![Rahul Gandhi Comments On Jammu Kashmir Statehood](/styles/webp/s3/article_images/2024/09/25/rahulgandhi.jpg.webp?itok=tJPsu7ES)
జమ్మూ: జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా కోసం పార్లమెంటుతో పాటు వీధుల్లోనూ పోరాడతామని లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ అన్నారు.జమ్మూలో బుధవారం(సెప్టెంబర్25) జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడారు.‘జమ్మకశ్మీర్‌ను లెఫ్టినెంట్ గవర్నర్‌తో పరిపాలించాలని బీజేపీ అనుకుంటోంది.
ఎల్జీ పరిపాలన ఉన్నంత కాలం జమ్మూకశ్మీర్ ప్రజలకు నష్టం తప్ప ఏమీ ఉండదు.రాష్ట్రహోదా సాధించడంతో పాటు ఇక్కడి స్థానిక పరిశ్రమలను కాపాడతాం.లోయలోని సామాన్యులకు మేలు చేస్తాం. ముందు జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా ఇస్తారనుకున్నాం. కానీ బీజేపీ ముందు ఎన్నికలకు వెళ్లింది.ఎన్నికల తర్వాత బీజేపీ గనుక రాష్ట్రహోదా ఇవ్వకపోతే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండియా కూటమి ప్రభుత్వం ఆ పనిచేస్తుంది’అని రాహుల్ మాటిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment