కేరళలో విషాదం నెలకొంది. వైద్యుడి నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఎంబీబీఎస్ రెండో ఏడాది కూడా పూర్తి చేయని ఓ వైద్యుడు.. రోగికి గుండె ఆపరేషన్ చేయడంతో అతడు మరణించాడు. ఈ దారుణం కోజికోడ్ జిల్లాలో సెప్టెంబర్ 23న జరగ్గా.. మృతుడి కుమారుడు వైద్యుడి విద్యార్హతలపై ప్రశ్నించడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది.
వినోద్ కుమార్ అనే వ్యక్తి హార్ట్ పేషెంట్. కొన్ని రోజులుగా ఛాతీలో నొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వైద్యం నిమిత్తం కోజికోడ్ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స చేసిన కాసేపటికి ఆయన మరణించారు. అనంతరం సంబంధిత వైద్యుడు(రెసిడెంట్ మెడికల్ అధికారి) కనీసం తన వైద్యవిద్యను పూర్తి చేయలేదనే విషయం మృతుడి కుమారుడు అశ్విన్‌కు తెలిసింది.
2011లో ఎంబీబీఎస్ కోర్సులో చేరగా.. ఇప్పటికీ ఎంబీబీఎస్ రెండో ఏడాది కూడా పాస్ కాలేదని తేలింది. రెండు ప్రొఫెషనల్ ఎంబీబీఎస్ పరీక్షలను క్లియర్ చేయలేకపోయాడని తెలియడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వైద్యుడిగా అర్హత లేని వ్యక్తిని వైద్యుడిగా ఎలా పనిచేయిస్తారని ప్రశ్నించారు. తన తండ్రి చావుకు వైద్యుడే కారణమని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రెసిడెంట్ మెడికల్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు
అయితే ఆర్‌ఎంఓ వైద్యుడి అర్హతలను ధృవీకరించడంలో విఫలమైన ఆసుపత్రి యజమా న్యం.. అతడిని వెనకేసుకొని రావడం గమనార్హం. డాక్టర్‌ను అబూ అబ్రహం లూక్‌గా గుర్తించారు. వెంటనే అతన్ని విధుల నుంచి తొలగించారు. లూక్‌ని నియమించి ముందు అతని మెడికల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను తనిఖీ చేసినట్లు ఆసుపత్రి మేనేజర్ పేర్కొన్నారు. తమతో పనిచేసే ముందు కోజికోడ్, మలప్పురంలోని చాలా ఆసుపత్రులలో పనిచేశాడని తెలిపారు.
గతంలో తమ కంటే పెద్ద ఆసుపత్రులలో పనిచేయడంతో అపాయింట్‌మెంట్‌తో ముందుకు సాగినట్లు చెప్పారు. అతను నిజంగా మంచి వైద్యుడని, ఆయను అందుబాటులో లేకుంటే రోగులు వారి అపాయింట్‌మెంట్‌లను రద్దు చేసేవారని తెలిపారు. రోగులతో బాగా ప్రవర్తించేవాడని, ాలా గౌరవించేవాడని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment