castes
-
ఎనిమిది కులాల పేర్లు మార్పు!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల్లోని ఎనిమిది కులాల పేర్లను మా ర్పు చేసేందుకు తెలంగాణ బీసీ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా కులాల పేర్లను తిట్ల రూపంలో వాడుతున్నారని, దీంతో కులం పేరు చెప్పేందుకు ఇబ్బందికరంగా ఉందని దొమ్మర, పిచ్చకుంట్ల, తమ్మలి, బుడబుక్కల, కుమ్మరి, చాకలి, చిప్పోలు, వీరముష్టి కులాలకు చెందిన ప్రతినిధులు పలు సందర్భాల్లో బీసీ కమిషన్‌కు పెద్ద సంఖ్యలో వినతులు సమర్పించారు.ఈ అంశంపై స్పందించిన బీసీ కమిషన్ తాజాగా పేర్ల మార్పునకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 18వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు ప్రకటించింది. అభ్యంతరాలను ఖైరతాబాద్‌లోని తెలంగాణ బీసీ కమిషన్ కార్యాలయంలో ప్రభుత్వ పనివేళల్లో స్వీకరించనున్నట్లు వివరించింది. -
మన అజ్ఞాత ఇంజినీర్లు
భారతదేశ అభివృద్ధి చేతివృత్తుల మీద జరిగింది. గౌండ్ల, కంసాలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి వంటి నైపుణ్యాలున్న కులాలు దేశమంతటా ఎన్నో ఉన్నాయి. పౌర సమాజంలో వీరి జనాభానే అధికం. ఈ చేతివృత్తుల కులాలే అనేక రంగాల్లో అద్భుతమైన ఇంజినీరింగ్ పరిజ్ఞానాన్ని సృష్టించాయి. ఉత్పత్తి సంస్కృతికి వీరు ప్రతినిధులు. ఆర్యులు, ముస్లింలు, బ్రిటిష్ వలసవాదులు గనక భారతదేశం మీదకు దండెత్తి వచ్చి ఉండకపోతే, ఈ భారతీయ ఇంజినీరింగ్ నైపుణ్యాలు ఒక ప్రత్యేక తాత్విక దృక్పథాన్ని సంతరించుకొని ఉండేవి. అయితే ఈ కులాలను ముస్లిం, బ్రిటిష్ దురా క్రమణదారుల కంటే బ్రాహ్మణ హిందూమతమే ఎక్కువగా దెబ్బతీసింది. వీరి నైపుణ్యాలకు ఆధ్యాత్మిక హోదా కల్పించలేదు. వీరిని సమాజంలో తక్కువ స్థాయిలోనే ఉంచింది. అయినా వాళ్లు సమాజ అభివృద్ధిలో నిరంతరం పాలుపంచుకుంటూనే వచ్చారు. కల్లుగీత కార్మికులు వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలువబడుతున్నారు. వీళ్ళు మనుషులు తాగడానికీ, తద్వారా తమ ఆరోగ్యాన్ని సమ తూలంగా ఉంచుకోవడానికీ పనికొచ్చే పానీ యాన్ని అందించే చెట్లను కనుగొన్నారు. కనుగొన డమే కాదు, దానికి తగిన పనిముట్లను సిద్ధం చేశారు. ఇందులో వీరి గొప్ప ప్రతిభ దాగివుంది. అందుకే కల్లుగీత కోసం రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానం మనిషికీ, ప్రకృతికీ మధ్య ఒక సజీవ మైన అనుబంధంగా మారింది. భారతదేశంలో అత్యంత గొప్ప ఇంజినీరింగ్ నైపుణ్యాలు మరో మూడు కులాల్లో కనిపిస్తాయి. అవి కమ్మరి (ఇనుముతో పనిముట్లు తయారు చేసేవాళ్లు), వడ్రంగి (కలపతో వివిధ పనులు చేసేవాళ్ళు), కంసాలి (బంగారం, వెండితో ఆభర ణాలు చేసేవాళ్లు). కమ్మరి వృత్తి ఆర్యుల కాలం కంటే ముందు నుంచే ఉన్నట్టు కనపడుతుంది. వారి పనిముట్లు చరిత్రకు ఆనవాళ్లు పట్టిస్తాయి. ఈ వృత్తికి సంబంధించిన పరిజ్ఞానం ఇప్పటికీ మన గ్రామీణ, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో అంత ర్భాగం. కమ్మరి పని వ్యవసాయ ప్రక్రియలో అనేక విధాలుగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. భారత దేశపు సామాజిక శక్తులు ఇనుము ఉపయోగాలను ఎలా కనుక్కొని ఉంటాయన్నది ఒక చారిత్రక అంశం. కమ్మరి కొలిమి ఇనుము సంబంధ పనుల్లో కీలకం. ఆ ప్రదేశం రెండు పైపు లైన్లను తోలు తిత్తితో అనుసంధానించి ఉంటుంది. అది కొలిమిలోకి క్రమబద్ధంగా గాలిని సరఫరా చేస్తుంది. ఈ తిత్తి ఆవిష్కరణ ఒక అద్భుతం. వడ్రంగి పనికి గొప్ప వృత్తి నైపుణ్యం అవసరం. వీరు సృష్టించిన అత్యంత విప్లవాత్మక సాధనం నాగలి. అలాగే వడ్రంగులు మానవ సమాజానికి అందించిన మరొక సేవ,ఇళ్ల నిర్మాణం. సమాజ ప్రధాన అవసరాలలో ఒకటైన ఇంటికి వాడే కర్రపనిలో వడ్రంగుల నైపుణ్యం మామూలుది కాదు. ఈనాటి ఇళ్ల నమూ నాల మూలాలన్నీ వడ్రంగుల నైపుణ్యంలో దాగి వున్నాయి. ప్రపంచంలో తొలినాళ్ల కుండల తయారీ జ్ఞాన వ్యవస్థల్లో కొన్నింటికి భారతదేశం పుట్టినిల్లు అని చెప్పవచ్చు. సింధు నాగరికత నాటికి మన దేశంలో కుండల తయారీ ఎంతో ఉచ్చస్థితిలో ఉంది. కుండల తయారీని ఎలా అభివృద్ధి పరిచారు అన్నది ఒక ఆశ్చర్యం. భారతీయ గ్రామాల్లో కుండల తయారీలో అధునాతన పరిజ్ఞానం కలిగిన కులాలు ఉన్నాయి. వారిని తెలుగునాట కుమ్మరోళ్లని పిలుస్తారు. అసలు సింధు నాగరికత ఈ కుండలు తయారు చేసేవారి భుజస్కందాలపై ఆధారపడే ఏర్పడినట్టు అనిపిస్తుంది. కుండల తయారీ పరి జ్ఞానం తొలుత మట్టికీ, చక్రానికీ మధ్య నుండే సంబంధాన్ని అర్థం చేసుకోవడంతో మొద లవుతుంది. ముడి కుండను మలిచేందుకు ముందు చక్రం తిప్పుతారు. మెత్తని బంక మట్టిని కుండగా మార్చవచ్చనీ, ఆ కుండలను వంటలకూ, నీళ్లు, ఇతర ద్రవ పదార్థాల నిల్వ ఉపయోగించవచ్చనీ వాళ్లకు ఎవరు చెప్పి ఉంటారు? మానవ జీవన పరిస్థితులను మెరుగుపరిచేందుకు భూవనరు లతో నిరంతరం పోరాడేవాళ్ళే బంకమట్టి నుంచి రకరకాల కుండలు తయారు చేయ వచ్చని కను గొని ఉంటారు. వేగంగా తిరిగే చక్రం మీద ఉంచిన బంకమట్టిని చేతివేళ్ల కొనలతో నొక్కుతూ ఒక ఆకారంలోకి తెస్తారు. ఈ దశలో కుమ్మరి చేతివేళ్ళు, గోళ్ళు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవాళ గృహాల అంతర్గత అలంకరణకు వినియోగించేలా అనేక ఆకృతులను కూడా అద్భుతంగా తయారు చేస్తున్నారు. ఇలా దేశంలోని ఎన్నో కులాలు భారతదేశ ఉత్పత్తి సంస్కృతికి ప్రాతినిధ్యం వహించాయి. దేశ నాగరకతను ముందుండి నడిపించాయి. – కిరణ్ ఫిషర్ అడ్వకేట్ ‘ 79893 81219 -
ఆ 21 కులాలు రాష్ట్రమంతటా బీసీలే
సాక్షి, అమరావతి: కొన్ని ప్రాంతాలకే వెనుకబడిన తరగతులు (బీసీ)గా పరిమితమైన 21 కులాలు, వాటి ఉప కులాలకు ప్రాంతం, భౌగోళిక పరిమితులను తొలగించి రాష్ట్ర మంతటా బీసీలుగానే పరిగణిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంత రాము ఉత్తర్వులు జారీ చేశారు. వెనుకబడిన తరగతుల జాబితాలో ఉన్న 138 కులాల్లో 31 కులాలు వాటి కార్యకలాపాలపై ప్రాంతం, భౌగోళిక పరిమితులను కలిగి ఉన్నాయి. వాటిలో పది బీసీ కులాలు తెలంగాణాలో, 21 ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 21 కులాలను కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో బీసీలుగా పరిగణిస్తున్నారు. ఈ విషయంలో వచ్చిన అనేక అభ్యర్థనలను పరిశీలించిన ప్రభుత్వం ఈ 21 కులాలకు ప్రాంతం, భౌగోళిక పరిమితిని తొలగించడం ద్వారా రాష్ట్రం అంతటా బీసీలుగా గుర్తించే అవకాశం దక్కింది. ఆ కులాలకు ఇకపై రాష్ట్రవ్యాప్తంగా బీసీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కల్లుగీతపై ఆధారపడిన శెట్టి బలిజ కులానికి మాత్రం రాయలసీమ ప్రాంతంలో ఇది వర్తించదు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు చెందిన అనేక కులాలకు కొన్ని ప్రాంతాల్లో బీసీ రిజర్వేషన్లు పొందేలా 2008లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అవకాశం కల్పిస్తే, ఇప్పుడు 21 కులాలకు, వాటి ఉప కులాలకు రాష్ట్రమంతటా బీసీలుగా పరిగణిస్తూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆ 21 కులాలు ఇవీ.. ► బీసీ–ఏ గ్రూప్‌లో ఆరు కులాలు, వాటి ఉపకులాలు ఉన్నాయి. అవి కురకుల, పొండర, సామాంతుల (సామంత, సౌంటియా), పాల ఏకరీ, ఏకిల, వ్యాకుల, ఏకిరి, నయనివారు, పాలేగారు, తొలగరి, కవలి, ఆసాదుల, కెవుట (కెవుటో, కెవిటి) కులాలు ఉన్నాయి. ► బీసీ–బీ గ్రూపులో నాలుగు కులాలు, వాటి ఉప కులాలు ఉన్నాయి. వాటిలో అచ్చుకట్లవాండ్లు, గౌడ (ఈడిగ, గౌడ, గమల్లా), కలాలీ, గౌండ్ల, శెట్టి బలిజ (రాయలసీమ మినహా అంతంటా), కుంచిటి వక్కలింగ (వక్కలింగ, కుంచిటిగ), గుడ్ల (గుడ్లయ) కులాలు ఉన్నాయి. – బీసీ–డీ గ్రూపులో 11 కులాలు, వాటి ఉప కులాలు ఉన్నాయి. వాటిలో మున్నూరు కాపు, పోలినాటి వెలమ, సదర, అరవ, అయ్యరక, నగరాలు, ముదలర్, ముదిలియర్, బెరి వైశ్య (బెరి శెట్టి), అతిరాస, కుర్మి, కలింగ కోమటి(కలింగ వైశ్య) కులాలు ఉన్నాయి. -
త్రిముఖ పోరులో కన్నడనాట కులాల కోలాటం.. కరుణ కోసం పార్టీల ఆరాటం
మన దేశంలో ఎన్నికలంటేనే కులం చుట్టూ తిరుగుతుంటాయి. అందులోనూ కర్ణాటక రాజకీయాల్లో కులాలు, మతాల పాత్ర మరీ ఎక్కువ. లింగాయత్, వొక్కలిగ, ఓబీసీ, ముస్లిం వర్గాలు నాలుగు స్తంభాలుగా ఎన్నికల ఫలితాలను శాసిస్తూ వస్తున్నాయి. అందుకే మరోసారి వారి మనసు చూరగొనేందుకు బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి... కర్ణాటకలో త్రిముఖ పోరు నేపథ్యంలో కులాలవారీగా ఓటర్లను ఆకర్షించడంలో బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. జేడీ(ఎస్) మాత్రం ప్రధానంగా రాష్ట్ర జనాభాల్లో లింగాయత్‌ల తర్వాత అత్యధికంగా 15% ఓటర్లున్న వొక్కలిగ ఓటు బ్యాంకునే నమ్ముకుంది. 59 అసెంబ్లీ స్థానాలున్న పాత మైసూరు ప్రాంతంలో వొక్కలిగలు ఇప్పటికీ మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడను ఎంతగానో ఆరాధిస్తారు. ఆ ఓటు బ్యాంకును చీల్చే లక్ష్యంతో ఎన్నికల ముందు నుంచే కోటా రాజకీయాలకు బీజేపీ తెర తీసింది. దాంతో దాన్ని ఎలాగైనా కాపాడుకునే పనిలో జేడీ(ఎస్) తలమునకలుగా ఉంది. కోటాతో రాజకీయ ఆట అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే అధికార బీజేపీ అన్ని సామాజిక వర్గాల ఓట్లూ రాబట్టేలా వ్యూహాలు పన్నడం మొదలు పెట్టింది. 2018 ఎన్నికల్లో 100కు పైగా స్థానాలు సాధించినా మెజారిటీ మాత్రం అందలేదు. పాత మైసూరులోని 59 సీట్లలో ఆరు మాత్రమే దక్కడం అందుకు ప్రధాన కారణం. దాంతో ఈసారి సరిగ్గా ఎన్నికల వేళ ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ సంచలనం నిర్ణయం తీసుకోవడమే గాక వాటిని బలమైన సామాజిక వర్గాలైన లింగాయత్, వొక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున పంచింది. ఈ నిర్ణయం పాత మైసూరు ప్రాంతంలో తమ భాగ్యరేఖలను కాస్త మెరుగు పరుస్తుందని ఆశ పడుతోంది. అలాగే ఎస్సీ రిజర్వేషన్లను 15 నుంచి 17 శాతానికి పెంచడమే గాక అంతర్గత కోటాను అమలు చేయాలని కూడా నిర్ణయించింది. ఈ నిర్ణయాలను లింగాయత్‌లు, దళితుల్లో ఒక వర్గం ఆహ్వానించినా ముస్లింలు భగ్గుమంటున్నారు. బంజారాల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతర్గత రిజర్వేషన్లతో తమకు మరింత అన్యాయం జరుగుతుందన్న భయం వారిలో ఉంది. పాత మైసూరులో బీజేపీ ఏకంగా 41 మంది వొక్కలిగలకు టికెట్లిచ్చింది! వీరు వ్యవసాయం మీద ఆధారపడ్డవారే కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ కార్యక్రమాలు బాగా జనంలోకి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తరచూ పాత మైసూరులో పర్యటిస్తున్నారు. హింద్ వర్సెస్ అహిందా లింగాయత్, బ్రాహ్మణుల ఓట్లతో పాటుగా హిందూత్వ ఓటు బ్యాంకునే బీజేపీ బాగా నమ్ముకుంది. హిందూత్వ, దేశభక్తి, అభివృద్ధి నినాదాలతో ఓట్లు రాబట్టజూస్తోంది. బాహుబలిగా పేరొందిన లింగాయత్ నేత బి.ఎస్.యడియూరప్పనే ముందుంచి ఎన్నికల వ్యవహారాలను నడిపిస్తోంది. 51 మంది లింగాయత్‌లకు టికెట్లిచ్చింది. కానీ బలమైన లింగాయత్ నేతలైన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాది పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం బీజేపీలో తాజాగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాను కనీసం 25 సీట్లలో బీజేపీ అవకాశాలకు గండి కొడతానన్న శెట్టర్ హెచ్చరికలను వారు గుర్తు చేస్తున్నారు. ఓబీసీలు ఎటువైపో...! వీరశైవ లింగాయత్‌లలో బీజేపీ ఓట్లలో 2 నుంచి 3% తమకు వస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. హిందూత్వకు పోటీగా అహిందా (ఓబీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ) నినాదంతో ఓట్లు కొల్లగొట్టే పనిలో పడింది. ఓబీసీల్లో ఒకప్పుడు కాంగ్రెస్‌కు ఓటుబ్యాంకుగా ఉన్న బిల్వాస్, మొగవీరాస్, విశ్వకర్మ, కొలిస్‌లు కొన్నేళ్లుగా బీజేపీ వైపు తిరిగారు. ఈసారి లింగాయత్, వొక్కలిగలు ఏ ఒక్క పార్టీకీ పూర్తిస్థాయిలో మద్దతునిచ్చే అవకాశాలు లేవన్న అభిప్రాయాల నడుమ ఈ ఓబీసీల ఓటు బ్యాంకే కీలకంగా మారింది. వారి ఓటుబ్యాంకును ఈసారి బీజేపీ నిలబెట్టుకోని పక్షంలో దానికి కాంగ్రెస్ నుంచి గట్టి ముప్పు పొంచి ఉన్నట్టే! – సాక్షి, నేషనల్ డెస్క్ -
పెద్దలకు తెలియజేయడమే శాపమైందో ఏమో! ఆ ప్రేమ జంట..
సాక్షి, గంగావతి రూరల్: ప్రేమ జంట అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన శనివారం కొప్పళ జిల్లా కుక్కనూరు తాలూకా బలిగేరి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రకాష్ (20) కుక్కనూరు ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన సుమ సుమ (17) కుక్కనూరులో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతోంది. రోజూ గ్రామం నుంచి ఆటో, బస్సుల్లో కుక్కనూరుకు వెళ్లివచ్చే క్రమంలో వీరి మధ్య స్నేహం ఏర్పడి ప్రేమకు దారితీసింది. వీరిద్దరివి వేర్వేరు కులాలు. తమ ప్రేమను కుటుంబ పెద్దలకు తెలియజేయగా చదువుకునే వయస్సులో ప్రేమ ఏంటని మందలించారు. వీరి ప్రేమ వ్యవహారంపై గ్రామస్తులు కూడా తప్పు బట్టారు. ఈక్రమంలో ఏం జరిగిందో ఏమో కాని శనివారం సుమ ఇంట్లో ప్రేమికులిద్దరూ రక్తపుమడుగులో విగతజీవులుగా కనిపించారు. కుక్కనూరు పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. గొంతుల వద్ద గాట్లు ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాలను కుక్కనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించి కేసు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: కొత్త బట్టలు కొని వస్తుండగా ఘోరం) -
మారణాయుధాలతో వచ్చి, అక్షితపై దాడిచేసి...
జగిత్యాల క్రైం: జగిత్యా ల రూరల్ మండలంలని బాలపల్లిలో ఆదివారం మధ్యాహ్నం ఓ యువతిని బెదిరించి, కొట్టి తీసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. బాలపల్లికి చెందిన జక్కుల మధు, రాయికల్ మండలంలోని ఇటిక్యాలకు చెందిన జవ్వాజి అక్షిత గత జూలై 3న ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాలు వేరు కావడంతో ఆమెపై కక్ష పెంచుకున్న తండ్రి భూమయ్య, మేనమామ సుంకశీల సత్తయ్యతోపాటు మరికొందరు రెండు కార్లలో మారణాయుధాలతో ఆదివారం బాలపల్లికి వచ్చారు. అక్షితపై దాడిచేసి, బలవంతంగా కారులో ఎక్కించారు. అడ్డుకోబోయిన ఆమె అత్త్త, ఆడపడుచులపై దాడి చేయడంతో గాయపడ్డారు. అక్కడికి చేరుకున్న స్థానికులపైనా ఆయుధాలతో వెంట పడటంతో వారు పరుగులు పెట్టారు. అనంతరం యువతిని తీసుకొని, వెళ్లిపోయారు. స్థానికులు జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్‌కు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. అక్షిత భర్త మధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల కోసం రెండు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి, గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. -
సంఘటితం.. సమారాధనం
సాక్షి, అమరావతి: అనుకూలమైన వనంలో బంధుమిత్రుల కలయిక. లక్ష్మీ దేవి స్వరూపంగా భావించే ఉసిరి చెట్టుకు పూజలు. అక్కడే వంటలు, ఆటలు, పాటలు, భోజనాలు.. ఓ వైపు ఆధ్యాత్మిక వాతావరణం. మరోవైపు ఆహ్లాదకరమైన సమారాధనం.. ఇదీ కార్తీక మాస వనభోజనాల ప్రత్యేకం. గతంలో ఇలా జరిగిన వన భోజనాల రూపు నేడు మారింది. ఒక కులానికి చెందిన వారంతా ఒక చోటకు చేరుతున్నారు. రాజకీయాలు, ఆర్థిక తారతమ్యాలకు అతీతంగా వనభోజనాల్లో ఐక్యతారాగం పాడుతున్నారు. ఉత్తేజపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. తమ కులస్థులు ఉన్నత స్థాయికి ఎదిగే ప్రణాళికలు వేస్తున్నారు. కుల జనోద్దరణ కోసం కార్తీక వనభోజనాలను వేదికగా చేసుకోవడం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 20 ఏళ్ల క్రితం మొదలైంది. అది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ట్రెండ్‌గా మారింది. కులస్థులను సంఘటితం చేసే సంకల్పంతో సమారాధనలు జరుగుతున్నాయి. తమ కులంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయాత నిచ్చే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమాజంలో ఎదుగుతున్న వారికి వెన్నుదన్నుగా ఎలా ఉండాలి అనే ప్రణాళికలు కూడా వేస్తున్నారు. మునుల కాలం నుంచి.. మాసాల్లో కార్తీకమాసానిది ప్రత్యేకం. శివకేశవులు ఆరాధన, ఉపవాస నియమాలు, పుణ్యతీర్థాల్లో స్నానాలు, ఆలయాల సందర్శనలు, వివిధ మాల ధారణలు ఇలా ఎటు చూసినా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిస్తూ ఉంటుంది. మరో పక్క వనభోజనాల సందడి కనిపిస్తూ ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజునే నైమిశారణ్యంలో సూత మహర్షి ఆధ్వర్యంలో మునులంతా వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు ‘కార్తీక పురాణం’లో ప్రస్తావించారు. భారతీయ సంప్రదాయంలో వనవిహారానికి ప్రాముఖ్యత ఉంది. ఆయుర్వేదంలో ఉసరికి ప్రత్యేక స్థానం ఉంది. ఇలా అన్నీ కలసిన కార్తీకం మానసిక ఉల్లాసాన్నిస్తుంది. స్థానికంగా కుల సమారాధన.. రాష్ట్రంలో ప్రధానంగా కాపు, రెడ్డి, గౌడ–శెట్టిబలిజ, యాదవ, వైశ్య, కమ్మ, క్షత్రియ తదితర కులాల వారీగా సామాజిక వన భోజనాల సందడి కొనసాగుతోంది. ఉద్యోగులు, వ్యాపారులకు విరామం దొరికే ఆదివారం అయితే మరింత జోరుగా జరుగుతుంది. ఈ ఏడాది కార్తీకమాసం తొలి ఆదివారం రాజమండ్రిలో నిర్వహించిన గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత కుల సమారాధనకు పార్టీలకు అతీతంగా పలువులు నేతలు హాజరయ్యారు. గత ఆదివారం భీమవరంలో నిర్వహించిన ఆర్యవైశ్య సమ్మేళనంలో ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. సింగపూర్‌లోని ఆర్యవైశ్యులు సైతం అక్కడి కూర్మ ద్వీపంలో (కుసు ఐలాండ్) కార్తీక వనభోజనాలను నిర్వహించుకోవడం విశేషం. చీమకుర్తి మండలం రామతీర్థంలోని మోక్ష రామలింగేశ్వరస్వామి దేవస్థానం వద్ద యోగి వేమన రెడ్ల సత్రంలో ఈ నెల 14న కార్తీక వన భోజనాలను నిర్వహించనున్నారు. రాయలసీమ ప్రాంతంలో రెడ్లు, కురుబ, యాదవ, బలిజ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కమ్మ, కాపు, గౌడ కులాలు, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో శెట్టిబలిజ–గౌడ, ఆర్యవైశ్య, క్షత్రియ, ఉత్తరాంధ్రలో తూర్పుకాపు, నగరాలు, కాళింగ తదితర కులాల వారీగా వన సమారాధనలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ట్రెండ్ మారింది.. సంఘటిత శక్తి చాటుతోంది గతంలో ఆధ్యాత్మిక కార్యక్రమంగా బంధు మిత్రుల సమక్షంలో కార్తీక వన భోజనాలు నిర్వహించేవారు. ఆ తర్వాత ఆ వేదికలను సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ఉపయోగించుకున్నారు. మరింత సామాజిక స్పృహ పెరిగి సొంత కులంలో ఆర్థికంగా దెబ్బతిన్న వారిని ఆదుకోవడానికి, విద్యా, వైద్యానికి సాయమందించడానికి కార్తీక వన సమారాధనలను వేదికగా చేసేవారు. క్రమంగా సామాజిక సంఘటిత శక్తిని చాటేందుకు ఉపయోగించుకోవడంతో పాటు రాజకీయంగా రాణించేందుకు దిశానిర్దేశం చేసేలా వన సమారాధనలు మారాయి. – పాకా వెంకట సత్యనారాయణ, కన్వీనర్, బీసీ కులాల సమాఖ్య పుణ్యం.. పురుషార్థం రాష్ట్రంలో కార్తీక సమారాధనలో పూజలతో పుణ్యం వస్తుంది. బంధు మిత్రులు ఒకే చోట కలుసుకుని సాధకబాధకాలు చర్చించుకుని, ఐక్యంగా పరిష్కారాలు కనుగొని ముందుకు సాగేందుకు చేసే ప్రయత్నాలతో పురుషార్థం నెరవేరుతుంది. రాష్ట్రంలో చాలా కాలంగా అనేక విధాలుగా కాపులు వన సమారాధనలు నిర్వహించి కులస్థుల్లో ఉత్సాహం నింపుతున్నారు. విహారయాత్రలు, వన సమారాధనలు నిర్వహిస్తున్నారు. అన్ని రంగాల్లోను రాణించేలా సంఘీయులు దిశానిర్దేశం చేస్తుంటారు. – చినమిల్లి వెంకట్రాయుడు, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు, పశ్చిమగోదావరి జిల్లా సంఘటితం.. చైతన్యం వెనుకబడిన తరగతులకు చెందిన గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత వంటి గీత కులాల వారు ఒకే సామాజికవర్గంగా ఉన్నారు. వీరంతా మరింత సంఘటితమై చైతన్యవంతంగా ముందుకు సాగేందుకు ఎన్నో ఏళ్ల నుంచి కార్తీక వనభోజనాలను నిర్వహిస్తున్నారు. సమాజంలో వారిని వారు రక్షించుకునేందుకు మొదలైన సంఘటిత నిర్మాణం.. కార్తీక వన సమారాధనలతో మరింత చైతన్యవంతమైంది. –వేండ్ర వెంకటస్వామి, గౌడ–శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు, పశ్చిమగోదావరి జిల్లా. -
జార్ఖండ్‌లో దారుణ కుల వివక్ష.. 50 దళిత కుటుంబాలను తరిమేసి..
మేదినీనగర్(జార్ఖండ్): సమ సమాజం దిశగా ముందడుగేయాల్సిన భారతావనిలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే కులానికి చెందిన 50 దళిత కుటుంబాలను కొందరు ఊరిలో నుంచి తరిమేశారు. ఈ దళిత కుటుంబాల ఇళ్లను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇళ్లలోని వస్తువుల అన్నింటినీ వాహనాల్లోకి ఎక్కించి, వీరిని సమీప అడవిలోకి తరిమేశారు. జార్ఖండ్‌లోని పలామూ జిల్లాలోని మరుమటు గ్రామంలో ఈ వివక్షాపూరిత ఘటన జరిగింది. ఘటనపై రాష్ట్ర గవర్నర్ రమేశ్ స్పందించారు. రెండ్రోజుల్లో నివేదిక సమరి్పంచాలని పలాము డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముషార్ కులానికి చెందిన 50 కుటుంబాలు మరుమటు గ్రామంలో నివసిస్తున్నాయి. సోమవారం హఠాత్తుగా కొందరు వీరు ఉండే ప్రాంతానికి వచ్చి అందరినీ చితకబాది ఇంటిసామగ్రిని బయటపడేసి ఇళ్లను ధ్వంసంచేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, మేదినీనగర్ సబ్ డివిజినల్ ఆఫీసర్ రాజేశ్ కుమార్ షా, సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్(ఎస్డీపీవో) సుర్జీత్ కుమార్‌లు ఘటనాస్థలికి చేరుకున్నారు. బాధిత కుటుంబాలకు మళ్లీ ఊరిలో వారి స్థలాల్లోనే నివాస సౌకర్యాలు కలి్పస్తామని, ప్రస్తుతం తాత్కాలిక శిబిరాల్లో ఉంచామని అధికారులు తెలిపారు. చదవండి: అంధుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు.. మైక్రోసాఫ్ట్‌లో 47 లక్షల వేతనం -
పోరాడితేనే ప్రభుత్వాలు దిగొస్తాయి
బన్సీలాల్‌పేట్: పీడిత కులాలు తమ భాష, సంస్కృతి మూలాలను మర్చిపోకుండా చైతన్యవంతమైన దిశగా ముందుకు సాగాలని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. మాజీ ఎమ్మెల్సీ, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అధ్వర్యంలో సికింద్రాబాద్ బోయిగూడ ముదిరాజ్ సంఘంలో ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ శతాబ్ది ఉత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాజ్యాంగ బద్ధంగా దక్కాల్సిన న్యాయమైన హక్కుల కోసం అణగారిన వర్గాలు పోరాడితే ప్రభుత్వాలు దిగొస్తాయన్నారు. రాష్ట్రంలో ముదిరాజ్ కులస్తుల హక్కులతో పాటు వారి అభ్యున్నతి, వికాసానికి కాసాని జ్ఞానేశ్వర్ చేస్తున్న కృషి అమోఘమైనదని కొనియాడారు. క్రిష్ణస్వామి ముదిరాజ్ ఆశయాలను, ఆదర్శాలను ఆచరణలో సాఫ ల్యం చేయడానికి ముదిరాజ్ మహాసభ నిర్మాణాత్మకమైన కార్యక్రమాలతో ముందుకు సాగుతోందని కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేర్కొ న్నారు. ముదిరాజ్‌లను బీసీ ‘డి’ నుంచి ‘ఏ’లో చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీ కమిషన్ నివేదికను సుప్రీంకోర్టుకు నివేదించడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని విడనాడాలని కోరారు. కార్యక్రమంలో అఖిల భారత కోళి సమాజ్ అధ్యక్షుడు, గుజరాత్ ఎమ్మెల్యే కువార్జీ భావాలియా, సుప్రీంకోర్టు న్యాయవాది పాండు, ముదిరాజ్ మహాసభ నాయకులు వెంకటేష్, చెన్నయ్య, ప్రకాష్, సదానంద్, జగదీష్, వీరేష్, సాయి, శారదా, శ్రీనివాస్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ కేటగిరీలోకి మరో 30 కులాలు!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల (బీసీ) కేటగిరీలోకి మరో 30 కులాలను చేర్చేందుకు బీసీ కమిషన్ కసరత్తు వేగిరం చేసింది. ప్రస్తుతం బీసీల్లో 112 కులాలున్నాయి. వీటికి అదనంగా 30 కులాలను చేర్చే అంశంపై బీసీ కమిషన్... గతేడాది ఆయా కులాల నుంచి వినతులు స్వీకరించింది. వీటిని పరిశీలించిన బీసీ కమిషన్ తాజాగా నిర్దిష్ట ఆధారాలు, విజ్ఞప్తుల స్వీకరణకు ఉపక్రమించింది. వాస్తవానికి కొత్త కులాల చేర్పు ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావాలి. కానీ గతేడాది సెప్టెంబర్ నుంచి వరుసగా ఎన్నికలుండటంతో ఈ ప్రక్రియను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసింది. ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి తొలగిపోవడంతో బీసీ కమిషన్ ఈ ప్రక్రియను వేగం చేసింది. ఈ నెల 17 నుంచి విజ్ఞప్తుల స్వీకరణ బీసీ జాబితాలో చేర్చాలని భావిస్తున్న 30 కులాల నుంచి బీసీ కమిషన్ ఇదివరకే విజ్ఞప్తులు, సూచనలు స్వీకరించింది. అయితే మరోసారి నిర్దిష్ట పద్ధతిలో విజ్ఞప్తులు, సూచనలు సమర్పించే వీలు కల్పిస్తోంది. ఈ మేరకు ఈనెల 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు బీసీ కమిషన్ కార్యాలయంలో నిర్దిష్ట విజ్ఞప్తులు, వినతులు స్వీకరించనుంది. కులాల మనుగడ, వారి జీవన విధానం, సంస్కృతితో పాటు సంబంధిత అంశాలను ఆధారాలతో జోడించి కమిషన్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. రెండు నెలల్లో పూర్తి..! బీసీల్లో కొత్త కులాల చేర్పునకు సంబంధించిన గరిష్టంగా రెండు నెలల్లో పూర్తి చేయాలని బీసీ కమిషన్ భావిస్తోంది. ఈనెల 27 వరకు విజ్ఞప్తులు స్వీకరించిన తర్వాత వాటిని పరిశీలించనుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి అభిప్రాయాల స్వీకరణ, ఆ తర్వాత అభ్యంతరాలను స్వీకరించి పరిశీలిస్తుంది. చివరగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి తుది నివేదికను తయారు చేయనుంది. రెండు నెలల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని, ఆగస్టు చివరికల్లా పూర్తవుతుందని బీసీ కమిషన్ సభ్యులు ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. బీసీ కేటగిరీలో చేర్చాలనుకుంటున్న కులాలు.. బీసీల్లో 112 కులాలున్నాయి. కొత్తగా కాకి పగడాల, మందెచ్చుల, సన్నాయోళ్లు/బత్తిన, కుల్ల కడగి, బౌల్ కమ్మర, బాగోతుల, బొప్పల, తోలుబొమ్మలాట, గంజికూటి, శ్రీ క్షత్రియ రామజోగి, ఏనూటి, గుర్రపు, అద్దపు, కడారి సైదరోళ్లు, సరగాని, ఓడ్, మాసయ్యలు/పటం, సాధనాశూరులు, రుంజ, పాపల, పనస, పెక్కర, పాండవుల, గౌడ జెట్టి, ఆదికొడుకులు, తెర చీరల, సారోళ్లు, అరవకోమటి, అహీర్ యాదవ్, గొవిలి కులాలను బీసీలో చేర్చేందుకు బీసీ కమిషన్ పరిశీలన చేస్తోంది. -
కులమే బలం !
ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే కుల సంఘాలను ప్రసన్నం చేసుకోవడానికి పార్టీల అభ్యర్థులు, ఆశావహులు తమ ప్రయత్నాల్లో మునిగి పోయారు. ఆయా సామాజికవర్గాల్లో పలుకుబడి ఉన్న కుల పెద్దల వద్దకు వెళ్లి మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని, గెలిచాక సంఘాలకు భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, కల్యాణ మండపాలు, ఇతర నిర్మాణాలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయిస్తామని హామీలు ఇస్తున్నారు. కొందరు నజరానాలు సైతం ముట్టజెప్పుతున్నారు. తమ పార్టీకే ఓటేసేలా ఏకగ్రీవ తీర్మానాలు చేయిస్తున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికల్లో కుల సం ఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సంఘాల మద్దతును కూడగట్టేందుకు అభ్యర్థులు, ఆశావహులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. గంప గు త్తాగా ఓట్లు పడతాయన్న ఆశతో ఆయా సంఘాల మద్దతు కూడ గట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తూనే., మరోవైపు ఈ సంఘాల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయా గ్రామాలు, డివిజన్లు, వార్డు ల్లో ప్రభావం చూపగల సామాజికవర్గాలను గు ర్తించి తమ వైపునకు తిప్పుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ఆయా కుల పెద్దలకు ప్రాధాన్యత పెరిగి పోయింది. ఆయా సామాజికవర్గాల్లో పలుకుబడి ఉన్న కుల పెద్దలకు అభ్యర్థులు గాలం వేస్తున్నారు. వారికి ఫోన్లు చేసి, సమయం తీసుకుని మరీ వారి వద్దకు వెళ్లి మాట్లాడుతున్నారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో హామీలను గుప్పిస్తున్నారు. గెలిచాక ఆయా సంఘాలకు భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, కల్యాణ మండపాలు, ఇతర నిర్మాణాలకు ప్రత్యేకంగా నిధులు మంజూ రు చేయిస్తామని హామీలు ఇస్తున్నారు. కొందరు నేతలకు నజరానాలు సైతం ముట్టజెప్పుతున్నారు. మందు, విందులతో మచ్చిక చేసుకుంటున్నా రు. ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతివ్వాలని కోరుతున్నారు. తమ పార్టీ కే ఓటేసేలా ఏకగ్రీవ తీర్మానాలు చేయిస్తు న్నారు. తద్వారా ఆయా సామాజికవ ర్గం ఓట్లను అధిక సంఖ్యలో తమ వైపునకు తిప్పుకోవడం ద్వారా గెలుపును సునాయసాయం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు.. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఆయా సామాజికవర్గాలతో మమేకమవుతున్నా రు. ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఈ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో కులసంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా ఆయా గ్రా మాల్లోని గ్రామాభివృద్ధి కమిటీల్లో ఈ సం ఘాలు భాగస్వామ్యం అవుతున్నాయి. దీంతో ఆయా సామాజికవర్గాల మ ద్దతు కూడగట్టడం ద్వారా ఆయా గ్రామాల్లో పట్టు సాధించవచ్చని పార్టీల అభ్యర్థు లు, ఆశావహులు భావిస్తున్నారు. ఏకగ్రీవ తీర్మానానాలు.. జిల్లాలో ఆయా నియోజకవర్గాల్లో కొన్ని కుల సంఘాలు తాము ఫలానా పార్టీకే మ ద్దతిస్తామని ఏకగ్రీవ తీర్మానాలు చే Ü్తుండ టం గమనార్హం. ఇలా ఆయా కులసం ఘా ల్లో తీర్మానాలు చేయించడం ద్వారా ని యోజకవర్గంలో పట్టు సాధించడానికి వీ లవుతుందని అభ్యర్థులు భావిస్తున్నారు. ఆసోసియేషన్లు.. కుల సంఘాలకే పరిమితం కాకుండా వివిధ రకాల అసోసియేషన్ల మద్దతును కూడగట్టుకుంటున్నారు. ఆయా అసోసి యేషన్లలో ఉన్న సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తాము గెలిచిన వెం టనే ఆ ఆసోయేషన్ అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని చెబుతున్నారు. కొన్ని అ సోసియేషన్ నేతలు సైతం అభ్యర్థులను కలుస్తున్నారు. మొత్తం మీద ఎన్నికలు ద గ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు, ఆశావ హులు గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తుండటం చర్చనీయాంశమవుతోంది. -
మహిళా సర్పంచ్ గ్రామ బహిష్కరణ
ఇందూరు (నిజామాబాద్ అర్బన్): వ్యవసాయ భూమి విషయంలో చెప్పినట్లుగా వినడం లేదనే కక్షతో కొందరు ఓ దళిత మహిళా సర్పంచ్‌నే కుల, గ్రామ బహిష్కరణ చేసిన ఘనట నిజామాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఊరికి సమస్యలు వస్తే సర్పంచ్‌గా పరిష్కరించే తనకు ఊరి నుంచే కొందరి వల్ల సమస్య ఎదురు కావడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ సర్పంచ్ సోమవారం కుటుంబీకులతో కలిసి కలెక్టర్ కార్యాలయానికి వచ్చి న్యాయం చేయాలని కలెక్టర్‌ను వేడుకుంది. జిల్లాలోని మెండోర మండలం బుస్సాపూర్ సర్పంచ్ జక్కుల మమత, ఆమె కుటుంబం తాతల కాలం నాటి నుంచి ఉన్న 20 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గ్రామంలోని కొందరు అగ్ర కులాల వారు ఆ భూమిని గతంలోనే తమకు విక్రయించారని, కాగితాలపై సంతకాలు చేయాలని సర్పంచ్ మమత, ఆమె భర్త శ్రీనివాస్‌పై ఒత్తిడి చేశారు. ఈ విషయంలో ఇరువర్గాలకు చాలాసార్లు వాగ్వాదం జరిగింది. సంతకం పెట్టనందుకు మొదటగా కుల బహిష్కరణ, ఆ వెంటనే గ్రామ బహిష్కరణ చేశారని బాధిత సర్పంచ్ మమత కలెక్టర్ రామ్మోహన్‌రావుకు ఫిర్యాదు చేసింది. తనతో తన కుటుంబ సభ్యులతో ఎవరైనా మాట్లాడినా.. పొలాల్లో పనులకు వచ్చినా.. వారికి రూ.5 వేల జరిమానా విధిస్తామని చాటింపు వేశారని వివరించారు. -
వంగవీటి హత్యపై పవన్ స్పందన
-
అగ్ని సాక్షిగా ఒక్కటై..
24 గంటల్లోపే రైలు కిందపడి యువతి, యువకుడి ఆత్మహత్య ♦ పెద్దలను ఎదిరించలేక.. కలిసి జీవించలేక బలవన్మరణం ♦ కులాలు వేరు కావడమే ఆ జంటకు ప్రధాన అడ్డంకి ♦ ఆత్మహత్యకు ముందు స్నేహితుడికి సమాచారం ♦ అవయవాలు ఇతరులకు ఇవ్వాలని విజ్ఞప్తి ♦ వేటపాలెం రైల్వేస్టేషన్లో ఘటన.. చీరాల: వారిద్దరూ ఇంజినీరింగ్ చదువుతున్నారు. కలిసి బతకాలన్న ఆ జంట ఆకాంక్షకు కులాలు అడ్డొచ్చాయి. పెద్దలను ఎదిరించలేక.. అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేక ప్రేమికులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి సరిగ్గా 24 గంటల ముందు ఓ గుడిలో వివాహం చేసుకుని దంపతులయ్యారు. ఆత్మహత్య అనంతరం పనికి వచ్చే తమ అవయవాలు దానం చేయాలని ఆ జంట తమ స్నేహితులకు విజ్ఞప్తి చేసింది. ఈ హృదయ విదారక సంఘటన మంగళవారం రాత్రి వేటపాలెం రైల్వేస్టేషన్లో జరిగింది. వివరాలు.. చీరాలలోని ఓ ప్రైవేటు ఇంజి నీరింగ్ కాలేజీలో నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన బత్తుల సందీప్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అదే కాలేజీలో గుంటూరు జిల్లా మోదుకూరుకు చెందిన మౌనిక రెండో సంవత్సరం చదువుతోంది. ఇద్దరి మధ్య పెరిగిన స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ అగ్రకులాల వారే. అయినా కులాలు వేరు కావడంతో ఇరువర్గాల పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. ప్రేమను వదులుకోకుంటే చనిపోతామని యువతి, యువకుడిని హెచ్చరించారు. కన్నవారిని ఎదిరించలేక ఇద్దరూ కుమిలిపోయారు. తమ కారణంగా తల్లిదండ్రులకు ఆపద రాకూడదని భావించారు. తాము ప్రాణాలు వదిలినా తల్లిదండ్రులు క్షేమంగా ఉండాలని భావించారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేమని తలచారు. ఆత్మహత్యకు ముందు ఒక్క క్షణమైనా దంపతులుగా జీవి ంచాలని భావించారు. విజయవాడ వెళ్లి అక్కడ ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. మంగళవారం రాత్రి వేటపాలెం రైల్వేస్టేషన్ చేరుకున్నారు. స్నేహితుడికి ఫోన్ చేసి.. పెళ్లి విషయాన్ని సందీప్ తన స్నేహితుడికి ఫోన్లో సమాచారం ఇచ్చాడు. పెద్దలను ఎదిరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నామని, ఈ విషయాన్ని ఇరువర్గాల పెద్దలకు చెప్పాలని కోరాడు. తమ అవయవాలు ఇతరులకు బనికొస్తే ఇవ్వాలని కోరాడు. సంఘటన జరిగిన వెంటనే 108 సిబ్బందికి సమాచారం ఇవ్వాలనీ ప్రాథేయపడ్డాడు. ఈ సమాచారాన్ని 108కు అందించాలని సూచించాడు. తలలు పట్టాలపై ఉంచి.. సందీప్, మౌనికలు తలలు మాత్రమే పట్టాలపై ఉంచి పడుకున్నారు. వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్నేహితులు వెంటనే చీరాల జీఆర్పీ ఎస్ఐ జి.రామిరెడ్డికి చెప్పడంతో ఆయన తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నా రు. సందీప్ మొబైల్ ఆధారంగా వారి వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. మిన్నంటిన రోదనలు రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్న ప్రేమికుల మృతదేహాలు చీరాల ఏరియా వైద్యశాల మార్చురీకి తరలించారు. ఇద్దరి తల్లిదండ్రులు, బంధువులు బుధవారం ఉదయం ఏరియా వైద్యశాలకు చేరుకున్నారు. ఉన్నత చదువులు చదువుకొని తమ కలలను నిజం చేస్తారన్న వారు ప్రేమ కోసం ప్రాణాలు తీసుకున్నారంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడకుంటే తమ ఆశలను అడియాశలు చేశాడంటూ రోదించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను తల్లిదండ్రులు తమ తమ స్వగ్రామాలకు తీసుకెళ్లారు. -
ఒక ఉద్యోగిని.. మూడు కులాలు!
►స్టడీ సర్టిఫికెట్లో బీసీ–సీ ►సర్వీస్ రిజిస్టర్లో ఎస్టీ ►పదోన్నతి కోసం ఎస్సీ సర్టిఫికెట్ ►వైద్య ఆరోగ్యశాఖలో మాయాజాలం కడప రూరల్: సాధారణంగా ఎవరికైనా ఒక కులంపైనే ఉద్యోగం వస్తుంది. దానిపైనే పదోన్నతులు తదితర సర్వీసు అంతా నడుస్తుంది. వైద్యారోగ్యశాఖలో మాత్రం అలా జరగడం లేదు. ఓ ఉద్యోగిని వద్ద మూడు కుల ధ్రువీకరణపత్రాలు ఉన్నాయి. వాటిని శాఖ ఆమోదించడం గమనార్హం. ఈ వ్యవహారం ప్రస్తుతం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. సమాచారహక్కు చట్టం ద్వారా అందిన వివరాలు ఇలా ఉన్నాయి. పి దేవశిరోమణి స్కూల్ రికార్డ్స్‌లో బీసీ–సీ అని ఉంది. అనంతరం ఆమె జరనల్ కోటా కింద జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ఎర్రగుంట్ల పీహెచ్సీలో 1983 నవంబర్ 22న హెల్త్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. తర్వాత ‘ఇన్ సర్వీస్ కోటా’ కింద ముంబైలో 2001 మే 29 నుంచి 2002 మే 13 వరకు డీహెచ్ఈ (డిప్లమో హెల్త్ ఎడ్యుకేషన్)కోర్స్‌ను పూర్తిచేశారు. ఈ కోర్స్ చేసిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు మాత్రమే ఆ కోర్స్ చేసిన కాలానికి పే అండ్ అలవెన్స్‌ల (జీతభత్యాలు)ను అందజేస్తారు. అందుకు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఉద్యోగులు వైద్య ఆరోగ్యశాఖకు ‘డిక్లరేషన్’ పత్రాన్ని సమర్పించాలి. అందుకు దేవశిరోమణి తాను ఎస్టీ–సుగాలి అని ‘డిక్లరేషన్’ను సమర్పించారు. ఆ పత్రాన్ని 2001 మే 21న ఎర్రగుంట్ల తహసీల్దార్ కార్యాలయం నుంచి పొందారు. ఈ కుల ధ్రువీకరణకు వైద్య ఆరోగ్యశాఖ అంగీకారం తెలిపింది. దీంతో కోర్స్ పూర్తిచేసిన కాలానికి జీతభత్యాలను చెల్లించారు. అనంతరం ఆమె డీహెచ్ఈ కోర్స్ పూర్తి చేసినందున హెల్త్ ఎడ్యుకేటర్‌గా పదోన్నతి లభించింది. ప్రస్తుతం పోరుమామిళ్ల మండలం టేకూరుపేట పీహెచ్సీలో పనిచేస్తున్నారు. మరోసారి ఎస్సీగా.. అనంతరం ఇటీవల డిప్యూటీ డెమో పదోన్నతులు జరిగాయి. ఈ పదోన్నతులను కడప పాత రిమ్స్‌లోని ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ కార్యాలయం చేపట్టింది. అంతకుముందే ఈ పదోన్నతుల అనుమతుల కోసం డిపార్ట్మెంట్ ప్రమోషన్స్ కమిటీకి పంపారు. అందులో దేవశిరోమణి పేరు ఎస్సీ జాబితాలో ఉంది. ఆమె ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని 2000 మార్చి 19న కడప తహసీల్దార్ కార్యాలయం నుంచి పొందినట్లుగా ఉంది. ఈ తరుణంలో ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలను సేకరించడంతో పాటు ఈ విషయాలను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారమంతా వెలుగుచూసింది. దీంతో డిప్యూటీ డెమో పదోన్నతి మాత్రమే నిలిచిపోయింది. సర్వీస్ రిజిస్టర్లో ఎస్టీగా... ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ రిజిస్టర్ ఎంతో కీలకం. కాగా దేవశిరోమణి సర్వీస్ రిజిస్టర్లో ఎస్టీ–సుగాలి అని పేరొనడం గమనార్హం. వైద్య ఆరోగ్యశాఖలో ఎన్నో అయోమయ పరిణామాలు జరిగాయి. అయితే ఇలా ఎప్పడు జరగలేదని ఆ కార్యాలయ వర్గాలు అంటున్నాయి. ఈ విషయమై సర్వీస్ రిజిస్టర్‌ను తయారుచేసిన మెడికల్ ఆఫీసర్, దానిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆమోదం తెలిపిన వైద్య ఆరోగ్య, రీజనల్ డైరెక్టర్ కార్యాలయం సిబ్బంది తప్పు ఉందా..లేదా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అలాగే రెవెన్యూశాఖ పనితీరుపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై ఆ శాఖ అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారు. విచారణలో ఏ విషయాలు వెలుగుచూస్తాయనేది ఆసక్తిదాయకంగా మారింది. వివరణ కోసం దేవశిరోమణిని సంప్రదించగా ఆమె అందుబాటులోకి రాలేదు. ఎస్సార్‌లో లోపాలు ఉన్నట్లుగా గుర్తించాం దేవ శిరోమణి సర్వీస్ రిజిస్టర్ (ఎస్సార్)ను పరిశీలించాం. కొన్ని లోపాలు ఉన్నట్లుగా గుర్తించాం. ఇంకా వాస్తవాలు తెలియాల్సి ఉంది. – డాక్టర్ గణపతిరావు డిప్యూటీ డైరెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ, అమరావతి విచారణకు ఆదేశించాం ఈ విషయం నా దృష్టికి వచ్చింది. విచారణకు ఆదేశించాం. ఆ వివరాలు అందగానే చర్యలు చేపడతాం – డాక్టర్ వీణాకుమారి రీజనల్ డైరెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ, కడప. ఫైల్‌ను ఆర్డీ కార్యాలయానికి పంపాం అందుకు సంబంధించిన ఫైల్ ఒకసారి మా వద్దకు వచ్చింది. దానిని ఆర్డీ కార్యాలయానికి పంపాం. – డాక్టర్ రామిరెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి. -
అన్ని కులాలకు సామాజిక న్యాయం
అసెంబ్లీలో చట్టం చేయండి: తమ్మినేని చండూరు/సాక్షి, హైదరాబాద్: ప్రజాసమస్యలపై అసెంబ్లీలో తీర్మానాలు చేస్తే ముఖ్యమంత్రికి దండ పంపిస్తాం.. లేదంటే దండయాత్ర చేయక తప్పదని సీపీఎం రాష్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర బుధవారం నల్లగొండ జిల్లా చండూరుకు చేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని కులాలకు సామాజిక న్యాయం జరిగేలా అసెంబ్లీలో చట్టం చేయాలని సూచించారు. కులాలకు సమానంగా బడ్జెట్ కేటాయించాలన్నారు. ఎంబీసీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ప్రకటన చేయడం ఆహ్వానించదగినదేనని.. అదేవిధంగా ఎంబీసీలకు అత్యాచార చట్టం తేవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మరోవైపు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టంలోని అన్ని అంశాలను పకడ్బందీగా అమలు చేయాలని తమ్మినేని ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అరవై ఏళ్లు దాటిన కార్మికులకు పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధంగా పెన్షన్ ఇవ్వాలని కోరారు. -
రాజ్యాధికారం కోసం పోరాడుదాం
రాష్ట్ర చేనేత కులాల ఐక్యవేదిక సమావేశంలో నాయకులు పిఠాపురం టౌన్ : చేనేత కుటుంబాలు కష్టాల నుంచి బయటపడాలంటే సమానత్వం, ఆర్థికస్వాలంభన, రాజ్యాధికారం దిశగా పోరాడాలని రాష్ట్రంలోని పలు చేనేత కులాల నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక మున్సిపల్ కల్యాణ మండపంలో శనివారం జరిగిన రాష్ట్ర వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ప్రతినిధుల సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. చేనేతే రంగం మీద ఆధారపడి జీవిస్తున్నవారు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో 19 శాతంగా ఉన్న చేనేత వర్గం అభివృద్ధి చెందాలంటే రాజకీయ ఆవశ్యకత అవసరమని కనీసం 10 మంది ఎమ్మెల్యేలను నెగ్గించుకునేందుకు ప్రతి చేనేత కుటుంబం కృషి చేయాలన్నారు. ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్రీరం శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. వీటికి నవరత్నాలు అని పేరుపెట్టారు. ఫ్రంట్‌కు రాష్ట్ర కన్వీనర్‌గా ఎంపికైన తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తీర్మానాలను చదివి వినిపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్యాయంతో సమగ్ర చేనేత జాతీయ, రాష్ట్ర విధానం అమలు చేయాలని, చేనేత కార్మికుల ఆత్మహత్యల నివారణకు వర్షాకాలంలో నేత విరామం అమలు చేయాలని, చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.2 వేల కోట్లు వార్షిక బడ్జెట్ కేటాయించాలని తీర్మానించారు. అలాగే చేనేత రంగానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలి ముఖ్యమంత్రికి స్వీయపర్యవేక్షణ ఉండాలని తదితర తీర్మానాలను ఆమెదించారు. వివిధ సంఘాల అధ్యక్షులు వై.కోటేశ్వరరావు, కోట వీరయ్య, మలిపెద్ది అప్పారావు, పాలాటి బాలయోగి, అడికి మల్లిఖార్జునరావు, ఎం.వెంకటేశ్వర్లు, తూతిక అప్పాజి, నక్కిన చినవెంకటరాయుడు, జగ్గారపు శ్రీనివాసరావు, రాయలసీమ ఇన్ చార్జ్ నేతాంజలి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రతినిధి డాక్టర్ సంజీవ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే చందన రమేష్, రాజమండ్రి జాంపేట కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ బొమ్మన రాజ్‌కుమార్, ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజు, కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడు శీరం ప్రసాదు, సభ్యులు, నాయకులు మాట్లాడారు. సమావేశం ప్రారంభంలో జ్యోతిప్రజ్వలన చేసి చేనేత నాయకులు స్వర్గీయ ప్రగడ కోటయ్య, స్వర్గీయ బొమ్మన రామచంద్రరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. అతుకులు లేకుండా జాతీయ జెండాను మగ్గంపై నేసిన పశ్చిమగోదావరి జిల్లా ఆచంట వేమవరం గ్రామానికి చెందిన రుద్రాక్ష సత్యన్నారాయణను ఘనంగా సత్కరించారు. సమావేశంలో తోపులాట సమావేశంలో తమ నాయకుడు జిల్లా పద్మశాలీ సంఘం అధ్యక్షుడు పంపన రామకృష్ణకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సమావేశంలో వాగ్వివాదం చోటు చేసుకుని తోపులాటకు దారితీసింది. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. కొంతసేపు అంతరాయం ఏర్పడి తర్వాత సద్దుమణిగింది. -
కులాల మధ్య చిచ్చు పెట్టిన బాబు
– కార్పొరేట్ చేతుల్లో కీలుబొమ్మగా మారిన సీఎం – రిజర్వేషన్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం – రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కర్నూలు సిటీ: ఓట్ల కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు..కులాల మధ్య చిచ్చు పెట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. బుధవారం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో సామాజిక హక్కుల వేదిక కన్వీనర్ జగన్నా«థం అధ్యక్షతన ప్రై వేటు రంగంలో రిజర్వేషన్లు, అమరావతి ఫ్రీజోన్ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలుపొందేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలన్నీ ఇచ్చారన్నారు. ఆయన ఇచ్చిన హామీలు అమలు కావాలంటే దేశ బడ్జెట్ మొత్తం ఏపీకి ఇచ్చినా సరిపోదన్నారు. కార్పొరేట్ శక్తుల చేతుల్లో సీఎం కీలుబొమ్మగా మారారని విమర్శించారు. రాధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. అమలుకాని రిజర్వేషన్లు.. దేశంలో బ్యాంకులకు కార్పొరేట్ సంస్థలు రూ. 34 లక్షల కోట్లు బకాయిలు పడ్డాయని, వారు చెల్లించకపోయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఐదేళ్లలో కార్పొరేట్ సంస్థలకు బ్యాంకులు..రూ. 1.06 లక్షల కోట్ల అప్పులను మాఫీ చేశాయన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావడం లేదన్నారు. దేశంలో 612 మంది జడ్జీలు ఉంటే బీసీలు 53 మంది, ఎస్సీలు 38 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. సుప్రీంకోర్టులో 29 మంది జడ్జీలు ఉంటే ప్రస్తుతం 27 మంది మాత్రమే పని చేస్తున్నారని, ఇందులో ఒక్క బీసీ, ఎస్టీ కూడ లేరని, ఎస్సీ వర్గానికి చెందిన జడ్జీ ఒక్కరు మాత్రమే ఉన్నారన్నారు. ఏపీ నుంచి సుప్రీంకోర్టులో ఉన్న ముగ్గురు జడ్జీలు ఒకే కులానికి చెందిన వారని గుర్తు చేశారు. కార్పొరేట్‌ను కాపాడే యత్నం.. ఏపీలో 80 శాతం ఇంటర్ విద్యార్థులు నారాయణ, శ్రీచైతన్య కార్పొరేట్ విద్యాసంస్థలో ఉన్నారని.. రాష్ట్రంలో రూ. 500 కోట్ల మెడికల్ స్కామ్ జరిగితే ఇందుకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా వారిని కాపాడేయత్నం చేస్తోందని రామకృష్ణ అన్నారు. ఢిల్లీ ప్రభుత్వ తరహాలో కార్పొరేట్ సంస్థలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని, అధిక ఫీజులు వసూలు చేసే సంస్థల గుర్తింపును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, ఏఐవైయఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్‌బాబు, ఏఐయస్‌యఫ్ జిల్లా అద్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, రంగన్న, ట్రై బల్ విద్యార్థి సంఘం జిల్లా అద్యక్షులు చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు. -
ఆ కులాల కోసం ప్రత్యేక కమిషన్
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: గుర్తింపు లేని కులాల గుర్తింపుకోసం కమిషన్ వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో విముక్తి జాతుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పేద పిల్లల చదువుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని, ఇందులో భాగంగానే 250 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి 2 లక్షల మంది విద్యార్ధులకు విద్యనందిస్తున్నామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఏడు పదుల స్వాతంత్య్రంలో సంచార జాతులకు ఏడుపే మిగిలిందని, రాష్ట్రంలో అనేక కులాలకు ఇప్పటికీ గుర్తింపు లేకుండా పోయిందన్నారు. బీజేపీ శాసన సభాపక్ష నేత కిషన్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా సంచార జాతుల బతుకులు మారలే దని, సంచార జాతులను గుర్తించేందుకు కమిషన్‌ను వేయాలన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ తిరుమలి, సంఘం నేతలు నరేందర్, వెంకటనారాయణ, కాటేపల్లి వీరస్వామి, మందుల గోపాల్, ఫకీర్ హుస్సేన్, రాజేశ్వర్ రావు, చవ్వ ఇస్తారి తదితరులు పాల్గొన్నారు. -
ఇతర కులాలను చేర్చితే బీసీలకు అన్యాయమే
బీసీ ఐక్య వేదిక కన్వీనర్ చిట్టబ్బాయి అమలాపురం రూరల్ : ఇతర కులాలను చేర్చితే బీసీలు రాజకీయంగా రిజర్వేషన్లు కోల్పోతారని జిల్లా బీసీ సంఘాల ఐక్య వేదిక కన్వీనర్, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి అన్నారు. అమలాపురంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 22న విజయవాడలో బీసీ కమిషన్ చైర్మన్ మంజునాథ్‌ను కలిసి జిల్లా బీసీ సంఘాల తరపున సమస్యలు, వినతులు ఇచ్చామని చెప్పారు. అభివృద్ధి చెందిన ఇతర కులాలను బీసీల్లో చేర్చటం వల్ల తమ రిజర్వేషన్లకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయంగా పలు పదవులు కోల్పోతామని కమిషన్‌కు వివరించామన్నారు. ప్రభుత్వం బీసీ సంఘాల సమస్యలు పరిష్కరించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌కు బడ్జెట్ రూ.వెయ్యి కోట్లు కేటాయించి రూ.రెండు లక్షల వరకూ హామీ లేకుండా రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. బీసీలకు రూ.50 వేల రుణాలకు కూడా బ్యాంకుల్లో హామీలు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుల వృత్తులకు రూ.అయిదు లక్షల వరకూ హామీ లేకుండా రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొన్ని సామాజిక వర్గాల మాదిరిగా తామేమీ విధ్వంసాలకు పాల్పడలేదని... అలా చేస్తే ప్రభుత్వం దిగి వస్తుందా..? అని ప్రశ్నించారు. జిల్లా బీసీ సంఘాల అధ్యక్షుడు పంపన రామకృష్ణ మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చటం వల్ల బీసీలు వార్డు మెంబరుగా కూడా గెలవరని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల్లో కాపులను చేర్చవద్దని తాము కమిషన్‌కు చెప్పామని స్పష్టం చేశారు. -
వానకోసం
వరుణదేవుడి కరుణ కోసం పల్లెజనం పరితపిస్తున్నారు. తడారిన భూముల్లో నీటి చుక్క కోసం నిరీక్షిస్తున్నారు. వానలు కురిపించండమ్మా అంటూ గ్రామదేవతలకు మొక్కుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆకాశగంగ ఆదరణ కోసం కలసపాడు గ్రామస్తులంతా శనివారం ఒక చేత్తో కాయా కర్పూరం.. మరో చేత్తో నిండు బిందె తీసుకుని సమైక్యంగా కదిలారు. కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు అనే భేదభావాలు విస్మరించి అంకాలమ్మ..పోలేరమ్మ.. సత్తెమ్మ.. గంగమ్మలకు ఒక్కొక్కరిక్కి 180 బిందెలతో జలాభిషేకం చేశారు. బోనాలు సమర్పించారు. వానలు కురిపించి కరువు బారి నుంచి కాపాడమని వేడుకున్నారు. - కలసపాడు -
నడుపల్లిలో సాకారమైన జాతిపిత ఆశయం
అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి ఇంటిలోకి దళితుల గృహ ప్రవేశం సాదరంగా ఆహ్వానించి గౌరవ మర్యాదలు చేసిన ఇంటి యజమాని కోలారు : కులాలు, మతాలు, జాతుల మధ్య అడ్డుగోడలు ఉండరాదనే గాంధీజీ ఆశయం సాకరమైంది. తాలూకాలోని నడుపల్లి గ్రామంలో ఆగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి దళితులను తన ఇంటిలోకి ఆహ్వానించి మనుషులందరిదీ ఒకే కులమని చాటారు. అనాదిగా ఇంటి బయటి నుంచే పలుకరిస్తున్న దళితులను తన ఇంట్లోకి ఆహ్వానించారు. కోలారు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యక్షుడు క్రిష్ణమూర్తి గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఆదివారం స్థానికంగా ఉన్న వెంకటేష్, మెణసమ్మ, మునిరత్న దళిత కుటుంబాలను తన ఇంటిలోకి ఆహ్వానించి వారికి తగిన గౌరవ మర్యాదలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ లా కళాశాల లెక్చరర్ ప్రసన్నకుమారి మాట్లాడుతూ అస్పృశ్యత పట్టణాలలో కంటె గ్రామీణ ప్రాంతాలలోనే అధికంగా ఉందన్నారు. గ్రామీణ స్థాయి నుంచే దీనిని అడ్డుకోవాలన్నారు. దళిత నాయకుడు విజయకుమార్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలకు కమ్యూనిస్టు సిద్దాంతాల పట్ల నమ్మకం ఉన్నవారు ముందుకు రావాల్సి ఉందన్నారు. కానీ వారు తమ నోటి వెంట దళితులు మా ఇంటికి రండి పిలవలేదని విచారం వ్యక్తం చేశారు. -
ఎలాగూ చనిపోతాం... ఇంకెందుకు వెళ్ళడం అనిపించింది!
రామ్‌గోపాల్ వర్మ... ఈ పేరు చెప్పగానే ఎవరికైనా చటుక్కున స్ఫురించేది ఓ విలక్షణ వ్యక్తిత్వం. ఆయన మాటలైనా, చేతలైనా ఎప్పుడూ ఏదో ఒక సంచలనమే. సినిమా హిట్టు, ఫ్లాపులతో ఆయనకు సంబంధం లేదు. వాటికి అతీతంగా అనునిత్యం వార్తల్లో ఉండడం వర్మలోని విశేషం. మరి, అలాంటి విలక్షణ వ్యక్తి ఎవరిని చూసి ప్రభావితమయ్యారు? దేన్ని చూసి, ఏం చదివి ప్రేరణ పొందారు? ఎవరి మీదైనా సరే మాటల తూటాలు పేల్చే ఈ మనిషికి బతుకు మీద భయం లేదా? రండి... రామూను అడిగేద్దాం... ఆయన మాటల్లోనే వివరణ వినేద్దాం. అతని తెలివితేటల ముందు నేనో పురుగులా అనిపించేవాణ్ణి! నన్ను ప్రధానంగా ప్రభావితం చేసిన వ్యక్తి - ఇంజినీరింగ్ కాలేజ్‌లో నాకు జూనియర్ అయిన నా స్నేహితుడు సత్యేంద్ర. అతను చాలా తెలివైనవాడు. ఇంటర్నెట్ లాంటివేవీ లేని ఆ రోజుల్లో విశాఖపట్నం నుంచి విజయవాడకు చదువుకోవడానికి వచ్చిన పద్ధెనిమిదేళ్ళ అతను ఆ తరం విద్యార్థులు ఎవరూ ఊహించని రీతిలో ఎన్నెన్నో పుస్తకాలు చదివాడు. ఆరు నెలల పాటు నేను, అతను రూమ్మేట్లం. అతనితో మాట్లాడుతుంటే, అదో చెప్పలేని అనుభూతి. ఒకసారి పరీక్షల ముందు నేను, సత్యేంద్ర విజయవాడలోని లీలామహల్లో ఓ ఇంగ్లిషు సినిమాకు వెళ్ళాం. సత్యేంద్ర ఆ సినిమా చూడడం అప్పటికి ఏడోసారి. ఇంతలో మా కాలేజ్ ప్రిన్సిపాల్ తుమ్మల వేణుగోపాలరావు కూడా అదే సినిమాకు వచ్చారు. ‘ఏమిటి ఇలా వచ్చార’ని ఆయన అడిగితే, ‘మీరు కాలేజ్‌లో నేర్పే దాని కన్నా, ఈ సినిమాల ద్వారా నేర్చుకునేది ఎక్కువ. అందుకే, ఈ సినిమాకు ఏడోసారి వచ్చా’ అన్నాడు సత్యేంద్ర. ‘ఈ సినిమా నేను చూశాను. ఇందులో అంత ఏముంది?’ అన్నారు ప్రిన్సిపాల్. ‘మీకు కనిపించనిదేదో, నాకు కనిపించింది’ అన్నాడు సత్యేంద్ర. చూడడానికి అతని మాట తీరు అలా నిర్లక్ష్యంగా అనిపించినా, అంత తెలివైన విద్యార్థిని నేను చూడలేదంటే నమ్మండి. చివరకు, మా ప్రిన్సిపాల్ గారు కూడా ఓ సందర్భంలో ‘నేను మరువలేని విద్యార్థి’ అంటూ సత్యేంద్ర మీద చాలా గొప్పగా ఓ వ్యాసం రాశారు. దాన్నిబట్టి అతను ఎలాంటివాడో అర్థం చేసుకోండి. అవడానికి కాలేజీలో నాకు జూనియర్ అయినా, సత్యేంద్ర మాటలు, అతను ప్రస్తావించిన పుస్తకాల పఠనం నన్నెంతగానో మార్చేశాయి. అతనితో మాట్లాడితే, మనకు తెలియని ఓ అభద్రత కలుగుతుంది. ఆయన తెలివితేటల ముందు మనమంతా పురుగులలాగా అనిపిస్తుంది. ప్రస్తుతం విజయవాడలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు సత్యేంద్ర. ఈ మధ్యే మూడు నెలల క్రితం కూడా అతనితో ఫోన్లో మాట్లాడాను. అతని మాటల్లోని తార్కికత మనల్ని ఆలోచనల్లో పడేస్తుంది. మనలోని అజ్ఞానపు తెరలు ఒక్కొక్కటిగా విడిపోతూ, ఉంటాయి. ‘భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నాను’ లాంటి ప్రకటనల వెనుక ఉన్న మన అంతరంగాన్ని ఆయన ప్రశ్నిస్తారు. కేవలం దేశాన్ని ప్రేమిస్తున్నావా, ఇక్కడి వ్యక్తులను ప్రేమిస్తున్నావా, కులాలు - మతాలు - ప్రాంతాల లాంటి విభేదాలు ఏమీ లేకుండా వ్యక్తులను ప్రేమించగలవా అని ఆయన చెప్పే తర్కం ఆలోచనలో పడేసేది. మనలో గూడు కట్టుకున్న స్థిరమైన అభిప్రాయాలనూ, భావాలనూ అతని మాటలు ఛిన్నాభిన్నం చేసేస్తాయి. నా జీవిత తాత్త్వికత అంతా ఆ పుస్తకాల ప్రభావమే! సత్యేంద్ర తరువాత నన్ను అమితంగా ప్రభావితం చేసినవి పుస్తకాలే. ఇంటర్మీడియట్ చదువుతుండగానే నేను కాల్పనిక సాహిత్యమంతా చదివేశాను. కాల్పనికేతర సాహిత్యం, ఫిలాసఫీ పుస్తకాలు మాత్రం ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాకే చదవడం మొదలుపెట్టాను. ఇప్పుడు నేను ఎక్కువగా ఫిలాసఫీ పుస్తకాలు, అందులోనూ పొలిటికల్ ఫిలాసఫీ పుస్తకాలు తెగ చదువుతుంటాను. వాటిని నాకు పరిచయం చేసింది సత్యేంద్రే. ఆయన స్నేహం వల్లే నేను జర్మన్ తత్త్వవేత్త నీషే, అయన్ ర్యాండ్ లాంటి ప్రసిద్ధులు రాసిన పుస్తకాలు చదివాను. అయన్ ర్యాండ్ రచనలన్నీ దాదాపు చదివేశాను. ముఖ్యంగా ఆమె రచనలు, నీషే రాసిన ‘దజ్ స్పేక్ జరాథుస్త్రా’ - నన్ను బాగా ప్రభావితం చేశాయి. అన్నట్లు నేను ఇందాక చెప్పిన సత్యేంద్ర కూడా ఇప్పుడు ఓ పుస్తకం రాస్తున్నాడు. అతని ఆలోచనలతో నిండిన ఆ పుస్తకం జనం ఆలోచించే తీరును మార్చి వేస్తుందని ఆయన నమ్మకం. కచ్చితంగా అది ఓ సంచలనమవుతుంది. తెలుగు పుస్తకాల విషయానికి వస్తే, నేను ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి అభిమానిని. ఆమె రాసిన ‘రామాయణ విషవృక్షం’ చదివాను. అలాగే, శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’, చలం రచనలు చదివాను. చలం మంచి రచయితే కానీ, ఆ భావాలు అప్పటికి కూడా కొత్త ఏమీ కాదు. అవన్నీ ప్రపంచ ప్రసిద్ధులైన నీషే తదితరుల తాత్త్వికతలో ఉన్నవే. ఆ సినిమాల జాబితా చాలా పెద్దది! ప్రపంచ సినీ చరిత్రలో ఆణిముత్యాలని చెప్పదగ్గ చిత్రాలు కొన్ని నా మీద ప్రభావం చూపాయి. వాటి జాబితా పెద్దదే. అయితే, చటుక్కున నాకు గుర్తొచ్చే సినిమాలు - ‘గాడ్ ఫాదర్’, ‘మెకన్నాస్ గోల్డ్’, ‘ఎగ్జార్సిస్ట్’. భారతీయ సినిమాల్లోకి వస్తే ‘షోలే’, ‘అర్ధ్ సత్య’ లాంటివి నన్ను ప్రభావితం చేశాయి. అలాగే, నా మీద ప్రభావం చూపాయని అనలేను కానీ, నేను బాగా ఇష్టపడిన తెలుగు సినిమాలు మాత్రం చాలానే ఉన్నాయి. దాసరి నారాయణరావు గారి ‘శివరంజని’, బాలచందర్ గారి సినిమాల లాంటివి నాకెంతో ఇష్టం. అలాగే, షార్ట్‌ఫిలిమ్‌లు, నేషనల్ జాగ్రఫీ చానల్లో వచ్చే డాక్యుమెంటరీలు కూడా తరచూ చూస్తూ ఉంటాను. వాటి ప్రభావం నా మీద కొంత ఉంది. నాకెప్పుడూ, దేనికీ భయం లేదు! అవతలివాళ్ళను భయపెట్టడం నాకు ఇష్టం. కానీ, చిత్రమైన విషయం ఏమిటంటే, నాకు ఎప్పుడూ భయం అనిపించదు. చాలా ఏళ్ళ క్రితం మహారాష్ట్రలోని లాతూరులో భయంకరమైన భూకంపం వచ్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు నేను బొంబాయిలో ఎనిమిదో అంతస్థులోని ఇంట్లో ఉన్నా. భవనమంతా ఒక్కసారిగా భయంకరంగా ఊగుతోంది. భూకంపం వచ్చిన విషయం నాకు అర్థమైంది. కిందకు వెళదామని అనుకున్నా. కానీ, వెంటనే ఈ లోపలే భవంతి కూలిపోయి చనిపోతామేమోలే... ఇంకెందుకు వెళ్ళడం అనిపించింది. అంతే! అక్కడే ఉండిపోయి, భూకంపం వచ్చినప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలని నిర్ణయించుకున్నా. భవంతి గోడలు విరిగినప్పుడు ఎలాంటి శబ్దం వస్తుందా అని ఆలోచిస్తూ కూర్చున్నా! - రెంటాల జయదేవ ఫొటోలు: శివ మల్లాల