సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా దళితులపై సాగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల 26న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్‌పీఎస్) నేత, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ తెలిపారు. రాజ్యాంగం ప్రకారం దళితులకు స్వేచ్ఛ, సమానత్వం, సమాన హక్కులు, వైద్య, విద్య, ఉద్యోగాలు కల్పించడం కేంద్ర, రాష్ట్రాల బాధ్యత అని పేర్కొన్నారు. ఈ హక్కులు దక్కకుండా చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం మఖ్దూం భవన్‌లో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.ఏసురత్నం అధ్యక్షతన జరిగిన సమావేశంలో మల్లేశ్ మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బీజేపీ, సంఘ్ పరివార్ ప్రోద్బలంతో దళితులపైనా పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. సమావేశంలో నేతలు నర్రా శ్రవణ్, ఆరుట్ల రాజ్ కుమార్, మార్టిన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment