జూన్‌లో చేరి.. సెప్టెంబర్‌లో ఉరేసుకుని! | Mtech student committed suicide in Kerala | Sakshi
Sakshi News home page

జూన్‌లో చేరి.. సెప్టెంబర్‌లో ఉరేసుకుని!

Published Sun, Sep 24 2017 12:13 PM | Last Updated on Sun, Sep 24 2017 12:13 PM

Mtech student committed suicide in Kerala

సాక్షి, కోజికోడ్ : ఇంజినీరింగ్ పూర్తిచేసి ఎంటెక్ చదువుతున్న విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాదం కేరళలోని కోజికోడ్‌లో శనివారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. తిరువనంతపురానికి చెందిన అరుణ్ క్రిష్ణ (23) ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. కోజికోడ్‌లోని నేషనల్ ఇన్‌స్టిస్టూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో నానో టెక్నాలజీ విభాగంలో ఎంటెక్ చదువుతున్నాడు. ఈ ఏడాది జూన్‌లో కోజికోడ్ నిట్‌లో చేరిన అరుణ్ హాస్టల్లో ఉంటున్నాడు.

ఈ క్రమంలో తన రూమ్‌మేట్ ఇంటికి వెళ్లిపోవడంతో గత కొన్ని రోజులుగా ఒంటరిగా ఉంటున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ శనివారం ఉదయం ఓ విద్యార్థి అరుణ్ రూమ్ తలుపుతట్టగా ఎలాంటి స్పందనరాలేదు. ఎంతసేపు పిలిచిన అలికిడి లేకపోవడంతో హాస్టల్ సిబ్బంది సాయంతో డోర్ ఓపెన్ చేసి చూడగా.. అరుణ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అతడ్ని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అదివరకే ఆ విద్యార్థి చనిపోయాడని నిర్ధారించారు. దీంతో కోజికోడ్ నిట్‌లో, అరుణ్ స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఎలాంటి సూసైడ్ లేఖ లభ్యం కాలేదని సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement