వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అదనపు కలెక్టర్ స్నేహలత
కల్లూరు/కల్లూరు రూరల్: కల్లూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను అదనపు కలెక్టర్ స్నేహలత, అసిస్టెంట్ కలెక్టర్ రాధికాగుప్తా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా వైద్యసేవలు, పరీక్షల్లో లోపాలపై వైద్యుడు లవన్‌కుమార్, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ఆస్పత్రిలో కనీస సంఖ్యలో ప్రసవాలు జరగకపోవడం, టీహబ్‌లో పరీక్షల లక్ష్యాలను చేరుకోకపోవడంతో పాటు రికార్డు నిర్వహణపై అసంతృప్తి వ్యక్తంచేశారు.
అలాగే, మండలంలోని చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రిని కూడా అదనపు కలెక్టర్ స్నేహలత, అసిస్టెంట్ కలెక్టర్ తనిఖీ చేసి ‘ఆరోగ్య మహిళ’లో భాగంగా వైద్యసేవలపై ఆరా తీశారు. డీఆర్డీఓ విద్యాచందన, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సీతారాం, ఎంపీపీ బీరవల్లి రఘు, ఎంపీడీఓ బి.రవికుమార్, ఎంపీఓ వీరస్వామి, డాక్టర్ తబుస్సుంతో పాటు డాక్టర్ లక్కినేని రఘు, సీహెచ్.కృష్ణారావు, లక్ష్మీకాంతమ్మ, నాగశేషరెడ్డి, సాకేత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment