
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నేతాజీ చౌరస్తాలో కూలీలకు, అడిషనల్ కలెక్టర్ డేవిడ్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. మహరాష్ట్ర నుండి వచ్చే కూలీలను నియంత్రణ చేయాలని.. అందులో భాగంగా కూలీలు రాకుండా రాకపోకలు నిలిపివేయాలని కూలీలు డిమాండ్ చేశారు. మహరాష్ట్ర నుండి వస్తున్న వందల మంది కూలీల రాకతో ఆదిలాబాద్‌లో కరోనా విజృంభిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మహరాష్ట్ర నుండి వచ్చే కూలీలను అడ్డుకుంటామని హమీ ఇవ్వాలంటూ కూలీలు.. అడిషనల్ కలెక్టర్‌ను నిలదీశారు. దీనిపై ఆయన కూలీలకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేక వెనుదిరిగారు.
చదవండి:
సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్‌చల్
ఈ చెరువుల్లో నీరు యమ డేంజర్, అస్సలు తాకొద్దు
Comments
Please login to add a commentAdd a comment