ఎంటెక్‌.. మెకానిక్‌ | MTech Student Rokkam Santosh Reddy Settled As A Car Mechanic | Sakshi
Sakshi News home page

ఎంటెక్‌.. మెకానిక్‌

Published Mon, Jul 8 2024 12:31 PM | Last Updated on Mon, Jul 8 2024 12:31 PM

MTech Student Rokkam Santosh Reddy Settled As A Car Mechanic

సంతోష్‌ స్వయంకృషి

సాఫ్ట్‌వేర్‌జాబ్‌ వదిలి సొంత వ్యాపారం

లక్షల జీతం వద్దనుకుని కార్ల మెకానిక్‌ షెడ్డు ఏర్పాటు

20మందికి ఉపాధి.. ప్రతినెలా రూ.లక్షల్లో జీతాల చెల్లింపు

‘ఏది తానంతట తానై నీ దరికి రాదు.. శోధించి సాధించాలనే’ నానుడిని నిజం చేశాడీ సంతోష్‌. లక్షల్లో వేతనం.. లగ్జరీ జీవితం అయినా ఏదో వెలితి.. ఒకరి వద్ద పని చేయడమేంటనే ఆలోచన వెంటాడటంతో సొంతంగా వ్యాపారం చేయాలని భావించాడు.

అనుకున్నదే తడువుగా చదువుకు తగిన పనినే ఎంచుకున్నాడు. మెకానిక్‌లుగా ఇంజినీరింగ్‌ పట్టభద్రులు లేక పోగా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విద్యతోనే వినియోగదారులకు సేవలందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో నగరంలో మెకానిక్‌ షాపును ప్రారంభించి పదేళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తుండగా.. తను మాత్రమే కాకుండా 20మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.   – కరీంనగర్‌ అర్బన్‌

స్వయంకృషే నా బలం..
మొదటి నుంచి స్వయంకృషితో ఎదగాలనుకున్న. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎంటెక్‌ పూర్తి చేసి మెకానికల్‌ రంగంలో రాణించాలని నిర్ణయించుకున్న. ఉద్యోగాన్ని వదిలినపుడు చాలామంది హేళన చేశారు. ఇప్పుడు వారే అభినందిస్తున్నారు. సొంతకాళ్లపై నిలబడటంతో పాటు 20మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నా. – రొక్కం సంతోష్‌రెడ్డి 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement