ఆదిలాబాద్: జైనూర్ మండలంలోని ఉషెగాం ప్రాథమి ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వైద్యుడు రాజును అక్రమంగా బదిలీ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం గిరిజనులు అందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఆర్మీలో విధులు నిర్వహించి గతేడాది నుంచి ఉషెగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వైద్యుడు రాజును అక్రమంగా లింగాపూ ర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బదిలీ చేశారని ఆరోపించారు. మా డాక్టర్ మాకు కావాలని, లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జెడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్‌రావు సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఐదు రోజుల్లో రీపోస్టింగ్ ఇస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినా జిల్లా వైద్యశాఖ కార్యాలయంలోని కిందిస్థాయి అధికారులు అక్రమంగా బదిలీ చేస్తూ వైద్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. లింగాపూర్‌లో పనిచేస్తున్న వైద్యుడిని కాగజ్‌నగర్ ప్రాంతానికి బదిలీ చేసి నిస్వార్థంగా పనిచేస్తున్న డాక్టర్ రాజును అక్రమంగా ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. కలెక్టర్ చొరవ తీసుకుని అక్రమ బదిలీని నిలిపి వేయాలని, లేకుంటే కలెక్టరెట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్, యూత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment