సమావేశంలో సమస్యలపై చర్చ
శ్రీరాంపూర్ : గుర్తింపు సంఘం టీబీజీకేఎస్, యాజమాన్యం మధ్య శనివారం ఏరియా స్థాయి స్ట్రక్చరల్ సమావేశం జరిగింది. ఇన్‌చార్జి జీఎం జేవీఎల్ గణపతి అధ్యక్షత జరిగిన సమావేశంలో టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి ఇతర ప్రతినిధులు సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎస్సార్పీ 3 గని నుంచి ఎస్సార్పీ 1 గని మ్యాగ్జిన్ వరకు వెళ్లే దారి బురదమయం అయిందని తెలిపారు.
మైనింగ్ రూల్స్‌కు వ్యతిరేకంగా మైనింగ్ సిబ్బందితో రెండు పనులు చేయిస్తున్నారని, సర్దార్, షాట్‌ఫైరర్ పనులు ఏక కాలంలో చేయిచండం మానుకోవాలని పేర్కొన్నారు. ఐకే 1ఏ గనిలో జనరల్ షిఫ్ట్, షిఫ్ట్ కోల్‌కట్టర్లు, టింబర్‌మెన్‌లు, లైన్‌మెన్‌లు, ట్రామర్లు, సర్వే సిబ్బందికి రెస్టు రూంలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎస్‌ఓటు జీఎం పీవీ సత్యనారాయణ, డీజీఎంలు శర్మ, జె.కిరణ్, శ్రీనివాస్‌రావు, టీబీజీకేఎస్ ప్రతినిధులు పానుగంటి సత్తయ్య, నెల్కి మల్లేశ్, సంజీవ్, లెక్కల విజయ్ పాల్గొన్నారు.