గువహతి:కాంగ్రెస్ పార్టీ దేశంతోనూ పోరాడుతోందని కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై అస్సాంలోని గువహతి పోలీస్ స్టేషన్‌లో ఆదివారం(జనవరి19) ఎఫ్‌ఐఆర్(FIR) నమోదైంది.
మోన్‌జిత్ చాటియా అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వాక్ స్వాతంత్ర్య పరిమితులను దాటాయని,అవి జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగిస్తాయని చాటియా తన ఫిర్యాదులో తెలిపారు.
ఆయన వ్యాఖ్యలు అశాంతితో పాటు,వేర్పాటువాద భావాలు కలిగిన వారిని రెచ్చగొట్టే ప్రమాదం ఉందన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత రాహుల్‌కు ఉందని చాటియా పేర్కొన్నారు. కాగా,ఢిల్లీలో కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యాలయాన్ని ఇటీవల ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీ ఆరెస్సెస్ దేశంలోని ప్రతి సంస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయన్నారు. తాము ఇప్పుడు బీజేపీ, ఆరెస్సెస్‌తోపాటు భారత దేశంపై కూడా పోరాడుతున్నామన్నారు. ఈవ్యాఖ్యలను పలువురు కేంద్ర మంత్రులు తప్పుబట్టారు.కాంగ్రెస్ అసలురూపం ఈ వ్యాఖ్యలతో బయటపడిందని బీజేపీ నేతలు విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment