ఖమ్మం సహకారనగర్: ఖమ్మం అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)గా మహబాబూబాద్ జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)గా విధులు నిర్వర్తిస్తు న్న అభిలాష అభినవ్ నియమితులయ్యారు. అలాగే, ప్రస్తుత ఖమ్మం అదనపు కలెక్టర్ స్నేహలతను జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా నియమించారు. ఈమేరకు రాష్ట్రప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
2018 బ్యాచ్
ఐఏఎస్ 2018వ బ్యాచ్‌కు చెందిన అభిలాష అభివన్‌కు 2020 ఆగస్టులో మహబూబాబాద్ అదనపు కలెక్టర్ తొలి పోస్టింగ్ వచ్చింది. అక్కడ పనిచేసిన మూడేళ్ల కాలంలో ఆమె మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు జాతీయ స్థాయిలో అవార్డులు సాధించడంలో కీలకంగా వ్యవహరించారు. బిహార్‌కు చెందిన ఆమె పాట్నాలో పదో తరగతి 91శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. అలా గే, ఇంటర్ 85శాతం మార్కులతో 2007లో ఉత్తీర్ణత సాధించగా, బీటెక్(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) నావి ముంబైలోని ఏసీ పటేల్ కళాశాలలో 2012లో పూర్తిచేశారు. అనంతరం పూణేలోని ఐబీఎంలో రెండేన్నరేళ్లు విధులు నిర్వర్తించిన అభిలాష వాలీబాల్ చాంపియన్ షిప్‌గా గుర్తింపు తెచ్చుకోవటంతో పాటు పెయింటింగ్ హాబీగా ఉంది. కాగా ఆమె తండ్రి గోల్‌నాథ్ సర్కార్ సైతం ఐపీఎస్ అధికారే కావడం విశేషం.
స్నేహలతకు మంచి గుర్తింపు
2020 ఫిబ్రవరి 10న ఖమ్మం అదనపు కలెక్టర్‌గా విధుల్లో చేరిన స్నేహలత విధినిర్వహణలో మంచి పేరు సంపాదించారు. స్థానిక సంస్థలకు సంబంధించి వివిధ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ విజయవంతమయ్యేలా కీలక భూమిక పోషించారు. మన ఊరు – మన బడి, గ్రామాల్లో పల్లెప్రగతి పనులు వేగవంతమయ్యేలా కృషి చేశారు. కాగా, స్నేహలత ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించడం ద్వారా ప్రభుత్వాస్పత్రులపై నమ్మకం పెరిగేందకు దోహదపడ్డారు.
కల్లూరు ఆర్డీఓగా శివాజీ
ఖమ్మం ఆర్డీఓ రవీంద్రనాథ్ తొర్రూరుకు బదిలీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(భూసేకరణ)గా ఉన్న బి.శివాజీని కల్లూరు ఆర్డీఓగా నియమించారు. ఈ స్థానంలో ఉన్న సీహెచ్.సూర్యనారాయణను కోదాడ ఆర్డీఓగా బదిలీ చేశారు. అలాగే, ఖమ్మం ఆర్డీఓ ఎం.వీ.రవీంద్రనాథ్‌ను తొర్రూరు ఆర్డీఓగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే, ఖమ్మం ఆర్డీఓగా మాత్రం ఇంకా ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment