కాంగ్రెస్‌ బాటలోనే బీజేపీ..    | BJP on Congress way | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ బాటలోనే బీజేపీ..   

Published Thu, Mar 22 2018 1:26 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

BJP on Congress way - Sakshi

సమావేశంలో అభివాదం చేస్తున్న సీసీఐ నాయకులు

 ఎదులాపురం(ఆదిలాబాద్‌): దేశంలో కాంగ్రెస్‌ అనుసరించిన బాటలోనే బీజేపీ పయనిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆదిరెడ్డి, గుండా మల్లేశ్‌ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో బుధవారం నిర్వహించిన సీపీఐ జిల్లా మహాసభలో వారు అతిథులుగా హాజౖ రె మాట్లాడారు. దేశ పాలనలో మోదీ అన్న అయితే రాష్ట్రంలో కేసీఆర్‌ తమ్ముడిగా పాలన సాగుతుందని ఎద్దేవా చేశారు.

దేశంలో గోరక్షణ దళాల పేరుతో మతోన్మాద దాడులకు పాల్పడుతూ హింస ను ప్రేరేపిస్తుందన్నారు. సాహితీవేత్తలు, సంఘ సంస్కర్తలను హత్య చేయి స్తున్నారని ఆరోపించారు. ఉపాధి హా మీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోంద న్నారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుండా మల్లేశ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న ఈ ప్రభుత్వానికి పట్టడం లే దన్నారు.

రైతు కుటుంబాలను కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని విమర్శిం చారు.  థర్డ్‌ ఫ్రంట్‌ ను సీపీఐ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. తొలు త కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరి నీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు విలాస్, నళినిరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యరద్శి మేస్రం భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement