
నల్లగొండ : జిల్లా కలెక్టర్ ఆర్‌వి.కర్ణన్ బదిలీ అయ్యారు. ఆయనను రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. కలెక్టర్ ఆర్‌వి.కర్ణన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కరీంనగర్ నుంచి బదిలీపై నల్లగొండకు వచ్చారు.
జూలై 26, 2023న ఇక్కడ విధుల్లో చేరారు. జిల్లా యంత్రాంగంతో కలిసి ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారు. అయితే నల్లగొండ కలెక్టర్‌గా ఇంకా ఎవరినీ నియమించలేదు.