మాట్లాడుతున్న శ్రీనివాస్‌రావు
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి కార్మిక హక్కుల సాధన కేవలం టీబీజీకేఎస్‌తోనే సాధ్యమని యూనియన్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్ రావు అన్నారు. బుధవారం బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూడ ఓసీపీలో కార్మికులను కలిసి సీఎం కేసీఆర్, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత, ఎంపీ బాల్క సుమన్ సహకారంతో కార్మికులకు ప్రకటించిన పథకాలను వివరించారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్న సంఘం టీబీజీకేఎస్ అన్నారు.
జాతీయ సంఘాలు పోగొట్టిన వారసత్వపు ఉద్యోగాలను సీఎం కేసీఆర్ కారుణ్య నియామకాల ద్వారా తిరిగి అందచేస్తున్నారని అన్నారు. కార్మికులు కారుణ్య నియామకాలపై దరఖాస్తు చేసుకోవాలన్నారు. సొంతింటి నిర్మాణం కోసం కార్మికులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని సీఎం చొరవతో కార్మికులకు రూ. 10 లక్షలు వడ్డీ లేని రుణం బ్యాంకుల నుంచి తీసుకోవచ్చన్నారు.
కార్మికులు ఏ బ్యాంకు నుంచి రుణం తీసుకున్న వడ్డీ మాఫీ వర్తిస్తుందన్నారు. కార్మికుల పిల్లల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సంస్థే భరిస్తుందన్నారు. కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యసౌకర్యం కల్పిస్తోందని, కార్మికులందరూ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీలన్ని తూచ తప్పకుండా అమలు చేస్తున్న సత్తా కేవలం టీబీజీకేఎస్‌తోనే సాధ్యమన్నారు.
రాబో వు రోజుల్లో ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, దుర్గం చిన్నయ్య, టీబీజీ కేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి సహకారంతో కార్మికులకు అన్ని వేళల్లో అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment