
చక్కెర ఫ్యాక్టరీని ఎందుకు అమ్మావ్?
టీడీపీ అధినేత చంద్రబాబుకు కవిత ప్రశ్న
బోధన్, న్యూస్‌లైన్: నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని చక్కెర ఫ్యాక్టరీని అమ్మి.. ఇక్కడి కార్మికులను ఎందుకు రోడ్డున పడేశారో టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పాలని నిజామాబాద్ లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి కవిత ప్రశ్నించారు.ఆదివారం ఆమె బోధన్‌లో ఆమె మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతాన్ని తానే అభివృద్ధి చేశానని బాబు గొప్పలు చెప్పకుంటున్నాడని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడితే 100 రోజుల్లో చక్కెర ఫ్యాక్టరిని ప్రభుత్వ పరం చేసి కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.