Jainur
-
జైనూర్ ఘటన.. మానవ హక్కుల కమిషన్ నోటీసులు
న్యూఢిల్లీ, సాక్షి: మహిళపై అత్యాచారయత్నం, ఆపై హత్యాయత్నం ఘటనలతో రెండు వర్గాలు పరస్పర దాడులతో రణరంగంగా మారిన జైనూర్ ప్రస్తుతం కొద్దిగా కోలుకుంటోంది. మరోవైపు.. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ మంగళవారం తెలంగాణ సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ మొదటివారంలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఘటన.. ఆపై నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తీవ్రంగా పరిగణించింది ఎన్హెచ్ఆర్సీ. మీడియా ఆధారంగా వచ్చిన కథనాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. ఆ కథనాల్లో పేర్కొందే గనుక వాస్తవమైతే.. మానవ హక్కులకు తీవ్ర ఉల్లంఘన జరిగినట్లేనని అభిప్రాయపడింది. రెండువారాల్లోగా పూర్తి నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు నోటీసులు పంపించింది.ఆ నివేదికలో.. ఎఫ్ఐఆర్తో పాటు బాధితురాలి ఆరోగ్య పరిస్థితి, ఆమెకు అందించిన కౌన్సెలింగ్.. ప్రభుత్వం తరఫున అందించిన పరిహార వివరాలను కూడా పొందుపర్చాలని సీఎస్, డీజీపీలకు స్పష్టం చేసింది. ఇదీ చదవండి: నిమజ్జన టైంలో కోరడం సరికాదు: తెలంగాణ హైకోర్టు -
మా డాక్టర్.. మాకు కావాలి!
ఆదిలాబాద్: జైనూర్ మండలంలోని ఉషెగాం ప్రాథమి ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వైద్యుడు రాజును అక్రమంగా బదిలీ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం గిరిజనులు అందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఆర్మీలో విధులు నిర్వహించి గతేడాది నుంచి ఉషెగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వైద్యుడు రాజును అక్రమంగా లింగాపూ ర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బదిలీ చేశారని ఆరోపించారు. మా డాక్టర్ మాకు కావాలని, లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జెడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్‌రావు సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఐదు రోజుల్లో రీపోస్టింగ్ ఇస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినా జిల్లా వైద్యశాఖ కార్యాలయంలోని కిందిస్థాయి అధికారులు అక్రమంగా బదిలీ చేస్తూ వైద్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. లింగాపూర్‌లో పనిచేస్తున్న వైద్యుడిని కాగజ్‌నగర్ ప్రాంతానికి బదిలీ చేసి నిస్వార్థంగా పనిచేస్తున్న డాక్టర్ రాజును అక్రమంగా ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. కలెక్టర్ చొరవ తీసుకుని అక్రమ బదిలీని నిలిపి వేయాలని, లేకుంటే కలెక్టరెట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్, యూత్ పాల్గొన్నారు. -
కొమరంభీం జిల్లా జైనూర్ లో హైమన్ ధర్ఫ్ 36వ వర్థంతి సభ
-
అభ్యర్థి కిడ్నాప్.. జెడ్పీటీసీ ఏకగ్రీవం..!
కొమురం భీం ఆసిఫాబాద్: తుది విడత పరిషత్ ఎన్నికల్లో భాగంగా జైనూర్ జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచి జైనూర్ జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, కోవా లక్ష్మీ కుట్రకు పాల్పడ్డారని జైనూర్ బీజేపీ జెడ్పీటీసీ అభ్యర్థి మైసన్ శేకు అతని భార్య చంద్రకళ ఆరోపించారు. ‘మా ఇద్దరినీ కిడ్నాప్ చేసి వేర్వేరు చోట్ల బంధించారు. నామినేషన్ విత్‌డ్రా చేసుకోకపోతే నా భర్తను చంపుతామని బెదిరించారు’ అని చంద్రకళ ఆవేదన వ్యక్తం చేశారు. కోవా లక్ష్మీ ఏకగ్రీవాన్ని రద్దు చేసి, తిరిగి ఎన్నికలు నిర్వహించాలని శేకు, చంద్రకళ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జైనూర్ చౌరస్తాలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఇక ఆసిఫాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిగా కోవా లక్ష్మీ పేరును టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేయడం గమనార్హం. రెండో విడత పరిషత్ ఎన్నికలు శుక్రవారం (మే 10) జరిగాయి. -
పాముకాటుతో రైతు మృతి
జైనూరు: పాముకాటుకు గురై ఓ రైతు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా జైనూరు మండలం జమ్గామ్ గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన కూరేడు మూగేజి(34) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజు లాగే వ్యవసాయ పనుల నిమిత్తం బావి వద్దకు వెళ్లిన మూగేజికి ఏదో కుట్టినట్లు అనిపించింది. దీంతో ఆస్పత్రికి వెళ్లాగా.. పాము కుట్టిందని చెప్పిన వైద్యులు చికిత్స అందించారు. చికిత్స పొందుతున్న మూగేజి మృతి చెందాడు. -
జ్వరంతో బాలుడి మృతి
జైనూరు (ఆదిలాబాద్ జిల్లా) : నాలుగు రోజులుగా జ్వరం వస్తున్నా సరైన వైద్యం చేయించుకోకపోవడంతో తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం ఆదిలాబాద్ జిల్లా జైనూరు మండలం కర్ణంగూడ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణంగూడ గ్రామానికి చెందిన శ్యాంకుమార్(9) మూడవ తరగతి చదువుతున్నాడు. కాగా గత నాలుగు రోజులుగా జ్వరం రావడంతో తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రిలో చూపించారు. అయితే, సరైన వైద్యం అందకపోవడంతో బాలుడు తీవ్ర అస్వస్థతకు గురై గురువారం మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు బోరున విలపించారు.