gunda mallesh
-
మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ కన్నుమూత
-
మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ కన్నుమూశారు. గత కొద్దికాలంగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిశారు. గుండా మల్లేష్ మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపం ప్రకటిస్తున్నారు. గుండా మల్లేశ్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం నారాయణగూడలోని మక్దూమ్ భవన్‌కు తరలించనున్నారు. అనంతరం మల్లేశ్ భౌతికకాయాన్ని ఆయన సొంత ఊరు బెల్లంపల్లికి తరలిస్తారు అంచెలంచెలుగా ఎదిగి.. కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గుండా మల్లేష్ అంచెలంచెలుగా శాసన సభ్యులు స్థాయికి ఎదిగారు. ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామానికి చెందిన మల్లేశ్ మెట్రిక్యులేషన్ చదివి, బెల్లంపల్లిలోని రామా ట్రాన్స్‌పోర్టులో క్లీనర్‌గా, డ్రెవర్‌గా పనిచేశారు. తోటి క్లీనర్లు, డ్రెవర్ల సమస్యలపై పోరాడారు. తర్వాత సింగరేణిలో కార్మికుడిగా చేరిన ఆయన సీపీఐలో సభ్యత్వం తీసుకున్నారు. 1970లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారారు. మంచి కార్మిక నేతగా పేరు తెచ్చుకున్న ఆయన 1983లో ఆసిఫాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. 1985, 1994 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 12వ శాసనసభలో 2009లో బెల్లంపల్లి నుంచి ఎన్నికై సీపీఐ సభానాయకుడిగా వ్యవహరించారు. -
మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషమం
సాక్షి, బెల్లంపల్లి: సీపీఐలో సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారం క్రితం శ్వా సకోస సమస్యలు ఏర్పడగా అతడిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేర్పించారు. అప్పటినుంచి ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య చికిత్స అందిస్తున్నారు. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న మల్లేష్‌కు తాజాగా కిడ్నీ సంబంధమైన సమస్యలు తోడైనట్లు పార్టీ శ్రేణులు అంటున్నారు. శుక్రవారం సాయంత్రం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి నిమ్స్‌కు వెళ్లి మల్లేష్‌ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో చర్చించారు. మల్లేష్ ఆరోగ్య సమాచారాన్ని బెల్లంపల్లిలోని పార్టీ శ్రేణులకు చాడ ఫోన్‌చేసి చెప్పినట్లు సమాచారం. మల్లేష్ ఆరోగ్యంపై సీపీఐ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. -
దళితులపై దాడులకు నిరసనగా 26న ధర్నా
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా దళితులపై సాగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల 26న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్‌పీఎస్) నేత, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ తెలిపారు. రాజ్యాంగం ప్రకారం దళితులకు స్వేచ్ఛ, సమానత్వం, సమాన హక్కులు, వైద్య, విద్య, ఉద్యోగాలు కల్పించడం కేంద్ర, రాష్ట్రాల బాధ్యత అని పేర్కొన్నారు. ఈ హక్కులు దక్కకుండా చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం మఖ్దూం భవన్లో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.ఏసురత్నం అధ్యక్షతన జరిగిన సమావేశంలో మల్లేశ్ మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బీజేపీ, సంఘ్ పరివార్ ప్రోద్బలంతో దళితులపైనా పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. సమావేశంలో నేతలు నర్రా శ్రవణ్, ఆరుట్ల రాజ్ కుమార్, మార్టిన్ పాల్గొన్నారు. -
సీపీఐ అభ్యర్థులు..
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలో భాగంగా సీపీఐకి కేటాయించిన మూడు స్థానా ల్లో అభ్యర్థులను ఆ పార్టీ బుధవారం ప్రకటించింది. హుస్నాబాద్ అభ్యర్థిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, బెల్లంపల్లి నుంచి గుండ మల్లేశ్, వైరా నుంచి బానోతు విజయాబాయి లు పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి బుధవారం జాబితా విడుదల చేశారు. అనంతం విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ను గద్దె దింపాలనే ఉద్దేశం తో మహాకూటమి ఏర్పాటైందని, సీట్ల కేటాయింపు లో కొంత అసంతృప్తి ఉన్నా కూటమి గెలుపు కోసం వాటిని పక్కన పెట్టినట్లు తెలిపారు. తమకు కేటా యించిన మూడు సీట్లే ఫైనల్ అని, నల్లగొండలోని దేవరకొండ సీటు ఇస్తే తీసుకుంటామే తప్ప మరోసారి కాంగ్రెస్‌తో సీట్ల గురించి మాట్లాడేది లేదన్నా రు. చాడ వెంకట్‌రెడ్డిపై రెబెల్‌గా పోటీ చేస్తానంటున్న కాంగ్రెస్ నేత ప్రవీణ్‌రెడ్డి విషయాన్ని ఆ పార్టీ పెద్దలు చూసుకోవాలన్నారు. తిరుగుబాటు అభ్యర్థులు ఉండకూడదనే ఉద్దేశంతోనే తమకు కేటాయించిన 3 సీట్ల నుంచే బరిలోకి దిగుతున్నామని చెప్పారు. -
సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే
సాక్షి, హైదరాబాద్ : మహాకూటమిలో భాగంగా సీపీఐకి కేటాయించిన మూడు స్థానాల్లో అభ్యర్థులను ఆ పార్టీ బుధవారం ప్రకటించింది. హుస్నాబాద్ అభ్యర్థిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, బెల్లంపల్లి- గుండ మల్లేష్, వైరా- బానోతు విజయబాయిలను ప్రకటిస్తూ ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి జాబితా విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమిలో సీపీఐకి మూడు సీట్లనే కేటాయించడం పట్ల కొంత అసంతృప్తి ఉన్నప్పటికి కేసీఆర్‌ను గద్దె దించడానికి తాము ఒప్పుకున్నామన్నారు. ప్రస్తుతం ఈ మూడు సీట్లే ఫైనల్ అన్నారు. సీట్లకోసం ఇకపై కాంగ్రెస్‌ను కలిసేదిలేదని స్పష్టం చేశారు. నల్గొండలోని దేవరకొండ సీటు ఇస్తే తీసుకుంటామని చెప్పారు. హుస్నాబాద్‌లో చాడపై రెబల్‌గా పోటీ చేస్తానంటున్న కాంగ్రెస్ నేత ప్రవీణ్ రెడ్డి విషయాన్ని ఆ పార్టీ చూసుకోవాలన్నారు. రెబల్స్ ఉండకూడదనే తమకు కేటాయించిన మూడు సీట్ల నుంచి మాత్రమే బరిలోకి దిగుతున్నామని పల్లా తెలిపారు. మొదట 12 సీట్లు కావాలని డిమాండ్ చేసిన సీపీఐ.. తర్వాత కనీసం 5 స్థానాలైనా కేటాయించాలని కోరింది. కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ మాత్రం 3 సీట్లనే ఇస్తామని తేల్చిచెప్పింది. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలంటే కూటమితో కలిసి పోటీ చేయడం అనివార్యంగా భావిస్తున్న సీపీఐ.. 3 సీట్లకు ఓకే చెప్పింది. -
ప్రాణహిత ప్రాణం తీసిన ప్రభుత్వం
దహెగాం(సిర్పూర్): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పుట్టిన ప్రాణహిత ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించకుండా వార్ధానదికి తరలించి ప్రాణహిత ప్రాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసిందని సీపీఐ బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ , జల సాధన సమితి అధ్యక్షుడు నైనాల గోవర్ధన్ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా మండల కేంద్రం సమీపంలో అసంపూర్తిగా ఉన్న ప్రాణహిత కాలువను సందర్శించారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రాణహిత వద్ద ప్రాజెక్టు నిర్మించకుండా వార్ధా నదికి మార్చడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి, ఉమ్మడి జిల్లాకు కేసీఆర్ తీరని ద్రోహం చేయడమే అన్నారు. ప్రాణహిత తుమ్మిడిహెట్టి 148 మీటర్ల, మైలారం 138, గోదావరి సుందిళ్ల 132 మీటర్లకు అనుసంధానం చేసే సంపూర్ణ గ్రావిటీ కాలువకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న వార్ధానదికి ప్రాజెక్టు మార్చే నిర్ణయం గొడ్డలి పెట్టులాంటిదన్నారు. ప్రాణహిత ప్రాజెక్టుకు వైఎస్సార్ హయాంలో అంబేద్కర్ సుజల స్రవంతిగా నామకరణం చేశారని నేడు అంబేద్కర్ పేరును లేకుండానే ఈ ప్రభుత్వం చేస్తోందన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరానికి ఈ ప్రాజెక్టును తరలించారన్నారు. జిల్లాలో ఉన్న ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రాణహిత ప్రాజెక్టును 148 మీటర్ల ఎత్తుకు సీఎం కేసీఆర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి ఒప్పందం కుదుర్చుకొని ఒంటెలపై ఊరేగింపు చేసుకున్న సీఎం.. చారిత్రక ద్రోహం చేశారన్నారు. అనంతరం సిర్పూర్ నియోజకవర్గం నాయకుడు పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం ఇక్కడే జరగడానికి ప్రాణహితకు అడ్డంగా పడుకొని నియోజకవర్గానికి సాగునీటికోసం నీళ్లు ఇప్పిస్తామన్న చెప్పిన ఎమ్మెల్యే నేడు ప్రాజెక్టు తరలిపోతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. మన చుట్టూ నీళ్లు ఉన్నా మన పొలాలకు సాగు నీరు అందక పోవడం పాలకుల కుట్రలో భాగమే అన్నారు. అఖిలపక్షం నాయకులు బద్రి సత్యనారాయణ, చాంద్‌పాషా, లాల్‌కుమార్, అంబాల ఓదెలు, వెంకట నారాయణ, నాగుల తిరుపతి, కోండ్ర రాజా గౌడ్, చిలువేరు కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ బాటలోనే బీజేపీ..
ఎదులాపురం(ఆదిలాబాద్): దేశంలో కాంగ్రెస్ అనుసరించిన బాటలోనే బీజేపీ పయనిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆదిరెడ్డి, గుండా మల్లేశ్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో బుధవారం నిర్వహించిన సీపీఐ జిల్లా మహాసభలో వారు అతిథులుగా హాజౖ రె మాట్లాడారు. దేశ పాలనలో మోదీ అన్న అయితే రాష్ట్రంలో కేసీఆర్ తమ్ముడిగా పాలన సాగుతుందని ఎద్దేవా చేశారు. దేశంలో గోరక్షణ దళాల పేరుతో మతోన్మాద దాడులకు పాల్పడుతూ హింస ను ప్రేరేపిస్తుందన్నారు. సాహితీవేత్తలు, సంఘ సంస్కర్తలను హత్య చేయి స్తున్నారని ఆరోపించారు. ఉపాధి హా మీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోంద న్నారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుండా మల్లేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న ఈ ప్రభుత్వానికి పట్టడం లే దన్నారు. రైతు కుటుంబాలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శిం చారు. థర్డ్ ఫ్రంట్ ను సీపీఐ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. తొలు త కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరి నీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు విలాస్, నళినిరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యరద్శి మేస్రం భాస్కర్, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో నియంత పాలన
ఆసిఫాబాద్‌క్రైం: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంతపాలన సాగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుండా మల్లేశ్ అన్నా రు. జిల్లాకేంద్రంలోని స్థానిక రోజ్ గార్డెన్లో మంగళవారం పార్టీ జిల్లా ద్వితీయ మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకమైందని, ఈ పోరాటంలో ఎంతో మంది కమ్యూనిస్టులు అమరులయ్యారన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలను విస్మరిస్తూ మాటల గారడీతో ప్రజలను మో సం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ బీజేపీ ప్రభుత్వం ఆడిస్తున్న నాటకమని ఆరోపించారు. జిల్లాలో పార్టి బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి పద్మ, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా కార్యదర్శులు బద్రి సత్యనారాయణ, కళవేణి శంకర్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్.తిరుపతి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిరంజీవి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోగె ఉపేందర్, నాయకులు గణేశ్, దివాకర్, పంచపల, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘వారసత్వం పేరుతో సర్కారు మోసం’
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి కార్మికులను వారసత్వ ఉద్యోగాల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం, గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్ మోసం చేశాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుండా మల్లేష్ విమర్శించారు. సోమవారం గోలేటిటౌన్‌షిప్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి షరతులు లేని వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ శాసనసభ సాక్షిగా ప్రకటించి కార్మికులను మోసం చేశారన్నారు. రాజ్యాంగం ప్రకారం వారసత్వ ఉద్యోగాలు చెల్లవని తెలిసినా బావులపై వెళ్లేందుకు ముఖం చాలక గుర్తింపు సంఘం నాయకులు కార్మికులకు అన్యాయం చేశారన్నారు. సమ్మె ద్వారానే వారసత్వ ఉద్యోగాలు సాధ్యమని, అన్ని కార్మిక సంఘాలు కలిసికట్టుగా ఆందోళనకు సిద్ధం కావాలని పేర్కొన్నారు. -
దళితులపై ఇంకా దాడులా?
గుండా మల్లేశ్ శంకర్పల్లి: దేశవ్యాప్తంగా దళితులపై ఇం కా దాడులు కొనసాగుతున్నాయని సీపీఐ రాష్ట్ర నేత, దళిత, గిరిజనుల హక్కుల సాధన జాతీయ కన్వీనర్ గుండా మల్లేశ్ అన్నారు. దళితులపై దాడులను అరిక ట్టాలంటూ నిర్వహిస్తున్న బస్సుయాత్ర ఆదివారం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లికి చేరుకుంది. ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లవుతున్నా దళితు లు నేటికీ కులవివక్ష,, అంటరానితనంతో అణచివేతకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ అంబేడ్కర్ ఆశయా లు నేటికీ అమలుకు నోచుకోవడం లేదన్నారు. రాజ్యాంగం కల్పించిన దళితుల హక్కులను పరిరక్షించడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యా ప్తంగా దాడులు మరింత ఎక్కువయ్యా యని తెలిపారు. దళితుడినే సీఎంను చేస్తాననే అబద్ధాల పునాదులపై ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వన్ని ఎండగట్టాలన్నారు. దళితులకు మూడెకరాల భూమిని ఇచ్చే విషయంలో ఇంకా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆయన విమర్శించారు. -
ఏకపక్షంగా విభజిస్తే రావణకాష్టమే...
పోలీసులు ప్రభుత్వానికి ఏజెంట్లు కాదు..ప్రజల సేవకులు సీపీఐ శాసనసభ పక్ష మాజీ నేత గుండా మల్లేశం హుస్నాబాద్ : జిల్లాల పునర్విభజనలో ప్రజాభీష్టాన్ని గౌరవించక ఏకపక్షంగా వ్యవహరిస్తే రాష్ట్రం రావణకాష్టంగా మారుతుందని సీపీఐ శాసనసభ పక్ష మాజీ నేత గుండా మల్లేశం హెచ్చరించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన హుస్నాబాద్ బంద్‌కు వివిధ పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ భుస్నాబాద్ను కరీంనగర్లో కొనసాగించాలని ఉద్యమం చేస్తున్న అఖిలపక్ష నాయకులపై పోలీస్‌లు అత్యుత్సాహం చూపి దుశ్చర్యలకు పాల్పడడాన్ని ఖండించారు. పోలీసులు ప్రభుత్వ ఏజెంట్లు కాదని ప్రజాసేవకులని అన్నారు. సిద్దిపేటకు ఇచ్చే ప్రాధాన్యత ఇతర జిల్లాలకు ఇవ్వడంలేదని ఆరోపించారు. సీఎంకు మతిభ్రమించిందని ప్రజలను పిచ్చోళ్ల మాదిరిగా చేస్తున్నాడని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు రాజకీయ జీవితం ఇచ్చిన కరీంనగర్ గుండెతో ఆడుకుంటున్నాడనిఅన్నారు. జిల్లాను ఆరు ముక్కలు చేసి చరిత్ర, సంస్కృతి లేకుండా చేస్తున్నాడని పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తలపెట్టిన కొత్త జిల్లాల ప్రక్రియ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా జరిగితే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కరీంనగర్‌ను ముక్కలు చేస్తూ అస్థిత్వం లేకుండా చేస్తున్నాడని అన్నారు. హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్లో కొనసాగించాలని డిమాండ్ చేశాడు. సీపీఐ జిల్లా కార్యదర్శి రాంగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయ స్వార్థం కోసం జిల్లాలు, రెవెన్యూ డివిజన్, కొత్త మండలాలను విడగొడుతున్నారని అన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణంలోకి తీసుకొకపోతే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరాంచక్రవర్తి మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతుల్లో రిలే దీక్షలు చేపడితే పోలీస్‌లతో టెంట్లు కూల్చివేయించడం, అరెస్ట్‌లు చేయడం బ్లాక్ డేగా అభివర్ణించాడు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
‘కేసీఆర్ అబద్ధ్దాల కోరు’
షాద్‌నగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాల కో రు అని భారత్ కేత్ మజ్దూరు యూనియన్ జా తీయ ఉపాధ్యక్షుడు గుండా మల్లేష్ అన్నారు. షాద్‌నగర్ పట్టణంలో జరగుతున్న వ్యవసాయ, కార్మిక రాష్ట్ర ప్రథమ మహాసభలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి అబద్ధాల ఫ్యా క్టరీగా మారారని, అతని నోటి వెంట అన్ని అబ ద్ధాలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఉద్యమ స మయంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించిన ఆయన, రాష్ట్రం ఏర్పడిన తరువాత పదవిపై వ్యామోహంతో గద్దెనెక్కారని ఆరోపించారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని వాటిని తగ్గించలేని అసమర్థుడని మండిపడ్డారు. కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చి కూలీలను మద్యానికి బానిసగా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఉపాధిహమీ పనులను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి కూలీలకు 300రోజులు పని కల్పించాలన్నారు. ఉపాధిహమీ పథకంలో అక్రమాలను ఆరికట్టాలని సూచించారు. బీకేఎంయూ ఆధ్వర్యంలో కూలీలు, కరువు సమస్యలపై రాబోయే రోజుల్లో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. -
పేపర్‌మిల్లును ప్రభుత్వమే నడపాలి
కాగజ్‌నగర్ టౌన్ : కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్లును ప్రభుత్వమే నడపాలని, ఉత్పత్తి ప్రారంభించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ శాసనసభాపక్ష మాజీ నేత, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ డిమాండ్ చేశారు. రోజురోజుకు మిల్లు సమస్య జటిలమవుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టిం చుకోకపోవడాన్ని నిరసిస్తూ ఎస్పీఎం కార్మిక సంఘాల ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు మిల్లు ప్రధాన ద్వారం ఎదుట ధర్నా నిర్వహించారు. గుండా మల్లేశ్ హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. పని దొరకక, తద్వారా వేతనాలు రాక 1600 మంది కాంట్రాక్టు కార్మికులు అర్ధాకలితో అలమటిస్తుంటే ప్రభుత్వం మౌనం వహించద ని ఆరోపించారు. మరోవైపు యాజ మాన్యం ఉత్పత్తిని పూర్తి స్థాయిలో నిలిపివేసి, మిల్లును మూతబడే దశకు తీసుకువస్తోందని, అయినా ముఖ్యమంత్రి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పేపర్ మిల్లులో ఉత్పత్తి నిలిచిపోవడంతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారని, పట్టణం మొత్తంలో వ్యాపారాలు పడిపోయాయన్నారు. కార్మికుల పక్షాన ఢిల్లీ దాకా పోరాడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు ఈర్ల విశ్వేశ్వర్రావు, ముర ళి, షబ్బీర్ అహ్మద్ (చోటా), ముంజం శ్రీనివాస్, వెంకటేశ్, అంబాల ఓదేలు, వేణు, వొల్లాల సుభాష్, రాజ్‌గోపాల్, భూమయ్య, హఫిజ్‌ఖాన్, అన్నం రాజయ్యతో పాటు కార్మికులు పాల్గొన్నారు. మరో వైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ గుమ్మి చక్రవర్తి ఆధ్వర్యంలో పట్టణ సీఐ జలగం నారాయణరావు, ఎస్పై అబ్దుల్‌మజీద్ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మిల్లును పునరుద్ధరించండి ఆదిలాబాద్ అర్బన్ : సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ పరిశ్రమలో ఉత్పత్తి నిలిపివేసి దాదాపు నాలుగు నెలలు గడుస్తుందని, వెంటనే పునరుద్ధరించి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ నాయకులు కలెక్టర్ ఎం.జగన్మోహన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ పరిశ్రమలో సుమారు పర్మినెంట్ కార్మికులు 1500 మంది, కాంట్రాక్టు కార్మికులు 600 మంది, స్టాఫ్ 600 మంది పని చేస్తున్నారన్నారు. గత నాలుగు నెలలుగా పరిశ్రమ ఉత్పత్తి నిలిపివేయడంతో కాంట్రాక్టు కార్మికులు వీధిన పడ్డారన్నారు. డిసెంబర్ నుంచి పర్మినెంట్ కార్మికులకు సైతం వేతనాలు నిలిపివేశారని, దీంతో ఆ కుటుంబాలు ఇబ్బందుల పాలవుతున్నాయన్నారు. జిల్లాలో ఉన్న ఏకైక పేపర్ పరిశ్రమ మూతపడకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.మల్లేశ్, పోశెట్టి, స్వామి, మయూరిఖాన్ ఉన్నారు. -
ముదురుతున్న ముసలం
సాక్షి, మంచిర్యాల : కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు రసవత్తరంగా మారుతోంది. రెబెల్ అభ్యర్థిని ఒక పార్టీ బరిలో ఉంచితే.. మరో పార్టీ శ్రేణులు తమను పట్టించుకోని వారిని తామెందుకు గౌరవిస్తామని వ్యాఖ్యానిస్తున్నాయి. వెరసి జిల్లాలోని పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పొత్తు కత్తులు నూరుతోంది. కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి చిలుముల శంకర్‌పై సీపీఐ రాష్ర్ట నేతలు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం తాజా పరిస్థితికి అద్దంపడుతోంది. రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్, సీపీఐల మధ్య కుదిరన పొత్తుతో బెల్లంపల్లి స్థానం నుంచి గుండా మల్లేశ్‌ను సీపీఐ బరిలోకి దింపింది. చిలుముల శంకర్ కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయనను ఉపసంహరింపచేయాలని సీపీఐ కాంగ్రెస్‌ను కోరినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఇటీవల గుండా మల్లేశ్ నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేసి సీపీఐ-కాంగ్రెస్ కార్యకర్తలు పొత్తు ధర్మం పాటించాలని, తన గెలుపునకు సహకరించాలని కోరారు. ఈ ప్రయత్నం ఫలించినట్లుగా కనిపించడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేసుకుని శంకర్‌కే తాము మద్దతిస్తామని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదంతా కాంగ్రెస్‌లోని ఓ బలమైన నాయకుడి అండతో సాగుతోందని సీపీఐ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీంతో గుండా మల్లేశ్ పరిస్థితి సంకటంలో పడిందని నియోజకవర్గ కమ్యూనిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలోనూ కాంగ్రెస్-సీపీఐ శ్రేణుల మధ్య సయోధ్య కుదిరినట్లు కనిపించడం లేదు. కాంగ్రెస్ నేతల సమావేశాలు, ప్రచారంలో ఎక్కడా సీపీఐ వర్గాలు కానరావడం లేదు. బెల్లంపల్లిలో తమకు కాంగ్రెస్ సహకరించిడం లేదని అలాంటపుడు తాము వినోద్‌కు మద్దతుగా ఎలా ఉంటామని చెన్నూర్ సీపీఐ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. రామగుండం, పెద్దపల్లి, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ శ్రేణులను కాంగ్రెస్ ప్రచారంలో ఆహ్వానించడం లేదు. శంకర్‌పై ఫిర్యాదు శంకర్‌పై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎన్నికల కమిటీ కన్వీనర్ చాడా వెంకటరెడ్డి తెలంగాణ పీసీసీ అగ్రనేతలకు బుధవారం హైదరాబాద్‌లో ఫిర్యాదు చేశారు. నేడు(గురువారం)సమావేశం కానున్న టీపీసీసీ శంకర్‌ను సస్పెండ్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తమ రెండు పార్టీల మధ్య పొత్తు అనేది ఉందా అనే సందేహాలు తమకే కలుగుతున్నాయని ఇరు పార్టీల నేతలే చర్చించుకుంటున్నారు. -
బెల్లంపల్లిలో గుండా మల్లేష్‌కు షాక్
కాంగ్రెస్, సీపీఐల మధ్య పొత్తు పలుచోట్ల చిచ్చులు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే మహేశ్వరంలో సీపీఐ అభ్యర్థి రంగంలో ఉండగా అదే స్థానం నుంచి కాంగ్రెస్ బీ ఫారంతో మల్రెడ్డి రంగారెడ్డి పోటీలో ఉన్నారు. తాజాగా సీపీఐ సీనియర్ నాయకుడు గుండా మల్లేష్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి చిలుముల శంకర్ బరిలో ఉన్నారు. బెల్లంపల్లి అసెంబ్లీ స్థానాన్ని పొత్తులో భాగంగా సీపీఐకి కాంగ్రెస్ కేటాయించింది. ఇక్కడి నుంచి సీపీఐ తరఫున గుండా మల్లేష్ పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆయనపైనే కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి చిలుముల శంకర్ పోటీ చేస్తున్నారు. పోటీ నుంచి ఉపసంహరించుకోవాలని స్వయంగా టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పోటీ చేసినా, శంకర్ మాత్రం ససేమిరా అంటూ బరిలోనే నిలిచారు. దీంతో ఈ వ్యవహారం ఏమిటంటూ కాంగ్రెస్ అధిష్ఠానానికి నేరుగా గుండా మల్లేష్ ఫిర్యాదు చేశారు. -
సీపీఐకి రెబల్స్ బెడద
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థి గుండా మల్లేష్‌కు రెబల్స్ బెడద పట్టుకుంది. కాంగ్రెస్-సీపీఐ పొత్తులో భాగంగా బెల్లంపల్లి స్థానాన్ని సీపీఐకి కేటాయించారు. ఆ పార్టీ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌నే మళ్లీ బరిలో దింపారు. అయితే.. రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరినా.. క్షేత్ర స్థాయిలో మాత్రం సీపీఐ-కాంగ్రెస్‌ల మధ్య అవగాహన కొరవడింది. కనీసం ముఖ్య నాయకులు కూడా ఇంత వరకు సమష్టిగా మాట్లాడుకున దాఖలాలు లేవు. అంతేగాకుండా రెబల్ స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి చిలుముల శంకర్ నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. నియోజకవర్గంలోని తాండూర్, కాసిపేట, భీమిని, నెన్నెల, వేమనపల్లి, బెల్లంపల్లి మండలాల కాంగ్రెస్ ముఖ్య, ద్వితీయ శ్రేణి నాయకులు శంకర్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు. ఎన్నికల్లో శంకర్ విజయం సాధించేలా కృషి చేస్తామని భరోసా ఇస్తున్నారు. ఈ పరిణామాలు సీపీఐ శ్రేణులను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. సయోధ్య కుదిరేనా? సీపీఐ అభ్యర్థిగా గుండా మల్లేష్, స్వతంత్ర అభ్యర్థిగా చిలుముల శంకర్ ఎన్నికల బరిలో దిగడం చర్చనీయాంశంగా మారింది. కలిసి పోటీ చేయాల్సింది పోయి ఎవరికి వారు వేర్వేరుగా నామినేషన్ దాఖలు చేయడంతో ఇరు పార్టీల మధ్య వైరుధ్యం పెరిగింది. ఇదిలా ఉంటే.. బుధవారం సీపీఐ అభ్యర్థి గుండా మల్లేష్ నామినేషన్ దాఖలు చేయగా.. ఆ కార్యక్రమానికి సీపీఐ నాయకులు, కార్యకర్తలు మాత్రమే హాజరయ్యారు. కాంగ్రెస్ వాళ్లు రానేలేదు. శంకర్ చేపట్టిన నామినేషన్ ప్రదర్శన ర్యాలీలో పాల్గొన్నారు. రెండు పార్టీల నాయకుల మధ్య సఖ్యత కలిగించడానికి అధినాయకులు రంగంలో దిగితే తప్ప మనస్పర్థలు తొలగేలా లేవు. ఆ దిశగా సీపీఐ శ్రేణులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ లోపు కాంగ్రెస్ శ్రేణులను బుజ్జగించకపోతే మల్లేష్‌కు తీవ్ర నష్టం కలిగే అవకాశాలూ లేకపోలేదు. వైఎస్సార్ సీపీ వైపు దృష్టి ఇదిలా ఉంటే.. బెల్లంపల్లి అసెంబ్లీ బరిలో తొలిసారిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొనసాగుతున్నారు. ఈ స్థానం నుంచి విద్యావేత్త ఎరుకల రాజ్‌కిరణ్ పోటీ చేస్తున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలతో లబ్ధిపొందిన ప్రజలు, కాంగ్రెస్‌లోని వైఎస్సార్ అభిమానులు ప్రస్తుతం వైఎస్సార్ సీపీ వైపు దృష్టి సారిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఇప్పటికీ వైఎస్సార్‌ను అభిమానించే ముఖ్య నేతలు ఎందరో ఉన్నారు. వారు రాజ్‌కిరణ్ అభ్యర్థిత్వాన్ని బలపర్చాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బెల్లంపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
క్లీనర్ నుంచి ఎమ్మెల్యేగా..
కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గుండా మల్లేష్ అంచెలంచెలుగా ఎమ్మెల్యే స్థా యికి ఎదిగారు. ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామానికి చెందిన మల్లేశ్ మెట్రిక్యులేషన్ చదివి, బెల్లంపల్లిలోని రామా ట్రాన్స్‌పోర్టులో క్లీనర్‌గా, డ్రెవర్‌గా పనిచేశారు. తోటి క్లీనర్లు, డ్రెవర్ల సమస్యలపై పోరాడారు. తర్వాత సింగరేణిలో కార్మికుడిగా చేరిన ఆయన సీపీఐలో సభ్యత్వం తీసుకున్నారు. 1970లో ఉద్యోగానికి రాజీనామా చేసి హోల్‌టైమర్‌గా మారారు. మంచి కార్మిక నేతగా పేరు తెచ్చుకున్న ఆయన 1983లో ఆసిఫాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. 1985, 1994 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 2009లోనూ బెల్లంపల్లి నుంచి ఎన్నికై సభానాయకుడిగా వ్యవహరిస్తున్నారు. - న్యూస్‌లైన్, బెల్లంపల్లి -
వినోద్ ఆశలు గల్లంతు?
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సీపీఐ-కాంగ్రెస్ పొత్తు దాదాపు ఖరారైందని భావించిన తరుణంలో, కామ్రేడ్లు టీఆర్ఎస్తో పొత్తు దిశగా అడుగులు వేస్తుండటం జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. ఈ రెండింటిలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ సీట్ల పంపకాల్లో జిల్లాలోని బెల్లంపల్లి స్థానాన్ని మాత్రం తమకే కేటాయించాలని సీపీఐ పట్టుబడుతోంది. ఇక్కడ ఆ పార్టీ శాస నసభాపక్ష నేత గుండా మల్లేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందా రు. సీపీఐ-టీఆర్ఎస్ పొత్తు ఖరారైన పక్షంలో బెల్లంపల్లి నుం చి పోటీ చేయాలని భావిస్తున్న మాజీ మంత్రి, టీఆర్ఎస్ ని యోజకవర్గ ఇన్చార్జి గడ్డం వినోద్ ఆశలు గల్లంతవనున్నాయి. బెల్లంపల్లి, చెన్నూరు స్థానాల్లో ఏదైనా ఒక చోట నుంచి వినోద్ పోటీ చేసేందుకు గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. చెన్నూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఉండటంతో బెల్లంపల్లిపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. తీరా ఇప్పుడు సీపీఐ టీఆర్ఎస్తో పొత్తు కుదిరితే వినోద్ ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సి వస్తుంది. ఇందులో భాగంగా ఆయన కరీంనగర్ జిల్లా ధర్మపురి స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రత్యామ్నా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. మున్సిపల్ బరిలో పొత్తుతోనే.. రాష్ట్ర స్థాయిలో పొత్తు ఇంకా ఖరారు కాకపోయినా బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఇప్పటికే టీఆర్ఎస్, సీపీఐ జతకట్టాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీలో కలిసి పోటీ చేస్తున్నాయి. సీట్ల పంపకాల్లో భాగంగా టీఆర్ఎస్ 28 వార్డుల్లో పోటీ చేస్తుంటే, ఎనిమిది వార్డుల్లో సీపీఐ అభ్యర్థులను బరిలోకి దింపింది. రెండు చోట్ల మాత్రం స్నేహపూర్వక పోటీ కొనసాగుతోంది. ఈ పొత్తు సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఉండే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు సీపీఐ కాంగ్రెస్‌తో పొత్తు ఖరారైన పక్షంలో ఈ స్థానానికి పోటీ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ నాయకుల ఆశలపై నీళ్లు చల్లినట్లు కానుంది. కాంగ్రెస్ నుంచి ఇన్చార్జి చినుముల శంకర్‌తోపాటు, మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి, సి.దుర్గాభవాణి, కే.హెమలత, రాజేశ్వర్‌రావు, రవికుమార్, డి.నర్సయ్య తదితరులు కాంగ్రెస్ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ సీపీఐతో పొత్తు కుదిరితే వీరు కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అవకాశం లేకుండా పోనుంది. పొత్తు, సీట్ల పంపకాల్లో భాగంగా సీపీఐ తెలంగాణలో 3 ఎంపీ, 20 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఇందులో ఆదిలాబాద్‌తోపాటు మెదక్, వరంగల్, మహబూబ్‌నగర్‌లలో ఒక్కో సీటును తమకు కేటాయించాలనే డిమాండ్‌తో ఉంది. నల్గొండ, ఖమ్మంలో మూడేసి సీట్లు, కరీంనగర్లో రెండు స్థానాలు కేటాయించాలని కోరుకుంటోంది. సీపీఐకి పలు చోట్ల పట్టు సీపీఐకి జిల్లాలో పలుచోట్ల మంచి పట్టుంది. ముఖ్యంగా సింగరేణిలో ఈ పార్టీ అనుబంధ కార్మిక సంఘమైన ఏఐటీయూసీ బలంగా ఉంది. సింగరేణి ఓట్లు బెల్లంపల్లితోపాటు, జిల్లాలోని శ్రీరాంపూర్ (మంచిర్యాల నియోజకవర్గం), మందమర్రి, రామకృష్ణాపూర్ (చెన్నూరు నియోజకవర్గం) ప్రాంతాల్లో అధికంగా ఉంటాయి. ఆదిలాబాద్‌తోపాటు, మరికొన్ని ప్రాంతాల్లో కూడా సీపీఐకి కేడర్ ఉంది. పొత్తు ఖరారైతే సీపీఐ పట్టున్న ఈ ప్రాంతాల్లో తమకు కలిసొస్తుందనే భావనతో కాంగ్రెస్, టీఆర్ఎస్లు భావిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఎన్నికల్లో సీపీఐతో పొత్తు పెట్టుకుని, ఎన్నికలయ్యాక కేంద్రంలో బీజేపీకి మద్దతివ్వాల్సి వస్తే రాజకీయ విమర్శలు ఎదురవుతాయని తమ అధినేత భావిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
సీఎం వ్యాఖ్యలకు కలత చెంది..
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : తెలంగాణ బిల్లు వెనక్కి పంపిస్తామని సీఎం కిరణ్ శాసనసభలో చేసిన వ్యాఖ్యలకు మనస్తాపం చెంది బెల్లంపల్లిలోని బాబుక్యాంప్ బస్తీకి చెందిన రాజ్‌కుమార్(30) కూరగాయల మార్కెట్ ముళ్లపొదల్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తూ రోడ్డు పైకి రావడంతో స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే 90 శాతం కాలి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. 108 అంబులెన్స్‌లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి సీపీఐ శాసనసభ పక్షనేత, ఎమ్మెల్యే గుండా మల్లేశ్ పరామర్శించారు. సీఐ రవీందర్ ఆస్పత్రికి చేరుకొని సంఘటన పూర్వపరాలు తెలుసుకున్నారు. రాజ్‌కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్‌లో మంచిర్యాలకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ప్రభుత్వాస్పత్రిలో సాయంత్రం మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. తెలంగాణవాదుల ధర్నా.. సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలకు ఓ నిండుప్రాణం బలైన ఘటనను పురస్కరించుకొని తెలంగాణవాదులు బజార్ ఏరియాలో ధర్నా నిర్వహించారు. కాంటా సమీపంలో ధర్నా చేసి కిరణ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం వ్యాఖ్యల కారణంగానే రాజ్‌కుమార్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. తెలంగాణ బిల్లు వెనక్కి పంపిస్తామని కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో క్షోభకు గురైన గుమస్తాగా పని చేసే రాజ్‌కుమార్ టీవీలో వీక్షించి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని సీపీఐ శాసనసభ పక్షనేత తెలిపారు. బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రిలో రాజ్‌కుమార్‌ను పరామర్శించిన అనంతరం మల్లేశ్ మాట్లాడారు. శాసనసభలో రాజ్‌కుమార్ మృతి అంశాన్ని లేవనెత్తుతానని తెలిపారు. మృతుడికి సంతాపం తెలిపి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. కొవ్వొత్తుల ర్యాలీ.. రాజ్‌కుమార్ మృతికి సంతాపంగా టీ-జేఏసీ, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. కాంటా చౌరస్తా నుంచి బజార్ ఏరియా పురవీధుల మీదుగా ర్యాలీ కొనసాగింది. రాజ్‌కుమార్ అమర్‌హే.., ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి డౌన్ డౌన్ అంటూ తెలంగాణ వాదులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీ-జేఏసీ పట్టణ కన్వీనర్ గజెల్లి వెంకటయ్య, నాయకులు పున్నం చంద్రు, వాసురాం, కె.విద్యాసాగర్, రంగ మహేశ్, రేణికుంట్ల శ్రీనివాస్, వేణుగోపాల్ పాల్గొన్నారు. నేడు బెల్లంపల్లి బంద్ తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్న రాజ్‌కుమార్ మృతికి సంతాపంగా సోమవారం బెల్లంపల్లి పట్టణ బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు ఆర్యవైశ్య సంఘం, టీ-జేఏసీ నాయకులు ప్రకటించారు. వ్యాపార, వాణిజ్యవర్గాలు బంద్‌కు సంపూర్ణంగా సహకరించాలని కోరారు. ఆటోలు,జీపులు, బస్సులు, దుకాణాలను మూసివేసి బంద్‌లో పాల్గొనాలని కోరారు. -
మనసులో తెలంగాణ, సీట్లకోసం సమైక్యాంధ్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీపీఐ నేత గుండా మల్లేశ్ మధ్య శుక్రవారం శాసనసభలో ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. మల్లేశ్ మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి చదివింది, క్రికెట్ ఆడింది అంతా తెలంగాణలోనే.. ఇటీవల నేను ఆయన సహచరులను కలిసినప్పుడు వారు, కిరణ్‌కుమార్‌రెడ్డి మంచివారే.. అయితే ఎందుకు అలా (సమైక్యవాదిగా) మారారో అర్థం కావడంలేదు అని వాపోయారు. సీఎం అంటే నాకూ గౌరవం ఉంది. కాని విభేదించేదంతా తెలంగాణపైనే’ అని అన్నారు. దీనితో ముఖ్యమంత్రి.. ‘అయితే నేను తెలంగాణవాడినా? సీమాంధ్రవాసినా?’ అని ప్రశ్నించారు. మల్లేశ్ ప్రతిస్పందిస్తూ..‘మనసులో తెలంగాణ..ఓట్లు, సీట్ల కోసం సమైక్యాంధ్ర అంటున్నారు. మీకు తెలంగాణలో పోటీ చేయడానికి సీటు ఇస్తాం.. తెలంగాణ అనండి’ అని అన్నారు. దీనితో ముఖ్యమంత్రి ‘ఓట్లు, సీట్ల కోసం రాజకీయం చేయడం లేదు. సమైక్యాంధ్ర నా నినాదం కాదు. విధానం. రాష్ట్ర విభజనతో ఇబ్బందులు వస్తాయి. తెలంగాణకు నష్టం జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పాను, కాని ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నానో ఈ సభలో చెబుతాను’ అని వ్యాఖ్యానించారు. -
సీఎంను పదవి నుంచి తప్పించాలి
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : సీడబ్ల్యూసీ తీర్మానానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం వెంటనే పదవి నుంచి తప్పించాలని సీపీఐ శాసనసభా పక్ష నేత గుండా మల్లేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణ సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ అంశంపై వైఖరి వెల్లడించకముందు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పిన కిరణ్ తీరా ఇప్పుడు ప్లేటు మార్చి సమైక్య నినాదం వినిపించడం సిగ్గు చేటన్నారు. సమైక్యవాద ముసుగులో సీమాంధ్ర ప్రజలను కూడా సీఎం మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎంకు ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా స్వచ్ఛందంగా సీఎం పదవికి రాజీనామా చేయడమో, కాంగ్రెస్ నుంచి వైదొలగడమో చేయాలని సవాల్ విసిరారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చి టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు భిన్నంగా ప్రవర్తిస్తున్నాడని దుయ్యబట్టారు. సీమాంధ్రకు రూ.5 లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు మిన్నకుండి పోవడం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ అదే ధోరణిని ప్రదర్శిస్తోందని అన్నారు. అసెంబ్లీ నడవకుండా సీమాంధ్ర నేతలు కుట్రలు చేశారని విమర్శించారు. సీపీఐ పట్టణ కార్యదర్శి పి.శేషగిరిరావు, సహాయ కార్యదర్శులు మంతెన మల్లేశ్, తాళ్లపల్లి మల్లయ్య, నాయకులు పుల్లూరి మల్లయ్య పాల్గొన్నారు. అధికారుల మూలంగానే నీటి చౌర్యం మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారుల బాధ్యతారాహిత్యం మూలంగానే బెల్లంపల్లికి వచ్చే గోదావరి జలాలు చౌర్యానికి గురవుతున్నాయని గుండా మల్లేశ్ పేర్కొన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి బెల్లంపల్లి, మంచిర్యాల, మందమర్రి మున్సిపాలిటీలకు తాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకు సంబంధించి బెల్లంపల్లికి గోదావరి జలాలు సరఫరా చేయడం కోసం ప్రత్యేకంగా ఇంటెక్వెల్ నిర్మించినట్లు తెలిపారు. కొంతమంది ఒత్తిళ్ల మేరకు మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు బెల్లంపల్లికి వచ్చే గోదావరి జలాలను అక్రమంగా మంచిర్యాలకు సరఫరా చేయడానికి అంగీకరించారని ఆరోపించారు. సోమవారం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్లి ఇంటెక్వెల్ను పరిశీలిస్తామన్నారు. కాసిపేట ప్రజలకు గోదావరి జలాలు సరఫరా చేయడానికి ప్రభుత్వం రూ.21 కోట్లు నిధులు మంజూరు చేసిందని తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. నెన్నెల మండలం మత్తడివాగుకు రూ.11 కోట్ల నిధులు మంజూరైనట్లు చెప్పారు. తెలంగాణపై చర్చ జరుగకుండా సీఎం కుట్ర : ఎమ్మెల్యే వేణుగోపాలాచారి భైంసా : అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణపై చర్చ జరుగకుండా సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి కుట్ర పన్నారని ముథోల్ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి ఆరోపించారు. ఆదివారం భైంసా పట్టణంలోని కేఎస్ గార్డెన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సీఎంకు తెలంగాణ ఏర్పాటు విషయం మింగుడు పడడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం హోదాలో అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడాల్సింది పోయి ఇష్టారీతిన వ్యవహారిస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారని విమర్శించారు. కేంద్రం తక్షణమే తెలంగాణ ఏర్పాటు చేసి, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. -
'సీఎం కిరణ్‌ను కాంగ్రెస్ అధిష్టానం కట్టడిచేయాలి'
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవుతున్న దశలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ బిల్లు అడ్డుకుంటామని చెప్పడం హాస్యాస్పదమని సీపీఐ శాసనసభ పక్షనేత గుండా మల్లేష్ వ్యాఖ్యానించారు. శనివారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ప్రజాఉద్యమమే పునాది అని ఆయన అభివర్ణించారు. ప్రజాఉద్యమంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటువుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని సూచించారు. సీఎం కిరణ్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని గుండా మల్లేష్ ఈ సందర్బంగా ఆరోపించారు. సీఎం కిరణ్‌ను కట్టడి చేయాలని ఈ సందర్బంగా ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిమయం
ఆసిఫాబాద్, న్యూస్‌లైన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతికి నిలయంగా మారాయని సీపీఐ శాసనసభా పక్షనేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే గుండా మల్లేశ్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపడుతున్న ఆందోళనలో భాగంగా శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర మంత్రులు అవినీతి ఊబిలో కూరుకుపోయారన్నారు. యూపీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న దివాళాకోరు విధానాలతో రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతోందని విమర్శించారు. అనంతరం సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్‌కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి కలవేని శంకర్, జిల్లా సహాయ కార్యదర్శి బద్రి సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.