
( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ఎంటెక్ నానోసైన్స్ రెండో సంవత్సరం చదువుతున్న ఆర్.మౌనిక(27) గత నెల 22న ఆత్మహత్య చేసుకునేందుకు కారణం ఏంటనే విషయాన్ని లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు కీలక సమాచారం లభ్యమైనట్లు తెలిసింది. హాస్టల్‌లోని ఆమె గదిలోంచి స్వా«దీనం చేసుకున్న సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్)కు పంపిన పోలీసులకు.. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్‌లో విస్తుపోయే నిజాలు తెలిశాయి.
ఆమె సెల్‌ఫోన్ నుంచి బట్టబయలైన పర్సనల్ చాటింగ్‌తో పాటు పలువురు సన్నిహిత స్నేహితులను విచారించిన పోలీసులు.. మౌనిక ఆత్మహత్యకు సంబంధించిన కీలక సమాచారాన్ని గుర్తించినట్లు తెలిసింది. రెండు మూడు రోజుల్లో మృతురాలి తల్లిదండ్రులతో నిర్ధారించుకున్న తర్వాత.. పూర్తి వివరాలను మీడియాకు వివరిస్తామని ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.
చదవండి: మ్మల్ని సాదుతానని మధ్యలోనే వెళ్లిపోయింది
ఐటీ ‘రిటర్న్స్’నూ మళ్లించేశారు..!
Comments
Please login to add a commentAdd a comment