మేదినీనగర్(జార్ఖండ్): సమ సమాజం దిశగా ముందడుగేయాల్సిన భారతావనిలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే కులానికి చెందిన 50 దళిత కుటుంబాలను కొందరు ఊరిలో నుంచి తరిమేశారు. ఈ దళిత కుటుంబాల ఇళ్లను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇళ్లలోని వస్తువుల అన్నింటినీ వాహనాల్లోకి ఎక్కించి, వీరిని సమీప అడవిలోకి తరిమేశారు. జార్ఖండ్‌లోని పలామూ జిల్లాలోని మరుమటు గ్రామంలో ఈ వివక్షాపూరిత ఘటన జరిగింది.
ఘటనపై రాష్ట్ర గవర్నర్ రమేశ్ స్పందించారు. రెండ్రోజుల్లో నివేదిక సమరి్పంచాలని పలాము డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముషార్ కులానికి చెందిన 50 కుటుంబాలు మరుమటు గ్రామంలో నివసిస్తున్నాయి. సోమవారం హఠాత్తుగా కొందరు వీరు ఉండే ప్రాంతానికి వచ్చి అందరినీ చితకబాది ఇంటిసామగ్రిని బయటపడేసి ఇళ్లను ధ్వంసంచేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు, మేదినీనగర్ సబ్ డివిజినల్ ఆఫీసర్ రాజేశ్ కుమార్ షా, సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్(ఎస్‌డీపీవో) సుర్జీత్ కుమార్‌లు ఘటనాస్థలికి చేరుకున్నారు. బాధిత కుటుంబాలకు మళ్లీ ఊరిలో వారి స్థలాల్లోనే నివాస సౌకర్యాలు కలి్పస్తామని, ప్రస్తుతం తాత్కాలిక శిబిరాల్లో ఉంచామని అధికారులు తెలిపారు.
చదవండి: అంధుడైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు.. మైక్రోసాఫ్ట్‌లో 47 లక్షల వేతనం
Comments
Please login to add a commentAdd a comment