్టరీ భవిష్యత్తుపై స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రజలు కోరుతున్నారు. తనఖాపెట్టి నిధులను సమీకరిస్తే... సహకార రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీ భూములు, యంత్రాలను ఆస్తులను బ్యాంకులకు ప్రభుత్వ గ్యారెంటీతో తనఖా పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం విధుల్లో ఉన్న కార్మికుల వేతనాలు, ఇవ్వాల్సిన అరియర్స్‌తో పాటు చెరకు సాగు, యంత్రాల మరమ్మతులకు సుమారు రూ.150 కోట్ల మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణం పొందాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో గతనెల 25న హైదరాబాద్‌లో చక్కెర పరిశ్రమలశాఖ కమిషనర్, సంబంధిత మంత్రి, సహకార చక్కెర ఫ్యాక్టరీల ఎండీలు, కార్మిక నేతలు, భరద్వాజ్ కమిటీతో జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు జరుపుతారనేది తేదీని అధికారులు ప్రకటించలేదు. అయితే ఈ విషయంపై ముఖ్యమంత్రి నేడు జరిగే జన్మభూమి సభలో వెల్లడిస్తారని చర్చలు జరుగుతున్నాయి. జిల్లాకు చెందిన అధికార పార్టీనాయకులు ఫ్యాక్టరీకి అనుకూలంగా సీఎంచే స్పష్టమైన ప్రకటన చేయించాలని ప్రజలు కోరుతున్నారు. ఫ్యాక్టరీ ఏ రంగంలో తెరిచినా 2012 మార్చి నుంచి తమకు రావాల్సిన వేతనాలు, పదవీ విరమణ పొందిన కార్మికులకు, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఇవ్వాల్సిన అరియర్స్ ఇవ్వాలని కార్మిక నేతలు కోరుతున్నారు. -
చీకట్లో చక్కెర కర్మాగారం
నిధులున్నా విద్యుత్ బిల్లులు చెల్లించని అధికారులు ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టేందుకే కరెంట్ కట్ కార్మికులను బయటకు గెంటడమే లక్ష్యం 20 రోజులుగా అంధకారంలో కార్మికుల నివాసాలు మంత్రి పీతల సుజాతకు చెప్పినా ప్రయోజనం శూన్యం కలెక్టర్‌తో మాట్లాడుకోమంటున్న ఎండీ పట్టించుకోని జిల్లా కలెక్టర్ చిత్తూరు చక్కెర కర్మాగారం కార్మికులు 20 రోజులుగా విద్యుత్ లేక చీకట్లో మగ్గుతున్నా అటు కర్మాగారం పాలక వర్గంగానీ, ఇటు జిల్లా అధికారులుగానీ ఏమాత్రం పట్టించుకోవడంలేదు. కార్మికులను ఖాళీ చేయించి చక్కెర కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టేందుకే ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. చిత్తూరు: రెండు నెలల విద్యుత్ బిల్లులు చెల్లించలేదంటూ విద్యుత్ శాఖవారు చిత్తూరు సహకార చక్కెర కర్మాగారం తోపాటు దాని పరిధిలోని కార్మికుల నివాసగృహాల(క్వార్టర్స్)కు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. 20 రోజులుగా విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో కర్మాగారం పరిధిలో నివసిస్తున్న 80కి పైగా కార్మిక కుటుంబాలు చీకట్లో నానా కష్టాలు పడుతున్నాయి. విద్యుత్ సౌకర్యం లేక తాగునీరు కూడా అందే పరిస్థితి కేకుండా పోయింది. ఒక వైపు పిల్లలకు పరీక్షల సమయం కావడం, చీకట్లోనే ఉండాల్సి రావడంతో వారి చదువులు సాగడంలేదు. దీంతో కార్మికుల కటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు కర్మాగారంలో కోట్లాది రూపాయల విలువైన సామగ్రి ఉంది. విద్యుత్ లేకపోవడంతో సామగ్రి దొంగతనానికి గురయ్యే అవకాశాలు అధికం. గతంలో కార్మికుల ఇళ్లలో సైతం దొంగలు దోపిడీకి పాల్పడిన సంఘటనలు కోకొల్లలు. ఇటీవల కర్మాగారం ఇన్చార్జ్ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన డీఆర్వో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ విషయం పట్టించుకోవడంలేదు. కార్మికులు పలుదఫాలు విన్నవించినా ఆయన స్పందించిన పాపాన పోలేదు. పైగా కలెక్టర్‌తో మాట్లాడుకోమంటూ ఎండీ ఉచిత సలహా ఇచ్చి తప్పించుకుంటున్నారు. కలెక్టర్ వద్దకు వెళితే ఎండీని కలవమంటున్నారు. వారం రోజులుగా కార్మిక కుటుంబాలు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాయి. కలెక్టరేట్ ఎదుట ధర్నా సైతం చేశారు. ఇటీవల జిల్లాకు వచ్చిన మహిళా,శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాతను సైతం కలిసి న్యాయం చేయాలని మహిళలు మొరపెట్టుకున్నారు. స్పందించిన మంత్రి చక్కెర కర్మాగారానికి విద్యుత్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అయినా కలెక్టర్ పట్టించుకోలేదు. కార్మికులను తరిమేసేందుకే కరెంట్ కట్ కర్మాగారం ఆవరణలో కాపురముంటున్న కార్మికులను బయటకు పంపేందుకే అధికారులు, పాలకవర్గం కలిసి విద్యుత్ సరఫరాను నిలిపివేయించినట్లు సమాచారం. కర్మాగారాన్ని అమ్మకం లేదా లీజుకు అప్పగించేందుకు ఇప్పటికే సిద్ధమైన ప్రభుత్వం ఈ తంతును పూర్తిచేసేందుకు డీఆర్వోకు ఇన్చార్జ్ ఎండీ బాధ్యతలు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఎండీగా బాధ్యతలు చేపట్టిన డీఆర్వో ఇప్పటికే కార్యాచరణకు దిగి కార్మికులను కర్మాగారం నుంచి బయటకు పంపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కార్మికులు ఫ్యాక్టరీ పరిధిలోనే కాపురం ఉంటే ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటారని, అందుకే ముందు కార్మికులను అక్కడి నుంచి వెళ్లేలా చేయాలని అధికారులు వ్యూహం పన్నారు. ఇందులో భాగంగానే తొలుత బకాయిలు చెల్లించలేదనే సాకుతో కార్మికుల నివాస గృహాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేయించినట్లు తెలుస్తోంది. విద్యుత్ లేకపోతే కార్మికులు ఎక్కువ కాలం అక్కడ ఉండే పరిస్థితి లేదు. విద్యుత్ బకాయిలు * 7 లక్షలు మాత్రమే ఉన్నాయి. కర్మాగారం పరిధిలో ఉన్న కల్యాణమండపం ఖాతాలో దాదాపు * 39 లక్షల రూపాయలు నిధులు ఉన్నట్లు కార్మికులు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో రెండు నెలల విద్యుత్ బకాయిలు చెల్లించడం కష్టమేమీ కాదు. కానీ అధికారులు బకాయిలు చెల్లించడంలేదు. -
రైతు ద్రోహిని నిలదీయండి
చెరకు, గసగసాల రైతులను ఆదుకోండి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరిన నేతలు తిరుపతి రూరల్: సహకార రంగాన్ని నిర్వీర్యం చేసి షుగర్ ఫ్యాకర్టీలను ప్రైవేటుకు ధారాదత్తం చేయాలని ప్రయత్నిస్తున్న రైతుద్రోహి చంద్రబాబును నిలదీయాలని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఆదికేశవులురెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి చిందేపల్లి మధుసూదన్ రెడ్డి కోరారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో సోమవారం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో సహకార సొసైటీల ఆధ్వర్యంలో నడుస్తున్న గాజులమండ్యం, చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీలను నిర్వీర్యం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. గాజులమండ్యంకు సంబంధించి 12,500 మంది రైతులకు రూ.9.50 కోట్లు, చిత్తూరులో 15,000 మంది రైతులకు రూ.8.20 కోట్ల బకాయిలను చెల్లించడం లేదని ఆరోపించారు. రెండు ఫ్యాక్టరీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ప్రయత్నిస్తున్నారని, దీనిపై ముఖ్యమంత్రిని నిలదీయాలని జగన్మోహన్ రెడ్డిని కోరారు. గసగసాల రైతులపై అక్రమ కేసులను అడ్డుకోండి జిల్లాలోని రైతులు అవగాహన లేక వేలాది ఎకరాల్లో గసగసాలు సాగు చే స్త్తున్నారని వారిపై ఎక్సైజ్ అధికారులు అక్రమ కేసులను బనాయిస్తున్నారని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రైతు విభాగం నేతలు ఆదికేశవులురెడ్డి, చిందేపల్లి మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. దాదాపు రూ.10 కోట్ల విలువైన పంటను అధికారులు ధ్వంసం చేసి కేసుల పెట్టినట్లు వివరించారు. రెతులపై పెట్టిన అక్రమ కేసులను మాఫీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. స్పందించిన జగన్మోహన్రెడ్డి రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాడుతుందని, చక్కెర ఫ్యాక్టరీలను కాపాడుకునేందుకు రైతులతో కలిసి ఉద్యమిస్తామని హామీ ఇచ్చినట్లు ఆదికేశవులురెడ్డి తెలిపారు. -
చంద్రబాబు మోసకారి: కవిత
బోధన్: 'ఏపీ సీఎం చంద్రబాబు బొడ్డులో కత్తి పెట్టుకున్నడు. ఏ అవకాశం వచ్చినా తెలంగాణ ప్రజలను మోసగిస్తడు' అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. చంద్రబాబు హయంలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీని విక్రయించారన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా బోధన్‌లో జరిగిన టీఆర్ఎస్ సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణలో టీఆర్ఎస్కు తప్ప మరో పార్టీకి స్థానం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం 200 పథకాలు ప్రకటించి, అమలుకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఇవి చూసి ఓర్వలేక కొన్ని పార్టీలు విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. -
భీమసింగి కర్మాగారంపై ముగిసిన అధ్యయనం
భీమసింగి సుగర్స్(జామి): ప్రభుత్వం నియమించిన సహకార చక్కెర కర్మాగారాల అధ్యయనం శుక్రవారంతో ముగిసింది. కమిటీ సభ్యులు భరద్వాజ, గురువారెడ్డిలు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైతులను,భీమసింగి సహకార చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కమిటీ సభ్యులకు మొరపెట్టుకున్నారు. కర్మాగారంలో కటింగ్ ఆర్డర్ల విషయంలోను, ఇబ్బందుల విషయంపై, అలాగే చెరుకు మద్దతు ధర విషయంలో గిట్టుబాటు కావడం లేదని వాపోయారు. భీమసింగి సహకార చక్కెర కర్మాగారం మాజీ చైర్మన్ లగుడు సింహాద్రి, జెడ్పీటీసీ బండారు పెదబాబు మాట్లాడుతూ కర్మాగారం ప్రస్తుతం రూ.40కోట్ల నష్టాల్లో ఉందని, ప్రభుత్వం ఈనష్టాలను భర్తీచేసి ఆదుకోవాలని, పాతఅప్పులను ప్రభుత్వం మాఫీ చేయాలని కోరారు. చెరుకు రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలన్నారు. సహకారచక్కెర కర్మగారాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన అధ్యయన కమిటీ సహకార చక్కెర కర్మాగారాల వ్యవస్థపై అధ్యయన కమిటీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.సహకార వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయన్నారు. భీమసింగి సహకార చక్కెర కర్మాగారం పురాతన యంత్రాలతో పనిచేస్తోందని, ప్రసుత్తం ఈ యంత్రపరికరాల విలువ శూన్యమన్నారు. ప్రపంచవ్యాప్తంగా కొత్తటెక్నాలజీ వచ్చిందని, పాత పరిస్థితులే కొనసాగితే కర్మాగారం మనుగడ కష్టతరమన్నారు. సహకార వ్యవస్థలో రైతులు,యాజమాన్యం సంయుక్తంగా కర్మగారాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. రైతులకు గిట్టుబాటుకావడంలేదని,యాజమాన్యం నష్టాల్లో ఉందని ఉత్తర, దక్షిణ ధ్రువాల్లా ఉంటే కర్మాగారం అభివృద్ధి చెందదన్నారు. అధ్యయనం నివేదికను పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి అందిస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బండారు పెదబాబు,రైతులు వి.రామావతారం,ఎ.అప్పలనాయుడు,సీహెచ్.సూరిబాబు, కె.ఎర్నిబాబు,ఎం.డి. డి.నారాయణరావు పలువురు రైతులు పాల్గొన్నారు. -
చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితిదీ!
-
చిత్తూరు షుగర్స్‌లో నో క్రషింగ్
355 మంది కార్మికుల తొలగింపు ఈ ఏడాది క్రషింగ్ నిలిపివేస్తున్నట్లు ప్రకటన ఆందోళనకు దిగిన కార్మికులు సాక్షి, చిత్తూరు: అదిగో క్రషింగ్.. ఇదిగో క్రషింగ్ అంటూ నెలరోజు లుగా దోబూచులాడిన చిత్తూరు షుగర్స్ పాలకవర్గం, అధికార వర్గం ఎట్టకేలకు చిత్తూరు సహకార చక్కెర కర్మాగారంలో ఈ ఏడాది క్రషింగ్ నిలిపివేస్తున్నట్లు శనివారం ప్రకటించాయి. అంతేకాదు కర్మాగారంలో 30 ఏళ్లకు పైగా పనిచేస్తున్న 355 మంది సీజనల్ పర్మినెంట్, కన్సాలిడేట్ కార్మికులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు రెఫరెన్స్ సీసీఎస్ ఈఎస్టీటీ ఓఎం 2015 ఉత్తర్వులు జారీచేసింది. రాత్రికి రాత్రే ఈ ఉత్తర్వులు వెలువడ్డా యి. బకాయిలు ఇవ్వలేనందునే ఈ ఏడాది కర్మాగారంలో క్రషింగ్ నిలిపివేయడంతోపాటు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో 355 మంది కార్మికులను సైతం విధులనుంచి రిలీవ్ చేస్తున్నట్లు పా లకవర్గం తీర్మానించగా ఇన్చార్జ్ ఎండీ అధికారికంగా దానికి ఆమోదముద్ర వేశారు. 12వతేదీనే పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో చూపారు. అధికారులు, చైర్మన్‌తో గొడవ నేపథ్యంలో ఈనెల 10వ తేదీ ఇన్చార్జ్ ఎండీ పదవికి రాజీ నామా చేసిన మల్లికార్జున రెడ్డి పేరు మీదనే క్రషింగ్ నిలిపివేత, కార్మికుల తొలగింపు ఉత్తర్వులు వెలువడడం విశేషం. అయితే ఇన్చార్జి ఎండీ తన పదవికి రాజీనామా చేయకమునుపే ఈ ఉత్వర్వులపై సంత కం చేశారా ? అనే అనుమానం తలెత్తుతోంది. లేకపోతే ఆయన రాజీనామానే ఓ డ్రామానా అనే సంశ యం కూడా కలుగుతోంది. కర్మాగారం కార్యాలయం, ఇం జినీరింగ్ విభాగం, మ్యాన్యుఫ్యాక్చరింగ్ విభాగాలకు చెందిన కార్మికు లు తొలగించిన వారిలో ఉన్నారు. 13 నెల లుగా వారు జీతాలు లేకుండానే పనిచేస్తున్నారు. కార్మికులకు సంబంధించి 12 కోట్ల జీతాలకు చెందిన బకాయిలతోపాటు మరో మూడు కోట్ల పీఎఫ్ బకాయిలు చెల్లించాలి. వాటి సంగతి పట్టించుకోని ప్రభుత్వం కార్మికులకు, యూనియన్ నేతలకు మాట మాత్రమైనా చెప్పకుండా తొలగింపు చర్యలకు దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఎండీ పాలక వర్గం తీర్మానానికి ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న కార్మికులు శనివారం ఉదయం నుంచి కర్మాగారం వద్ద ఆందోళన చేపట్టారు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒక్కసారిగా వందలాది మం ది ఉద్యోగులను ఎలా తొలగిస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. రైతులు, కార్మికులకు చెందిన బకాయిలను చెల్లించలేని పరిస్థితిలోనే కన్సాలిడేట్ కార్మికులను రిలీవ్ చేసినట్లు చైర్మన్ ఎన్పీ రామకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. ఆది నుంచి డ్రామానే రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించి సహకార చక్కెర కర్మాగారాన్ని ముందుకు నడిపిస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత హామీలు తుంగలో తొక్కారు. విలువైన ఆస్తులున్న కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టేందుకు బాబు ప్రభుత్వం ఆది నుంచే మొగ్గు చూపింది. ఇందుకోసం అధ్యయనం అంటూ కమిటీ వేసి చిత్తూరు షుగర్స్ అమ్మకానికి మార్గం సుగమం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా రైతాంగంతో పాటు అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో కర్మాగారం అమ్మకానికి చంద్రబాబు తాత్కాలిక విరామం మాత్రమే ఇచ్చినట్లు కనబడుతోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించడంతో పాటు చిత్తూరు షుగర్స్‌లో క్రషింగ్ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. బాబు ప్రకటనతో పాలకవర్గం డిసెంబర్ 4న కర్మాగారంలో స్లోఫైరింగ్ కార్యక్రమం నిర్వహించింది. ఆ తరువాత చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో డిసెంబర్ 11న కర్మాగారంలో పూజా కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఇదే సమయంలో ప్రభుత్వం పైసా నిధులు ఇవ్వక పోయినా పాలకవర్గం, అధికారవర్గం కర్మాగారం విలువైన స్టోర్స్‌ను తాకట్టు పెట్టి ఆప్కా బ్ వద్ద రెండు కోట్ల రుణం తెచ్చింది. రుణం కోసం డెరైక్టర్ ఆఫ్ షుగర్స్ సైతం ఆప్కాబ్‌కు సిఫారసు చేసింది. క్రషింగ్ నిర్వహించనపుడు ఆప్కాబ్ నుంచి రుణం ఎందుకు తేవాల్సి వచ్చిందో పాలకవర్గానికే తెలియాలి. -
బాబు..వ్యవసాయం లేని సింగపూర్ చేస్తారా?
తిరుపతి: పెండింగ్‌లో వున్న కోట్ల రూపాయల బకాయిలను రైతులకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ, తిరుపతిలోని గాజులమండెం షుగర్ ఫ్యాక్టరీ వద్ద వైఎస్ఆర్ సిపి నేతలు సోమవారం మహాధర్నాకు దిగారు. ధర్నాలో పాల్గొన్న నగరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ను సింగపూర్ చేస్తా..సింగపూర్ చేస్తానంటూ...ఊదరగొడుతున్నారని, సింగపూర్‌లో వ్యవసాయం అనేది లేదని...ఏపీలో కూడా వ్యవసాయం లేకుండా చేయాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తుందన్నారు. మొక్కలోనే వ్యవసాయాన్ని తుంచేయాలనే చందంగా షుగర్ ఫ్యాక్టరీ బకాయిలను ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు వ్యవహరించటం దారుణమన్నారు. పంట భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేవారి పరం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని రోజా మండిపడ్డారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు షుగర్ ఫ్యాక్టరీలను ప్రయివేట్ వ్యక్తుల పరం చేశారని ఆమె ఆరోపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే షుగర్ ఫ్యాక్టరీ బకాయిల నిమిత్తం రూ.300 కోట్లు విడుదల చేశారని రోజా ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతులకు నేను ఉన్నానంటూ వైఎస్ ధైర్యాన్ని ఇచ్చారన్నారు. అలాంటిది చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు వ్యవసాయాన్ని పండుగ చేస్తాను, రుణమాఫీ అంటూ రైతులను అబద్దాల హామీలతో మోసం చేశారన్నారు. రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలభిస్తున్నారని రోజా మండిపడ్డారు. రైతుల నుంచి చెరుకును.. టన్నుకు మూడు వేల చొప్పుల చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. -
పొలం బలం.. ఇలా పదిలం
* భూసారం భర్తీకి ‘నవభారత్’ పరిశోధనలు * చెరకుకు ముందు అపరాల విత్తుల జల్లకం * 45 రోజుల తర్వాత దున్నేస్తే చక్కని ఫలితం సామర్లకోట :‘కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే..’ అన్నాడో కవి. ఎంత బలమైన పొలమైనా.. ఏటా సాగుతో, పంటల్ని పిండుకుంటుంటే.. దాని సారమూ అలాగే తరిగిపోతుంది. మరి.. దాన్ని తిరిగి భర్తీ చేసుకోవాలంటే? దానికీ మార్గాలున్నాయంటోంది దీనిపై పరిశోధనలు చేసిన సామర్లకోటలోని నవభారత్ వెంచర్స్ (చక్కెర ఫ్యాక్టరీ). చెరకు పండించే సమయంలో రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల భూసారం తగ్గిపోతుంటుంది. చెరకును పండించే సమయంలో క్రిమి సంహారక మందులు ఎక్కువగా వినియోగించడమూ భూసారం క్షీణతకు కారణమవుతుంది. పర్యవసానంగా చెరకు దిగుబడీ పడిపోతుంది. దీని నివారణకు పరిశోధనలు చేసిన నవభారత్ అందుకు ఉపాయాలను సూచిస్తోంది. భూసారం పెంచడానికి కందులు, మినుములు, పెసలు, ఆవాలు, మిరియాలు, ధనియాలు, చోళ్లు, జనుము, సజ్జలు, బొబ్బర్లు, మెంతుల వంటివి కలిపి చెరకు పంట వేసే ముందు పొలంలో వెదజల్లాలి. 45 రోజుల తరువాత పెరిగిన మొక్కలను దుక్కి దున్నాలి. దాంతో భూమిలోని సారం పెరుగుతుంది. అప్పటి వరకు ఎకరం చెరకు 30 టన్నుల దిగుబడి వస్తే ఈ విధంగా చేయడం ద్వారా 35 నుంచి 40 టన్నులకు పెరిగే అవకాశం ఉందని నవభారత్ వెంచర్స్ వైస్ చైర్మన్ నాగభైరవ ప్రభాకర్ అన్నారు. అలాగే చెరకు నాటే సమయంలో ఖాళీ ఎక్కువగా ఉంచి నాటడం వల్ల గాలి ఎక్కువగా వేయడానికి అవకాశం ఉండి చెరకు గెడ నాణ్యత పెరుగుతుందని తెలిపారు. చెరకు ముచ్చులను దగ్గర దగ్గరగా వేయడం వల్ల కలుపు పెరిగిపోయే ప్రమాదం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఫ్యాక్టరీ యాజమాన్యం చెరకు నారు మొక్కలను నాట్లుగా రైతులకు అందజేస్తోంది. ఈ కారణం గా రైతులకు 45 రోజుల వ్యవధి తగ్గడమే కాక ఆ మేరకు పెట్టుబడీ తగ్గుతుంది. చెరకు మధ్య ఖాళీ ఎక్కువగా ఉండటం వల్ల అంతర్ పంట లుగా బెండ, వంగ, టమాటా, మిర్చి వంటివి వేసుకోవచ్చు. వాటిని కూడా రైతులకు ఫ్యాక్టరీ యాజమాన్యమే ఉచితంగా అందజేస్తుంది. చెరకు మొక్కలు వేయడానికి లోతుగా దుక్కి దున్నాలని, ఎరువుల వాడకంలో అవగాహన పెంచుకోవాలని ప్రభాకర్ చెప్పారు. తోటకు తక్కువ నీటిని వాడటం ద్వారా చెరకులో నాణ్యతను పెంచుకోవచ్చన్నారు. భూసార పరిరక్షణతో పాటు ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చిన సూచనలు, సలహాలు పాటిస్తే అధిక దిగుబడిని, తద్వారా మెరుగైన రాబడిని పొందవచ్చన్నారు. -
సుగర్స్ చేదుగీతం
చెరకు నీటమునగడంతో రికవరీ తగ్గిపోయే ప్రమాదం క్రషింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం తుఫాన్ దెబ్బనుంచి తేరుకోని మిల్లు యాజమాన్యాలు జిల్లాలోని సహకార చక్కెర మిల్లులు చేదుగీతం ఆలపిస్తున్నాయి. చెరకు గానుగాట అయోమయంలో పడింది. ముందుగానే చేపట్టి లక్ష్యానికి మించి క్రషింగ్ జరపాలన్న వారి ఆశలు గల్లంతయ్యాయి. రికవరీ తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది. హుదూద్ ధాటికి కర్మాగారాల్లోని గోడౌన్లు, మిల్లు హౌస్‌లు ధ్వంసమయ్యాయి. ఆ నష్టం నుంచి ఇప్పటికీ తేరుకోలేకపోతున్నాయి. నీట మునిగిన చెరకును మరో రెండు నెలల వరకు క్రషింగ్ జరపలేని పరిస్థితి. ఇవన్నీ యాజమాన్యాలకు పెనుభారం కానున్నాయి. చోడవరం: సహకార చక్కెర ఫ్యాక్టరీల క్రషింగ్ పరిస్థితి అయోమయంలోపడింది. గడిచిన పదేళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది జిల్లాలో చెరకు విస్తీర్ణం భాగా పెరిగిందని మురిసిపోయినప్పటికీ.. అంతలోనే తీవ్ర నిరాశ మిగిలింది.పెరిగిన పంట విస్తీర్ణంతో ఈ సారి ఇటు పంచదార, అటు బెల్లం దిగుబడి బాగా పెరుగుతుందని అంతా ఆశించారు. జిల్లాలోని చోడవరం, ఏటికొప్పాక, తాండవ ఫ్యాక్టరీలు ఈసీజన్లో 11ల క్షల టన్నులకు మించి క్రషింగ్ చేయగలమని ధీమా వ్యక్తం చేశాయి. ఒక్క గోవాడ ఫ్యాక్టరీయే గతేడాది 5.48లక్షల టన్నుల క్రషింగ్ చేపట్టింది. ఈ ఏడాది పెరిగిన చెరకు విస్తీర్ణం దృష్ట్యా 6లక్షల టన్నుల వరకు క్రషింగ్ చేయగలమని ధీమాను వ్యక్తం చేసింది. ఇందు కోసం ముందుగానే క్రషింగ్ ప్రా రంభించాలని నిర్ణయించింది. గోవాడ ఈ నేల 15వ తేదీ నుంచి మిగతా ఫ్యాక్టరీలు కూడా డిసెంబరు ఆరంభంలోనే గానుగాటకు సిద్ధమయ్యాయి. ఇందుకు ఎంతో ఉత్సాహంగా ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇంతలో హుదూద్ ఫ్యాక్టరీలకు పెద్ద నష్టాన్ని చేకూర్చింది. తుఫాన్ తాకిడి ఇటు ఫ్యాక్టరీల్లో ఉన్న గోడౌన్లు, మిల్లు హౌస్‌లు ధ్వంసమయ్యాయి. అటు చెరకు పంట ఘోరంగా దెబ్బతింది. ఇది మిల్లుల యాజమాన్యాలకు కోలుకోలేని పరిణామం. అత్యధికంగా చెరకు పండించే చోడవరం, మాడుగుల, యలమంచిలి, అనకాపల్లి, పాయకరావుపేట నియోజకవర్గాల్లోనే తుపాన్ తీవ్రతో చెరకు తోటలు పెద్ద విస్తీర్ణంలో నేలమట్టమయ్యాయి. గోవాడ ఫ్యాక్టరీ వాస్తవానికి మరో 13రోజులుల్లో గానుగాట ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం పక్వానికి వచ్చిన 2లక్షల టన్నుల చెరకు కటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. తుఫాన్‌కు ఆయా తోటలన్నీ నేలకొరిగి నీరుపట్టాయి. దీంతో రికవరీ పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉంది. జడచుట్టు దశలో ఉన్న వేలాది ఎకరాల్లో తోటలు నీటమునిగి, నేలమట్టమవ్వడంతో చెరకు గెడ ఎదుగుదల తగ్గిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే పరిస్థితి జిల్లాలోని మిగతా మూడు ఫ్యాక్టరీల పరిధిలోనూ నెలకొంది. తాండవకు కొంతమేర ఫర్వాలేకపోయినా ఏటికొప్పాకకు కూడా దెబ్బతిన్న చెరకు పంటతో తీవ్ర నష్టమే పొంచివుంది. మరో పక్క తుఫాన్‌కు దెబ్బతిన్న మిల్లుహౌస్. గోడౌన్లను మునుపటి స్థితికి తెచ్చుకోవడం యాజమాన్యాలకు తలకు మించిన భారమవుతుంది. దెబ్బతిన్న మిషనరీ, పంచదారకు ఇన్సూరెన్సు కోసం ఆయా కర్మాగారాల అధికారులు నానా తంటాలు పడుతున్నారు. వీలైనంత తొందరగా మరమ్మతులు చేపట్టేందుకు యత్నిస్తున్నారు. ఆగమేఘాలమీద వీటన్నింటిని చేపట్టినా పూర్తికావడానికి కనీసం రెండు నెలలైనా పడుతుంది. ప్రస్తుతం చెరకు తోటల్లో నీరున్నందున క్రషింగ్‌ను కొంత ఆలస్యం చేస్తే తప్పా రికవరీ వచ్చే అవకాశం లేదని కూడా యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో డిసెంబరు 20 తర్వాతే గోవాడ, మిగతా ఫ్యాక్టరీల క్రషింగ్ ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక వేళ క్రషింగ్ మరింత ఆలస్యమైతే పక్వానికి వచ్చి నేలకొరిగిన చెరకు తోటల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇన్ని అవాంతరాల మధ్య ఈ ఏడాది క్రషింగ్ ఫ్యాక్టరీలకు పెనుభారం కానుంది. -
షుగర్ ఫ్యాక్టరీలను అమ్మేయడం వీళ్లకు మామూలే: వైఎస్ జగన్
సహకార రంగంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలను నష్టాల్లోకి తీసేసి.. వాటిని సొంత మనుషులకు అమ్మేయడం ఈ ప్రభుత్వానికి మామూలేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. హుదూద్ తుఫాను బారిన పడిన విశాఖపట్నంలోని తుమ్మపాల ప్రాంతాన్ని ఆయన శనివారం సందర్శించి, అక్కడి వారిని పరామర్శించారు. తుఫాను సాయం ఎలా అందుతోందో వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి చెరుకు రైతులు తమ గోడును వైఎస్ జగన్ వద్ద వెళ్లబోసుకున్నారు. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ రైతులకు 6 కోట్ల రూపాయలు బకాయి పడితే ఇప్పటికి కేవలం 3 కోట్లే ఇచ్చారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏడు నెలల నుంచి కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నారని, ఇప్పుడు ఈ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో కూడా 4 కోట్ల రూపాయలకు ఈ ఫ్యాక్టరీని అమ్మేయడానికి ప్రయత్నాలు చేయగా, అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారని ఆయన గుర్తుచేశారు. -
క్రషింగ్‌కు సిద్ధమవుతున్న ఎన్సీఎస్
బొబ్బిలి : చెరకు రైతుల అనుమానాలకు అధికారులు తెరదించారు. లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం పరిధిలో ఉన్న వేలాది ఎకరాల చెరకును అదే ఫ్యాక్టరీలో క్రషింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుల కష్ట, నష్టాలు, ఇబ్బందులను గుర్తించిన అధికారులు స్వీయ పర్యవేక్షణలో ఈ ఏడాది క్రషింగ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు చెరకు అభివృద్ధి మండలి అధికారులు, ఉద్యోగులు దగ్గరుండి మిల్లు అయిలింగ్ పనులను చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ యాజ మాన్యం మూడేళ్లగా బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం, ఈ ఏడాది జనవరి నుంచి బిల్లులు చెల్లింపు పూర్తిగా నిలిపి చేయడంతో ఏపీ చెరకు రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన సంగతి విధితమే. రైతులతో పాటు, బ్యాంకులు, కార్మికులు, కూలీలకు దాదాపు రూ.50 కోట్ల వరకూ యాజమాన్యం చెల్లించవలసి ఉంది. ఆర్ఆర్ యాక్టు ప్రకారం ఎన్సీఎస్ ఆస్తులను వేలంవేయడానికి కూడా రెవెన్యూ శాఖ సిద్ధమైంది. ఫ్యాక్టరీ ఎండీ., డైరక్టర్లును పోలీసులు అరె స్టు చేశారు. దాదాపు 20రోజుల తరువాత వారు బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈఫ్యాక్టరీలో క్రషింగ్ జరిగే పరిస్థితి కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. వేలాది ఎకరాల్లో చెరుకు పండించామని ఇప్పుడు తమగతేంకానని వా పోరారు. దీంతో అధికారులు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు వైపు దృష్టి సారించారు. జిల్లాలో బీమసింగి వద్ద సహకార రంగంలో నడుస్తున్న చక్కెర కర్మాగారంలో లచ్చయ్యపేట పరిధిలోని రైతులు సంబంధించిన చెరకును రోజుకు రెండు వందల టన్నులు ఆడేవిధంగా ఏర్పాట్లు చేశారు. అయితే దీనివల్ల రవాణా ఖర్చు పెరగడంతో పాటు చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులు మరీ అధికమవుతాయని భావించిన అధికారులు లచ్చయ్యపేట ఫ్యాక్టరీ ద్వారా ఈ ఏడాది చెరుకును క్రషింగ్ చేయించాలని నిర్ణయించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా ఈ ఏడాది చెరుకును క్రషింగ్ చేయడానికి సుముఖత వ్యక్తంచేస్తూ ఈ నెల 3న అధికారులకు లేఖ పంపింది. దీంతో చెరకు అభివృద్ధి మండలి అధికారులు దగ్గరుండి ఆయిలింగ్ పనులు చేయిస్తున్నారు. ఫ్యాక్టరీలో కొన్ని ప్రధానమైన భాగాలు పాడైతే వాటిని ఇతర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. ఈ ఆయిలింగ్ పనులకు దాదాపు కోటీ 25 లక్షల రూపాయల వరకూ ఖర్చు కానుంది. ఎండీ, డైరక్టర్లు బెయిల్‌పై బయటకు వచ్చేశారు కాబట్టి ఫ్యాక్టరీని క్రషింగు చేయడానికి, ఇతర విషయాలపై ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఈఏడాది క్రషింగ్‌కు చెరుకు తీసుకువచ్చిన వారికి బిల్లులు వెంట వెంటనే చెల్లించే విధంగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ పరిధిలో 17 మండలాలకు చెందిన దాదాపు 16 వేల మంది రైతులు 6వేల 900 హెక్టార్లలో చెరకు పంటను వేశారు. దాని ద్వారా సుమారు 3 లక్షల 61 వేల టన్నుల దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం రోజుకు 4 వేల నుంచి 4200 టన్నుల వరకూ క్రషింగును చేస్తుంది. -
నేడు ‘తాండవ’ మహాజనసభ
పాయకరావుపేట : తాండవ చక్కెర కర్మాగారం 2014-15 క్రషింగ్ సీజన్ నవంబర్ మూడో వారంలో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా శుక్రవారం ఫ్యాక్టరీ మహాజన సభ జరగనుంది. ఈ కర్మాగారం 2013-14 సీజన్లో 1,78,361 టన్నులు చెరకు క్రషింగ్ చేసి 1,74,985 బస్తాల పంచదార దిగుబడి సాధించింది. 9.9 రికవరీతో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో 2 లక్షల టన్నుల చెరకు క్రషింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చెరకు సాగు ప్రోత్సహించేందుకు 5,870 మందిై రెతులకు రూ.1.73 కోట్ల విలువ చేసే చెరకు విత్తనం, రూ.1.70 కోట్ల యూరియా, 2,500 టన్నుల సూఫర్ ఫాస్పేట్, పొటాష్లను వడ్డీ లేని అప్పు కింద సరఫరా చేశారు. 2,415 ఎకరాల్లో ఉడుపు,7478 ఎకరాల్లో కార్శితోటల్లో 2.4 లక్షల టన్నుల చెరకు సరఫరా చేసేందుకు రైతులతో ఫ్యాక్టరీ అధికారులు అగ్రిమెంట్లు తీసుకుంటున్నారు. మూడు నెలల క్రితం చేపట్టిన ఓవర్ హాలింగ్ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. గత సీజనులో క్రషింగ్‌కు అంతరాయం ఏర్పడిన మిల్లులో లోపాలు సరిచేశారు. ప్రస్తుతం ఫ్యాక్టరీలో 90 వేల బస్తాల పంచదార నిల్వలు ఉన్నాయి. చెరకుకు ధర లభించక తాండవ సుగర్స్ రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పెరిగిన పెట్టుబడులకనుగుణంగా గిట్టుబాటు ధర లేకపోతే భవిష్యత్తులో చెరకు సాగు సాధ్యం కాదని అంటున్నారు. గత ఏడాది ఫ్యాక్టరీ యాజమాన్యం టన్నుకు రూ.1870లు ఇవ్వగా ప్రభుత్వం రూ.160లు ప్రోత్సాహం ప్రకటించింది. దీంతో టన్నుకు రూ.2030 గిట్టుబాటు కల్పించారు. రైతులకు రూ.7.90 కోట్లు చెల్లింపులు చేశారు. జిల్లాలో ఏటికొప్పాక, చోడవరం ఫ్యాక్టరీల్లో టన్నుకు రూ.2200 నుంచి 2400 వరకూ మధ్దతు ధర చెల్లిస్తున్నారు. ‘తాండవ’ యాజమాన్యం కూడా అదే ధర చెల్లించాలని రైతులు కోరుతున్నారు. రెండేళ్ల తరువాత మహాజన సభ.. ఏటా క్రషింగ్ ప్రారంభానికి రెండు నెలల ముందు మహాజనసభ నిర్వహించడం ఆనవాయితీ. ఫ్యాక్టరీకి పాలకవర్గం లేక రెండేళ్లుగా రైతు మహాజన సభ నిర్వహించలేదు. కొత్త పాలకవర్గం పగ్గాలు చేపట్టడంతో ఈ నెల 26న మధ్యాహ్నం మూడు గంటలకు రైతు మహాజన సభ జరగనుంది. ఇందులో టన్నుకు ఎంత ధర ప్రకటిస్తారోనని రైతులు ఎదురు చూస్తున్నారు. -
చక్కెర ఫ్యాక్టరీల గొంతులోచేదు గుళిక
ధర, విక్రయాలు లేక చక్కెర పరిశ్రమలు దిగాలు భారీగా పేరుకుపోయిన పంచదార నిల్వలు మార్కెట్లో దిగుమతులే కారణం గతేడాది పంచదార ఉత్పత్తి ఆశాజనకంగా వచ్చింది. అయితే ధర లేదు. డిమాండ్ అంతకన్నా లేదు. ఫలితం విక్రయాలు నిలిచిపోయాయి. లక్షలాది పంచదార బస్తాలు గోడౌన్లలో మూలుగుతున్నాయి. జిల్లాలోని సుగర్ ఫ్యాక్టరీల పరిస్థితి ఇది. చోడవరం : ఓవైపు పంచదారకు ధర లేక.. మరోవైపు విక్రయాలు జరగక చక్కెర కర్మాగారాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. లక్షలాది బస్తాల పంచదార నిల్వలు గోడౌన్లలో మూలుగుతున్నాయి. జిల్లా చోడవరం, ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి సుగర్ ఫ్యాక్టరీల్లోనూ ఇదే పరిస్థితి. గత ఏడాది పంచదారపై లెవీ ఎత్తేయడంతో ప్యాక్టరీలు ఆర్థికంగా బాగుపడతాయని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా పంచదార ధర ఘోరంగా పడిపోయింది. గత ఏడాది మొదట్లో క్వింటాలు రూ. 3300వరకు విక్రయించగా, తర్వాత క్రమేణా ధర తగ్గుకుంటూ వచ్చింది. ఒక దశలో క్వింటాలు రూ.2600కు పడిపోయింది. ఈ ఏడాది సీజన్ మొదట్లో అయినా ఈ ధర పెరుగుతుందని భావించినా ఆశించినమేర పెరగలేదు. జులై, ఆగస్టు నెలల్లో మాత్రం క్వింటా రూ. 3100కు వెళ్లినప్పటికీ, పరిస్థితి తారుమారై ప్రస్తుతం రూ. 2900 వద్దే ఉంది. కనీసం ఈ ధరకైనా విక్రయించాలని ఫ్యాక్టరీ అనుకున్నా మార్కెట్లో డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. ఇదీ కారణం! ఇతర రాష్ట్రాల నుంచి పంచదార దిగుమతి అవుతుండడమే ఇందుకు కారణంగా ఫ్యాక్టరీ యాజమాన్యాలు భావిస్తున్నాయి. దీనికి తోడు వ్యాపారులు సిండికేట్ అయిపోవడం వల్ల కూడా ధర పెరగడం లేదనే వాదన వినిపిస్తోంది. జిల్లాలో చక్కెర కొనుగోలుకు ఎప్పట్నుంచో ఉంటున్న ‘ఆ ముగ్గురే’ తప్ప, మరెవ్వరూ రాకపోవడం కూడా ధర పెరగడానికి, అమ్మకాలకు విఘాతం కలుగుతున్నట్టుగా తెలుస్తోంది. ధర తగ్గినప్పుడు తప్ప ధర పెరిగినప్పుడు బయ్యర్లు ముందుకు రావడం లేదు. దీనివల్ల గత నెలరోజులుగా జిల్లాలో అన్ని ఫ్యాక్టరీల్లోనూ పంచదార విక్రయాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం రూ.2900 ధరకైనా కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో అన్ని ఫ్యాక్టరీల్లోనూ లక్షలాది క్వింటాళ్ల పంచదార నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. ‘గోవాడ’కు అద్దెభారం... పాత యంత్రాలైనప్పటికీ ఆపసోపాలు పడి క్రషింగ్ చేయగా, తీరా నిల్వలు పేరుకుపోవడంతో ఫ్యాక్టరీలు దిక్కుతోచని స్థితిలో గిలగిలా కొట్టుకుంటున్నాయి. గోవాడ ఫ్యాక్టరీ అయితే పంచదార నిల్వలకు అదనంగా ప్రైవేటు గోడౌన్లను అద్దెకు కూడా తీసుకుంది. ఈ పరిస్థితుల్లో అద్దె అదనపు భారంగా మారింది. వచ్చేది పండగల సీజన్ కావడంతో ధర, డిమాండ్ కూడా పెరగొచ్చని గోవాడ ఫ్యాక్టరీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు, మేనేజింగ్ డెరైక్టర్ వి.వి.రమణారావు ఆశాభావం వ్యక్తం చేశారు. -
చెరకు రైతుల గోడు
- కోట్లాది రూపాయల బకాయిలు చెల్లించని ఫ్యాక్టరీలు - కాళ్లరిగేలా తిరుగుతున్న రైతులు - పట్టించుకోని అధికారులు సాక్షి, నెల్లూరు : ఆరుగాలం కష్టపడి చెరకు పండించిన రైతులకు షుగర్ ఫ్యాక్టరీల యాజమాన్యాల ైవె ఖరి శాపంగా మారింది. పంటను ఫ్యాక్టరీకి తరలించి రెండేళ్లు గడుస్తున్నా ఇంకా బకాయిలు చెల్లించకపోవడంతో అప్పులపాలయ్యారు. తమకు రావల్సిన మొత్తాన్ని చెల్లించాలని కోరుతూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం కరువవుతోంది. ఫ్యాక్టరీల యాజమాన్యాలతో పాటు అధికారులకు కూడా రైతుల కష్టాలు పట్టడం లేదు. న్యాయం చేస్తామని సాక్షాత్తు కలెక్టర్ ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదు. కోవూరు ఫ్యాక్టరీ పరిధిలో పాతబకాయిలు కొంత మాత్రమే చెల్లించి మిగిలినవి పెండింగ్‌లో పెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొదలకూరు మండలం ప్రభగిరిపట్నంలోని ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో 2012-13కి సంబంధించి రైతులకు రూ.12.90 కోట్లు రావాలి. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో రైతులు రెండేళ్లుగా ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాకు చెందిన రైతులే కాక వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన రైతులకు కూడా బకాయిలు చెల్లించాలి. వీరు పలుమార్లు కలెక్టర్ శ్రీకాంత్‌ను కలిసినా ఫలితం కరువైంది. ఈ ఫ్యాక్టరీపై గతంలో అధికారులు ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగించి రూ.25 లక్షల మేర రికవరీ చేశారు. గత ఏడాది రైతులే యూనియన్‌గా ఏర్పడి ఫ్యాక్టరీని నడిపించారు. పాత బకాయిలు చెల్లించినా 2012-13కి సంబంధించిన బకాయిలు మాత్రం అలాగే పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఫ్యాక్టరీ యాజమాన్యం కోర్టును ఆశ్రయించడంతో స్టే కొనసాగుతోంది. సెప్టెంబర్ నెలాఖరుకు రూ.2 కోట్లు డిపాజిట్ చేయాలని కోర్టు ఇది వరకే ఆదేశించింది. అయితే ఈ కేసు ఎప్పటికి పూర్తయి, తమకు ఎప్పుడు నగదు అందుతుందోనని రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. నాయుడుపేటలోని ఎంపీ షుగ ర్స్ 2013-14 సంబంధించి రైతులకు రూ.9.59 కోట్ల బకాయిలు చెల్లిం చాలి. వీటి కోసం రైతులు ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతున్నా యాజమాన్యం నుంచి స్పందన కరువైంది. కోవూరు సహకార చక్కెర కర్మాగారానిది ఇదే పరిస్థితి. రెండేళ్లుగా రైతులకు రూ.7 కోట్లకు పైగా చెల్లించాలి. బకాయిలు చెల్లించాలంటూ రైతులు ఫ్యాక్టరీతో పాటు కలెక్టరేట్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అయినా ప్రభుత్వం కనికరించకపోవడంతో గత ఏడాది ఫ్యాక్టరీలో క్రషింగ్ నిలిపేశారు. బకాయిలకోసం రైతులు పదేపదే ఆందోళనలకు దిగడంతో ఎట్టకేలకు ప్రభుత్వం టన్నుకు రూ.1,760 వంతున 89 వేల టన్నులకు సంబంధించి రూ.6 కోట్లు చెల్లించింది. అంతకు ముందు ఏడాది టన్నుకు రూ. 2,150 చెల్లించి, తర్వాత సంవత్సరం కేవలం రూ.1,760 చెల్లించడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం టన్నుకు రూ.1,960 చొప్పున చెల్లించాలని ప్రతిపాదనలు పంపారు. ఈ లెక్కన అయినా ఇంకా రూ.1.70 కోట్లు రైతులకు చెల్లించాలి. ఇవి ఎప్పటికి వస్తాయో చెప్పలేని పరిస్థితి. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
చక్కెర కర్మాగారాన్ని తిరిగి తెరిపించాలి
హైదరాబాద్ : వైఎస్ఆర్ జిల్లా చెన్నూరు మండలంలోని సహకార చక్కెర కర్మాగారాన్ని తిరిగి తెరిపించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి సోమవారం అసెంబ్లీలో కోరారు. కేసీ కెనాల్ పరివాహక ప్రాంతంలో 13 మండలాల రైతులు ఈ ఫ్యాక్టరీపైనే ఆధారపడి ఉన్నారన్నారు. చక్కెర కర్మాగారం ఉద్యోగులకు మూడేళ్లుగా జీతాలు కూడా చెల్లించటం లేదని, వారు దుర్భర పరిస్థితిలో ఉన్నారని రవీంద్రనాథ్ రెడ్డి సభ దృష్టికి తీసుకు వచ్చారు. ఇప్పటికైనా తక్షణం రైతులను ఆదుకోవాలంటూ ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
బాబు పర్యటనతో ఒరిగిందేమీ లేదు
అనకాపల్లి : జిల్లాలో ఇటీవల రెండ్రోజుల పాటు జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కేవలం టీడీపీ రోడ్‌షో మాదిరిగా సాగిందని, దీనివల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని అనకాపల్లి నియోజక వర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్చార్జ్ కొణతాల రఘునాథ్ విమర్శించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ సీఎం పర్యటన ప్రజా సమస్యలపై సమీక్ష జరిపినట్లు లేదని, ఆ పార్టీ సొంత కార్యక్రమంలా సాగిందని ధ్వజమెత్తారు. జిల్లా అభివృద్ధికి నిధులు మంజూరు చేయకుండా తిరిగి వెళ్లిన ఘనత చంద్రబాబుదేనన్నారు. తుమ్మపాల చక్కెర కర్మాగారానికి నిధులు కుమ్మరిస్తారని హడావుడి చేశాక, ఇప్పుడు మూడు నెలల పాటు నిపుణులతో కమిటీ వేసి, ఆ నివేదిక మేరకు న్యాయం చేస్తానని చెప్పడం ఎంత వరకూ సమంజసమని రఘునాథ్ ప్రశ్నించారు. తుమ్మపాల సుగర్స్‌లో చెరకు రైతుల బకాయిలు, ఉద్యోగుల జీతాల బకాయిలపై ఒక్క మాట కూడా మాట్లాడని సీఎం పర్యటన వల్ల ఏం న్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వందేళ్లు నిండిన ఉత్తర కోస్తా మండలి వ్యవసాయ పరిశోధనా స్థానం వేడుకలకూ నిధులు మంజూరు చేయకుండా వట్టి చేతులతో వెళ్లిపోయిన సీఎం చంద్రబాబేనని ఎద్దేవా చేశారు. గ్రామీణ ప్రాంతంలోని విద్యుత్ వినియోగదారుల మన్ననలు పొందిన కశింకోట ఆర్‌ఈసీఎస్‌ను రద్దు చేస్తానని చెప్పడం బాబు మార్కు పాలనకు నిదర్శనమని, అయినా అదేమీ నామినేటెడ్ పాలకవర్గం కాదన్న విషయం సీఎంకు తెలియకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. కష్టాల్లో కూరుకుపోయిన రైతులకు భరోసా ఇవ్వకుండా, చిర్రుబుర్రులాడుతూ రాజకీయ కక్షసాధింపు రీతిలో సాగిన చంద్రబాబు పర్యటన వల్ల అధికారుల విలువైన సమయం, లక్షలాది రూపాయిలు వృథా అయ్యాయని రఘునాథ్ మండిపడ్డారు. -
చేదెక్కిన ‘చక్కెర’ బతుకులు
9 నెలలుగా వేతనాల్లేక అల్లాడుతున్న ఉద్యోగులు 400మంది ఉద్యోగులకు రూ.3.5కోట్ల బకాయిలు గతేడాది రైతులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.9.87కోట్లు {పైవేటు ఫ్యాక్టరీలకు చెరుకు తరలిస్తున్న రైతులు ఈసారి ఇంకా ఉద్యోగులను రీకాల్ చేయని వైనం నేడు చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీ పాలకమండలి సమావేశం సాక్షి, చిత్తూరు: ‘‘సూర్యప్రకాష్(పేరు మార్చాం) చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీలో ఉద్యోగి. ఈయనకు 9 నెలలుగా జీతం ఇవ్వలేదు. ఇతనికి ముగ్గురు పిల్లలు. జూన్, జూలైలో పిల్లల చదువుకోసం ఫీజులు, దుస్తులు, పుస్తకాల కోసం 40వేల రూపాయలు ఖర్చయ్యూరుు. జూన్‌లో 50వేల రూపాయలు అప్పు చేశాడు. ప్రతి నెలా ఇంటి బాడుగ, ఇతర ఖర్చులు కలిపి 10వేల రూపాయల వరకూ ఖర్చు వస్తోంది. జూన్‌లో చేసిన అప్పుతో కలిపి 1.7లక్షల రూపాయల అప్పులు తేలారుు. ఎవరినైనా అప్పు అడగాలన్నా అడగలేని పరిస్థితి. పేరుకు ‘చక్కెర ఫ్యాక్టరీ’లో ఉద్యోగం అనే మాటే కానీ...ప్రకాష్...ఆయన భార్యాపిల్లలు ఆర్థికంగా తీవ్ర వేదనపడుతున్నారు.’’ ఈ ఫొటోలోని రైతుపేరు సురే ష్ బాబు. కార్వేటినగరం ఎం.ఎం విలాసం వాసి. గతేడాది 3ఎకరాల్లో చెరుకు సాగు చేశాడు. అప్పటికే 2012కు సంబంధించి 40వేల రూపాయల బకాయిలు ఉన్నాయి. అయినా గతేడాది చెరుకును ఫ్యాక్టరీకి తోలాడు. ఇప్పటికీ రెండేళ్లకు సంబంధించి 90వేల రూపాయల బకాయిలు రావాలి. పంట పెట్టుబడికి చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి. గతేడాది పంటసాగుకు ఇంట్లోని బంగారు తాకట్టుపెట్టాడు. ఈ ఏడాది ఇద్దరు పిల్లల చదువుకు మళ్లీ అప్పు చేశాడు. పూర్తిగా కష్టాల ఊబిలో కూరుకుపోయాడు. దీనంతటికీ కారణం పంట దిగుబడి ఇంటికి రాకపోవడమే ! సూర్యప్రకాష్ కుటుంబంలాగే చిత్తూరు సహకార చక్కెర కర్మాగారంలోని 400మంది ఉద్యోగులు వేదనపడుతున్నారు. నగరి, పుత్తూరు, కార్వేటి నగరంతో పాటు పలు మండలాల్లోని వందలాది మంది రైతులు అవస్థలు పడుతున్నారు. అయినప్పటికీ ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం స్పందించదు. ఇదేంటి ? అని ప్రశ్నిస్తే గతంలో నష్టాలు వచ్చాయి ? అవి అలాగే కొనసాగుతున్నాయి ? అనే చెబుతున్నారు. ఉద్యోగుల బకాయిలు రూ.3.5 కోట్లు ఫ్యాక్టరీలో 400మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 120మంది పర్మినెంట్ ఉద్యోగులు. తక్కినవారు కన్సాలిడేటెడ్ ఉద్యోగులు. వీరందరికీ గతేడాది నవంబర్ నుంచి వేతనాలు ఇవ్వలేదు. దీంతో ఉద్యోగులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 400మందిలో అప్పులేని ఉద్యోగి లేరని తోటి ఉద్యోగులు చెబుతుంటే... వారి జీవనం ఎంత కష్టంగా సాగుతుందో తెలుస్తుంది. కష్టాలు పడుతున్నవారు పత్రికలకు అభిప్రాయాలు ఇచ్చేందుకు కూడా జంకుతున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే..‘లేనిపోని కారణాలతో యాజమాన్యం వేధిస్తుంది’ అంటున్నారు. ఇప్పటి వరకూ ఉద్యోగుల రీకాల్ లేదు ఏటా జూన్‌లో ఉద్యోగుల రీకాల్ జరిగేది. ఈ ఏడాది ఆగస్టు గడుస్తున్నా కన్సాలిడేటెడ్ ఉద్యోగులను రీకాల్ చేయలేదు. అక్టోబర్, నవంబర్ నుంచి సీజన్ మొదలవుతుంది. నవంబర్-ఫిబ్రవరిలో 600మంది ఉద్యోగులు ఫ్యాక్టరీలో పనిచేస్తారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ రీకాల్‌పై ప్రకటన లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి చెరుకుసాగు తక్కువే.. 2012-13లో 1.05 లక్షల టన్నుల చెరుకు ఫ్యాక్టరీకి చేరింది. క్వింటాలు 1800 రూపాయలతో యాజమాన్యం డబ్బులు చెల్లించాలి. కొందరికి, కొద్దిమేర మాత్రమే డబ్బు చెల్లించారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం 3.4 కోట్లు ఫ్రీలోన్ ఇచ్చినా బకాయిలు చెల్లించలేకపోయారు. 2013-14లో రైతులు 47వేల టన్నుల చెరుకు ఫ్యాక్టరీకి తోలారు. దీనికిగాను టన్నుకు రూ.2100చొప్పున 9.87కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం 50వేల టన్నుల చెరుకు పంటకు ఫ్యాక్టరీ రైతులతో అగ్రిమెంట్లు చేసుకుంది. అయితే పాత బకాయిలు చెల్లించకపోతే చెరుకును రైతులు మరో ఫ్యాక్టరీకి తరలించేందుకు వెసులుబాటు ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే కొందరు రైతులు ఎస్ఆర్ పురం మండలం నెళవాయిలోని ‘సాగర్ షుగర్స్’కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఫ్యాక్టరీ పాలకమండలి సమావేశం జరగనుంది. ఇటీవల రామకృష్ణ నేతృత్వంలో కొత్త పాలకవర్గం కొలువుదీరింది. ఉద్యోగుల జీతాలతో పాటు రైతుల బకాయిలు చెల్లించాల్సిన అనివార్య పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగులు, రైతులకు దాదాపు 13 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడం యాజమాన్యానికి ఇబ్బందే! ఈ క్రమంలో ప్రభుత్వం ఆదుకుని ఫ్యాక్టరీని గట్టేక్కించాల్సి ఉంది. బకాయిలు ఉన్నాయి....నేనూ కొత్తగా వచ్చాను ఉద్యోగులు, రైతులకు బకాయిలు ఉన్నాయి. ఎందుకు ఈ పరిస్థితి తలెత్తిందనేది నాకు కూడా పూర్తిగా తెలియదు. కొత్తగా బాధ్యతలు తీసుకున్నాను. సోమవారం జరిగే పాలకమండలి సమావేశం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తా! -మల్లికార్జునరెడ్డి, ఎండీ నెళవాయికి చెరుకు తోలుతున్నా సార్! ఐదెకరాల్లో చెరుకుసాగు చేశా ! నాకు చిత్తూరు ఫ్యాక్టరీ వాళ్లు 25వేల రూపాయల బకాయిలు ఇవ్వాల.! మేమే అప్పు చేసి పంటసాగు చేస్తే.. మా పంట తీసుకుని మాకు అప్పు పెడితే ఎట్టా. అందుకే నెళవాయి ఫ్యాక్టరీకి చెరుకు తరలిస్తుండా! -దేశయ్య, పాదిరికుప్పం, కార్వేటినగరం -
రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలి
తెర్లాం రూరల్:టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎప్పటిలో గా పూర్తి చేస్తారన్న దానిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సి ఉందని వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. శనివారం ఆయన తెర్లాం మండలంలోని కుసుమూరులో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీపై మాయ మాటలు చెప్పి రైతులు, మహిళలను మో సం చేస్తున్నారన్నారు. ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ వర్తింపజేయకపోవడంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదని చెప్పారు. దీంతో రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేయూల్సి వస్తోందన్నారు. బ్యాంకులు గతంలో మహిళలకు పిలిచి రుణాలిచ్చేవ ని, ప్రస్తుతం రుణమాఫీ అనడంతో బ్యాంకులు మహిళలకు అప్పులు ఇవ్వడం మానేశాయని తెలిపారు. రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో మంజూరు చేసిన ఇళ్లపై దర్యాప్తు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు దాని గురించి పట్టించుకోవడం లేదన్నారు. పింఛన్ల పెంపుపై కూడా ప్రభుత్వానికి స్పష్టత లేదని చెప్పారు. బొబ్బిలి నియోజకవర్గం పరిధిలోని ఎన్సీఎస్ సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు కోట్లాది రూపాయలు బకాయి చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు పూర్తిస్థాయిలో చెల్లింపులు జరపలేదన్నారు. తక్షణమే ప్రభుత్వం ఎన్సీఎస్ యాజ మాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అక్షయ గోల్డ్ ఆస్తులను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకుని వాటిలో అమ్మకాలతో వచ్చిన సొమ్మును బాధితులకు ఇవ్వాలన్నారు. వీటన్నింటిపై అసెం బ్లీలో ప్రస్తావిస్తానన్నారు. అలాగే నియోజకవర్గం లోని కుసుమూరు-వంతరాం, నంది గాం-కుసుమూరు రోడ్డు పనులకు నిధుల మంజూరు విషయమై కలెక్టర్‌తో మాట్లాడుతానని చెప్పారు. ఆయనతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు నర్సుపల్లి వెంకటేశ్వరరావు, తెంటు సత్యంనాయుడు, గులివిందల శ్రీనివాసరావు ఉన్నారు. ఎందుకింత నిర్లక్ష్యం..? నందిగాం (తెర్లాం రూరల్): మూడేళ్ల క్రితం వచ్చిన తుపానుకు పాడైన రోడ్డు, కల్వర్టుకు ఇంతవరకు మరమ్మతులు చేయకపోతే ఎలా అని బొ బ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు అధికారులను ప్రశ్నించారు. శని వారం ఆయన నంది గాం-కుసుమూరు రోడ్డులో నీలం తుపానుకు కోరుకుపోయిన కల్వర్టు, కోతకు గురైన రోడ్డును పరి శీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఎందుకు మరమ్మతులు చేయలేదని పీఆర్ డీఈఈ కృష్ణాజీని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఆయ న మూడేళ్లుగా కల్వర్టు, రోడ్డు పనులు చేపట్టేందుకు నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపిస్తున్నామని, కానీ నిధులు మంజూరు కాకపోవడంతో పనులు చేపట్టలేకపోతున్నామని చెప్పారు. సందర్భంగా మాజీ జెడ్పీటీసీ తెంటు సత్యంనాయుడు కల్వర్టు, రోడ్డు లేకపోవడంతో రైతులు, స్థానికులు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే, అధికారులకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఏడాదైనా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని డీఈఈని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నందిగాం సర్పంచ్ ఆర్నిపల్లి సత్య ంనాయుడు, పీఆర్ ఏఈ ఆదిమూర్తి, డీఈఈ తవిటిరాజు, మండల ఇంజనీరింగ్ అధికారి రామనాధం, తదితరులు పాల్గొన్నారు. -
వీధినపడ్డ కేబీడీ షుగర్స్ కార్మికులు
అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా పట్టించుకోని వైనం ఆందోళనలో రైతాంగం ఇరవై రెండు సంవత్సరాలుగా నడుస్తున్న కేబీడీ చక్కెరఫ్యాక్టరీ ఒక్కసారిగా లేఆఫ్ ప్రకటించడంతో ఇటు కార్మికులు, అటు రైతులు అయోమయంలో పడ్డారు. చక్కెర ఫ్యాక్టరీ చైర్మన్‌గా ఉన్న దివంగత డీకే.ఆదికేశవులునాయుడు సతీమణి డీకే.సత్యప్రభ ప్రస్తుతం చిత్తూరు ఎమ్మెల్యేగా అధికార టీడీపీ తరపున గెలుపొందారు. అధికార పార్టీలో ఉండి కూడా కార్మికులు, రైతుల సమస్యలను పరిష్కరించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పుంగనూరు: పుంగనూరు మండలం ముడిబాపనపల్లె వద్ద ఉన్న కేబీడీ చక్కెర ఫ్యాక్టరీని 1992లో మాజీ ప్రధాని పివి.నరసింహారావు కుటుంబీకులు శ్రీవాణి షుగర్స్ పేరుతో నిర్మించారు. రెండేళ్ల పాటు ఫ్యాక్టరీని నడిపారు. నష్టాలు రావడంతో 1994లో ప్రముఖ పారి శ్రామికవేత్త, దివంగత ఆదికేశవులునాయుడుకు విక్రయించారు. జిల్లాతో పాటు పుంగనూరు ప్రజలతో ఉన్న సంబంధాలతో ఆదికేశవుల నాయుడు ఫ్యాక్టరీలో నష్టాలు వచ్చినా కార్మికులు, రైతుల కోసం నడుపుతూ వచ్చారు. గత సంవత్సరం ఆయన మృతి చెందడంతో ఫ్యాక్టరీ నిర్వహణ కష్టతరంగా మారింది. నష్టాలను భరించలేని స్థితిలో ఫ్యాక్టరీని మూసివేసి, లేఆఫ్ ప్రకటించేందుకు డికె కుటుంబం సిద్ధమైంది. ఈ మేరకు చక్కెర ఫ్యాక్టరీ చైర్మన్ డిఏ.శ్రీనివాస్ 468 మంది కార్మికులకు మార్చి 22న లేఆఫ్ నోటీసులను జారీ చేసి, పనుల్లో నిలిపివేశారు. కార్మికులు వీధినపడ్డారు. ఆందోళనలకు దిగారు. కాని ఫలితం లేకపోయింది. ఐదు నెలలుగా కార్మికులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. ఫలితం లేకపోగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. కేబీడీ చక్కెర ఫ్యాక్టరీ పరిధిలో.. పుంగనూరు కేబీడీ చక్కెర ఫ్యాక్టరీ పరిధిలోకి ఆరు నియోజకవర్గాల రైతులను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో పీలేరు, తంబళప ల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు చెందిన 36 మండలాల రైతులు ప్రతిఏటా చక్కెర ఫ్యాక్టరీకి సుమారు లక్ష టన్నుల చెరకును సరఫరా చేసేవారు. ఫ్యాక్టరీ వారు సుమారు 50 వేల టన్నుల చెరుకును తమిళనాడు నుంచి కొనుగో లు చేసేవారు. ఫ్యాక్టరీ పరిధిలో చెరకు లేని సమయంలో ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసేవారు. ఫ్యాక్టరీ మూసివేయడం తో 438 మంది కార్మికులు, 36 మండలాల రైతులు వీధినపడ్డారు. లేఆఫ్ నిబంధనలకు తిలోదకాలు ఫ్యాక్టరీని మూసివేసే సమయంలో ప్రభుత్వ నిబంధనల మేరకు కార్మికులందరికీ వ్యక్తిగత నోటీసులు జారీ చేయాలి. లేఆఫ్‌ను 45 రోజులు మాత్రమే కొనసాగించాలి. లేఆఫ్ ప్రకటించిన వెంటనే కార్మికశాఖ దీనిని ధృవపరుస్తూ, కార్మికులకు నోటీసులు జారీచేసి, 50 శాతం బేసిక్ జీతం ఇవ్వాలి. కాని యాజమాన్యం 40 శాతం మాత్రం జీతాలు పంపిణీ చేస్తోంది. యాజమాన్యం మార్చి 27, మే 1, జూలై 16న మూడు నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులను నిబంధనల మేరకు జారీ చేయలేదు. అలాగే జూలై 16న జారీ చేసిన నోటీసులో కార్మికులందరూ ప్రతి రోజు 10 గంటలకు ఫ్యాక్టరీలో హాజరై, సంతకాలు చేయాలని పేర్కొంది. అలా చేస్తే 40 శాతం జీతం చెల్లిస్తామని మెలిక పెట్టింది. ఫ్యాక్టరీ నిబంధనల మేరకు లేఆఫ్ ప్రకటించిన తరువాత కార్మికులు ఎక్కడ విధుల్లో ఉన్నా వారికి 50 శాతం జీతం చెల్లించాలి. కేబీడీ షుగర్స్ యాజమాన్యం మాత్రం తమకున్న అధికార బలంతో కార్మికుల కడుపుకొడుతూ 40 శాతం జీతం ఇవ్వడం, ప్రతి రోజు కార్మికులను ఇతర పనులకు వెళ్లనివ్వకుండా సంతకాలు చేసేందుకు ఫ్యాక్టరీకి రావాలని నిబంధనలు పెట్టడంతో కార్మికులు మండి పడుతున్నారు. ఈ విషయాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే పరిస్థితి విషమించే ప్రమాదం ఉంది. కేబీడీ చక్కెర ఫ్యాక్టరీ మూసివేసి సుమారు ఐదు నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర ఆరోపణలకు దారి తీస్తోంది. జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ వెం టనే చర్యలు తీసుకుని ఫ్యాక్టరీని తెరి పించాలని ఇటు కార్మికులు, అటు రైతు లు కోరుతున్నారు. మూడునెలల్లోపు సమస్య పరిష్కారం కేబీడీ చక్కెర ఫ్యాక్టరీ లేఆఫ్‌ను చట్ట ప్రకారం ప్రకటించాం. కార్మికుల డిమాండ్ మేరకు చక్కెర ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడం కష్టతరం. చెరకు పంట పండించలేని స్థితిలో రైతులు అవస్థలు పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఫ్యాక్టరీని నడపాలంటే వీలుకాదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు యాజమాన్యం మూడు నెలల్లోపు స్పష్టమైన చర్యలు తీసుకుంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోను కార్మికులను నష్టపరిచేది లేదు. యాజమాన్యం అన్ని రకాలుగా ఆలోచించి సముచితమైన ప్రకటన వెలువరిస్తుంది. - డీజే ఇంద్రప్రకాష్, ఉపాధ్యక్షుడు, కేబీడీ షుగర్స్, పుంగనూరు. -
షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం
ఆమదాలవలస రూరల్, న్యూస్‌లైన్: ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీని తప్పనిసరిగా తెరిపించేందుకు ప్రయత్నిస్తామని శ్రీకాకుళం ఎంపీ కింజారాపు రామోహన్ నాయుడు అన్నారు. మున్సిపాలిటీలోని నాలుగవ వార్డు గేదలవానిపేట కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన రుప్ప రామచంద్రారావు, మండలంలోని చిట్టివలస పంచాయితీ సర్పంచ్ గుజ్జల జగదీశ్వరీలు ఏర్పాటు చేసిన విజయోత్సవ సభకు ఆయనతోపాటు ఎమ్మెల్యే కూన రవికుమార్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిలు అతిధిలుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ అభివృద్ధి అంటే ఏమిటో ఈ ఐదేళ్ళ పాలనలో చూపిస్తామన్నారు. ఆమదాలవలస మున్సిపాలిటీలో టీడీపీ జెండా ఎగరవేస్తామని కాబట్టి మున్సిపాలిటీ నుంచి గాని, శ్రీకాకుళం రూరల్ నుంచి అభివృద్ధి పనులు కోసం మా ముగ్గురిలో ఎవరినైనా కలవవచ్చునని తెలిపారు.అలాగే ఆమదాలవలస నియోజకవర్గంలో కుటుంబాల పాలన పోయిందని అందుకే నిజాయితీ, నిబద్దత కలిగిన కూన రవికుమార్‌ను గెలిపించారన్నారు. కార్యక్రమంలో తమ్మినేని విద్యాసాగర్, కిల్లి రామ్మోహనరావు, తమ్మినేని గీత, ఇంజరాపు విశ్వనాథం,గుడ్ల రాజ్యలక్ష్మీ, బొడ్డేపల్లి లక్ష్మణరావు, యండ అప్పలనాయుడు, మొదలవలస రమేష్, జీడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షోభంలో తుమ్మపాల
మూత దిశగా చక్కెర కర్మాగారం పాత యంత్రాలతో తగ్గుతున్న రికవరీ పదేళ్లుగా నష్టాల బాట చెరకు రైతులకు పైసా చెల్లించలేని దుస్థితి అనకాపల్లి, న్యూస్‌లైన్ : తుమ్మపాల చక్కెర కర్మాగారం గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షోభంలో చిక్కుకుంది. ఈ సుగర్స్ పరిస్థితి నానాటికీ దిగజారిపోతున్నది. 2013-14 సీజన్లో ఫ్యాక్టరీకి చెరకు తరలించిన రైతులకు చెల్లింపులు లేకపోవడం, ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం వంటి పరిణామాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. దీని ఆధునికీకరణకు నిధులు మంజూరవుతాయనే ఆశలు కనుచూపుమేరలో కానరావడం లేదు. ఈ మిల్లులో చెరకు క్రషింగ్ 33 శాతం తగ్గి మూత దిశగా సాగుతోంది. దీనిని 1937లో అప్పటి యంత్రాలతో ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ వీటిని ఆధునికీకరించకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపింది. ఈ సుగర్స్ నష్టాలు రూ.14 కోట్లను దాటిపోయాయి. ఈ సీజన్లో చెరకు సరఫరా చేసిన రైతులకు రూపాయి కూడా చెల్లించలేదు. 28,286.2 టన్నులకు రూ.6 కోట్లు చెల్లించాల్సి ఉంది. కార్మికులకు మూడు నెలల జీతాలు రూ.70 లక్షలు బ కాయి పడింది. రెండేళ్ల నుంచి కార్మికులు, ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలకు పైసా జమచేయడం లేదు. అలాగే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రూ.80 లక్షలు గ్రాట్యుటీ చెల్లించాల్సి ఉంది. ఈ సీజన్లో కొన్ని ప్రైవేటు ఫ్యాక్టరీలు గరిష్టంగా 10.9శాతం రికవరీ సాధిస్తే తుమ్మపాల 7.9శాతానికి దిగజారిపోయింది. ఈ కారణంగా టన్ను చెరకుపై రైతులకు రూ.600 వరకు నష్టం వస్తోంది. కొన్ని కర్మాగారాల్లో గరిష్టంగా రోజుకు 7500 టన్నులు గానుగాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటే ఈ ఫ్యాక్టరీలో 500 టన్నుల క్రషింగ్ కనాకష్టమవుతోంది. ఇలా ఈ సీజన్‌కు సంబంధించి రూ.9 కోట్లు, రానున్న సీజన్ ప్రారంభానికి రూ.5 కోట్లు కావాలి. చెరకు క్రషింగ్ సీజన్ వస్తే తప్ప ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోదు. దీనికి తోడు లోటు బడ్జెట్, రాష్ట్ర విభజన తతంగం, మిగిలిన కర్మాగాలపై నివేదన అంటూ ప్రభుత్వం కాలయాపన తప్పదు. ఈ నేపథ్యంలో తుమ్మపాల కర్మాగారం భవితవ్యం మరోసారి ప్రశ్నార్థకమవుతోంది. హామీలు దాటని ఆధునికీకరణ తాము అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీని ఆధునీకరిస్తామన్న ఆయా పార్టీల హామీలు పరిపాటిగా మారాయి. తెలుగుదేశం హయాంలో అప్పట్లో రెండేళ్లపాటు ఏకంగా మూతపడి అమ్మకంబాట పట్టింది. 2004లో మహానేత వైఎస్సార్ హయాంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఫ్యాక్టరీని తెరిపించింది. అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంటు నుంచి ప్రాతినిధ్యం వహించిన గంటా శ్రీనివాసరావు మంత్రిగా దీని గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి వచ్చిన అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దీని ఆధునికీకరణకు రూ.7.56 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. రూపాయి కూడా విడుదల చేయలేదు. గత సీజన్(2012-13)లో ఈ ఫ్యాక్టరీ 38 వేల టున్నుల చెరకు గానుగాడింది. ప్రోత్సాకంగా టన్నుకు రూ.200 చొప్పున రూ.76 లక్షలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. రైతుల్లో ఆందోళన జిల్లాలోని ఒక్క గోవాడ(చోడవరం) చక్కెర కర్మాగారం మాత్రం లాభాల్లో పయనిస్తోంది. ఏటి కొప్పాక మూడేళ్లుగా లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ గతంలో పేరుకుపోయిన నష్టాల నుంచి గట్టెక్కలేకపోతోంది. తుమ్మపాల పదేళ్లుగా నష్టాలనే మూటగట్టుకుంటోంది. ఏడాదికేడాది కనాకష్టంమీద గానుగాడుతోంది. పురాతన యంత్రాలు,పరికరాలతో ప్రతి సీజన్లోనూ తుమ్మపాల, తాండవ ఫ్యాక్టరీల్లో క్రషింగప్పుడు అంతరాయం ఏర్పడుతోంది. పరోక్షంగా రికవరీ రేటు పడిపోతోంది. సహకార రంగంలోని చక్కెర కర్మాగారాల పరిస్థితి నానాటికీ దిగజారి పోతుంటే రైతులను ఆదుకునే నాధుడెవ్వరన్న వాదన వ్యక్తమవుతోంది. రానున్న సీజన్‌కైనా దీనిని ఆధునికీకరించకపోతే దీని పరిధిలోని రైతులు నిండా మునిగిపోవడం ఖాయం. -
చక్కెర ఫ్యాక్టరీని ఎందుకు అమ్మావ్?
టీడీపీ అధినేత చంద్రబాబుకు కవిత ప్రశ్న బోధన్, న్యూస్‌లైన్: నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని చక్కెర ఫ్యాక్టరీని అమ్మి.. ఇక్కడి కార్మికులను ఎందుకు రోడ్డున పడేశారో టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పాలని నిజామాబాద్ లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థి కవిత ప్రశ్నించారు.ఆదివారం ఆమె బోధన్‌లో ఆమె మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతాన్ని తానే అభివృద్ధి చేశానని బాబు గొప్పలు చెప్పకుంటున్నాడని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే 100 రోజుల్లో చక్కెర ఫ్యాక్టరిని ప్రభుత్వ పరం చేసి కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. -
వైఎస్సార్ హయాంలో..
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖ రరెడ్డి హయాంలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనించింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. జిల్లాలో ఉన్న ఏకైక చక్కెర ఫ్యాక్టరీ వేమూరు మండలం జంపనిలో ఉంది. 2004 ముందు ప్రైవేట్ సంస్థ ఆధీనంలో ఉండటంతో వందలాది మంది రైతులు, కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకంగా తయారైంది. మూతబడిన ఫ్యాక్టరీని వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెరిపించి సుమారు 2.5 కోట్లు రూపాయలు మంజూరు చేశారు. వైఎస్సార్ మరణాంతరం ఫ్యాక్టరీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఫ్యాక్టరీ మూతపడింది. జంపనిలో రేపల్లె మెయిన్ డ్రెయిన్‌పై కొత్త వంతెన నిర్మాణానికి వైఎస్ రూ.1.35కోట్లు మంజూరు చేశారు. చుండూరు మండలంలో నూతనంగా నిర్మించిన గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి రూ.9.6 కోట్లు మంజూరు చేశారు. వైఎస్సార్ మరణం తర్వాత... పేదోడికి సొంతింటి కల ‘కల్ల’గానే మిగిలిపోయింది. అధికార పార్టీ సిఫార్సులున్నవారికే ఇందిరమ్మ ఇళ్లు దక్కుతున్నాయి. తూతూ మంత్రంగా కొంత మంది అర్హులు దక్కించుకున్నా వారుకూడా బిల్లుల కోసం నెలల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. మహానేత వైఎస్సార్ మరణం తర్వాత పేదలను పట్టించుకునే వారే కరువయ్యారు. -
గోవాడ క్రషింగ్‌కు మళ్లీ అంతరాయం
కేఎస్ఎన్ నామినేషన్ కోసం పాలకవర్గం నిర్వాకమని రైతుల ఆందోళన కాటాల వద్ద 450 టన్నుల చెరకు ఎండిపోతోందంటూ రైతుల ఆగ్రహం బుచ్చెయ్యపేట/చోడవరం,న్యూస్‌లైన్: గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి మళ్లీ క్రషిం గ్‌కు బ్రేక్ పడింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు క్రషింగ్ పునరుద్ధరించారు. పది హేను రోజుల కాలంలో క్రషింగ్ నిలిచిపోవడం ఇది ఏడోసారి. క్రషింగ్ నిలిచిపోవడంతో కాటా ల వద్ద దాదాపు 450 టన్నుల చెరకు పేరుకుపోయింది. మండే ఎండల్లో చెరకు ఎం డిపోతోందని, దీనివల్ల దిగుబడి తగ్గిపోతుం దని రైతులు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ అభ్యర్థి నామినేషన్ ఉండడంతో పాలకవర్గమే ఈ తతంగానికి తెరతీసిందని రైతులు ఆరోపిస్తున్నారు. ‘లాభాల్లో ఉన్న సుగర్స్‌ను నష్టాలపాల్జేసే లక్ష్యంతోనే యాజమాన్యం, అధికారులు కలిసి పనిచేస్తున్నారన్న అనుమానం కలుగుతోంది’ అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అసలే వేసవి కాలం, పది నిమిషాలు ఎండలో నిలబడలేకపోతున్నాం, అలాంటిది రెండు మూడురోజుల పాటు రాత్రి, పగలు నిద్రాహారం లేక చెరకు కాటాల వద్ద పశువులు, మేము నిరీక్షించాల్సి వస్తోంది’ అని రైతులు అద్దెపల్లి అప్పారావు, రామారావు, గొంప పెదబాబు, పిళ్లా వెంకటరమణ, మాణిక్యం, ఒంటెద్దు రమ ణ, సయ్యపురెడ్డి రమణ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డాది, బుచ్చెయ్యపేట చెరకు కాటాల వద్ద టన్నుల కొద్ది చెర కు అన్లోడింగ్ అవ్వక ఎండుతోంది. దీంతో బుచ్చెయ్యపేట, వడ్డాది కాటాల పరిధిలోని 20 గ్రామాల రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి నామినేషన్ కోసమా? గురువారం చోడవరం ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి కె.ఎస్.ఎన్.ఎస్.రాజు నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి లారీల ద్వారా జనాన్ని తరలించాలని నిర్ణయించారని, జనసమీకరణ కోసం వ్యూహాత్మకంగానే క్రషింగ్ నిలిపివేశారని పలు గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు నామినేషన్‌కు రావాలని పథకం ప్రకారమే బుధవారం రాత్రి నుంచి లారీలను చెరకు కాటాలకు పంపించలేదని ధ్వజమెత్తారు. ‘ఫ్యాక్టరీకి టీడీపీకి చెందిన పాలకవర్గం వచ్చినప్పటి నుంచి రైతులకు పాట్లు తప్పడం లేదు. సక్రమంగా కటింగ్ ఆర్డర్లు ఇవ్వడం లేదు. పలుమార్లు క్రషింగ్‌కు అంతరాయం వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం’ అని బుచ్చెయ్యపేట, వడ్డాది, ఎల్.బి.పురం, పేట, దిబ్బిడి, అయితంపూడి, లోపూడి, వీరవల్లి, పోతనపూడి తదితర గ్రామాల చెరకు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చెరకు కాటాలకు లారీలు తిరగకపోవడం, చెరకు తరలింపు ఎక్కడికక్కడ నిలిచిపోవడంపై ఫ్యాక్టరీ సిబ్బందిని వివరణ కోరగా క్రషింగ్‌లో అంతరాయం వల్లేనని, మరమ్మతులు అనంతరం చెరకు తరలిస్తామని తెలిపారు. -
తుమ్మపాల.. పీడకల
మొరాయిస్తున్న పురాతన యంత్రాలు 30 వేల టన్నుల లోపే గానుగాట ? లక్ష టన్నుల లక్ష్యం ఫలించని స్వప్నం 8 శాతం లోపు రికవరీతో కలవరం ఏ క్షణం ఏమవుతుందోనన్న భయం డెబ్భై ఐదేళ్లుగా అనకాపల్లి కీర్తికి నిలువెత్తు నిదర్శనం.. దశాబ్దాలుగా వేలాది మంది రైతులకు ఆధారం.. తుమ్మపాల చక్కెర కర్మాగారం! కానీ అంత ప్రశస్తి ఉన్న ఈ అన్నదాత ఆశాకిరణం ఇప్పుడు వెలవెలపోతోంది. కాలం చేసిన మాయాజాలం కారణంగా పడుతూ లేస్తూ ప్రయాణం సాగిస్తోంది. మూలకు చే రే తీరులో ఉన్న యంత్రాలు చీటికీ మాటికీ మొరాయిస్తుండడంతో భవిష్యత్తు భయపెడుతోంది. గానుగ లక్ష్యం దిగజరిపోతోంది. రికవరీ శాతం కలవరపెడుతోంది. లక్ష టన్నుల క్రషింగ్ దేవుడెరుగు.. అందులో పావుసగం సాధిస్తే గొప్పేనన్న నిర్లిప్తత నీరసం కలిగిస్తోంది. అనకాపల్లి, న్యూస్‌లైన్: చేరువలో ఉన్న గోవాడ దూసుకు పోతూ ఉంటే, అనకాపల్లి వి.వి.రమణ (తుమ్మపాల) సహకార చక్కెర కర్మాగారం మాత్రం పడుతూ లేస్తూ పయనం సాగిస్తోంది. సుమారు 75 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కర్మాగారాన్ని యాంత్రిక వైఫల్యం శాపంలా వెంటాడుతోంది. కాలం చెల్లిన యంత్రాలు మొరాయిస్తుండడంతో ఏటేటా రికవరీ శాతం తగ్గిపోతోంది. లక్ష టన్నుల క్రషింగ్ కలేనన్న అభిప్రాయం బలపడుతోంది. పరువు కాపాడుకునేందుకైనా గానుగాట నిర్వహించాలని ముందుకు వచ్చిన తుమ్మపాల కర్మాగారానికి మళ్లీ కష్టాలు వచ్చి పడ్డాయి. ఒకవైపు చెరకు కొరత, మరొక వైపు సాంకేతిక సమస్యలు జంటగా వెంటాడుతున్నాయి. లక్ష టన్నుల మాట అటుంచి కనీసం గతేడాది చేపట్టిన క్రషింగ్ లక్ష్యాన్ని అధిగమించగలమా అనే అనుమానం తుమ్మపాల యాజమాన్యాన్ని వేధిస్తోంది. 30 వేల టన్నుల లోపే? ఆశలు ఎన్ని ఉన్నా, వెంటాడుతున్న వాస్తవాలతో యాజమాన్యం బెంబేలెత్తుతోంది. తుమ్మపాల కర్మాగార ప్రస్తుత సీజన్ క్రషింగ్ 30 వేల టన్నుల లోపే ఉంటుందని ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం 25 వేల టన్నుల వరకు క్రషింగ్ చేపట్టినప్పటికీ రికవరీ శాతం దయనీయంగా మారింది. కేవలం 7.92 రికవరీ శాతం నమోదవుతున్న పరిస్థితుల్లో ఎంత గానుగాడినా ఆస్థాయిలో నష్టాలే వస్తాయని ఆర్ధిక నిపుణుల అంచనాగా ఉంది. ఈ నేపథ్యంలో గానుగాటను ఎంత పొడిగించినా లాభం లేదని ఇప్పటికే కర్మాగార వర్గ్గాలు ఒక అంచనాకు వచ్చాయి. ఇదే సమయంలో చెరకు కొరత ఆందోళన కలిగిస్తోంది. క్రషింగ్ ఏరోజైనా ముగించే పరిస్థితి కనిపిస్తోంది. అటు ఉత్సాహం.. ఇటు నీరసం పక్కనున్న గోవాడ కర్మాగారం దూసుకుపోతోంది. 3 లక్షల టన్నుల గానుగాటతో 9.27 రికవరీ శాతం నమోదయింది. తుమ్మపాల తీరు మరీ తీసికట్టుగా ఉంది. 25 వేల టన్నులు గానుగాడి 7.92 రికవరీ శాతం నమోదయిందంటే పరిస్థితి అర్ధమవుతుంది. వెంటాడుతున్న బకాయిల భయం, సిబ్బంది జీతాల సమస్య, కానరాని ఆధునికీకరణ నిధులు, చేరని క్రషింగ్ లక్ష్యం .. భవిష్యత్తు భయంగా ఉంది. రాజకీయంగా కూడా అనిశ్చిత వాతావరణం ఉండడంతో రాబోయే ప్రభుత్వం ద్వారానే తుమ్మపాలకు మేలు జరగాలని అన్ని వర్గాల వారు భావిస్తున్నారు.