tbgks
-
నేడు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రానికి కొంగుబంగారంగా నిలిచిన సింగరేణి సంస్థ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. నిధులు, నియామకాల్లో నంబర్‌వన్‌గా నిలిచిన సింగరేణి సంస్థ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే. ఈసారి ఎన్నికల్లో 39,748 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 11 ఏరియాల్లో ఈ ఎ న్నికలను నిర్వహించేందుకు కార్మికశాఖ ఏర్పా ట్లుచేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి సంస్థలో తరచూ సమ్మెలు జరగడం, ఉత్పత్తికి తీవ్రవిఘాతం కలగడం సర్వసాధారణంగా మారింది. దీంతో సంస్థకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. 1998లో వాస్తవ పరిస్థితులు సమీక్షించిన అప్ప టి ముఖ్యమంత్రి సమ్మెల నివారణ లక్ష్యంగా గుర్తింపు సంఘం ఎన్నికలకు శ్రీకారం చుట్టా రు. ఇలా మొదలైన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు మొదటి రెండుసార్లు రెండేళ్ల కాలపరిమితితో సాగాయి. ఆ తర్వాత మూడు దఫాలు సింగరేణి యాజమాన్యంతో జరిగిన ఒప్పందం నేపథ్యంలో నాలుగేళ్ల కాలపరిమితితో నిర్వహించారు. అయితే 2017లో కేంద్ర కార్మిక శాఖ రెండేళ్ల కాలపరిమితి అని తేల్చింది. ఎన్నికలకు ముందు నాలుగేళ్లు అని చెప్పి తాము గెలిచాక రెండేళ్లు అంటున్నారని పేర్కొంటూ గుర్తింపు సంఘం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ క్రమంలో 2021 వరకు ఎన్నికలు జరగలేదు. ఆ తర్వాత కరోనా వైరస్ విజృంభించడంతో మరో రెండేళ్ల పాటు జాప్యం జరిగింది. చివరకు ఏఐటీయూసీ హైకోర్టులో కేసు వేయడంతో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో చలనం వచ్చింది. అయితే ఎన్నికల సన్నాహాలు ఇతర కారణాలతో వాయిదా వేయాలని రాష్ట్ర ఇంధన కార్యదర్శి కోర్టులో పిటిషన్ వేశారు. కానీ ఎన్నికలు జరపాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. రిటర్నింగ్ అధికారి రెండేళ్ల కాలపరిమితితో నోటిఫికేషన్ జారీ చేసినా, ఎన్నికల తర్వాత గెలిచిన సంఘం నాలుగేళ్ల కాలపరిమితి ఒప్పందాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉండటంతో..గుర్తింపు సంఘం రెండేళ్లే ఉంటుందా? నాలుగేళ్ల వరకు కొనసాగుతుందా? అని సింగరేణి వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. 2012 నుంచి ప్రతిష్టాత్మకంగా.. సింగరేణి ఎన్నికలు 2012 నుంచి అన్ని పార్టీల కు ప్రతిష్టాత్మంగా మారాయి. సంస్థ విస్తరించి న 11 ఏరియాల్లో 11 మంది ఎమ్మెల్యేలు ప్రాతి నిధ్యం వహిస్తుండటంతో కీలకంగా మారాయి. అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించి ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యే క పరిశీలకులను నియమించారు. ఈ క్రమంలో రెండుసార్లు గుర్తింపు యూనియన్‌గా బీఆర్ఎస్ పార్టీ అనుబంద టీబీజీకేఎస్ (తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) గెలిచింది. తాజా ఎన్నికలు టీబీజీకేఎస్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీయూసీ, సీపీఐ అనుబంధ ఏఐటీ యూసీ మధ్య జరుగుతున్నాయి. -
యువ సారథ్యానికి అవకాశం
సాక్షి, హైదరాబాద్: సింగరేణి సంస్థలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించామని, అదే స్ఫూర్తితో నాయకత్వంలోనూ యువతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని తెలంగాణ బొగ్గు గని కా ర్మి క సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య బుధవారం హైదరాబాద్‌లో కవితను కలసి సింగరేణి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, సన్నద్ధతపై చర్చించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తమ యూనియన్‌లో యువతకు 66 శాతం వరకు నాయకత్వ బాధ్యతల్లో అవకాశాలు కల్పిస్తామన్నారు. 1998లో ఆగిపోయిన కారుణ్య నియామకాలను 2018లో కేసీఆర్ తిరిగి పునరుద్ధరించి వేలాది మందిని నియమించారన్నారు. జాతీయ సంఘాల కారణంగా కారుణ్య నియామకాలకు గండి పడిందని, కోల్ ఇండియా సంస్థలో సైతం లేని విధంగా కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని చెప్పారు. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. సింగరేణిని కష్టాల నుంచి కాపాడిన బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్‌ను ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ దాదాపు 20 వేల డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి యువతకు ఉపాధి కల్పించారని, ఎప్పుడూ లేని విధంగా సింగరేణి సంస్థ నికర లాభాల్లో కార్మికులకు భారీ మొత్తంలో వాటాలను పంచారని వివరించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 61కి పెంచామని, తెలంగాణ ఉద్యమ సమయంలో 35 రోజుల పాటు సాగిన సకల జనుల సమ్మెలో పాల్గొన్న వారికి రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పూర్తి జీతం ఇచ్చారని గుర్తు చేశారు. కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సౌకర్యం కల్పించారని, క్వార్టర్స్‌లో నివసించే వారు బేసిక్‌లో 1% సంస్థకు చెల్లించాలన్న నిబంధనను కేసీఆర్ రద్దు చేశారని, డిపెండెంట్ ఉద్యోగం వద్దనుకుంటే ఆ కుటుంబానికి రూ. 25 లక్షలు చెల్లించాలన్న నిర్ణయం తీసుకున్నారని కవిత పేర్కొన్నారు. -
గనుల వేలం ఆపకుంటే యుద్ధమే
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సాక్షి, పెద్దపల్లి/సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో శనివారం బొగ్గు గనుల ప్రాంతాల్లో మహాధర్నాలు నిర్వహించారు. భూపాలపల్లి, కొత్తగూడెం, మంచిర్యాల, గోదావరిఖని, రామగుండం, మందమర్రి, నస్పూర్, ఇల్లందులో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిరసన తెలిపారు. బొగ్గు గనుల వేలాన్ని కేంద్రం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో బీజేపీ హటావో.. సింగరేణి బచావో పేరిట నిర్వహించిన ఈ ధర్నాల్లో మంత్రులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రంపై ప్రధాని సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని నేతలు దుయ్యబట్టారు. కొత్తగూడెంలో... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన మహాధర్నాలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. సింగరేణి బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటు సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే కేంద్రంపై జంగ్ సైరన్ మోగిస్తామని హెచ్చరించారు. సింగరేణిని కాపాడుకునేందుకు సీఎం కేసీఅర్, మంత్రి కేటీఆర్ నాయకత్వాన మరో ప్రజా ఉద్యమం నిర్మిస్తామన్నారు. సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణపల్లి, పెనగడప బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని ఉపసంహరించుకోవడమే కాకుండా ఇప్పటికే వేలం వేసిన బ్లాక్‌లను సింగరేణికి కేటాయించాలన్నారు. ఈ ధర్నాలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. భూపాలపల్లిలో... సింగరేణి బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణను రద్దు చేసే వరకు పోరాటాలు నిర్వహిస్తూ కేంద్రంపై ఒత్తిడి తెస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో వారు మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని నాలుగు బొగ్గు బ్లాక్‌లను కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, శంకర్‌నాయక్, నన్నపునేని నరేందర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, అరూరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. నస్పూర్‌లో... అదానీకి కట్టబెట్టేందుకే లాభాల్లో ఉన్న సింగరేణి బొగ్గు బ్లాక్‌లను వేలం వేసేందుకు చూస్తున్నారని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణం సీసీసీ కార్నర్ వద్ద జరిగిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో పది శాతంగా ఉన్న సింగరేణి లాభాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మరింత పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ఎన్.దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, జోగు రామన్న, రాథోడ్ బాపురావు, ఆత్రం సక్కు, జెడ్పీ చైర్పర్సన్లు రాథోడ్ జనార్దన్, నల్లాల భాగ్యలక్ష్మి , కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీలు పురాణం సతీష్, నారదాసు లక్ష్మణ్‌రావు, సీపీఐ రాష్ట్ర నాయకులు కలవేణ శంకర్, టీబీజీకేఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గోదావరిఖనిలో... సింగరేణిని ప్రైవేటీకరించబోమంటూ గతేడాది రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారం¿ోత్సవం సందర్భంగా చెప్పిన ప్రధాని మోదీ ఆ మాట తప్పారని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ ‘ప్రధాని మోదీ.. నీకు అదానీ కా వాలో.. సింగరేణి కార్మికులు కావాలో తేల్చుకో..’అంటూ డిమాండ్ చేశారు. సింగరేణిని ప్రైవేటీకరిస్తే అందులో పనిచేసే 45 లక్షల మంది కార్మికులు ఏం కావాలని ప్రశ్నించారు. సింగరేణి బొగ్గు టన్నుకు రూ. 4,500కు లభిస్తుంటే ప్రధాని తన దోస్త్ అయిన అదానీకి ఇండోనేసియాలో ఉన్న బొగ్గు కంపెనీ నుంచి టన్నుకు రూ. 24,500 చొ ప్పున ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే చందర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, టీజీకేఎస్ నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. -
కీలక నేతలంతా మావెంటే..
గోదావరిఖని(పెద్దపల్లి జిల్లా): ‘సంఘంలో కీలక నేతలంతా మావెంటే ఉన్నారు.. కొంత మంది అవకాశవాదులు సంఘాన్ని వీడితే ఒరిగే నష్టమేమి లేదు.. రాజీనామా చేసిన వారిలో కీలక పదవులున్న వారెవరూ లేరు’ అని టీబీజీకేఏస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి స్పష్టం చేశారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 11మెన్ కమిటీ సభ్యులు, సెంట్రల్ కమిటీ నాయకులు, డివిజన్ ఉపాధ్యక్షుల్లో ఎవరూ సంఘాన్ని వీడలేదన్నారు. రాజీనామా చేసిన వారిలో ఇద్దరికి మాత్రమే ప్రస్తుతం పదవులున్నాయని తెలిపారు. ఎక్కడ ప్రకంపలున్నాయని, ఎక్కడ యూనియన్ బద్ధలైందని ఆయన ప్రశ్నించారు. ఏడు గనులను తిరిగి సింగరేణి వ్యాప్తంగా పర్యటించామని, కార్మికులంతా తమ వెంటే ఉన్నారని బయటకు వెళ్లిన వారు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. స్వార్థంతో సంఘాన్ని విమర్శించడం సరికాదన్నారు. వలసవాదులెవరూ తమ యూనియన్‌లో లేరని, ఈ పదాన్ని వాడడాన్ని ఆయన ఖండించారు. పురుడు పోసింది కెంగర్ల కాదు.. యూనియన్‌కు పురుడు పోసింది కెంగర్ల మల్ల య్య కాదని, గోదారిఖనిలో టీబీజీకేఏస్ యూనియన్ ఆరంభం నుంచి ప్రస్తుత సంక్షేమ మంత్రి గా కొనసాగుతున్న కొప్పుల ఈశ్వర్ కీలక పాత్ర పోషించారని రాజిరెడ్డి తెలిపారు. అలాగే పీటీస్వామి వ్యవస్థాపక అధ్యక్షులుగా కొనసాగారన్నారు. కొప్పుల లక్ష్మిరాజం, ఆంధ్రయ్య సంఘం లో ప్రముఖ పాత్ర పోషించారని, తానే పురుడు పోశామని చెప్పడం అర్థరహితమని అన్నారు. యూనియన్‌కు ఓనర్లంటూ అహంతో మాట్లాడుతున్నారన్నారు. స్వార్థ రాజకీయాల కోసం సంఘాన్ని బదనాం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాము కార్మికులకు పోగొట్టిన హక్కులు ఏమిటో చెప్పాలని సవాల్ చేశారు. సమావేశంలో నాయకులు నూనె కొమురయ్య ధీకొండ అన్నయ్య, గండ్ర దామోదర్‌రావు, సంపత్, ఐలి శ్రీనివాస్, కొత్త సత్యనారాయణరెడ్డి, దేవ వెంకటేశం, శ్రీనివాస్‌రావు, తిరుపతి, సురేందర్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, వీర భద్రయ్య, మంగిలాల్, మల్లారెడ్డి పాల్గొన్నారు. -
‘టీబీజీకేఎస్ నుంచి వైదొలగుతున్నా..!’
గోదావరిఖని : తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) నుంచి తాను పూర్తిగా వైదొలగుతున్నట్లు ఆ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య ప్రకటించారు. యూనియన్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు రాజీనామా లేఖను అందజేసినట్లు పేర్కొన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేరు పెట్టి పెద్ద చేసిన సంఘం నుంచి వైదొలగడం బాధగా ఉన్నా.. తప్పడం లేదన్నారు. సింగరేణి సంస్థలో 2003లో టీబీజీకేఎస్ పురుడు పోసుకుందని, అప్పటి నుంచి తాను సంస్థలో కీలక నాయ కుడిగా పని చేస్తున్నానని చెప్పారు. సింగరేణిలో ఒంటి చేత్తో సంఘాన్ని గెలిపించి గులాబీ జెండా ఎగురవేశామని గుర్తు చేశారు. అయినా.. సంఘంలో తనకే స్థానం లేకుండా పోయిందని వాపోయారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి చట్టబద్ధత లేదని జూన్ 21న ఓ వలసవాది ప్రకటించి తన స్థానమేమిటో తెలియజేశారని, ఈ విషయం తనకు ఎంతో బాధ కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. కాగా, మల్లయ్యతో పాటు ఎనిమిది మంది ముఖ్య నాయకులు కూడా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. -
టీబీజీకేఎస్ నేత రాజీనామా?
గోదావరిఖని : టీఆర్ఎస్ అనుబంధ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగెర్ల మల్లయ్య తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన అధికారికంగా ప్రకటించనున్నారని తెలిసింది. టీబీజీకేఎస్‌లో సరైన గుర్తింపు లేకపోవడంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నెలాఖరులో కేంద్ర మంత్రుల సమక్షంలో ఆయన బీఎంఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా 2003లో పురుడు పోసుకున్న టీబీజీకేఎస్‌లో ఆది నుంచి పనిచేస్తున్న మల్లయ్య అనేక కీలక పదవుల్లో పనిచేశారు. యూనియన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శితో పాటు ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. టీబీజీకేఎస్‌లో ఉంటే గుర్తింపు లేదనే ఆలోచనతో మల్లయ్య బీఎంఎస్ వైపు దృష్టి సారించారు. అయితే బీజేపీ అగ్ర నాయకులతో భేటీ అయి కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. -
‘నామా’ను గెలిపించాలని ప్రచారం
సాక్షి, సూపర్‌బజార్(కొత్తగూడెం): ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో బుధవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా వర్క్‌షాప్ వద్ద ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కారు గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని, సింగరేణి కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని కొనియాడారు. సింగరేణికి మరింత భవిష్యత్ చేకూరాలంటే టీఆర్ఎస్ను గెలిపించాల్సిన బాధ్యత కార్మికవర్గంపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.ఎ.రజాక్, రీజనల్ కార్యదర్శి కూసన వీరభద్రం, లెవెన్‌మెన్ కమిటీ మెంబర్ కాపు కృష్ణ, సెంట్రల్ కౌన్సిల్ మెంబర్లు పొదిల శ్రీనివాసరావు, విప్లవరెడ్డి, పిట్ సెక్రటరీ ఎండీ.సత్తార్‌పాషా, వాసు, శంకర్, పద్మ పాల్గొన్నారు. నామా, వనమాతో అభివృద్ధి సాధ్యం పాల్వంచరూరల్: టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం మండల పరిధి పాండురంగాపురం, సూరారంలో నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలిసి నామాను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు మాటాడుతూ నామాను గెలిపిస్తే ఇటు ఎంపీ, అటు ఎమ్మెల్యే వనమా ద్వారా నియోజకవర్గంలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గురువారం ఖమ్మంలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు జగదీష్‌కుమార్, రాణి, జి.రాంబాబు, రవీందర్, నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వర్లు, బొందిల హరి, లక్ష్మీనర్సయ్య, నాగిరెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి: జలగం పాల్వంచ: టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు కోరుతూ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ బుధవారం పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీపీఎస్ అంబేడ్కర్ సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేటీపీఎస్ ఉద్యోగులకు కరపత్రాలు పంపిణీ చేసి నామా గెలుపునకు సహకరించాలని కోరారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో నాయకులు బిక్కసాని నాగేశ్వరరావు సీతారామిరెడ్డి, సురేష్‌బాబు, బుడగం రవి, నల్లమల్ల సత్యం, బిల్లా సృజిత్, అయితా గంగాధర్, జనార్దన్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, బాషా, పోతురాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఐదో వార్డులో పొనిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. నామా నాగేశ్వరరావుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. -
సింగరేణితో టీబీజీకేఎస్ చర్చలు ఫలప్రదం
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ హామీ ఇచ్చారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్)తో మంగళవారం ఇక్కడ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్మిక సంఘం సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సింగరేణిలో గైర్హాజరు కారణంగా తొలగించిన కార్మికులకు ఆఖరి అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. సింగరేణి, కోల్ ఇండియాలోని క్యాడర్ స్కీమ్‌ను అధ్యయనం చేసి కార్మికులకు మేలు కలిగేలా ప్రతిపాదనలు చేసేందుకు అధికారుల కమిటీ ఏర్పాటు చేశామని, ఈ నివేదిక ఆధారంగా ఇంక్రిమెంట్‌ను అమలు చేస్తామన్నారు. సమావేశంలో టీబీజీకేఎస్ అధ్యక్ష, కార్యదర్శులు వెంకట్రావు, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు
రెబ్బెన : మండలంలోని గోలేటి, రెబ్బెన మండల కేంద్రంలో మంగళవారం కార్మిక దినోత్సవ వేడుకలను కార్మికులు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గోలేటి టౌన్షిప్ లోని తెలంగాణ భవన్ వద్ద టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్‌రావు ఎర్రజెండాను ఎగురవేసి కార్మిక అమరవీరులకు నివాళి అర్పించారు. స్థానిక కేఎల్ మహేంద్రభవన్ వద్ద ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్, సింగరేణి బస్టాండ్ వద్ద సీపీఐ పట్టణ కార్యదర్శి జగ్గయ్య,రమణారెడ్డి నగర్లో సీపీఐ సహాయ కార్యదర్శి కిషన్ ఆధ్వర్యంలో మేడే దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పతాకాన్ని ఎగురవేసి అమరవీరులు నివాళులర్పించారు. గోలేటి ఎక్స్‌రోడ్ వద్ద సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పొన్న శంకర్, రెబ్బెన మండల కేంద్రంలో మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య జెండాలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని ఆరో పించారు. కార్మిక సంఘాలు పోరా టాలతో సాధించిన కార్మిక చ ట్టాలను తుంగలో తొక్కుతూ కార్మిక లోకా నికి ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయ ని అన్నారు. చికాగో అమరవీరుల పో రాట స్ఫూర్తితో కార్మికులంతా హక్కుల కోసం పోరాడాలని సూచించారు. కార్యక్రమాల్లో సిక్స్మె న్ కమిటీ సభ్యులు రాంరెడ్డి ,నాయకులు సాంబగౌడ్, చంద్రశేఖర్, కుమార్, ఏఐటీయూసీ నాయకులు శేషు, కిరణ్‌బాబు, సీపీఐ రెబ్బెన పట్టణ కార్యదర్శి శంకర్, నాయకులు అశోక్, దుర్గం తిరుపతి ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కా ర్యదర్శి దుర్గం రవీందర్ పాల్గొన్నారు. -
రెండేళ్లా.? నాలుగేళ్లా..?
గోదావరిఖని(పెద్దపల్లిజిల్లా): సింగరేణిలో ఆరో దఫా గుర్తింపు సంఘం ఎన్నికలు 2017 అక్టోబర్ 5న జరిగాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 11 డివిజన్లకు తొమ్మిది డివిజన్లలో టీబీజీకేఎస్ గెలిచి గుర్తింపు సంఘంగా, రెండు డివిజన్లలో ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గెలిచి ప్రాతినిధ్య సంఘంగా మారాయి. గుర్తింపు పత్రాలు ఇవ్వడంలో జాప్యం సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలను కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని సెంట్రల్ లేబర్ కమిషనర్ కార్యాలయ వర్గాల ఆధ్వర్యంలో నిర్వహించారు. 2017 అక్టోబర్ 5న ఎన్నికలు జరిగి అదే రోజు రాత్రి ఫలితాలు వెల్లడించింది. కానీ అధికారిక పత్రాలను మాత్రం కార్మిక శాఖ అధికారులు ఇవ్వలేదు. ఈ విషయమై గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలకు చెందిన నాయకత్వం ఇటు యాజమాన్యంపైన, అటు కేంద్ర కార్మిక శాఖ అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చాయి. గుర్తింపు పత్రం ఇవ్వకపోవడంతో టీబీజీకేఎస్‌ను యాజమాన్యం అధికారికంగా ఏ సమావేశానికీ ఆహ్వానించలేదు. చివరకు ఎన్నికలు జరిగిన ఆరు నెలల తర్వాత కార్మిక సంఘాలకు 2018 ఏప్రిల్ 11న గుర్తింపు, ప్రాతినిధ్య హోదా పత్రాలను డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ రెండు సంఘాల నేతలకు అప్పగించారు. ఆలస్యానికి బాధ్యులెవరు? టీబీజీకేఎస్, ఏఐటీయూసీ సంఘాలకు గుర్తింపు, ప్రాతినిధ్య హోదా సర్టి ఫికెట్లు ఇవ్వడంలో ఆలస్యానికి బాధ్యులెవరనేది ప్రశ్నగా మారింది. సింగరేణిలో ఎన్నికలు 2017 అక్టోబర్ 5న జరగగా, కేంద్ర కార్మిక శాఖ నవంబర్ 30న గుర్తింపు, ప్రాతినిధ్య హోదా సర్టిఫికెట్లను సింగరేణి యాజమాన్యానికి పంపించింది. ఇందులో రెండేళ్ల కాలపరిమితిని నిర్ణయిస్తూ లేఖ పంపించారు. ఈ విషయంపై సింగరేణి యాజమాన్యం స్పందించి గతంలో గుర్తింపు సంఘం కాలపరిమితి నాలుగేళ్ల పాటు ఉండగా, ఈ సారి రెండేళ్లుగా నిర్ణయించడంపై డైరెక్టర్ (పా) కేంద్ర కార్మిక శాఖకు లేఖ రాశారు. గుర్తింపు సంఘం కాలపరిమితి నాలుగేళ్లు ఉండేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేంద్ర కార్మిక శాఖ నుంచి ఇందుకు స్పందన రాలేదు. గుర్తింపు, ప్రాతినిధ్య హోదా సర్టిఫికెట్లు సింగరేణికి 2017 నవంబర్ 30నే వచ్చినా యాజమాన్యం మాత్రం వాటిని గెలిచిన సంఘాలకు ఇవ్వకుండా నాన్చుతూ వచ్చింది. చివరకు మూడు నెలల తర్వాత రెండేళ్ల కాలపరిమితి అంటూ కార్మిక శాఖ నుంచి లేఖ పంపించారు. దీంతో చేసేదేమీలేక ఆనాడు పంపించిన పత్రాలనే గత బుధవారం హైదరాబాద్‌లోని కార్మిక శాఖ కార్యాలయంలో టీబీజీకేఎస్, ఏఐటీయూసీ నేతలకు వాటిని అందజేశారు. సింగరేణి యాజమాన్యమా? లేక కేంద్ర కార్మిక శాఖా? ఈ ఆలస్యానికి బాధ్యులెవరనేది ప్రశ్నార్థకంగా మారింది. తొలుత రెండేళ్లు..అనంతరం నాలుగేళ్లు.. ఇప్పుడు.? 1998లో సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రారంభం కాగా ఆ సంవత్సరంతో పాటు 2001లో రెండేళ్ల కాలపరిమితి నిర్ణయించారు. 2003 నుంచి నాలుగేళ్ల పరిమితి వర్తింపజేశారు. 2007, 2012లో గెలిచిన సంఘాలకే అదే కాలపరిమితి వర్తింపజేశారు. 2017లో తిరిగి రెండేళ్ల కాలపరిమితి అంటూ కేంద్ర కార్మిక శాఖ పాతపాటే పాడింది. ఎప్పటి నుంచి అమలు.? ఈ సారి రెండేళ్ల కాలపరిమితి నిర్ణయించిన నేపథ్యంలో అది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే చర్చ సాగుతోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమకు అధికారిక పత్రం ఇచ్చినప్పటి నుంచే కాలపరిమితి అమల్లోకి వస్తుందని గుర్తింపు సంఘం నాయకులు పేర్కొంటున్నారు. కానీ కేంద్ర కార్మిక శాఖ 2017 నవంబర్ 30వ తేదీనే అధికారిక పత్రం ఇవ్వగా...దానిని టీబీజీకేఎస్, ఏఐటీయూసీ సంఘాలకు ఇవ్వడంలో సింగరేణి యాజమాన్యం తాత్సారం చేస్తూ వచ్చింది. కేంద్ర కార్మిక శాఖ మొదట అధికారిక పత్రాలను పంపించిన నవంబర్ 30వ తేది నుంచి కాలపరిమితి మొదలవుతుందని పలువురు పేర్కొంటున్నారు. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తాం సింగరేణిలో ఆరో దఫా గుర్తింపు సంఘం ఎన్నికల జరగడానికి ముందు కాలపరిమితి రెండేళ్లా, నాలుగేళ్లా అనే విషయాన్ని కేంద్ర కార్మిక శాఖ కార్మిక సంఘాలకు తెలపలేదు. గతంలో ఉన్నట్లుగానే నాలుగేళ్లు ఉంటుందని మాతో పాటు మెజారీ కార్మిక సంఘాలు నమ్మాయి. చివరకు టీబీజీకేఎస్ గెలిచిన తర్వాత నాలుగేళ్లు కాదు, రెండేళ్ల కాలపరిమితి అంటూ లేఖ రాయడం కేంద్ర కార్మిక శాఖకు సరికాదు. ఈ విషయంలో అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయిస్తాం. – మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి -
హక్కుల సాధన టీబీజీకేఎస్‌తోనే సాధ్యం
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి కార్మిక హక్కుల సాధన కేవలం టీబీజీకేఎస్‌తోనే సాధ్యమని యూనియన్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్ రావు అన్నారు. బుధవారం బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూడ ఓసీపీలో కార్మికులను కలిసి సీఎం కేసీఆర్, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత, ఎంపీ బాల్క సుమన్ సహకారంతో కార్మికులకు ప్రకటించిన పథకాలను వివరించారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్న సంఘం టీబీజీకేఎస్ అన్నారు. జాతీయ సంఘాలు పోగొట్టిన వారసత్వపు ఉద్యోగాలను సీఎం కేసీఆర్ కారుణ్య నియామకాల ద్వారా తిరిగి అందచేస్తున్నారని అన్నారు. కార్మికులు కారుణ్య నియామకాలపై దరఖాస్తు చేసుకోవాలన్నారు. సొంతింటి నిర్మాణం కోసం కార్మికులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని సీఎం చొరవతో కార్మికులకు రూ. 10 లక్షలు వడ్డీ లేని రుణం బ్యాంకుల నుంచి తీసుకోవచ్చన్నారు. కార్మికులు ఏ బ్యాంకు నుంచి రుణం తీసుకున్న వడ్డీ మాఫీ వర్తిస్తుందన్నారు. కార్మికుల పిల్లల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సంస్థే భరిస్తుందన్నారు. కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యసౌకర్యం కల్పిస్తోందని, కార్మికులందరూ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీలన్ని తూచ తప్పకుండా అమలు చేస్తున్న సత్తా కేవలం టీబీజీకేఎస్‌తోనే సాధ్యమన్నారు. రాబో వు రోజుల్లో ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, దుర్గం చిన్నయ్య, టీబీజీ కేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి సహకారంతో కార్మికులకు అన్ని వేళల్లో అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. -
సింగరేణి గుర్తింపు సంఘంగా టీబీజీకేఎస్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సింగరేణి గుర్తింపు యూనియన్‌గా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్)ను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ ప్రకటించింది. అక్టోబర్ 5న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ ఈ ఎన్నికల్లో విజయం సాధించింది. కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ కార్మిక అనుబంధ సంఘాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఏఐటీయూసీ గుర్తు మీద పోరాడినప్పటికీ, 4,217 ఓట్ల తేడాతో టీబీజీకేఎస్ విజయం సాధించింది. ఈ మేరకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ సింగరేణి సీఎండీ శ్రీధర్‌కు గత నెల 30న ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తూ లేఖ రాసింది. ఈ కాపీలను ఢిల్లీలోని చీఫ్ లేబర్ కమిషనర్ (సీఎల్సీ), హైదరాబాద్‌లోని డిప్యూటీ లేబర్ కమిషనర్‌కు కూడా పంపించింది. దీంతో టీబీజీకేఎస్ వరుసగా రెండోసారి అధికార సింగరేణి గుర్తింపు యూనియన్‌గా నిలిచింది. అక్టోబర్ 5న జరిగిన ఎన్నికల్లో మొత్తం 49,877 ఓట్లకు గాను 15 సంఘాలు పోటీ పడగా, టీబీజీకేఎస్ 23,848 ఓట్లు సాధించింది. ఏఐటీయూసీ 19,631 ఓట్లు సాధించి రెండోస్థానంలో నిలిచింది. మిగతా సంఘాలకు నామమాత్రపు ఓట్లు మాత్రమే లభించాయి. సింగరేణిలోని 11 ఏరియాలకు గాను టీబీజీకేఎస్ తొమ్మిదింట, ఏఐటీయూసీ రెండింట విజ యం సాధించాయి. కేంద్ర కార్మిక శాఖ టీజీబీకేఎస్‌ను అధికార యూనియన్‌గా గుర్తించిన నేపథ్యంలో టీబీజీకేఎస్‌కు ఇక గుర్తింపు పత్రం తీసుకొని కమిటీ ఏర్పా టు చేయడమే మిగిలింది. కాగా, గతంలో గుర్తింపు సంఘం కాల పరిమితి పదే ళ్లు ఉండగా, ప్రస్తుతం దానిని రెండేళ్లకు కేంద్ర ప్రభుత్వం పరిమితం చేసింది. -
చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత ఎందుకు?
సాక్షి, హుస్నాబాద్ : సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో తెరాస అనుభంద యూనియన్ టీబీజీకేఎస్ గెలుపొందడంతో కేసీఆర్‌కు అహంకారం తలకెక్కి సహానం కోల్పోయి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవినే దిగజార్చారని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. వందల కోట్లు ఖర్చు పెట్టి స్వల్ప ఆధిక్యంతో సింగరేణి ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినట్లుగా ఊగిపోవడం ఆయనకే చెల్లిందని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్మికులు, కార్మిక శాఖ, సింగరేణి యాజమాన్యం నిర్వహించుకోవాల్సిన ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం అధికార యంత్రాగాన్ని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను గనుల ఏరియాల్లో తింపి ఎడాపెడా వాగ్ధానాలతో గెలిచిందసలు గెలుపే కాదని అన్నారు. కేసీఆర్ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో సింగరేణి కార్మికులకు లాభాలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను అవమానపరిచి, ప్రొఫెసర్ జయశంకర్, ప్రోఫెసర్ కొదండరాం ఆలోచన విధానంతో కదిలిన కేసీఆర్, సోనియా గాంధీ దయతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక గౌరవ పెద్దలను అవమానించడం క్షమించరాదని పొన్నం ప్రభాకర్ దుయ్యబట్టారు. కుర్చీ పై కూర్చున్న నీకు నీ కుటుంబ సభ్యులు తప్పా, ఇంకెవరి త్యాగాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రధాని నెహ్రూ తెలంగాణ వర ప్రదాయిని శ్రీరాం సాగర్, నాగార్జునసాగర్ భారీ ప్రాజెక్టులను ప్రారంభించి, ఇందిరా గాంధీ హాయంలో పూర్తి చేయడం వల్లనే బీడు వారిన తెలంగాణ నేడు సస్యశ్యామలమైందని అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు కేంద్ర అనుమతులు సాధించి ప్రారంభించారని చెప్పారు. అలా నిర్మాణంలో ఉన్న దాని గురించి వక్ర భాష్యాలు చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చడం వల్లనే నేడు కేంద్రంలోని అనుమతులు ఆగిపోయాయన్నారు. తెలంగాణలోని ఎంతో మంది సినీ తారలను అవమానించి తమిళనాడుకు చెందిన సినీ నటి సమంతను రాష్ట్ర చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం వెనుక ఆంతర్యమేమిటో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలైన రెండు పడకల గదులు, దళితులకు మూడెకరాల భూమి, యాదవ సోదరులకు ఎన్ని వేల గొర్రెలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌లతో ఎంత మంది లభ్ది పొందారో, కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని పొన్నం డిమాండ్ చేశారు. దమ్ము, దైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు సిద్దపడాలని అన్నారు. -
సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్
సాక్షి, కొత్తగూడెం: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్, ఏఐటీయూసీల మధ్య జరిగిన పోరులో టీబీజీకేఎస్ వరుసగా రెండో సారి విజయం సాధించింది. 2012లో జరిగిన గత ఎన్నికలతో పాటు ఈసారి ఈ రెండింటి మధ్యే ప్రధాన పోటీ జరిగింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే ప్రస్తుతం టీబీజీకేఎస్, ఏఐటీయూసీలు ఓట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకున్నాయి. సింగరేణిలోని మొత్తం 11 ఏరియాల్లో 9 చోట్ల టీబీజీకేఎస్ విజయం సాధించగా.. ఏఐటీయూసీ 2 చోట్ల గెలిచింది. 2012 ఎన్నికల్లో 5 చోట్ల టీబీజీకేఎస్ విజయం సాధించి గుర్తింపు సంఘంగా ఉండగా.. 2 చోట్ల ఏఐటీయూసీ, 2 చోట్ల ఐఎన్టీయూసీ, మరో రెండు చోట్ల హెచ్ఎంఎస్ గెలుపొంది ఆయా ఏరియాల్లో ప్రాతినిధ్య సంఘాలుగా వ్యవహరించాయి. ఈసారి మాత్రం మొత్తంగా 2 యూనియన్లే గెలుపొందాయి. 2012లో టీబీజీకేఎస్ 38.69 శాతంతో 23,311 ఓట్లు సాధించగా.. ఏఐటీయూసీ 27.76 శాతంతో 16,724 ఓట్లు సాధించింది. ప్రస్తుత ఎన్నికల్లో టీబీజీకేఎస్ 45.40 శాతంతో 23,848 ఓట్లు సాధించగా.. ఏఐటీయూసీ 37.37 శాతంలో 19,631 ఓట్లు సాధించింది. -
ఫలించిన ‘కారుణ్య’ మంత్రం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: హోరాహోరీగా సాగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యూహం ఫలించింది. కార్మికుల ఆకాంక్షను గుర్తించి తదనుగుణంగా స్పందించడం.. టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) విజయానికి కారణమైంది. ప్రజాప్రతినిధులను కార్మిక వాడల్లోకి, బొగ్గు గనుల వద్దకు పంపించి.. అధికార పక్షంపై నమ్మకాన్ని పెంచడంలో కేసీఆర్ సఫలీకృతులయ్యారు. ‘కారుణ్య’నియామకాల పేరిట వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీతోపాటు కార్మికులకు ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షల వడ్డీ లేని రుణం, మారుపేరు (అలియాస్) మీద పనిచేస్తున్న కార్మికులను సొంతపేరిట క్రమబద్ధీకరించడం, సింగరేణి క్వార్టర్లకు ఏసీ సౌకర్యం వంటి హామీలతో ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వీటిని కార్మికుల్లోకి తీసుకెళ్లేలా సంఘం గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవిత స్వయంగా రెండు రోజులు చేసిన ప్రచారం కూడా ప్రభావం చూపింది. శ్రీరాంపూర్‌తో పట్టు సింగరేణిలో అత్యధిక ఓట్లున్న డివిజన్ శ్రీరాంపూర్. ఇక్కడ మొత్తం 11,862 ఓట్లు ఉండగా.. 11,266 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ ఏ యూనియన్‌కు ఎక్కువ ఓట్లు వస్తే.. ఆ యూనియన్‌కే గుర్తింపు సంఘం అవకాశం ఎక్కువ. సింగరేణి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సమయానికి శ్రీరాంపూర్‌లో ఏఐటీయూసీ కూటమివైపే కార్మికులు అధికంగా మొగ్గు చూపినట్లు ఇంటెలిజెన్స్ సర్వే ద్వారా టీఆర్ఎస్ నాయకత్వం గుర్తించింది. దీంతో వెంటనే పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ను, సీఎంవో పరిశీలకుడిగా శ్రవణ్‌ను రంగంలోకి దింపి.. పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టింది. వారు వ్యూహాత్మకంగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ తదితర సంఘాల్లోని వారిని టీబీజీకేఎస్‌లో చేర్పించారు. దీనికితోడు సీఎం హామీలు, ఇతర అంశాలు కలసి టీబీజీకేఎస్ ఇక్కడ 6,189 ఓట్లు సాధించింది. మెరుగైన ఫలితం సాధిస్తుందని భావించిన ఏఐటీయూసీ 3,946 ఓట్లకే పరిమితమైంది. టీబీజీకేఎస్ ఇక్కడ సాధించిన 2,243 ఓట్ల ఆధిక్యతే.. గుర్తింపు సంఘంగా ఎన్నికయ్యేందుకు కీలకంగా మారిందని చెప్పవచ్చు. రామగుండంలో హెచ్ఎంఎస్ ఎఫెక్ట్ రామగుండం రీజియన్‌లోని ఆర్జీ–1, ఆర్జీ–2, ఆర్జీ–3 డివిజన్లలో హెచ్ఎంఎస్ ప్రభావం ఎక్కువ. గతంలో ఇక్కడి రెండు డివిజన్లలో ప్రాతినిధ్యం వహించిన హెచ్ఎంఎస్ను టీబీజీకేఎస్ వ్యూహాత్మకంగా దెబ్బతీసింది. ఈ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న టీఆర్ఎస్ నేత ఎస్.వేణుగోపాలచారిని టీబీజీకేఎస్‌లో చేర్చుకున్నారు. హెచ్ఎంఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో తమ యూనియన్ టీబీజీకేఎస్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటింపజేశారు. దీంతో కార్మికుల్లో గందరగోళం తలెత్తింది. చివరికి హెచ్ఎంఎస్ నేతలు.. ‘హెచ్ఎంఎస్కు ఓటేయకపోయినా ఫరవాలేదు. టీబీజీకేఎస్‌కు మాత్రం వేయొద్దు..’’అంటూ ప్రచారం చేసినా నష్టం జరిగిపోయింది. హెచ్ఎంఎస్కు ఆర్జీ–1లో 787, ఆర్జీ–2లో 895, ఆర్జీ–3లో 488 ఓట్లు వచ్చాయి. ఈ మూడు డివిజన్లలో ఏఐటీయూసీ కూటమి స్వల్ప తేడాతో ఓడిపోవడం గమనార్హం. హెచ్ఎంఎస్ ఓట్లు ఏఐటీయూసీకి వస్తే పరిస్థితి పూర్తిగా మారిపోయేది. ఇక బీజేపీ అనుబంధ కార్మిక సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) సింగరేణి ఎన్నికల్లో ఉనికిలో లేకుండా పోయింది. సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ పేరుతో పోటీ చేసిన ఈ సంఘం తరఫున బీజేపీ రాష్ట్ర నేత కిషన్‌రెడ్డి వంటి నాయకులు ప్రచారం చేసినా మొత్తంగా 246 ఓట్లే సాధించింది. కూటమిని దెబ్బతీసిన అతి నమ్మకం ఈసారి టీబీజీకేఎస్‌ను ఓడించి తీరుతామని ఏఐటీయూసీ కూటమి తొలి నుంచీ ధీమాతో ఉంది. వారసత్వ ఉద్యోగాలను సుప్రీంకోర్టు తిరస్కరించిన అంశాన్ని ఏఐటీయూసీ సహా జాతీయ సంఘాలన్నీ అనుకూలంగా మల్చుకునేందుకు ప్రయత్నించాయి. కార్మికుల్లో టీబీజీకేఎస్‌పై వ్యతిరేకతను గుర్తించి కలసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కలసి పోటీ చేయగా.. టీడీపీ అనుబంధ టీఎన్టీయూసీ మద్దతిచ్చింది. హెచ్ఎంఎస్ మాత్రం కలసి రాలేదు. అయితే కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో ఆయా యూనియన్ల నాయకుల్లో గెలుపుపై ధీమా వ్యక్తమైంది. దీనిని గుర్తించిన టీబీజీకేఎస్ నేతలు వ్యూహాత్మకంగా ఆయా ఏరియాల్లో ప్రభావం చూపే నాయకులను, కార్మికులను చేర్చుకుని దెబ్బకొట్టారు. -
‘ఆయన మాటే శిలాశాసనం’
సాక్షి, శ్రీరాంపూర్(మంచిర్యాల) : ఎన్నికల్లో చెప్పినవన్ని అమలు చేస్తామని పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ తెలిపారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో అన్ని గనులపై ఆ యూనియన్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. గులాజీ రంగులు పూసుకొని నృత్యాలు చేస్తూ, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. అన్ని గనులపై జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ మాటే శిలాశాసనమని, వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. నెలన్నర రోజుల్లో మారు పేరుతో పని చేసే వారందరికి పేర్లు క్లియర్ చేస్తూ జీవో ఇప్పిస్తామన్నారు. ఇళ్లు కట్టుకొనే కార్మికునికి రూ. 6 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ ఆసుపత్రిల్లో చికిత్స చేయించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత టీబీజీకేఎస్ నేతలకు గర్వం రాదన్నారు. కడుపు, నోరు కట్టుకొని పని చేయాలన్నారు. గత తప్పిదాలు జరగకుండా పని చేయాలని పిలుపునిచ్చారు. ఫిట్ నుంచి డివిజన్, కేంద్ర స్థాయి వరకు నేతలను ఎంపిక చేయడం కార్మికుల అభిప్రాయం మేరకు సర్వేచేసి ఎన్నిక చేస్తామని ఎంపీ అన్నారు. ఏ ఒక్క నేత తప్పు చేసినా క్షమించమన్నారు. టీబీజీకేఎస్ సంఘం పార్టీ అజమాయిషీలో నడుస్తుందని ఆయన చెప్పారు. అనంతరం మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్.దివాకర్‌రావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి వెంకట్రావు మాట్లాడుతూ.. శ్రీరాంపూర్‌లో పెద్ద మెజారిటీతో గెలిపించినందుకు కార్మికులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే 4 ఏళ్లు కార్మికులకు మంచిగా సేవలు అందుతాయని అన్నారు. కార్మికులు కేసీఆర్‌పై విశ్వాసం ఉంచి ఈ విజయం సాధించి పెట్టారని వారు చెప్పారు. -
సింగరేణిలో గులాబీ జెండా!
-
గుర్తింపు ఎన్నికల్లో టీబీజీకేఎస్‌కు బుద్ధి చెప్పాలి
శ్రీరాంపూర్(మంచిర్యాల): వారసత్వం పేరు చెప్పుకొని మరోసారి సింగరేణి ఎన్నికల్లో గెలువాలని టీబీజీకేఎస్ కుట్ర పన్నుతోందని ఏఐటీయూసీ, హెచ్ఎమ్మెస్ నేతలు ఆరోపించారు. ఆర్కే 5గనిపై గురువారం నిర్వహించిన జాతీయ సంఘాల గేట్ మీటింగ్‌లో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి ముస్కె సమ్మయ్య, హెచ్ఎమ్మెస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు పేరం రమేశ్ మాట్లాడారు. వారసత్వ ఉద్యోగాలిస్తామని నమ్మించి కార్మికులను మోసం చేసిన టీబీజీకేఎ‹స్కు రానున్న గుర్తింపు ఎన్నికల్లో బుద్ది చెప్పాలన్నారు. వారసత్వ ఉద్యోగాల సాధన కోసం జాతీయ సంఘాలన్ని కలిసి ఈ నెల 15 నుంచి నిరవధిక సమ్మెకు పిలు పునివ్వగా.. సమ్మెను నీరుగార్చేందుకు టీ బీజీకేఎస్ నాయకులు కుట్ర చేస్తున్నారని ఆ రోపించారు. తాడిచెర్ల బొగ్గుబ్లాకుల ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి ల్యాగల శ్రీనివాస్, నాయకులు బి య్యాని శ్రీనివాస్, జోగుల మల్లయ్య, మేక ల దాసు, ప్రసాద్‌రెడ్డి, హెచ్ఎమ్మెస్ బ్రాం చి కార్యదర్శి తిరుపతిగౌడ్, నాయకులు వినయ్‌కుమార్, నర్సయ్య, మల్లేశ్, తిరుపతిరెడ్డి, శంకరయ్య పాల్గొన్నారు. సమ్మెతోనే వారసత్వ ఉద్యోగ సాధన మందమర్రి: జూన్ 15న సింగరేణి వ్యాప్తం గా తలపెట్టిన సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలని, సమ్మెతోనే వారసత్వ ఉద్యోగ సాధన సాధ్యమవుతుందని ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు సిద్దంశెట్టి రాజమొగిలి, ఏఐటీయూసీ ఏరి యా ఏరియా బ్రాంచి కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, సీఐటీయూ ఏరియా కా ర్యదర్శి ఎస్.వెంకటస్వామి, హెచ్ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు బోనాల శ్రీనివాస్ అన్నారు. ఏరియాలోని కేకే–1 గనిలో గురువారం ఏర్పాటు చేసిన గెట్ మీటింగ్‌లో వా రు మాట్లాడారు. -
‘వారసత్వం పేరుతో సర్కారు మోసం’
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి కార్మికులను వారసత్వ ఉద్యోగాల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం, గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్ మోసం చేశాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుండా మల్లేష్ విమర్శించారు. సోమవారం గోలేటిటౌన్‌షిప్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి షరతులు లేని వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ శాసనసభ సాక్షిగా ప్రకటించి కార్మికులను మోసం చేశారన్నారు. రాజ్యాంగం ప్రకారం వారసత్వ ఉద్యోగాలు చెల్లవని తెలిసినా బావులపై వెళ్లేందుకు ముఖం చాలక గుర్తింపు సంఘం నాయకులు కార్మికులకు అన్యాయం చేశారన్నారు. సమ్మె ద్వారానే వారసత్వ ఉద్యోగాలు సాధ్యమని, అన్ని కార్మిక సంఘాలు కలిసికట్టుగా ఆందోళనకు సిద్ధం కావాలని పేర్కొన్నారు. -
హామీలు నెరవేరుస్తున్న టీబీజీకేఎస్
రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావ్ షరతులు లేని వారసత్వ ఉద్యోగాలు సాధిస్తాం నస్పూర్ : కార్మికులకు ఇచ్చిన హామీలను టీబీజీకేఎస్ యూనియన్ నెరవేరస్తుందని రాష్ట్ర అద్యక్షుడు బి.వెంకట్రావ్ పేర్కొన్నారు. ఆదివారం న స్పూర్ కాలనీ పాత కమ్యూనిటీ హాల్ నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు సింగరేణి కార్మికులంటే ఎంతో అభిమానం ఉందన్నారు. సింగరే ణి కార్మికులు సైనికుల కంటే తక్కువ కాదని దసరా పండుగ కానుకగా కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు, లాభాల ప్రకటించారన్నారు. కార్మికులందరికి షరతులు లేకుండా వారసత్వ ఉద్యోగాలు వచ్చేలా కృషిచేస్తానన్నారు. స్వంత ఇంటిపథకం త్వరలోనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వీఆర్ఎస్ డిపెండెంట్లకు అన్యాయం చేసింది ఏఐటీయూసినే అన్నారు. డిస్మిస్ కార్మికులకు అవకాశం కల్పించడానికి యాజమాన్యంలో చర్చిస్తామని తెలిపారు. వీఆర్ఎస్ కార్మికులను రెచ్చగొట్టి ఆందోళనా కార్యక్రమాలు చేపిస్తున్నారని ఆరోపించారు. ఏఐటీయూసీ నాయకులు ఏం సాధించారని కార్మికుల నుంచి చందాలు వసూలు చేస్తున్నారో కార్మికులు వారిని ప్రశ్నించాలని కోరారు. వారసత్వ ఉద్యోగాలు కార్మికుల వారసులకే కాకుండా సింగరేణేతరుకు కూడా కల్పించాలని కోరుతూ ఏఐటీయూసీ హైకోర్టుకు వెళ్లి కార్మికుల వారసులకు అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. కార్మికుల పక్షానæ పోరాడుతున్న టీబీజీకెఎస్పై జాతీయ సంఘాలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయన్నారు. నేటి నుంచి హైదరాబాద్‌లో నిర్వహించే సమావేశాల్లో వారసత్వ ఉద్యోగాల విధివిధానాలపై చర్చించనున్నట్లు తెలిపారు. కార్మికుల హక్కుల సాధనకోసం పోరాడుతున్న టీబీజీకేఎస్‌ను రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. భారీగా చేరికలు శ్రీరాంపూర్ ఏరియాలోని వివిధ గనులకు చెంది న సుమారు 200మంది ఏఐటీయూసీ నాయకు లు కార్యకర్తలు ఆదివారం టీబీజీకేఎస్‌లో చేరా రు. ఆర్కే–7 ఏఐటీయూసీ మాజీ పిట్ కార్యద ర్శి అశోక్‌తోపాటు మరికొంత మంది యూని యన్‌లో చేరారు. యూనియన్‌లో చేరుతున్న నా యకులు కార్యకర్తలకు టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య, ఉపాధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డిలు కండువాలను కప్పి యూనియన్‌లోకి ఆహ్వానిం చారు. ఈ సమావేశంలో టీబీజీకెఎస్ కేంద్ర నా యకులు సారంగపాణి, ఏనుగు రవీందర్‌రెడ్డి, ఏరియా ఉపాధ్యక్షుడు కె.సురేందర్‌రెడ్డి, నాయకులు పెద్దపల్లి కోటిలింగం, బంటు సారయ్య, రమేష్, పానుగంటి సత్తయ్య, వీరభద్ర య్య, మల్లారెడ్డి, కానుగంటి చంద్రయ్య, పోశెట్టి, అశోక్, ఎంపీపీ సత్యనారాయణ, సర్పంచులు రాజేంద్రపాణి, శంకర్, కిష్టయ్య పాల్గొన్నారు. -
సింగరేణిపై సీఎం కీలక సమావేశం
తేలనున్న వారసత్వ ఉద్యోగాలు, లాభాల వాటా..? ఇప్పటికే డైరెక్టర్ తో సీఅండ్ఎండీ బేటి 10 గంటలకు సీఅండ్ఎండీకి సీఎం అపాయిమెంట్ హైదారాబాద్‌లోనే మకాం వేసిన టీబీజీకేఎస్ నేతలు వారసత్వం, విధివిధానాలపై కసర త్తు శ్రీరాంపూర్ : ఎంతో కాలంగా అందరూ ఎదురుచూస్తున్న సింగరేణి కీలక సమావేశం నేడు సీఎం కేసీఆర్ సమక్షంలో జరుగనుంది. కార్మికుల ప్రధాన డిమాండ్లు అయిన వారసత్వ ఉద్యోగాలు, లాభాల వాటా, స్వంతింటి పథకం వంటి వాటిపై ముఖ్యమంత్రి నేడు అటు సింగరేణి యాజమాన్యం, ఇటు గుర్తింపు సంఘం నేతలతో చర్చించనున్నట్లు విశ్వాసనీయం సమాచారం. బుధవారం మధ్యాహ్నమే సీఎం పేషీ నుంచి సింగరేణి సీఅండ్ఎండీకి కబురు వచ్చింది. ఆయనకు ఉదయం 10 గంటలకు సీఎం అపాయిమెంట్ ఇచ్చారు. రాత్రికి గుర్తింపు సంఘం నేతలకు కూడా సమాచారం అందనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఎంపీ కవిత, బాల్క సుమన్‌లు టీబీజీకేఎస్ ముఖ్య నేతలను హైదరాబాద్‌కు పిలిపించుకున్నారు. సీఎం ఎప్పుడు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించడంతో వారు రెండు రోజులుగా ఇక్కడే మాకం వేసి ఎప్పుడు కబురు వస్తుందా అని వేచి ఉన్నారు. ఎట్టకేలకే సీఅండ్ఎండీ అధికారికంగా అపాయిమెంట్ ఇవ్వడంతో ఇక సమావేశం ఖరారైనట్లు తెలిసింది. ఇదిలా అన్నింటిలోకెళ్లా ముఖ్యమైన వారసత్వ ఉద్యోగాలపై ఇప్పటికే సీఎం తనును కలిసి పలువురు ఎంపీలు, కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నట్లు తెలిసింది. డైరెక్టర్ తో సీఅండ్ఎండీ మంతనాలు... ఇదిలా ఉంటే ఇందులో వారసత్వ ఉద్యోగాల పీటముడిపై సీఅండ్ఎండీ ఎన్ శ్రీధర్ కంపెనీ డైరెక్టర్ల తో సమావేశమయ్యారు. డైరెక్టర్లంతా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. వారసత్వ ఉద్యోగాలు ఇస్తే కంపెనీ జరిగే లాభ నష్టాలను ప్రత్యేక రిపోర్టు తయారు చేసుకున్నారు. కంపెనీలో ఉన్న ప్రస్తుత క్లిష్ట పరిస్థితులు, ఈసమయంలో వారసత్వం ఇస్తే ప్రభుత్వం నుంచి సింగరేణి అందాల్సిన సహాయ సహకారా లు కూడా చర్చకు పెట్టే అవకాశం ఉంది. సీఎం వారసత్వ ఉద్యోగాలు డిక్లేర్చేస్తే దానిలో విధివిధానాలు ఎలా పెట్టాలో ఇప్పటికే యాజమాన్యం డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసిపెట్టుకుంది. మంతనాలు సాగిస్తున్న టీబీజీకేఎస్ నేతలు.. గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ముఖ్యనేతలు సీఎం బేటిలో చర్చించాల్సిన అంశాలపై మంతనాలు సాగిస్తున్నారు. ఇప్పటికే ఆయూనియన్ అధ్యక్షుడు బి వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్యలు రెండు రోజులుగా హైదారాబాద్‌లోనే మకాం వేసి అటు కవిత, ఇటు బాల్క సుమన్‌తో టచ్‌లో ఉన్నారు. కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్‌కు పయనమయ్యారు. వారసత్వ ఉద్యోగాలపై సీఎం సానుకూలత వ్యక్తం చేస్తే దాన్ని యాజమాన్యం చెప్పే అభ్యంతరాలను ఎలా అడ్డుకోవాలి, వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడం వల్లే కలిగే ప్రయోజనాలు, అటు కంపెనీ పరంగా, ఇటు రాజకీయ పరంగా మేలు చేసే అంశాలను కూడా సీఎం వద్ద ప్రజెంట్ చేయడానికి ఈ ఇద్దరు నేతలు సిద్దమయ్యారు. దీనికి సంబంధించిన వారు రిపోర్టును కూడా సిద్ధం చేసుకున్నారు. గతంలో ఉన్న మాదిరిగా కేవలం రెండేళ్ల సర్వీసుతో వారసత్వం కల్పిస్తే కేవలం కొద్ది మందికి మాత్రమే వస్తుంది. చాలా మంది నష్టపోతారు. కాబట్టి వీలైనంత ఎక్కువ మందిని వారసత్వ ఉద్యోగాల పరిదిలో చేర్చాలని నిర్ణయించారు. దీనికి ఇప్పటి వరకు మెడికల్ బోర్డుకు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకొన్న వారికి కూడా వారసత్వ అవకాశం కల్పిస్తే ఎక్కువ మంది లబ్ధి పొందుతారని సీఎంకు సూచించనున్నారు. -
టీబీజీకేఎస్ నేతలకు అధిష్టానం పిలుపు
హైదరాబాద్‌లో అందుబాటులో ఉండాలి లాభాల వాటా, వారసత్వ ఉద్యోగాలపై చర్చించే అవకాశం గోదావరిఖని (కరీంనగర్) : సింగరేణి గుర్తింపు సం ఘం (టీబీజీకేఎస్) నాయకులు బుధవారం హైదరాబాద్‌లో అందుబాటులో ఉండాలని టీఆర్ఎస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఈ మే రకు యూనియన్ అధ్యక్షుడు బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య, ఉపాధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, కనకరాజుతోపాటు పలువురు నాయకులు మంగళవారం హైదరాబాద్‌కు తరలివెళ్లారు. సింగరేణి గుర్తింపు సంఘానికి త్వరలో జరిగే ఎన్నికల్లో గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపే వారసత్వ ఉద్యోగాల విషయంపై సీఎం కేసీఆర్‌తో జరిగే సమావేశంలో నాయకులు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని అమెరికా పర్యటనలో ఉన్న టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవిత బుధవారం హైదరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో ఆమెను నాయకులు ముందుగా కలిసి వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణతోపాటు 2015-16లో సింగరేణి సాధించిన లా భాల వాటాను కార్మికులకు పంచే విషయంపై చర్చించనున్నట్లు సమాచారం. బుధవారం కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న సీఎం కేసీఆర్ దృష్టికి ఈ విషయాలను ఎంపీ కవితతో పాటు టీబీజీకేఎస్ నాయకులు ప్రాథమికంగా తీసుకెళ్లి, తర్వాత సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలిసింది. కాగా, రెండు రోజుల క్రితం పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్.. సీఎం కేసీఆర్‌ను కలిసి వారసత్వ ఉద్యోగాలను వివరిం చిన సందర్భంలో విదేశీ పర్యటనలో ఉన్న సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ వ చ్చిన తర్వాత ఆయనతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇ చ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో వారసత్వ ఉద్యోగాలపై సీఎం సానుకూలంగా ఉన్నప్పటికీ ఏ రకంగా నిబంధనలు విధిస్తారనేది ప్రశ్నార్థకం గా మారింది. ఇప్పటి వరకు వారసత్వ ఉద్యోగాల విషయంలో (మెడికల్ అన్‌ఫిట్ కింద) రెండేళ్ల సర్వీస్ మిగిలి ఉన్నవారికి అవకాశం కల్పించారు. అరుుతే రెండేళ్ల సర్వీస్ కాలాన్ని అమలు పరిస్తే కొద్ది మందికే అవకాశం వచ్చి మిగతా కార్మికులు ఎదురు తిరుగుతారనే ఉద్దేశంతో ఏడాది సర్వీస్ కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలనే ప్రతిపాదన ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో గుర్తింపు సంఘం నాయకులు ఏ మేరకు యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని ఒప్పించగలగుతారనేది ఆసక్తిగా మారింది. -
అంతా.. ఒక్కటయ్యారు
ఏడాది తర్వాత ఒకే వేదికపై టీబీజీకేఎస్ ఇల్లెందు నాయకులు ఫలించిన అగ్ర నేతల సయోధ్య చర్చలు ఇల్లెందు అర్బన్(ఖమ్మం) : టీబీజీకేఎస్ ఇల్లెందు ఏరియా కమిటీలో కొంత కాలంగా నెలకొన్న వర్గ విభేదాల సమస్య ఎట్టకేలకు సమసిపోయింది. ఇప్పటి వరకు రాజిరెడ్డి, కనకరాజు వర్గీయులు ఒకవైపు, మల్లయ్య వర్గీయులు మరో వైపు విడిపోయి యూనియన్ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. మల్లయ్య వర్గీయులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, కనకరాజు వర్గీయులు యూనియన్ కార్యాలయంలో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించేవారు. నిన్న, మొన్నటి వరకు గనుల్లో నిర్వహించిన పిట్ మీటింగ్‌లకు మల్లయ్య వర్గీయులు దూరంగా ఉన్నారు. యూనియన్ కార్యాలయంలోకి సైతం అడుగుపెట్టలేదు. రోజురోజుకూ పరిస్థితులు జఠిలంగా మారి ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుకుంది. సింగరేణి లో గుర్తింపు సంఘం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధిష్టానం ఇరువర్గాల మధ్య సఖ్యత కుదిర్చేందుకు మల్లయ్య, వెంకట్రావ్, రాజీరెడ్డి, కనకరాజు రంగంలోకి దిగారు. ఇటీవల కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశంలో ఈ విషయమై పలు దఫాలుగా జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి. బుధవారం 21 పిట్ మీటింగ్‌కు రెండు వర్గాల నాయకులం తా హాజరుకావడమే ఇందకు నిదర్శనం. సుమారు ఏడాదిన్నర పాటుగా ఎడమొహం, పెడమొహంగా ఉన్న ఏరియా నాయకులు ఎట్టకేలకు ఒకే వేదికపై ప్రసంగాలు ఇవ్వడంతో కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపినట్లైంది. ఇది ఇలా ఉండగా ముఖ్య నాయకులు ఇచ్చి న హామీ మేరకు పిట్‌మీటింగ్‌లో స్థానిక నాయకులంతా పాల్గొన్నారు. అయితే యూనియన్ కార్యాలయంలోకి ఇప్పటి వరకు అడుగుపెట్టని నాయకులు, కార్యకర్తలు ఇక నుంచి అడుగుపెడుతారా? లేదా వేర్వేరుగా సమావేశాలు నిర్వహించుకుంటారా అనేది ఇక వేచి చూడాల్సిందే. ఏరియా ఎన్నికల కమిటీ.. టీబీజీకేఎస్ ఇల్లెందు ఏరియా ఎన్నికల కన్వీనర్‌గా గడ్డం వెంకటేశ్వర్లు, కోకన్వీనర్‌గా కళ్లెం కోటిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఐఎన్టీయూసీ నుంచి కోటిరెడ్డికి సైతం సముచిత స్థానం కల్పించడం తో యూనియన్‌లో గ్రూపు తగాదాలకు తావులేకుండా పోయిందని నాయకులు పేర్కొంటున్నారు. -
జైలుకెళ్లిన నేతలను ఎలా నమ్ముతారు
మాజీ ఎమ్మెల్సీప్రేంసాగర్రావు మంచిర్యాల టౌన్ : కార్మికుల డబ్బులు కాజేసిన కెంగర్ల మల్లయ్య, కనకయ్య, మిర్యాల రాజిరెడ్డి ముగ్గురు జైలుకు వెళ్లి వచ్చిన వారేనని, వారని కార్మికులు ఎలా నమ్ముతారని మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు అన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఆదివారం పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మికులు ఎన్నో ఆశలతో టీబీజీకేఎస్‌కు పట్టం కట్టితే, వారు కార్మికుల సంక్షేమాన్ని విస్మరించారన్నారు. ప్రతి నెలా కార్మికులు వారి సంక్షేమం కోసం రూ.10 చొప్పున వేతనాల్లో నుంచి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న డబ్బులను టీబీజీకేఎస్ నాయకులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల డబ్బులు కాజేసిన నాయకులను కార్మికులు నమ్మొద్దన్నారు. ఐఎన్టీయూసీ నుంచి టీబీజీకేఎస్‌కు వెళుతున్నప్పుడు వెంకట్రావు ఐఎన్టీయూసీ కార్మికుల సంక్షేమం ఖాతా నుంచి సుమారు రూ.36 లక్షలు డ్రా చేసి వెళ్లాడని, దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సింగరేణిలో రిటైర్డ్ కార్మికులకు సీలింగ్ పది లక్షలు ఇస్తారని, అది ఎత్తి వేయాలని, లాభాల నుంచి బోనస్ 30 శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వచ్చే సింగరేణి కార్మిక ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గెలుపునకు ప్రతీ ఒక్కరు కలిసి కృషి చేయాలని కోరారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఏమయ్యాయి? తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ప్రజలను మభ్య పెడుతుందని, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇంత వరకు ఇవ్వలేదన్నారు. ఉపాధిహామీ పథకంలో పనులు సక్రమంగా లేవని, ఆసరా పింఛన్లు కూడా సరిగా అందడం లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో జరిగే అవినీతిని బయట పెడతామన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కమలాకర్‌రావు, యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు సులేమాన్, నాయకులు సుంకి సత్యం, మందమర్రి, బెల్లంపల్లి ఐఎన్టీయూస్ నాయకులు జె.శంకర్రావు, వెంకటస్వామి, గరిగె స్వామి, బాబురావు, లింగయ్య, చంద్రయ్య, శ్రీనివాస్, సూర్యనారాయణ, ఎల్లయ్య, వెంకటస్వామి, భూమయ్య, భిక్షపతి, రాజయ్య ఉన్నారు. -
టీబీజీకేఎస్‌కు తప్పని ఇంటిపోరు
గంపెడాశలతో కార్యకర్తలు కొత్త చేరికలతోనే ఇబ్బందులు మంచిర్యాల సిటీ : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. యూనియన్‌లో నెలకొన్న నాయకత్వ సమస్యను పరిష్కరించడానికి టీఆర్ఎస్ అధిష్టానం టీబీజీకేఎస్‌కు నూతన కమిటీని ప్రకటించి కేవలం నలుగురికి మాత్రమే బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల తర్వాత మిగతా పదవులు భర్తీ చేయనున్నట్లు సంకేతాలిచ్చింది. దీంతో ఆవిర్భావం నుంచి పార్టీని, సంఘాన్ని నమ్ముకొని ఉద్యమంలో భాగస్వాములై, జెండా మోసి పదవులపై ఆశలు పెట్టుకున్నవారు ఎందరో ఉన్నారు. అలాగే రానున్న ఎన్నికల్లో మరోసారి సింగరేణిలో జెండా ఎగురవేస్తుందనే నమ్మకంతో టీబీజీకేఎస్‌లో చేరినవారూ ఉన్నారు. ఇంకా చేరికలు జరుగుతూనే ఉన్నారు. ‘మంది ఎక్కువైతే మజ్జిగ పలుచనవుతుందన్న’ చందంగా వీరందరు ఆశించిన మేరకు పదవులు సర్దుబాటు చేయడం అధిష్టానానికి కత్తిమీద సాములాంటిదేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆశలు పెట్టుకున్న వారిలో ఏదో మంచి హోదా ఉన్న పదవి రాకపోతుందా అని ఎదురు చూసేవారు ఎక్కువగానే కనబడుతున్నారు. ఇంతమందిలో పదవి రాకుంటే భవిష్యత్ ఏమిటా అని సందిగ్ధంలో మరి కొందరు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇదే సంఘంలో ఉండాలా లేక బలమైన ప్రతిపక్ష సంఘంలోకి వెళితే ఎలా ఉంటుందనే ఆలోచనతో పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. మూడు వర్గాలకు ముడిపడేనా..? టీబీజీకేఎస్‌లో ప్రస్తుతం మిర్యాల రాజిరెడ్డి, కెంగెర్ల మల్లయ్య, బి.వెంకట్రావు అనుచరులు ఉన్నారు. వీరిని నమ్ముకొని పదువులపై ఆశలు పెట్టుకున్నవారు ప్రతి ఏరియాలో పదుల సంఖ్యలో ఉన్నారు. గోదావరిఖని, శ్రీరాంపూర్ వంటి ఏరియాల్లో వీరి సంఖ్య మరీ ఎక్కువ. వారిని సంతృప్తి పరచడం సాధ్యమయ్యే పనికాదని యూనియన్‌లోని వారే చెబుతున్నారు. నాయకులను నమ్ముకున్న వారికి సరైన పదువులు రాని పక్షంలో గ్రూపుల సమస్య మరింత పెరిగే ఆవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. ఎన్నికలకు ముందే పదవుల కేటాయింపు జరిగితే అసంతృప్తులను బుజ్జగించడం సాధ్యం కాదు. కార్మికుల్లో పట్టుఉన్న వారికి పదవులు ఇవ్వకుండా, గ్రూపుల ఆధారంగా ఇచ్చిన నేపథ్యంలో సంఘానికి ఎదురుదెబ్బ తగలక తప్పదు. అలాగే యూనియన్ గెలిచిన తర్వాతనే పదవులు ఇస్తామని చెబితే ఎన్నికల ప్రచారంలో ఏ హోదాతో కార్మికుల వద్దకు వెళ్లాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘ఏ హోదా లేకుండా తాము వెళితే ప్రతిపక్ష సంఘాల నాయకులు హోదాతో వస్తారు. అప్పుడు తమ మాటకు కార్మికులు విలువ ఇస్తారా’ అంటూ పలువురు ఈ పాటికే అగ్రనాయకులను ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ సంఘం గెలిచిన తర్వాత పదవులు ఇవ్వాలనుకుంటే కోల్‌బెల్ట్‌లోని అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సిఫారసులకే ఆ ముగ్గురు అగ్రనాయకులు కట్టుబడి ఉండాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అప్పుడు తమ పరిస్థితి ఏమిటనే సందేహాలు ద్వితీయ శ్రేణి నాయకుల్లో వ్యక్తం అవుతున్నా యి. భవిష్యత్‌లో పదవి లేకుండా గనులపై అధికారులతో ఏ హోదాలో మాట్లాడటానికి వెళ్లాలి.. ప్రతిపక్ష సంఘాల వద్ద సైతం చులకనయ్యే పరిస్థితులు ఉంటాయనే అభిప్రాయాలు వెలుబుచ్చుతున్నారు. ఎన్నికలు ఆలస్యమైతే ఇంటిపోరు మరింత పెరిగే అవకాశాలు సైతం కనబడుతున్నాయి. సమసిపోని కుమ్ములాటలు టీబీజీకేఎస్‌లో ఇంకా కుమ్ములాటలు సమసిపోలేదు. ఇందుకు నిదర్శనం ఈనెల 11న శ్రీరాంపూర్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశం. ఇందులో మిర్యాల రాజిరెడ్డి మాట్లాడటానికి సన్నద్ధమవుతుండగా కొందరు మాట్లాడవద్దంటూ అడ్డుతగిలారు. ఎంపీ బాల్క సుమన్ జోక్యం చేసుకొని సర్దిచెప్పినా వినిపించుకోలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్‌లో తాను యూనియన్ సమావేశానికి రాను అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారు శాంతించక తప్పలేదు. రాజిరెడ్డి ప్రసంగాన్ని వ్యతిరేకించిన వారు యూనియన్‌లోని మరో వర్గానికి చెందినవారనే విషయం స్పష్టమవుతూనే ఉంది. దీనిని బట్టి నేటికీ యూనియన్‌లో లుకలుకలు ఉన్నాయనడంలో సందేహం లేదు. నాలుగేళ్ల పాటు కార్మికుల బాగోగులు పట్టించుకోకుండా గొడవలతో కాలం గడిపిన నాయకు ల కుమ్ములాటలు ఇంకా కొనసాగడంపై సంఘాన్ని నమ్ముకున్నవారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.