ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే కుల సంఘాలను ప్రసన్నం చేసుకోవడానికి పార్టీల అభ్యర్థులు, ఆశావహులు తమ ప్రయత్నాల్లో మునిగి పోయారు. ఆయా సామాజికవర్గాల్లో పలుకుబడి ఉన్న కుల పెద్దల వద్దకు వెళ్లి మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని, గెలిచాక సంఘాలకు భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, కల్యాణ మండపాలు, ఇతర నిర్మాణాలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయిస్తామని హామీలు ఇస్తున్నారు. కొందరు నజరానాలు సైతం ముట్టజెప్పుతున్నారు. తమ పార్టీకే ఓటేసేలా ఏకగ్రీవ తీర్మానాలు చేయిస్తున్నారు.
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికల్లో కుల సం ఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సంఘాల మద్దతును కూడగట్టేందుకు అభ్యర్థులు, ఆశావహులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. గంప గు త్తాగా ఓట్లు పడతాయన్న ఆశతో ఆయా సంఘాల మద్దతు కూడ గట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తూనే., మరోవైపు ఈ సంఘాల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయా గ్రామాలు, డివిజన్లు, వార్డు ల్లో ప్రభావం చూపగల సామాజికవర్గాలను గు ర్తించి తమ వైపునకు తిప్పుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ఆయా కుల పెద్దలకు ప్రాధాన్యత పెరిగి పోయింది. ఆయా సామాజికవర్గాల్లో పలుకుబడి ఉన్న కుల పెద్దలకు అభ్యర్థులు గాలం వేస్తున్నారు.
వారికి ఫోన్లు చేసి, సమయం తీసుకుని మరీ వారి వద్దకు వెళ్లి మాట్లాడుతున్నారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో హామీలను గుప్పిస్తున్నారు. గెలిచాక ఆయా సంఘాలకు భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, కల్యాణ మండపాలు, ఇతర నిర్మాణాలకు ప్రత్యేకంగా నిధులు మంజూ రు చేయిస్తామని హామీలు ఇస్తున్నారు. కొందరు నేతలకు నజరానాలు సైతం ముట్టజెప్పుతున్నారు. మందు, విందులతో మచ్చిక చేసుకుంటున్నా రు. ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతివ్వాలని కోరుతున్నారు. తమ పార్టీ కే ఓటేసేలా ఏకగ్రీవ తీర్మానాలు చేయిస్తు న్నారు. తద్వారా ఆయా సామాజికవ ర్గం ఓట్లను అధిక సంఖ్యలో తమ వైపునకు తిప్పుకోవడం ద్వారా గెలుపును సునాయసాయం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు.
ఆత్మీయ సమ్మేళనాలు..
ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఆయా సామాజికవర్గాలతో మమేకమవుతున్నా రు. ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఈ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో కులసంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా ఆయా గ్రా మాల్లోని గ్రామాభివృద్ధి కమిటీల్లో ఈ సం ఘాలు భాగస్వామ్యం అవుతున్నాయి. దీంతో ఆయా సామాజికవర్గాల మ ద్దతు కూడగట్టడం ద్వారా ఆయా గ్రామాల్లో పట్టు సాధించవచ్చని పార్టీల అభ్యర్థు లు, ఆశావహులు భావిస్తున్నారు.
ఏకగ్రీవ తీర్మానానాలు..
జిల్లాలో ఆయా నియోజకవర్గాల్లో కొన్ని కుల సంఘాలు తాము ఫలానా పార్టీకే మ ద్దతిస్తామని ఏకగ్రీవ తీర్మానాలు చే Ü్తుండ టం గమనార్హం. ఇలా ఆయా కులసం ఘా ల్లో తీర్మానాలు చేయించడం ద్వారా ని యోజకవర్గంలో పట్టు సాధించడానికి వీ లవుతుందని అభ్యర్థులు భావిస్తున్నారు.
ఆసోసియేషన్లు..
కుల సంఘాలకే పరిమితం కాకుండా వివిధ రకాల అసోసియేషన్ల మద్దతును కూడగట్టుకుంటున్నారు. ఆయా అసోసి యేషన్లలో ఉన్న సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తాము గెలిచిన వెం టనే ఆ ఆసోయేషన్ అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని చెబుతున్నారు. కొన్ని అ సోసియేషన్ నేతలు సైతం అభ్యర్థులను కలుస్తున్నారు. మొత్తం మీద ఎన్నికలు ద గ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు, ఆశావ హులు గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తుండటం చర్చనీయాంశమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment