రామాయాంపేట మండలం లక్ష్మాపూర్లో సహకార షుగర్ ఫ్యాక్టరీలో గురువారం తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకుంది.
రామాయాంపేట మండలం లక్ష్మాపూర్లో సహకార షుగర్ ఫ్యాక్టరీలో గురువారం తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని పాల ట్యాంక్ను శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ఇద్దరు కార్మికులు మరణించారు. మరో కార్మికుడు ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో తోటి కార్మికులు వెంటనే స్పందించి ఫ్యాక్టరీ యాజమాన్యానికి సమాచారం అందించారు.
దీంతో ఆపస్మారక స్థితిలో ఉన్న కార్మికుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులు ఇద్దరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హర్షద్, చాంద్మియా అని యాజమాన్యం తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.