attack on dalits
-
చింతమనేని దాష్టీకంపై భగ్గుమంటున్న దెందులూరు
ఏలూరు, సాక్షి: ఎన్నికల వేళ.. దెందులూరు నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ప్రచారంలో వీరంగం సృష్టించారు. వైఎస్సార్సీపీ సంక్షేమ ప్రభుత్వం గురించి మాట్లాడిన దళితులపై తన అనుచరులతో దాడి చేయించారు. ఈ ఘటనపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు.. క్షతగాత్రులను పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, చింతమనేని తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. శుక్రవారం పెదవేగి మండలం లక్ష్మీపురం కూచిపూడి రామసింగవరం గ్రామాల్లో చింతమనేని, తన అనుచరులతో ప్రచారానికి వెళ్లారు. ఆ సమయంలో యర్ర చంటిబాబు అనే యువకుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంచి జరిగిందంటూ వ్యాఖ్యానించాడు. దీంతో కోపోద్రిక్తులైన చింతమనేని అనుచరులు అతనిపై దాడికి దిగారు. అడ్డుకోబోయిన మరికొందరు యువకులపైనా దాడి చేశారు. ఈ దాడిలో గాయపడ్డ ఐదుగురు యువకుల్ని హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరిలు, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఆస్పత్రికి వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. చింతమనేనిపై దెందులూరు ప్రజానీకం, దళిత సంఘాలు ఆగ్రహం వెల్లగక్కుతున్నాయి. నియోజకవర్గం వ్యాప్తంగా నిరసనలకు పిలుపు ఇచ్చాయి. మరోవైపు ఈ ఉదయం దాడి ఘటనపై ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. ‘‘చింతమనేని ఏమాత్రం విలువల్లేని నాయకుడు. చింతమనేని తన హయాంలో చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. 93 కేసులు ఉన్న ఓ రౌడీ షీటర్. ఎన్నికల ప్రచారంలోనూ తన ప్రవర్తన ఏమాత్రం మార్చుకోలేదు. దెందులూరులో గొడవలతో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.... ప్రచారంలో భాగంగా దళితవాడలోకి వెళ్లి మరీ దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం. సీఎం జగన్ హయాంలోనే తనకు మంచి జరిగింది అన్నందుకు ఓ దళిత యువకుడిపై బూతులు తిడుతూ దాడి చేయించాడు. అతని కన్నతల్లిని దుర్భాషలాడారు. ఆ యువకుల్ని చంపే ప్రయత్నం చేశారు. ఇలాంటి వ్యక్తికి బీఫామ్ ఇచ్చారు చంద్రబాబు. చంద్రబాబు ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా?. దళిత యువకులపై దాడి హేయనీయం. చింతమనేని అరాచకాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం. చింతమనేని పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలి. దళితులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి. ‘చింతమనేని.. ఎవరి పేగులు లాగేస్తావ్?. ఇలాంటి ప్రవర్తనను కొనసాగిస్తే నువ్వు ప్రచారం చేయలేవ్. ప్రజలపై విశ్వాసం లేని మూర్ఖుడివి నువ్వు. చంద్రబాబూ.. చింతమనేనిని ఎన్నికల ప్రచారానికి పంపావా? లేదంటే దళితులపై దాడిచేయమని పంపవా?.. చింతమనేని.. ఇక నుంచి దెందులూరులోని ప్రజలు గ్రామాల్లోకి రానియకుండా నిన్ను కట్టడి చేస్తారు. జాగ్రత్త.. చంద్రబాబు, చింతమనేని ఇద్దరూ బాధితులకు క్షమాపణ చెప్పాలి.. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి హెచ్చరించారు. -
మూడు రాజధానుల దీక్షా శిబిరంపై దాడి.. చంద్రబాబు డైరెక్షన్ మేరకే
తాడికొండ/సాక్షి, అమరావతి : అమరావతి దీక్ష శిబిరంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మూడు రాజధానుల శిబిరం వద్ద నిరసన తెలిపిన బహుజన పరిరక్షణ సమితి నాయకులు, కార్యకర్తలపై బీజేపీ ముసుగులోని టీడీపీ మాజీ మంత్రి అనుచరులు విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ దాడులను బీజేపీ, వైఎస్సార్సీపీ మధ్య చోటుచేసుకున్న ఘర్షణగా చిత్రీకరిస్తూ టీడీపీ, జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు రాజకీయ డ్రామాకు తెరతీశారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆదినారాయణరెడ్డిని నాటి సీఎం చంద్రబాబు టీడీపీలోకి లాక్కుని.. మంత్రివర్గంలో స్థానం కల్పించారు. 2019లో అధికారం కోల్పోగానే చంద్రబాబు కనుసైగల మేరకే ఆదినారాయణరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అమరావతి దీక్షలు 1200వ రోజుకు చేరుకున్న సందర్భంగా శుక్రవారం మందడంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆదినారాయణరెడ్డి.. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌తో కలిసి వెళ్లారు. ఆ శిబిరంలో సీఎం జగన్‌పై ఆదినారాయణరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం తాళ్లాయపాలెం జంక్షన్‌లోని మూడు రాజధానుల శిబిరంలో 915వ రోజు దీక్షలు చేస్తున్న బహుజన పరిరక్షణ సమితి నాయకులు, కార్యకర్తలకు తెలిసింది. కాసేపటి తర్వాత ఆదినారాయణరెడ్డి, సత్యకుమార్, వారి అనుచరులు విజయవాడకు బయలుదేరారు. వారి వాహన శ్రేణి మూడు రాజధానుల శిబిరం వద్దకు చేరుకోగానే.. బహుజన పరిరక్షణ సమితి నాయకులు రోడ్డు పక్కన నిల్చొని శాంతియుతంగా నిరసన తెలిపారు. ఆదినారాయణరెడ్డి డౌన్ డౌన్.. అమరావతి వద్దు.. మూడు రాజధానులే ముద్దు.. అంటూ నినదించడంతో ఆదినారాయణరెడ్డి అనుచరులు వారిపై విచక్షణా రహితంగా దాడులకు దిగారు. ఎస్సీ, ఎస్టీలు, మహిళలపై విరుచుకు పడ్డారు. మహిళలని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని లాగారు. వారు ప్రతిఘటించడానికి సిద్ధమవుతుండగా.. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనకు కారణమైన ప్రతిపక్ష నేత చంద్రబాబు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాదిగాని గురునాథం, నూతక్కి జోషి, ఈపూరి ఆదాం, బేతపూడి సాంబయ్య, బొలిమేర శామ్యూల్, కారుమూరి పుష్పరాజ్, ఇందుపల్లి సుభాషిణి, మల్లవరపు సుధారాణి, తదితరులు డిమాండ్ చేశారు. అనంతరం దీక్ష శిబిరాన్ని సందర్శించిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఆయన అనుచరులు, టీడీపీ నాయకులు శిబిరం వద్ద ఉన్న మహిళలను జుట్టు పట్టుకొని తన్నారని చెప్పారు. చంద్రబాబు డైరెక్షన్లోనే ఇదంతా జరిగిందన్నారు. ఆదినారాయణరెడ్డి కోసమే.. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తీరుపై బహుజనులు నిరసన తెలపడంలో భాగంగానే ఈ సంఘటన జరిగిందని బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ ఘటన సమయంలో ‘నా పేరు ఎవరూ ఎత్తలేదు.. ఆదినారాయణరెడ్డి కోసమే ఆరా తీశారు. ఆయన నా కారు ఎక్కలేదు. ఉదయం నేను, ఆయన కలిసి వెళ్లాం. సభ నుంచి ఆయన కాస్త ముందుగా వచ్చారు. ఆ విషయం వారికి తెలియదు. ఎవరో నా కారుపై దాడి చేశారు’ అని వివరించారు. కాగా, సత్యకుమార్ కారుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ ఘటనకు నిరసనగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పారు. ఈ ఘటన గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ దాదాగిరీ పరాకాష్టకు చేరిందన్నారు. అమరావతి రైతులపై 3,500 కేసులా? అమరావతి రైతులపై 3,500 కేసులు నమోదు చేశారని, ఇదెక్కడ న్యాయమని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఆదినారాయణరెడ్డి ప్రశ్నించారు. అమరావతి దీక్షలు 1200వ రోజుకు చేరిన సందర్భంగా తుళ్లూరు మండలం మందడంలోని దీక్షా శిబిరంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతులకు లీగల్‌గా, పర్సనల్‌గా, పార్టీ పరంగా, టెక్నికల్‌గా అన్ని విధాలా సాయం చేస్తామని స్పష్టం చేశారు. కేసు నమోదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుపై బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ పులిపాటి ప్రవీణ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో వెంటనే జోక్యం చేసుకుని, నివారించామన్నారు. గుర్తు తెలియని వ్యక్తి బీజేపీ నేత సత్యకుమార్ వాహనంపై రాయి విసిరి పొలాల్లోకి పారిపోయాడని చెప్పారు. తమపై ఆదినారాయణరెడ్డి అనుచరులు దాడి చేశారంటూ మూడు రాజధానుల ఆందోళనకారులు ఫిర్యాదు ఇచ్చారని, ఈ ఘటనపై త్వరితగతిన దర్యాప్తు చేస్తామని తెలిపారు. చదవండి: ప్రతిసవాల్‌ను స్వీకరించని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి -
బైక్‌ను తాకాడని దళిత విద్యార్థి గొంతు పిసికిన టీచర్
బలియా (యూపీ): తన మోటారుసైకిల్‌ను తాకాడనే కారణంగా ఓ దళిత విద్యార్థిని తరగతి గదిలో బంధించి, ఇనుప రాడ్‌తో కొట్టాడో ఉపాధ్యాయుడు. ఉత్తరప్రదేశ్‌లోని నగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని రనౌపూర్ హయ్యర్ సెకండరీ స్కూల్లో శుక్రవారం ఈ దారుణం చోటుచేసుకుంది. ‘స్కూల్ ఉపాధ్యాయుడు కృష్ణ మోహన్ శర్మ బైక్‌ను ఆరో తరగతి చదువుకుంటున్న ఓ దళిత విద్యార్థి తాకాడు. శర్మ ఆగ్రహంతో ఆ బాలుడిని గదిలో బంధించి, ఐరన్ రాడ్‌తో, చీపురుతో కొట్టాడు. అతడి గొంతు పిసికాడు. స్కూల్ సిబ్బంది బాధిత బాలుడిని కాపాడారు’ అని పోలీసులు తెలిపారు. ఆగ్రహించిన బాలుడి కుటుంబసభ్యులు శనివారం స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. అధికారులు ఉపాధ్యాయుడు శర్మను సస్పెండ్ చేశారు. చదవండి: పాపం పక్షులు.. గుండెల్ని పిండేస్తున్న వీడియో.. స్పందించిన గడ్కరీ కార్యాలయం -
జార్ఖండ్‌లో దారుణ కుల వివక్ష.. 50 దళిత కుటుంబాలను తరిమేసి..
మేదినీనగర్(జార్ఖండ్): సమ సమాజం దిశగా ముందడుగేయాల్సిన భారతావనిలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే కులానికి చెందిన 50 దళిత కుటుంబాలను కొందరు ఊరిలో నుంచి తరిమేశారు. ఈ దళిత కుటుంబాల ఇళ్లను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇళ్లలోని వస్తువుల అన్నింటినీ వాహనాల్లోకి ఎక్కించి, వీరిని సమీప అడవిలోకి తరిమేశారు. జార్ఖండ్‌లోని పలామూ జిల్లాలోని మరుమటు గ్రామంలో ఈ వివక్షాపూరిత ఘటన జరిగింది. ఘటనపై రాష్ట్ర గవర్నర్ రమేశ్ స్పందించారు. రెండ్రోజుల్లో నివేదిక సమరి్పంచాలని పలాము డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముషార్ కులానికి చెందిన 50 కుటుంబాలు మరుమటు గ్రామంలో నివసిస్తున్నాయి. సోమవారం హఠాత్తుగా కొందరు వీరు ఉండే ప్రాంతానికి వచ్చి అందరినీ చితకబాది ఇంటిసామగ్రిని బయటపడేసి ఇళ్లను ధ్వంసంచేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, మేదినీనగర్ సబ్ డివిజినల్ ఆఫీసర్ రాజేశ్ కుమార్ షా, సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్(ఎస్డీపీవో) సుర్జీత్ కుమార్‌లు ఘటనాస్థలికి చేరుకున్నారు. బాధిత కుటుంబాలకు మళ్లీ ఊరిలో వారి స్థలాల్లోనే నివాస సౌకర్యాలు కలి్పస్తామని, ప్రస్తుతం తాత్కాలిక శిబిరాల్లో ఉంచామని అధికారులు తెలిపారు. చదవండి: అంధుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు.. మైక్రోసాఫ్ట్‌లో 47 లక్షల వేతనం -
'చంద్రబాబు నిర్మాతగా రోజుకో సినిమా చూపిస్తున్నారు'
సాక్షి, కృష్ణా : చంద్రబాబు నిర్మాతగా రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడు దర్శకత్వంలో రోజూ మనకు మహాద్భుతమైన సినిమాను చూపిస్తున్నారని మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. దళితులకు ద్రోహం జరుగుతుందని టీవీ చానెల్స్ డిబేట్లు పెడుతున్నాయన్నారు. ఎందకు పనికిరాని కొంతమంది టీడీపీ నేతలు టీవీల ముందుకు వచ్చి విషపూరిత ఉపన్యాసాలు ఇస్తున్నారన్నారు. నిజానికి టీడీపీ నేతలే దళితులపై దాడులు చేయిస్తున్నారు. (చదవండి : పల్లకి మోసే పనులు మాకు.. పల్లకిలో కూర్చునేది మీరు) అంతేగాక చంద్రబాబు ఈ దాడులపై దుష్ర్పచారం చేస్తూ ప్రభుత్వం మీద బురద జల్లాని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కోర్టుల్లో కేసులు వేసి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుంది చంద్రబాబు కాదా అంటూ ప్రశ్నించారు. త్వరలోనే మహిళల పేర్లపై రిజిస్ట్రేషన్లు చేసి, ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాల కోసం ఇప్పటివరకు రూ.60వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి నాని వెల్లడించారు. -
'ప్రజారోగ్యం గాలికొదిలేసిన దిక్కుమాలిన ప్రభుత్వం'
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పట్టణాలకే పరిమితమైన కరోనా ఇప్పుడు గ్రామాలకు విస్తరించే పనిలో ఉందన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో భట్టి మాట్లాడుతూ.. ప్రజారోగ్యాన్ని ఇంత దారుణంగా గాలికొదిలేసిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చూడలేదని మండిపడ్డారు. వెంటనే గ్రామాల్లో, మండల కేంద్రాల్లో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరోనాను కంట్రోల్ చేయడానికి కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను కాంగ్రెస్ నేతలను కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం వాడుకుంటుందని భట్టి విమర్శించారు. ప్రభుత్వం చేసిన తప్పు వల్లే గజ్వేల్‌లో రైతు ఆత్మహత్య చేసుకున్నాడని.. టీఆర్ఎస్ అనే ఫ్యూడల్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ దాడులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో దళితులపై దాడులు ఆగడం లేదని.. దళిత వర్గానికి రాజ్యాంగ రక్షణ కరువయిపోయిందని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులపై సిరిసిల్ల దగ్గర మొదలుకొని గజ్వేల్ నుంచి రాజాపూర్ వరకు దాడులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. దళితులపై జరుగుతున్న దాడుల పై డీజీపీ కి ఫిర్యాదు చేస్తే కనీసం స్పందన కూడా కరువయింది.. ఈ దాడుల గురించి గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. కరోనా వైరస్ కారణంగా గవర్నర్‌ను నేరుగా కలవకుండా మెయిల్ ద్వారా ఫిర్యాదును పంపుతున్నట్లు తెలిపారు. -
ఓట్లు వేయలేదంటూ దళితులపై దాడి
పెదకూరపాడు: తమకు ఓట్లు వేయలేదన్న అక్కసుతో గుంటూరు జిల్లాలో తెలుగుదేశం నేతలు బరితెగించారు. దళితులపై ఆదివారం దాడులకు తెగబడ్డారు. పెదకూరపాడు మండలం లగడపాడులో ఈ దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఎస్సీలు ఆదివారం రాత్రి కాలనీలో ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో చంద్రబాబు సామాజికవర్గం నేతలు కత్తులు, గొడ్డళ్లు, రాడ్లతో వారిపై దాడి చేశారు. టీడీపీ నేత శివయ్యతోపాటు తదితరులు అంబేడ్కర్ జయంతి వేడుకలను అడ్డుకోవటమే కాకుండా రోడ్డుపై ట్రాక్టర్‌ను అడ్డుగా ఉంచి ఊర్లోకి వెళ్లనీయకుండా దౌర్జన్యానికి దిగారు. ఎంత ధైర్యం ఉంటే మాకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీకి ఓటు వేస్తారంటూ రాయలేని భాషలో బూతులు తిడుతూ మారణాయుధాలతో దాడులకు పాల్పడ్డారు. ఎస్సీ కాలనీని చుట్టుముట్టి విధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలోకి వచ్చినప్పటికి వారిని సైతం లెక్కచేయకుండా బూతులు తిడుతూ దాడులకు దిగారు. దీంతో గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద దళితులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా దళిత మహిళలు మాట్లాడుతూ అంబేడ్కర్ జయంతిని జరుపుకోనీయకుండా తమపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఊర్లో ఉండాలా? ఊరు వదిలి వెళ్లాలా? అంటూ కన్నీరుమున్నీరయ్యారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా వండుకున్న భోజనాన్ని కూడా తిననీయకుండా దాడులకు తెగబడటం దారుణమన్నారు. ఎన్నికల రెండు రోజుల ముందు నుంచి టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నారని అయినా సహనంతో వాళ్లు ఎన్ని తిడుతున్నా పట్టించుకోలేదని అన్నారు. పోలీసులు సైతం టీడీపీ నేతలకే కొమ్ముకాస్తూ తమను వెళ్లిపోవాలంటూ హెచ్చరిస్తున్నారని వాపోయారు. -
దళితులపై దాడులకు నిరసనగా 26న ధర్నా
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా దళితులపై సాగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల 26న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్‌పీఎస్) నేత, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ తెలిపారు. రాజ్యాంగం ప్రకారం దళితులకు స్వేచ్ఛ, సమానత్వం, సమాన హక్కులు, వైద్య, విద్య, ఉద్యోగాలు కల్పించడం కేంద్ర, రాష్ట్రాల బాధ్యత అని పేర్కొన్నారు. ఈ హక్కులు దక్కకుండా చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం మఖ్దూం భవన్లో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.ఏసురత్నం అధ్యక్షతన జరిగిన సమావేశంలో మల్లేశ్ మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బీజేపీ, సంఘ్ పరివార్ ప్రోద్బలంతో దళితులపైనా పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. సమావేశంలో నేతలు నర్రా శ్రవణ్, ఆరుట్ల రాజ్ కుమార్, మార్టిన్ పాల్గొన్నారు. -
దళితునిపై అగ్రవర్ణాల దాడి
యర్రగొండపాలెం: నేటి టీడీపీ పాలనలో దళితులపై దాడులు హెచ్చిమీరుతున్నాయి. తాజాగా మండలంలోని అమానిగుడిపాడులో మంగళవారం రాత్రి ఇలాంటి ఘటనే జరిగింది. మందా దేవదాసు అనే వ్యక్తిపై గ్రామానికి చెందిన ముగ్గురు అగ్రవార్ణానికి చెందినవారు కులం పేరుతో దూషిస్తు దాడికి పాల్పడ్డారు. గాయాలపాలైన దేవదాసు యర్రగొండపాలెంలోని ప్రభుత్వ వైద్యశాలలో చేరి చికిత్స పొందుతుండగా బుధవారం ఉదయం నిందితులు ముసుగులు ధరించి బాధితుడి గొంతుకోసి సాక్ష్యం లేకుండా హతమార్చటానికి ప్రయత్నించారు. అమానిగుడిపాడులో తొలుత దాడి జరిగిన సమయంలో ఉన్న మరో వ్యక్తి ఇంటి వద్దకు వెళ్లి తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని బెదిరించారు. అందుకు నిరాకరించిన అమృతపూడి బాబు అనే వ్యక్తిని కులంపేరుతో దూషిస్తు కాళ్లతో తన్నారని ఆయన భార్య హెప్సీరాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె తెలిపిన వివరాల మేరకు.. అమానిగుడిపాడు ఎస్సీ కాలనీకి చెందిన మందా దేవదాసు మంగళవారం తమ గ్రామంలోని మద్యం షాపువద్దకు వెళ్లాడు. అక్కడ ఉన్న లక్ష్మయ్య అనేవ్యక్తి తనకు ఇవ్వవలసిన బాకీ అడిగాడు. తాను తీసుకున్న రూ. 3వేలు అసలు, వడ్డీకింద మరో రూ. 3వేలు కలిపి రూ. 6వేలు దఫాలుగా చెల్లించానని, ఇక తాను కట్టలేనని దేవదాసు చెప్పాడు. వీరిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడ ఉన్న వేగినాటి ఆనందకుమార్, జాగర్లమూడి సూరయ్య, మూతి శ్రీను అనేవారు దేవదాసును కులం పేరుతో దూషించడం మొదలు పెట్టారు. మీకు సంబంధంలేని విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని దేవదాసు ప్రశ్నించడంతో వెంటనే అతనిపై దాడి చేసి కాళ్లు, చేతులతో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనతో భీతిల్లిన దేవదాసు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత తనభార్య మూగమ్మతో కలిసి వైపాలెంలోని ప్రభుత్వ వైద్యశాలలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఉదయం 5గంటల ప్రాంతంలో దేవదాసు బహిర్భూమికి వెళ్లాడు. అయితే అక్కడ కాపుకాసి ఉన్న నిందితులు తిరిగి అతనిపై దాడి చేశారు. సాక్ష్యం లేకుండా హతమార్చాలనే ఉద్దేశంతో గొంతుకోసి పారిపోయారు. విషయం తెలుసుకున్న అమానిగుడిపాడు ఎస్సీ పాలెం వారితో పాటు దళిత నాయకులు వైద్యశాలవద్దకు చేరుకున్నారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీగా స్థానిక వైఎస్సార్ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ దాదాపు గంటపాటు రాస్తారోకో చేశారు. దళితవాడలను శ్మశానాలుగామార్చుతారా? టీడీపీ ప్రభుత్వం దళితవాడలను శ్మశానాలుగా మార్చాలనుకుంటోందని దళిత సంఘాలకు చెందిన నాయకులు ఆరోపించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి మండాది పీటర్ మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఎక్కువగా దళితులపై దాడులు జరుగుతున్నాయని, హత్యలు, అత్యాచారాలు పెరిగి పోయాయని ఆరోపించారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే చుండూరు, కారంచేడు సంఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. పలుకుబడిఉన్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడంలేదని ఆయన విమర్శించారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని అప్పటి వరకు ఆందోళన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని హెచ్చరించారు. తక్షణమే అరెస్ట్ చేస్తాం నిందితులను పట్టుకొని తక్షణమే అరెస్ట్ చేస్తామని మార్కాపురం డీఎస్పీ రామాంజనేయులు అన్నారు. రాస్తారోకో చేస్తున్న దళితులు, ప్రజా సంఘాలను ఉద్దేశించి మాట్లాడారు. దాడులు జరిపిన నిందితులను ఉపేక్షించేదిలేదని, వారు ఎక్కడ ఉన్నా పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కేసును త్వరితగతిన ముందుకు సాగేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అమానిగుడిపాడులో ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు డివిజన్ పరిధిలోని దళితనాయకులతో చర్చిస్తామన్నారు. కార్యక్రమంలో దళిత నాయకులు ఆర్.ప్రసాద్, కె.గురవయ్య, సింగా ప్రసాద్, సీపీఐ నాయకుడు డి.శ్రీనివాస్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కె.కళావతి, రైతుసంఘం డివిజనల్ కార్యదర్శి డి.తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. -
దళితుడితో మూత్రం తాగించారు!
లక్నో : తమ పంటను కోయలేదని అగ్ర కులాలకు చెందిన కొందరు వ్యక్తులు ఓ దళితుడితో మూత్రం తాగించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది. ఏప్రిల్ 23న జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. బదౌన్ జిల్లాలోని అజంపూర్ బిసౌరియా గ్రామంలోని వాల్మికీ సామాజిక వర్గానికి చెందిన సీతారాం వాల్మికీ తనకున్న కొద్ది పొలంలో గోధమ సాగు చేశారు. తన పంట కోతకు రావడంతో ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే అదే ఊరిలో అగ్ర కులానికి చెందిన కొందరు రైతులు మాత్రం తమ పొలంలోని పంటను కోసిన తర్వాతే నీ పంటని కోసుకోవాలని సీతారాంని బెదిరించారు. దీనికి అతను ఒప్పుకోకపోవడంతో అతనిపై దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటనపై బాధితుడు మాట్లాడుతూ.. వారి మాట విననందుకు తనపై చెప్పులతో దాడి చేశారని తెలిపారు. అంతేకాకుండా మీసాలను బలంగా లాగుతూ.. బలవంతగా తనతో మూత్రం తాగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై పాశవికంగా ప్రవర్తించిన వారిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే స్థానిక ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేసేందుకు నిరాకరించాడు. దీంతో ఎస్పీని ఆశ్రయించడంతో ఆయన ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ పోలీసు అధికారిని సస్పెండ్ చేయడంతోపాటు అతనిపై శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశించారు. ఈ కేసులో గ్రామానికి చెందిన విజయ్ సింగ్, పింకు సింగ్, శైలేంద్ర సింగ్ ప్రధాన నిందితులుగా ఉన్నారని పోలీసు ఉన్నాతాధికారులు తెలిపారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. -
గుర్రంపై ఊరేగాడని..
భిల్వారా : పెళ్లిరోజు గుర్రంపై ఊరేగాడని దళితుడిపై గ్రామస్తులు ప్రతాపం చూపారు. అగ్రవర్ణాలకే పరిమితమైన ఈ సంప్రదాయాన్ని హైజాక్ చేశాడంటూ దళితుడిని బలవంతంగా గుర్రంపై నుంచి కిందకు దించి దారుణంగా కొట్టారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు 250 కిమీ దూరంలోని భిల్వారా జిల్లా గోవర్థనపుర గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పెళ్లికొడుకుపై గ్రామస్తుల దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు తాము ప్రయత్నించినా పెద్దసంఖ్యలో చేరుకున్న అల్లరి మూకలు దాడికి తెగబడ్డాయని పోలీసులు తెలిపారు. దళిత యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. పెళ్లి సందర్భంగా ఊరేగింపు నిర్వహించే దళిత పెళ్లికుమారులను అడ్డుకోవడం, వారిపై దాడిచేయడం వంటి ఘటనలు ఉత్తరాది రాష్ట్రాల్లో తరచూ చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో ఈ ఏడాది మార్చిలో ఓ దళితుడిని గుర్రంపై ఊరేగినందుకు అగ్రవర్ణాలకు చెందిన కొందరు హతమార్చిన ఘటన కలకలం రేపింది. -
నేటి నుంచి కాంగ్రెస్ ‘సేవ్ ది కాన్స్టిట్యూషన్’
న్యూఢిల్లీ: బీజేపీ హయాంలో దేశంలో రాజ్యాంగంతోపాటు దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆరోపిస్తూ సోమవారం నుంచి కాంగ్రెస్ ‘రాజ్యాంగాన్ని రక్షించండి’ (సేవ్ ది కాన్స్టిట్యూషన్) కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీన బీఆర్ అంబేడ్కర్ జయంతి వరకు కొనసాగనున్న ఈ ప్రచార కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టనున్నారు. 2019 ఎన్నికల్లో దళితులకు దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగా పార్టీ చేపట్టే ఈ కార్యక్రమంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ , ప్రధాన కార్యదర్శి గులాంనబీ ఆజాద్, సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, సుశీల్ కుమార్ షిండే తదితరులు పాల్గొననున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీ దళిత నేతలు వివిధ స్థాయిల్లో జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రస్తుత బీజేపీ పాలనలో జరుగుతున్న అన్యాయాన్ని వివరించి, ప్రజాభిప్రాయాన్ని కూడగడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
రాజ్యాంగ హక్కులను కాపాడండి
న్యూఢిల్లీ: దేశంలో దళితులపై జరుగుతున్న దాడులను ఖండించడంతో పాటు రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దీనికి గానూ ‘సేవ్ ద కాన్స్టిట్యూషన్’ పేరిట దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ నిర్వహించనుంది. ఈ నెల 23న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇక్కడి తల్కటోరా స్టేడియంలో దీనిని ప్రారంభించనున్నారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించిన దళితులు, పౌర సంఘాలు, పంచాయతీ సమితులు సహా పలువురు సామాజిక కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వీరంతా తమ తమ రాష్ట్రాల్లో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రచారం నిర్వహిస్తారని ఎస్సీ విభాగం చైర్మన్ నితిన్ రౌత్ వెల్లడించారు. -
దళితులపై టీడీపీ నేతల దాడి
సాక్షి, వెదురుకుప్పం: వంక పోరంబోకులో అక్రమ నిర్మాణాన్ని తొలగించారన్న కక్షతో చిత్తూరు జిల్లాలో కొందరు అధికారపార్టీ నాయకులు దళితులపై దౌర్జన్యం చేశారు. కర్రలు, రాళ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెదురుకుప్పం మండలం బొమ్మయ్యపల్లె పంచాయతీ జడబాపనపల్లె ఆది ఆంధ్రవాడలో ఈ దారుణం జరిగింది. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యూకేమర్రిçపల్లెకు చెందిన మండల టీడీపీ ఉపాధ్యక్షుడు వెంకట్రామనాయుడికి.. జడబాపనపల్లె దళితులకు గతంలో దారి సమస్యపై విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే జడబాపనపల్లెకి చెందిన టీడీపీ కార్యకర్త మణితో పాటు కొందరు వంక పోరంబోకులో షెడ్డు, మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. దీంతో గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు వెళ్లి షెడ్డుతో పాటు మరుగుదొడ్లను తొలగించారు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన మునిరాజ ఇంటి వెనుక భాగంలో స్నానం చేసుకోవడం కోసం తడికెలతో చిన్నిపాటి గదిని ఏర్పాటు చేసుకున్నాడు. దీన్ని సాకుగా తీసుకున్న మర్రెపల్లె గ్రామానికి చెందిన టీడీపీ మండల ఉపాధ్యక్షుడు వెంకట్రామనాయుడు, అతని అనుచరులు మణితో జతకలిసి బుధవారం ఉదయం దాడి చేశారు. ఇళ్లలో ఉన్న వారిని బయటకు లాక్కొచ్చారు. దీంతో భయంతో దళితులు పరుగులు తీశారు. ఈ దాడిలో పురుషోత్తం(29), వెంకటస్వామి(59), సుబ్రమణ్యం(60) తీవ్రంగా గాయపడ్డారు. భయంతో 100కు సమాచారం ఇచ్చారు. దీంతో కార్వేటినగరం సీఐ చల్లనిదొర, వెదురుకుప్పం ఎస్ఐ రామకృష్ణ జడబాపనపల్లె గ్రామానికి వచ్చి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని సీఐ పేర్కొన్నారు. -
దళితులపై దాడిని ఖండిస్తున్నాం
► టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ► సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నేరెళ్ల ఘటనపై ఫొటో ఎగ్జిబిషన్ ► అన్ని పార్టీలు ఒక్కటై పోరాడాలి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ► ఇసుక దందాపై విచారణ జరగాలి: కోదండరాం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గంలో దళితులపై జరిగిన దమనకాండను ఖండిస్తున్నామని, బాధితు లకు నష్టపరిహారం చెల్లించాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. నేరెళ్ల ఘటనపై గురువారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో టీడీపీ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. వివిధ పార్టీల నేతలు ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు. నేరెళ్ల ఘటనపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి బాధితులకు న్యాయం జరిగేలా ప్రయత్నం చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నా రు. లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ బాధితులను చూసి కంట తడిపెడితే సీఎం కేసీఆర్ హేళన చేశారని, ఇలాంటి సంఘట నలపై అన్ని పార్టీలు ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒక్కటైన పార్టీలకు అభినందన.. అట్టడుగు వర్గాల మీద జరిగిన దాడులను ఖండించడానికి ఏకతాటిపైకి వచ్చిన అన్ని పార్టీలను అభినందిస్తున్నానని టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. లారీని తగుల బెట్టా రన్న నెపంతో పది కుటుంబాలను టార్గెట్ చేశా రని ఆరోపించారు. కులం పేరుతో దూషించిన తర్వాత ఇది దళితులపై జరిగిన దాడి కాదని ఎలా అంటారని, బాధ్యులపై అట్రాసిటీ కేసులు కూడా పెట్టాలని అన్నారు. ఇసుక దందాపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నేరేళ్ల బాధితులను తాను స్వయంగా కలిశానని, పోలీసులు వారిని చిత్రహింసలు పెట్టారని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రజా పరిపాలన కాకుండా పోలీస్ పాలన సాగిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి విమర్శించారు. దళితులను ఎందుకు చిత్రహింసలకు గురిచేయాల్సి వచ్చిందో చెప్పాలని, చలో సిరిసిల్ల పాదయాత్ర కార్యక్రమానికి అన్ని పార్టీల సహకారం ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. ఇసుక మాఫియాతో కేటీఆర్‌కు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని, కేసీఆర్ కుటుంబమే ఇసుక మాఫియాను నడిపిస్తోందని, ఇందుకు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. నేరెళ్ల బాధితులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నేరేళ్ల ఘటనను బీజేపీ ఖండిస్తోందని ఆ పార్టీ నాయకుడు చింతా సాంబమూర్తి పేర్కొన్నారు. నేరేళ్లలో జరిగిన దాడులను సీపీఐ ఖండిస్తోందని ఆ పార్టీ నేత బాలస్వామి అన్నారు. -
నేరెళ్ల ఘటనలో కేటీఆర్ దోషే..
► ‘హ్యుమన్‌రైట్స్’కు తీసుకెళ్లి అట్రాసిటీ కేసుకు డిమాండ్ చేస్తం ►కాంగ్రెస్ పార్టీ ముసలినక్కే కావచ్చు.. ► టీఆర్ఎస్ పార్టీలా మోసపూరితమైనది కాదు ► కేసీఆర్‌ది దొంగ దీక్షని తెలిసినా.. తెలంగాణకు మద్దతిచ్చాం ► కాపలాకుక్కలా ఉంటానన్న కేసీఆర్ గుంటనక్కలా మారాడు ► 31న చలో సిరిసిల్ల : సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి సాక్షి, కరీంనగర్: నేరెళ్ల దళితులపై జరిగిన దాడి ఘటనలో రాజన్న సిరిసిల్ల ఎస్పీతోపాటు మంత్రి కేటీఆర్ సైతం దోషేనని.. ఇసుక మాఫియాతో భాగస్వామ్యం ఉన్నం దువల్లే చర్యలు తీసుకోలేకపోతున్నారని సీఎల్పీ ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్రెడ్డిఅన్నారు. ఈనెల 31న చేపట్టనున్న చలో సిరిసిల్ల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బుధవారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. నేరెళ్లలో ఇసుక లారీ ప్రమాదం జరిగ దళితుడు చనిపోతే రాజకీయాలకు అతీతంగా పార్టీలు స్పందించాయని, అందులో టీఆర్ఎస్ కూడా ఉందన్నారు. లారీల దహనం కేసులో ఇంటరాగేషన్ పేరుతో ఎస్పీ థర్డ్ అమాయకులపై డిగ్రీ ప్రయోగించడమే కాకుండా ఈ విషయాన్ని బయట చెబితే కుటుంబాల్లోని మహిళలపై వ్యభిచారం కేసులు, పిల్లలపై గంజాయి కేసులు నమోదు చేస్తామని బెదిరించడం సిగ్గుచేటన్నారు. ‘ఎస్సీ అయితే కొమ్ములున్నాయారా..? అట్రాసిటీ కేసుతో నన్నేమి చేస్తారురా..’ అంటూ దుర్భాషలాడారని, ఐపీఎస్‌లో ఇదే ట్రేనింగ్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. దళితుల రక్షణకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. చలో సిరిసిల్ల కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా భావించి, ప్రభుత్వ ఆకృత్యాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ముసలి నక్క అంటూ కేటీఆర్ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ముసలి నక్కేకావచ్చుగానీ.. టీఆర్ఎస్లా మోసపూరితమైన పార్టీ కాదన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ప్రాణాలర్పించిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు. కేసీఆర్‌ది దొంగ దీక్షని తెలిసి కూడా ఆనాడు తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం కోసం సమర్థించామని స్పష్టంచేశారు. తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ ఇప్పుడు గుంటనక్కలా తయారయ్యాడని ఎద్దేవా చేశారు. 31న నిర్వహించే ఛలో సిరిసిల్ల కార్యక్రమంతో యావత్ సమాజాన్ని మేల్కొలిపి టీఆర్ఎస్ ఆకృత్యాలను బయటపెడతామని హెచ్చరించారు. పోలీసులు నిర్ధోషులైతే 15 రోజులుగా బాధితులు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలా చికిత్స పొందుతున్నారని ప్రశ్నించారు. బా«ధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని, న్యాయ విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ కేసును హ్యుమన్ రైట్స్‌కు తీసుకెళ్తామని, బాధ్యులపై అట్రాసిటీ కేసు నమోదుకు డిమాండ్ చేస్తామన్నారు. డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కర్ర రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
'చంద్రబాబు నిర్లక్ష్యం మళ్లీ రుజువైంది'
⇒ మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య కాకినాడ : కోనసీమలో దళితులను అమానుషంగా హింసించి గాయపర్చిన సంఘటన జరిగి రెండు వారాలవుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు విచారకరమని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్న బాధితుడు వెంకటేశ్వరరావును గురువారం పరామర్శించి ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియూతో మాట్లాడుతూ.. కేవలం రూ.లక్ష పరిహారాన్ని చంద్రబాబు పంపించి చేతులు దులుపుకోవడం దళితుల పట్ల ఆయనకున్న నిర్లక్ష్యాన్ని మరోమారు రుజువు చేసుకున్నారని విమర్శించారు. రాజమండ్రి వరకు వచ్చిన సీఎం అమలాపురానికి ఎందుకు రాలేకపోయారని, గుజరాత్ ఘటనను పోటీలు పడి ఖండించిన టీడీపీ నేతలు, మంత్రులు నేడు ఏమయ్యారని ప్రశ్నించారు. దాడి కేసులో ఎ-1 ముద్దాయిగా ఉండాల్సిన వ్యక్తిని 8వ ముద్దాయిగా చూపడం చూస్తుంటే కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. తక్షణం బాధితులను అన్నివిధాలా ఆదుకోవాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సేవ్దళిత్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా యాత్రలు చేపట్టి ఉద్యమాన్ని ఉదృ్ధతం చేస్తామన్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దళితులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో గ్రామ బహిష్కరణలు నేటికీ జరుగుతున్నాయన్నారు. పదిరోజుల కందట అదే జిల్లా పచ్చికాపల్లం గ్రామంలో ధర్మరాజుల తిరునాళ్ళలో దళితులను బహిష్కరిస్తే నేటికీ బాధ్యులను అరెస్ట్ చేయలేదని, నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం నిండలి గ్రామంలో సాక్షాత్తు సీఎం బంధువులు ఎస్సీ, ఎస్టీల భూమిని ఆక్రమించి, మహిళలపై అమానుషంగా దాడిచేస్తే వారిపై శిక్షించలేదని చెంగయ్య ఈ సందర్భంగా గుర్తుచేశారు. -
చంద్రబాబుకు బాధ్యత లేదా?
≈ సీఎంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు ≈ దాడిలో గాయపడ్డ దళితులను పరామర్శించే తీరిక లేదా? ≈ మొక్కుబడిగా రూ.లక్ష ఇచ్చేస్తే సరిపోతుందా? ≈ ఒక్కొక్కరికి రూ.8.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందే ≈ బాధితుల గోడు వింటే గుండె బరువెక్కుతోంది ≈ దళితులపై దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి ≈ అమలాపురం ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన ప్రతిపక్ష నేత సాక్షిప్రతినిధి, కాకినాడ: పాశవిక దాడిలో గాయపడ్డ దళితులను పరామర్శించే సమ యం, తీరిక, బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేవా? అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. గోదావరి అంత్య పుష్కరాల ముగింపు ఉత్సవాలకు రాజమహేంద్రవరానికి వచ్చి కూడా బాధితులను కనీసం పలకరించాలనే మానవతా దృక్పథం కూడా చంద్రబాబుకు లేకుండా పోయిందని మండిపడ్డారు. దళితులను పట్టించుకోకుండా వెళ్లిపోయిన చంద్రబాబును ఏమనుకోవాలని ప్ర శ్నించారు. బాధితులకు ఏదో మొక్కుబడిగా తలో రూ.లక్ష ఇచ్చేస్తే సరిపోతుందనుకుంటున్నారా? అని ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ సూదాపాలెంలో చనిపోయిన ఆవు చర్మాన్ని వలుచుకుంటున్న దళితులపై కొందరు వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో గాయపడి, చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం అమలాపురం ఏరి యా ఆస్పత్రిలో పరామర్శించారు. అనంతరం ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. మీడియాతో జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘నిన్న చంద్రబాబు నాయుడు ఈ జిల్లాకు వచ్చారు. దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించి, ఏం జరిగిందో అడిగి ఉంటే.. వారిలో మనోధైర్యం పెరిగేది. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెబితే బాధితుల్లో నమ్మకం కలిగేది. ఆ నమ్మకం ఈవాళ చంద్రబాబు ఇవ్వగలుగుతున్నారా? ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధ చట్టం ప్రకారం.. ఇలాంట దారుణమైన ఘటనలు జరిగితే ప్రభుత్వం తరుపున బాధితులకు రూ.లక్ష నుంచి రూ.8.25 లక్షల వరకు పరిహారం ఇవ్వాలి. ముఖ్యమంత్రి మాత్రం అందులో మొదటి చెప్పిన రూ.లక్ష ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో చంద్రబాబే చెప్పాలి. చట్టంలో ఉన్నట్టుగా నలుగురు బాధితులకు రూ.8.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. దళితులపై దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టాలి. ప్రజలకు తోడుగా ఉంటామనే భరోసాను కల్పించాలి. హోం మంత్రి సొంత మండలంలో ఘోరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు చెప్పిన విషయాలు వింటే గుండె బరువెక్కుతోంది. వ్యవస్థలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నా ప్రశ్నించకపోవడం ధర్మమేనా? వారు దశాబ్దాలుగా చర్మాలు వలుచుకునే వృత్తిలో ఉన్నారు. బతుకు తెరువు కోసం వారికి మరో మార్గం లేదు. ఆవు చర్మం తీస్తున్నారనే ఒకే ఒక్క కారణంతో వీరిని శ్మశానం నుంచి దాదాపుగా 300 మీటర్లు చొక్కా పట్టుకొని నిర్దాక్షిణ్యంగా లాక్కొని పోయారు. శ్మశానం నుంచి బయటకు వచ్చిన తరువాత చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. దుర్భాషలాడుతూ చెప్పు తీసుకుని మరీ కొట్టారు. చిన్న పిల్లవాడిని కూడా వదిలిపెట్టలేదు. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. వ్యక్తులను నడిరోడ్డు మీదకు తీసుకొచ్చి, చెట్లకు కట్టేసి చెప్పులతో కొట్టడమన్నది సభ్య సమాజం అంగీకరించే విషయం కాదు. అరగంట తరువాత పోలీసులు వచ్చారు. పోలీసుల సమక్షంలోనే తమను తీవ్రంగా కొట్టారని బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. వీళ్లని కాపాడేందు కోసం వారి పిల్లలు కూడా వచ్చారట. పిల్లలను నడిరోడ్డు మీద మోకాళ్లపై కూర్చోబెట్టి ఇంకా ఎక్కువ కొట్టారు. రాష్ట్ర హోం మంత్రి సొంత మండలంలో ఇది జరగడం అత్యంత హేయం. ఏం జరిగిందో తెలుసుకోవాలని దళిత సంఘాలు వచ్చి గగ్గోలు పెట్టిన తరువాతే బాధితులను ఆస్పత్రిలో చేర్చారు. పోలీసు స్టేషన్లో వ్యాను డ్రైవర్ లక్ష్మీప్రసాద్‌ను లెంపకాయలు కొట్టారు. నిజంగా పేదవాళ్లంటే ఇంత అలుసా? చట్టాలన్నీ ఉండి కూడా ఇలా ప్రవర్తిస్తే ఇక ఈ వ్యవస్థ ఎప్పుడు బాగుపడుతుంది? తోటి మనిషిని మనిషిగా చూడాలి మన వ్యవస్థలో మార్పు వచ్చే దిశగా అడుగులు వేయాలి. వ్యవస్థలో మార్పు రావాలంటే మనం ముందుండి గట్టిగా అడగాలి. తోటి మనిషిని మనిషిగా చూడాలి. ఇది కులానికి సంబంధించిన వ్యవహారం కాదు. మొన్న విశాఖ జిల్లా ఫాల్మన్పేటలో మత్స్యకారులకు ఇదేరమైన అన్యాయం జరిగింది. అక్కడ యనమల రామకృష్ణుడు అనే మంత్రిస్థానంలో ఉన్న వ్యక్తి తన తమ్ముడిని, మనుషులను పంపించి బీభత్సం సృష్టించాడు. మేమంతా అక్కడికి వెళ్లి బాధితులకు అండగా నిలిచాం. వారికి భరోసా ఇచ్చాం. ఇక్కడ కూడా దళితులకు అన్యాయం జరిగిందని వచ్చాను. తప్పు చేశారని భావిస్తే పోలీసు స్టేషన్‌కు వెళ్లి కేసులు పెట్టాలి. అంతేకానీ ఎవరికి వారు నడిరోడ్డు మీద చెట్టుకు కట్టేసి కొట్టకూడదు. ఇలా కొట్టేవారిని కఠినంగా శిక్షస్తేనే సమాజానికి సందేశం వెళ్తుంది’’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, మాజీ ఎమ్మెల్యేలు కుడుపూడి చిట్టబ్బాయి, పెండెం దొరబాబు, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మీ, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా తదితరులు ఉన్నారు. -
గోవధ అపోహ బాధితులకు పరామర్శ
-
21వ శతాబ్ధంలో కూడా ఇలాంటి ఘోరమా?
-
21వ శతాబ్దంలో కూడా ఇలాంటి ఘోరమా?: వైఎస్ జగన్
అమలాపురం: దళితులపై దాడి అమానుషమని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం సూదాపాలెంలో గోవధకు పాల్పడ్డారన్న అపోహతో ఇటీవల దళితులపై దుండగులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దాడిలో గాయపడి అమలాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను శుక్రవారం వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. 'ఆస్పత్రిలో పేషెంట్లుగా ఉన్న దళితులను ఏం జరిగింది, ఎందుకు జరిగిందని అడిగితే వీళ్ల చెప్పిన విషాయాలు వింటే గుండె బరువెక్కుతుంది. ఇది ధర్మమేనా.. వ్యవస్థలో ఇంత దారుణం జరుగుతున్నా ప్రశ్నించకపోవడం ధర్మమేనా?. ఏం జరిగిందని అడిగినప్పుడు వాళ్లు చెప్పింది వింటే బాధ అనిపిస్తుంది. అరవింద్ అనే సామిల్ ఓనర్ తన ఆవు చనిపోతే, ఆ ఆవును తీసుకెళ్లాలని ఇక్కడున్న ఎలిషా, వెంకటేశ్వరరావులను కోరారు. వీళ్లు జంతు చర్మం మీదే ఆధారపడి బతుకుతారు. వాళ్ల వృత్తే అది. అరవింద్ ఫోన్ చేసిన తర్వాత వాళ్లు ఆ ఆవును వ్యాన్‌లో శ్మశానం దగ్గరకు తీసుకెళ్లి, చర్మాన్ని ఒలిచి ఆవును పూడ్చిపెడుతున్నారు. అది వాళ్ల వృత్తి.. అది తప్ప వేరే ఆదాయమార్గం లేదు. దశాబ్దాలుగా అదే పని చేసుకుంటున్నారు. ముందుగా అక్కడకు ఇద్దరు వ్యక్తులు వచ్చి బండి నెంబరు నోట్ చేసుకున్నారు. వెంటనే పది - పదిహేను నిమిషాల్లో దాదాపు 15 మంది పైచిలుకు అక్కడకు వచ్చారు. వచ్చీ రాగానే వీళ్లను నిర్దాక్షిణ్యంగా శ్మశానం నుంచి లాక్కుని బయటకు వచ్చి నడిరోడ్డు మీద చెట్టుకు కట్టేసి కొట్టడం మొదలుపెట్టారు. దుర్భాషలాడుతూ, చెప్పు తీసుకుని మొహాన కొట్టారు. దెబ్బలు తిన్నవాళ్లలో పదోతరగతి పిల్లాడు కూడా ఉన్నాడు. ఆ సంగతి కూడా పక్కన పెట్టి పసివాడిని కూడా చెట్టుకు కట్టేసి కొట్టారు. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం.. వాళ్లు చేసింది తప్పని అనిపిస్తే పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి కేసులు పెట్టాలి. తప్పు ఎవరు చేసినా తప్పే. ఆ నలుగురినీ కట్టేసి నడిరోడ్డు మీద చెప్పులతో కొట్టడం సభ్య సమాజం ఆమోదించాల్సిన విషయమేనా. పోలీసుల సమక్షంలోనే ఇంకా ఎక్కువ కొట్టారు. వీళ్లను కాపాడేందుకు పిల్లలు వస్తే వాళ్లను నడిరోడ్డు మీద మోకాళ్లపై కూర్చోబెట్టారు. వాళ్ల ముందు మళ్లీ కొట్టారు.అర్ధగంట తర్వాత పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. వీళ్లు చెప్పే మాటలను కూడా పోలీసులు వినే పరిస్థితి లేదు. ఈ ఆవు యజమాని స్వయంగా చెబితేనే వెళ్లి ఆవు మృతదేహాన్ని తీసుకెళ్లినట్లు చెప్పినా, ఆ సామిల్లు ఓనర్‌తో మాట్లాడండని చెప్పినా కనీసం పోలీసులు ఆ మాటలు కూడా వినిపించుకోలేదు. పైపెచ్చు నడిరోడ్డు మీద చెప్పులతో కొట్టడం, హోం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే.. ఆయన సొంత ఊరు అయినా కూడా ఇక్కడే ఈ ఘటన జరగడం బాధాకరం. మర్నాడు ఆ అరవింద్ దగ్గరకు పోవాలని దళిత సంఘాలు గొడవ చేస్తే అప్పుడు వీళ్లను తీసుకెళ్లి ఏం జరిగిందో తెలుసుకున్నారు. బాధితులకు రు.లక్ష పరిహారం ఇవ్వడం అన్యాయం. నిబంధనల ప్రకారం రూ.8 లక్షల 20వేలు చెల్లించాలి. రాజమండ్రి వరకూ వచ్చిన సీఎం చంద్రబాబు అమలాపురం వచ్చి ఉంటే బాధితుల్లో నైతిక స్థైర్యం పెరిగేది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి' అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
‘గోవధ అపోహ’ బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
అమలాపురం: ‘గోవధ అపోహ’ బాధితులను వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను శుక్రవారం మధ్యాహ్నం కలుసుకుని ఘటన పూర్వాపర్వాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసాయిచ్చారు. ఉప్పలగుప్తం మండలం సూదాపాలెంలో గోవధకు పాల్పడ్డారన్న అపోహతో ఇటీవల ఇద్దరు దళితులపై దుండగులు అమానుషంగా దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో అమలాపురం పట్టణంలోని జానకిపేటకు మోకాటి ఎలీషా, అతని సోదరుడు మోకాటి వెంకటేశ్వరరావు, డ్రైవర్ లక్ష్మణకుమార్ తీవ్రంగా గాయపడ్డారు. -
ఆ దాడి చేసింది బీజేపీ, టీడీపీకి చెందినవాళ్లే
విజయవాడ: ఆవును దొంగిలించి, చర్మం వొలిచారన్న నెపంతో ముగ్గురు దళితులపై విచక్షణా రహితంగా దాడి చేయడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. గోసంరక్షకుల ముసుగులో బీజేపీ, టీడీపీకి చెందినవారే దళితులపై దాడి చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆరోపించారు. బుధవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడిన ఆమె.. ఘటన జరిగి రెండు రోజులు కావస్తున్నా ప్రభుత్వంగానీ, అధికార పార్టీ నేతలుకానీ స్పందించకపోవడం దారుణమన్నారు. (అమలాపురంలో 'ఆవు'వివాదం: ఉద్రిక్తత) 'బీజేపీ, టీడీపీకి చెందినవారు కావాలనే దళితులను హింసించారు. వాళ్ల ఆవులు తప్పిపోయింది అబద్ధమని తెలిసింది. కొన్ని రాష్ట్రాల్లో గోవధపై నిషేధం ఉండొచ్చు. కానీ ఏపీలో లేదు. నిషేధం ఉన్నా, లేకున్నా గోసంరక్షకులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దళితులపై దాడులు చేయడం దారుణం. ఇది ముమ్మాటికి బీజేపీ- టీడీపీల కుట్రే. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. నిన్న గిరిజన దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యం చేశారు. డాన్స్ చేయడం కంటే దళిత, గిరిజనులకు బాబు చేసిన మేలు ఏదైనా ఉందా?'అని కల్పన ప్రశ్నించారు. మమ్మల్నెవరూ ఏమీ చెయ్యలేరనే దైర్యంతో టీడీపీవారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని, దాడి జరిగి రెండు రోజులైనా పోలీసులు నిందితులను అరెస్టు చేయకపోవడం ప్రభుత్వవైఫల్యమేనని కల్పన వ్యాఖ్యానించారు.పలు ప్రజా సంఘాలు, వేదికలు బాధితులను పరామర్శించాయి. కానీ ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్క టీడీపీ నాయకుడు కూడా దళితులను పట్టించుకోకపోడం దారుణమని అన్నారు. -
ఆ దాడి చేసింది బీజేపీ, టీడీపీకి చెందినవాళ్లే
-
'తూర్పు'లో చర్మకారులపై దాడి: ఉద్రిక్తత
అమలాపురం: ఇన్నాళ్లూ ఉత్తరాదికే పరిమితం పరిమితం అయిందనుకున్న ఆవు వివాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వెలుగుచూసింది. ఆవును దొంగతం చేసి, చర్మం వొలుస్తున్నారనే నెపంతో ఇద్దరు చర్మకారులపై పాశవికదాడి జరింది. అమలాపురం పట్టణంలో జరిగిన ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రధాని మోదీ దళితులపై దాడులను ఖండించిన కొద్ది గంటలకే చోటుచేసుకున్న ఈ దాడి వార్త జాతీయ మీడియా పతాక శీర్షికలకెక్కడం గమనార్హం. అమలాపురం పట్టణంలోని జానకిపేటకు మోకాటి ఎలీషా, అతని సోదరుడు మోకాటి వెంకటేశ్వరరావు చర్మకారులు. వీరిద్దరూ ఓ మినీవ్యాన్ డ్రైవర్ తో కలిసి సోమవారం రాత్రి ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి శివారు సూదాపాలెం శ్మశానంలో చనిపోయిన ఆవు చర్మాన్ని వొలిచేపనిలో ఉండగా.. కామనగరువు గ్రామానికి చెందిన ఎనిమిది మంది అక్కడికి వచ్చి, 'మా ఆవును దొంగిలించి, చింపి, తోలు వొలుస్తా' అంటూ ఆగ్రహంతో ఎలీషా, వెంకటేశ్వర్ రావు, డ్రైవర్ లక్ష్మణకుమార్ లను బంధించి, తాళ్లతో చెట్లకు కట్టేసి కొట్టడం మొదలుపెట్టారు. ఇది గమనించిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పోలీసులకు సమచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేలోపే దుండగులు పారిపోయారు. రక్తపు మడుగులో పడిఉన్న ముగ్గురినీ పోలీసులు అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇంతకీ ఆ ఆవు ఎవరిది? కామనగరువు గ్రామస్తులకు చెందిన మూడు ఆవులు ఆది, సోమవారాల్లో తప్పిపోయాయి. వాటిని వెదుక్కుంటూ ఆవుల యజమానులైన రైతులు వివిధ ప్రాంతాలు గాలించారు. మరోవైపు అమలాపురానికి చెందిన బూరగాలయ అరవింద్ అనే రైతుకు చెందిన ఆవు సోమవారం విద్యుదాఘాతానికి గురై మరణించింది. అతని అభ్యర్థనమేరకు ఎలీషా, లాజర్ లు ఆ ఆవును తీసుకెళ్లి, దూరంగా స్మశానంలో చర్మం వలిచేందుకుప్రయత్నించారు. సరిగ్గా అదేసమయానికి అక్కడికి చేరుకున్న కామనగరువు రైతులు.. ఆ ఆవు తమదేనని భావించి దళితులపై దాడిచేశారు. కనీసం వివరణ కూడా వినకుండా పాశవికంగా కొట్టారు. దీంతో కామనగరువుకు చెందిన పలువురిపై ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు, ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భగ్గుమన్న దళిత సంఘాలు: సెక్షన్ 30 అమలు దళితులపై దాడి విషయం తెలియగానే జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దాడిని నిరసిస్తూ అమలాపురంలో దళిత సంఘాల నాయకులు రాస్తారోకోకు దిగారు. వైఎస్సార్ సీపీ నాయుకడు ఇజ్రాయెల్ దాడి ఘటనను ఖండించారు. దీనిపై తనకు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అధికారులను ఆదేశించారు. నిందితులను 48 గంటల్లో అరెస్టు చేయాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా దళితులు రోడ్డెక్కి ఆవు, ఎద్దు మాంసాలతోనే వంటావార్పులకు దిగుతారని హెచ్చరించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సెక్షన్ 30 అమలులోకి తెచ్చినట్లు తూర్పుగోదావరి ఎస్పీ ఎం.రవిప్రకాష్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అమలాపురం, కాకినాడ, రామచంద్రపురం, పెద్దాపురం, రంపచోడవరం, చింతూరు పోలీసు సబ్ డివిజన్లలో ఆగస్టు 31 వరకు సెక్షన్ 30 అమలవుతుందని చెప్పారు.