టీబీజీకేఎస్ నేతలకు అధిష్టానం పిలుపు
టీబీజీకేఎస్ నేతలకు అధిష్టానం పిలుపు
Published Wed, Oct 5 2016 11:51 AM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM
హైదరాబాద్‌లో అందుబాటులో ఉండాలి
లాభాల వాటా, వారసత్వ ఉద్యోగాలపై చర్చించే అవకాశం
గోదావరిఖని (కరీంనగర్) : సింగరేణి గుర్తింపు సం ఘం (టీబీజీకేఎస్) నాయకులు బుధవారం హైదరాబాద్‌లో అందుబాటులో ఉండాలని టీఆర్‌ఎస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఈ మే రకు యూనియన్ అధ్యక్షుడు బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య, ఉపాధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, కనకరాజుతోపాటు పలువురు నాయకులు మంగళవారం హైదరాబాద్‌కు తరలివెళ్లారు. సింగరేణి గుర్తింపు సంఘానికి త్వరలో జరిగే ఎన్నికల్లో గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపే వారసత్వ ఉద్యోగాల విషయంపై సీఎం కేసీఆర్‌తో జరిగే సమావేశంలో నాయకులు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని అమెరికా పర్యటనలో ఉన్న టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవిత బుధవారం హైదరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో ఆమెను నాయకులు ముందుగా కలిసి వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణతోపాటు 2015-16లో సింగరేణి సాధించిన లా భాల వాటాను కార్మికులకు పంచే విషయంపై చర్చించనున్నట్లు సమాచారం.
బుధవారం కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న సీఎం కేసీఆర్ దృష్టికి ఈ విషయాలను ఎంపీ కవితతో పాటు టీబీజీకేఎస్ నాయకులు ప్రాథమికంగా తీసుకెళ్లి, తర్వాత సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలిసింది. కాగా, రెండు రోజుల క్రితం పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్.. సీఎం కేసీఆర్‌ను కలిసి వారసత్వ ఉద్యోగాలను వివరిం చిన సందర్భంలో విదేశీ పర్యటనలో ఉన్న సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ వ చ్చిన తర్వాత ఆయనతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇ చ్చినట్లు సమాచారం.
ఈ క్రమంలో వారసత్వ ఉద్యోగాలపై సీఎం సానుకూలంగా ఉన్నప్పటికీ ఏ రకంగా నిబంధనలు విధిస్తారనేది ప్రశ్నార్థకం గా మారింది. ఇప్పటి వరకు వారసత్వ ఉద్యోగాల విషయంలో (మెడికల్ అన్‌ఫిట్ కింద) రెండేళ్ల సర్వీస్ మిగిలి ఉన్నవారికి అవకాశం కల్పించారు. అరుుతే రెండేళ్ల సర్వీస్ కాలాన్ని అమలు పరిస్తే కొద్ది మందికే అవకాశం వచ్చి మిగతా కార్మికులు ఎదురు తిరుగుతారనే ఉద్దేశంతో ఏడాది సర్వీస్ కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలనే ప్రతిపాదన ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో గుర్తింపు సంఘం నాయకులు ఏ మేరకు యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని ఒప్పించగలగుతారనేది ఆసక్తిగా మారింది.
Advertisement
Advertisement