mtech student
-
ఎంటెక్.. మెకానిక్
‘ఏది తానంతట తానై నీ దరికి రాదు.. శోధించి సాధించాలనే’ నానుడిని నిజం చేశాడీ సంతోష్. లక్షల్లో వేతనం.. లగ్జరీ జీవితం అయినా ఏదో వెలితి.. ఒకరి వద్ద పని చేయడమేంటనే ఆలోచన వెంటాడటంతో సొంతంగా వ్యాపారం చేయాలని భావించాడు.అనుకున్నదే తడువుగా చదువుకు తగిన పనినే ఎంచుకున్నాడు. మెకానిక్‌లుగా ఇంజినీరింగ్ పట్టభద్రులు లేక పోగా మెకానికల్ ఇంజినీరింగ్ విద్యతోనే వినియోగదారులకు సేవలందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో నగరంలో మెకానిక్ షాపును ప్రారంభించి పదేళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తుండగా.. తను మాత్రమే కాకుండా 20మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. – కరీంనగర్ అర్బన్స్వయంకృషే నా బలం..మొదటి నుంచి స్వయంకృషితో ఎదగాలనుకున్న. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎంటెక్ పూర్తి చేసి మెకానికల్ రంగంలో రాణించాలని నిర్ణయించుకున్న. ఉద్యోగాన్ని వదిలినపుడు చాలామంది హేళన చేశారు. ఇప్పుడు వారే అభినందిస్తున్నారు. సొంతకాళ్లపై నిలబడటంతో పాటు 20మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నా. – రొక్కం సంతోష్‌రెడ్డి -
మౌనిక ఆత్మహత్య కేసు: ఫోరెన్సిక్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ఎంటెక్ నానోసైన్స్ రెండో సంవత్సరం చదువుతున్న ఆర్.మౌనిక(27) గత నెల 22న ఆత్మహత్య చేసుకునేందుకు కారణం ఏంటనే విషయాన్ని లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు కీలక సమాచారం లభ్యమైనట్లు తెలిసింది. హాస్టల్లోని ఆమె గదిలోంచి స్వా«దీనం చేసుకున్న సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)కు పంపిన పోలీసులకు.. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్‌లో విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఆమె సెల్‌ఫోన్ నుంచి బట్టబయలైన పర్సనల్ చాటింగ్‌తో పాటు పలువురు సన్నిహిత స్నేహితులను విచారించిన పోలీసులు.. మౌనిక ఆత్మహత్యకు సంబంధించిన కీలక సమాచారాన్ని గుర్తించినట్లు తెలిసింది. రెండు మూడు రోజుల్లో మృతురాలి తల్లిదండ్రులతో నిర్ధారించుకున్న తర్వాత.. పూర్తి వివరాలను మీడియాకు వివరిస్తామని ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. చదవండి: మ్మల్ని సాదుతానని మధ్యలోనే వెళ్లిపోయింది ఐటీ ‘రిటర్న్స్’నూ మళ్లించేశారు..! -
హెచ్సీయు విద్యార్థి: వీడని విద్యార్థిని ఆత్మహత్య మిస్టరీ!
సాక్షి, కాల్వశ్రీరాంపూర్(కరీంనగర్): హైదరాబాద్‌లో ఎంటెక్ విద్యార్థి రగుసాల మౌనిక ఆత్మహత్య చేసుకోవడంతో స్వగ్రామం తారుపల్లి శోకసంద్రంలో మునిగింది. గ్రామానికి చెందిన రగుసాల లచ్చయ్య రజితకు మమత, మౌనిక ఇద్దరు కూతుళ్లు, మమతకు డిగ్రీ తర్వాత వివాహం చేశారు. మౌనిక స్థానిక ప్రభుత్వపాఠశాలలో పదోతరగతి చదివి స్కూల్ టాపర్‌గా నిలిచి బాసర ట్రీపుల్ ఐటీలో చదువు పూర్తిచేసింది. హైదరాబాద్‌లో ఎంటెక్ నానోసైన్స్ టెక్నాలజీ రెండో సంవత్సరం చదువుతోంది. ఇటీవల కళాశాల పిలుపు మేరకు హైదరాబాద్ వెళ్లి హాస్టల్లో చేరింది. సోమవారం హాస్టల్ గదిలో తమ కూతురు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందన్న వార్త ఆ తల్లి దండ్రులను షాక్‌కు గురిచేసింది. కూతురు మరణవార్తతో ఆ కుటుంబం బోరున విలపిస్తోంది. గచ్చిబౌలి పోలీసులు ఇచ్చిన సమాచారంతో.. తండ్రి లచ్చయ్య గ్రామస్తుల సాయంతో కూతురు మృతదేహన్ని తీసుకువచ్చేందుకు హైదరాబాద్ తరలివెళ్లారు. తమ కూతురు ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యం ఒత్తిడి, నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదుచేశారు. మౌనిక మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తనతో ఫొన్లో మాట్లాడిందని తల్లి రజిత విలపిస్తూ చెప్పింది. చిన్నబిడ్డకు ఇంత గతి పట్టించావా దేవుడా అంటూ రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. చదువులో ముందు.. మౌనిక చిన్నప్పటినుంచి చదువులో ముందజలో ఉండేదని అత్యంత ప్రతిష్టాత్మకమైన నానోసైన్స్ టెక్నాలజీలో సీటు పొందిందన్న సంతోషం తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ఎంతోకాలం నిలవలేదు. జెడ్పీహైస్కూల్లో మౌనికకు చదువుచెప్పిన గురువులు ఆత్మహత్య చేసుకుందన్న నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ కీలకం.. మౌనిక ఆత్మహత్యకు కారణలేమిటన్నది పోలీసులకు సవాలుగా మారింది. మౌనికది ముమ్మాటికీ ఆత్మహత్యే అంటున్న పోలీసులు ఆమె వినియోగించిన ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ కీలక ఆధారం కావొచ్చని పేర్కొంటున్నారు. హాస్టల్లో సహావిద్యార్థిని, క్లాస్మెంట్స్ను విచారిస్తున్నామని ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకుంటామని తల్లిదండ్రులకు గచ్చిబౌలి డీఎస్పీ తెలిపారు. మౌనిక ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. చదవండి: మమ్మల్ని సాదుతానని మధ్యలోనే వెళ్లిపోయింది -
జూన్‌లో చేరి.. సెప్టెంబర్‌లో ఉరేసుకుని!
సాక్షి, కోజికోడ్ : ఇంజినీరింగ్ పూర్తిచేసి ఎంటెక్ చదువుతున్న విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాదం కేరళలోని కోజికోడ్‌లో శనివారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. తిరువనంతపురానికి చెందిన అరుణ్ క్రిష్ణ (23) ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. కోజికోడ్‌లోని నేషనల్ ఇన్స్టిస్టూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో నానో టెక్నాలజీ విభాగంలో ఎంటెక్ చదువుతున్నాడు. ఈ ఏడాది జూన్‌లో కోజికోడ్ నిట్‌లో చేరిన అరుణ్ హాస్టల్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో తన రూమ్మేట్ ఇంటికి వెళ్లిపోవడంతో గత కొన్ని రోజులుగా ఒంటరిగా ఉంటున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ శనివారం ఉదయం ఓ విద్యార్థి అరుణ్ రూమ్ తలుపుతట్టగా ఎలాంటి స్పందనరాలేదు. ఎంతసేపు పిలిచిన అలికిడి లేకపోవడంతో హాస్టల్ సిబ్బంది సాయంతో డోర్ ఓపెన్ చేసి చూడగా.. అరుణ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అతడ్ని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అదివరకే ఆ విద్యార్థి చనిపోయాడని నిర్ధారించారు. దీంతో కోజికోడ్ నిట్‌లో, అరుణ్ స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఎలాంటి సూసైడ్ లేఖ లభ్యం కాలేదని సమాచారం. -
ఎంటెక్ విద్యార్థి బలవన్మరణం
ఓబుళదేవరచెరువు : ఓబుళదేవరచెరువు మండలం మిట్టపల్లికి చెందిన మాజీ సర్పంచ్ రొద్దం గోవిందరెడ్డి కుమారుడు రొద్దం సుమంత్‌కుమార్‌రెడ్డి(28) శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు సమీప బంధువులతో పాటు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. అనంతపురం జేఎన్టీయూలో ఎంటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. తను ఓ అమ్మాయిని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులతో చెప్పాడు. ‘చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకుందువు. అంతవరకు వద్దని’ తల్లిదండ్రులు నచ్చచెప్పారు. దీంతో క్షణికావేశానికి గురైన సుమంత్ ఇంటి పైఅంతస్తులోకి వెళ్లి ఉరేసుకున్నాడు. వెంటనే గమనించి కిందకు దింపగా అప్పటికే అతను మరణించాడు. ఒక్కగానొక్క కుమారుడు ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు గుండెలుపగిలేలా రోదించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఎంటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి
రంగారెడ్డిజిల్లా (కీసర): ఓ ఎంటెక్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. హత్యే అని ఆరోపిస్తూ మృతుడి కుటుంబీకులు కీసర ఠాణా వద్ద ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మండల పరిధిలోని యాద్గార్పల్లి బైపాస్ రహదారి కల్వర్టు వద్ద మంగళవారం ఉదయం వెలుగుచూసింది. పోలీసులు, మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. హయత్‌నగర్ మండలం బండరావిర్యాల గ్రామానికి చెందిన గోద రాములు, అమృత దంపతుల కుమారుడు మధుయాదవ్(25) స్థానికంగా బాటసింగారంలోని ఓ కాలేజీలో ఎంటెక్ చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం కీసర మండలం నాగారంలోని స్నేహితుల వద్దకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పిన అతడు తన పల్సర్ బైక్‌పై బయలుదేరాడు. ఇదిలా ఉండగా, మంగళవారం తెల్లవారుజామున కీసర యాద్గార్పల్లి బైపాస్ రహదారి (ఓఆర్ఆర్ జంక్షన్ సమీపం)లోని కల్వర్టులో మధుయాదవ్ విగ తజీవిగా పడి ఉన్నాడు. ఘటనా స్థలంలో అతడి బైక్ పడి ఉంది. వాహనదారుల సమాచారంతో కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి మృతుడి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. మృతుడి కుటుంబీకులు పీఎస్ వద్దకు చేరుకున్నారు. మధుయాదవ్‌ను అతడి స్నేహితులు పథకం ప్రకారం హత్య చేసి బైక్ తీసుకొచ్చి పడేసి ప్రమాద ఘటనగా చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగారం గ్రామంలో నివాసం ఉండే మధుయాదవ్ స్నేహితుల్లో ఒకరికి ఇటీవలే విదేశాలకు వెళ్లేందుకు వీసా రావడంతో సోమవారం రాత్రి విందు ఏర్పాటు చేశారని, ఈక్రమంలో పథకం ప్రకారం హత్య చేశారని మృతుడి తల్లిదండ్రులు గోద రాములు, అమృత ఆరోపించారు. తమ కుమారుడి ఒంటిపై బలమైన గాయాలు ఉన్నాయని, అతడు చివరిక్షణం వరకు దుండగుల నుంచి తప్పించుకునేందుకు యత్నించాడని తెలిపారు. సోమవారం రాత్రి 2 గంటల సమయంలో మధుయాదవ్ రెండుసార్లు ఇంటికి రెండుసార్లు కాల్ చేశాడని తెలిపారు. ఘటనా స్థలానికి క్లూస్‌టీం, జాగిలాలను ఎందుకు రప్పించలేదని పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ఎస్ఐలు వెంకట్‌రెడ్డి, అనంతచారిలు ఆందోళనకారులతో మాట్లాడి సముదాయించారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని, హత్య అయితే దుండగులను వెంటనే అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో మృతుడి కుటుంబీకులు, బంధువులు శాంతించారు. ఇప్పటికే మధుయాదవ్ స్నేహితులు ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నామని సీఐ గురువారెడ్డి పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు మధుయాదవ్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.