నేటి నుంచి కాంగ్రెస్‌ ‘సేవ్‌ ది కాన్‌స్టిట్యూషన్‌’ | Rahul Gandhi to launch Save the Constitution drive today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి కాంగ్రెస్‌ ‘సేవ్‌ ది కాన్‌స్టిట్యూషన్‌’

Published Mon, Apr 23 2018 4:23 AM | Last Updated on Mon, Apr 23 2018 4:23 AM

Rahul Gandhi to launch Save the Constitution drive today - Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ హయాంలో దేశంలో రాజ్యాంగంతోపాటు దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆరోపిస్తూ సోమవారం నుంచి కాంగ్రెస్‌ ‘రాజ్యాంగాన్ని రక్షించండి’ (సేవ్‌ ది కాన్‌స్టిట్యూషన్‌) కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14వ తేదీన బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వరకు కొనసాగనున్న ఈ ప్రచార కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శ్రీకారం చుట్టనున్నారు.

2019 ఎన్నికల్లో దళితులకు దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగా పార్టీ చేపట్టే ఈ కార్యక్రమంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ , ప్రధాన కార్యదర్శి గులాంనబీ ఆజాద్, సీనియర్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, సుశీల్‌ కుమార్‌ షిండే తదితరులు పాల్గొననున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీ దళిత నేతలు వివిధ స్థాయిల్లో జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రస్తుత బీజేపీ పాలనలో జరుగుతున్న అన్యాయాన్ని వివరించి, ప్రజాభిప్రాయాన్ని కూడగడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement