రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి కార్మికులను వారసత్వ ఉద్యోగాల పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం, గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్ మోసం చేశాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుండా మల్లేష్ విమర్శించారు. సోమవారం గోలేటిటౌన్‌షిప్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎలాంటి షరతులు లేని వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ శాసనసభ సాక్షిగా ప్రకటించి కార్మికులను మోసం చేశారన్నారు. రాజ్యాంగం ప్రకారం వారసత్వ ఉద్యోగాలు చెల్లవని తెలిసినా బావులపై వెళ్లేందుకు ముఖం చాలక గుర్తింపు సంఘం నాయకులు కార్మికులకు అన్యాయం చేశారన్నారు. సమ్మె ద్వారానే వారసత్వ ఉద్యోగాలు సాధ్యమని, అన్ని కార్మిక సంఘాలు కలిసికట్టుగా ఆందోళనకు సిద్ధం కావాలని పేర్కొన్నారు.
‘వారసత్వం పేరుతో సర్కారు మోసం’
Published Mon, May 8 2017 7:30 PM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM
Advertisement