
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ చుట్టూ రాజకీయాలు పెనవేసుకుంటున్నాయి. ఫ్యాక్టరీ మూసివేతను ప్రతిపక్షాలు ఆయుధంగా మలుచుకునేందుకు ప్రయత్నం చేస్తుండగా, అధికార పార్టీ టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా కదులుతోంది. బకాయి వేతనాలు చెల్లించడం ద్వారా ఫ్యాక్టరీ కార్మికుల్లో ఉన్న నిరసన జ్వాలలను చల్లబర్చాలని చూస్తోంది. ఈ మేరకు ఎంపీ కవిత ఐదు రోజుల క్రితం ఫ్యాక్టరీ కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమై 27 నెలల బకాయి వేతనాలు చెల్లించేందుకు హామీ ఇచ్చారు.
బోధన్ (నిజామాబాద్): మూతపడిన నిజాం షుగర్స్ ఫ్యా క్టరీ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నా యి. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఫ్యా క్టరీ సమస్య ప్రధాన అంశంగా మారనుంది. ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలు దీని ని ఆయుధంగా మరల్చుకునే ప్రయత్నం చేస్తుండగా, అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు ఇరకాట పరిస్థితి ఎదురుకానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, శివసేన పార్టీలు ఫ్యాక్టరీ సమస్యపై రోడ్డె క్కి ఆందోళనకు దిగాయి. మలి దశ తెలంగాణ ఉద్యమం, ఎన్నికల్లో సమయంలో నూ అధికారంలోకి రాగానే షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ రద్దు చేసి స్వాధీనం చేసుకు ని పూర్వవైభవం తెస్తామని టీఆర్‌ఎస్ హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం హామీని నిలబెట్టుకోలేక పోయింది.
ప్రభుత్వ భాగస్వామ్యంతో ఫ్యాక్టరీని నడిపించిన ప్రైవేటు యాజమాన్యం బోధన్ తో పాటు ముత్యంపేట (జగిత్యాల) ముంబోజిపల్లి (మెదక్) యూనిట్లను 2015 డిసెంబర్ 23న లేఆఫ్ ప్రకటించి మూసివేసింది. మూడు ఫ్యాక్టరీల పరిధిలో వందలాది మంది కార్మికులు రోడ్డున న పడ్డారు. ఆనాటి నుంచి నిజాం షుగర్స్ రక్షణ కమిటీ, కార్మిక, ప్రజా సంఘాలు, చెరుకు రైతులు, వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్, బీజేపీ, శివసేన, ఎంఐఎం, వైఎస్‌ఆర్ సీపీ, తెలంగాణ సా మాజిక పోరాట సమితి ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం అనేక రూపాల్లో ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్నాయి. అయితే ఫ్యాక్టరీ పునరుద్ధర ణ, స్వాధీన అంశాల విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎటూ తేల్చలేకపోయింది. ప్రస్తుతం ఎన్‌సీఎల్‌టీ ( నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ), లేబర్ కోర్టుల్లో షుగర్ ఫ్యాక్టరీ సమ స్య విచారణలో ఉంది. ఫ్యాక్టరీ భవిష్యత్తు అయోమయంగా మారింది.
ఫలించని అధికార పక్షం ఆలోచన
షుగర్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారానికి 2015 జనవరిలో సీఎం కేసీఆర్ చెరుకు రైతులతో రాష్ట్ర సచి వాలయంలో చర్చించారు. రైతులు ముం దుకొస్తే సహకార రంగంలో నడిపిస్తామని స్పష్టత ఇచ్చారు. రైతులు తమతో అయ్యే పని కాదని తేల్చి చెప్పారు. దీంతో ఫ్యాక్టరీ సమస్య మొదటి కొచ్చింది. 2015 ఏప్రిల్ 29న ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని జీవో నంబర్ 28ను ప్రభుత్వం జారీ చేసింది. మరో ముందడుగు వేసి ఫ్యాక్టరీ స్వాధీనంలో సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు అధిగమించేందుకు ఆరుగురు ఐఏఎస్ ఉన్న తాధికారులతో అధ్యయన కమిటీని వేసింది. ఈ కమిటీ నివేదిక బహిర్గతం చేయలేదు. సమస్య మాత్రం యథాతథంగా ఉంది.
పెండింగ్‌లో బకాయిలు..
ఫ్యాక్టరీ మూతపడిన నాటి నుంచి కార్మికుల నెలసరి వేతనాలు అటు ఫ్యాక్టరీ యాజమాన్యం, ఇటు ప్రభుత్వం చెల్లించలేదు. ఇప్పటి వరకు 33 నెలల బకాయి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. కార్మికులు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కార్మికులు ఆగ్రహంతో ఉన్నారనే విషయా న్ని అధికార పక్షం గుర్తించి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. తాజాగా ఎంపీ కవిత ఐదు రోజుల క్రితం బోధన్ షుగర్ ఫ్యాక్టరీ వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులతో సమావేశమై కార్మికుల ఇబ్బందులపై చర్చించారు. 2015 డిసెంబర్ నుంచి 2018 మార్చి వరకు 27 నెలల బకాయి వేతనాలు చెల్లించేందుకు హామీ ఇచ్చారు. ఏది ఏమైనా షుగర్ ఫ్యాక్టరీ సమస్య ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశంగా మార నుందని స్పష్టమవుతోంది. ప్రతిపక్షాల, అధికార పార్టీ వ్యూహప్రతివ్యూహాలతో బోధన్ నియోజక వర్గం ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయని అంటున్నారు.
ఎంపీ కవిత ప్రత్యేక దృష్టి పెట్టారు
షుగర్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారంపై ప్రభు త్వం సీరియస్‌గా దృష్టిసారించింది. ఎంపీ కవిత చొరవ తీసుకుని కార్మికుల బకాయి వేతనాలు ఇప్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. త్వర లోనే కార్మికుల బకాయి వేతనాలు చెల్లిస్తారు. బకాయిల చెల్లింపుతో కార్మికులకు న్యాయం జరుగుతుంది. వేతనాలు వస్తే ఉపశమనం పొందుతారు. ఎంఏ రజాక్, టీఆర్‌ఎస్ నాయకుడు, బోధన్
ఫ్యాక్టరీ సమస్య పరిష్కారంలో విఫలం
షుగర్ ఫ్యాక్టరీ సమస్యను పరిష్కరించడం లో టీఆర్‌ఎస్ ప్రభు త్వం విఫలమైంది. ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని ఎన్నికల హామీని అమలు చేయకుండా మోసగించింది. మరో వైపు ఫ్యాక్టరీ మూతపడినా పట్టించుకోలేదు, మభ్యపెట్టే మాటలతో కాలం వెళ్లదీసింది. ఫ్యాక్టరీ మూసి వేత, టీఆర్‌ఎస్ ఎన్నికల హామీ, మోసపూరిత వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్తాం. గుణ ప్రసాద్, కాంగ్రెస్ బోధన్ అధ్యక్షుడు
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.
షుగర్ ఫ్యాక్టరీ మూసి వేత వల్ల ఈ ప్రాంత చెరుకు రైతులు, కార్మికులకు తీరని అన్యా యం జరిగింది. టీఆర్‌ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయలేక చేతులెత్తేసింది. ఫ్యాక్టరీ సమస్యపై అనేక రూపాల్లో ఆందోళనలు చేసిన టీఆర్‌ఎస్ ప్రభు త్వం పట్టించుకోలేదు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కాకపోవడంతో కార్మికుల కష్టాలు తీరలేదు. దుర్భర బతుకులను అనుభవిస్తున్నారు. రామరాజు, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, బోధన్
ఫ్యాక్టరీ మూసివేత బాధకరం
ఘన చరిత్ర కలిగిన నిజాంషుగర్ ఫ్యాక్టరీ మూసివేత బాధకరం. ఫ్యాక్టరీని తెరిపించే విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపలేదు. ఫ్యాక్టరీ తెరిపించి రైతులు, కార్మికులను ఆదుకోవాలి.మా పార్టీ రైతులు, కార్మికుల పక్షాన పోరాడుతోంది. ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని ప్రభు త్వం నడిపితేనే రైతులు, కార్మికులకు మేలు జరుగుతోంది.
సయ్యద్ ముక్తార్ పాషా, వైఎస్‌ఆర్ సీపీ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బోధన్
Comments
Please login to add a commentAdd a comment