Forensic reports
-
లా విద్యార్థినిపై దారుణం.. పోలీస్ కస్టడీకి నిందితులు?
సాక్షి, విశాఖపట్నం: లా విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దారుణానికి ఒడిగిట్టిన నలుగురు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.బుధవారం దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీజ్ చేసిన వారి ఫోన్లను ఫోరెన్సిక్ కి పంపించారు. బాధితురాలి నగ్నంగా ఉన్న వీడియోలని ఎవరికి పంపించారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. దారుణ ఘటనలో ఏ2గా ఉన్న జగదీష్ తన ఫోన్లో ఉన్న బాధితురాలి నగ్న వీడియోల్ని రికార్డ్ చేసి ఏ1గా ఉన్న వంశీకి షేర్ చేశాడు. వంశీ ఏ3 ఆనంద్, ఏ4 రాజేష్‌కి పంపించాడు. అయితే, బాధితురాలి వీడియోలను ఈ నలుగురు ఇంకెవరికైనా పంపారా? అన్న కోణంలో ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ పరిశీలించిన అనంతరం రిపోర్ట్ ఇవ్వనుంది. -
షెల్ కంపెనీతో సీఎం రమేశ్ టోకరా..
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ఆయన నమ్మిన బంటు.. ఆ పార్టీ మాజీ ఎంపీ, ప్రస్తుతం బీజేపీలో టీడీపీ కోటరీకి నాయకుడు సీఎం రమేశ్ అక్రమాల బాగోతం మరొకటి బయటపడింది. ఫోర్జరీ సంతకాలు చేసి షెల్ కంపెనీ ముసుగులో ఏకంగా రూ.450 కోట్లు కొట్టేసిన వ్యవహారం ఆధారాలతో సహా వెలుగుచూసింది. సీఎం రమేశ్, ఆయన సన్నిహితుడు పి. నాగేశ్వరరావు పక్కా స్కెచ్‌తో పాల్పడిన ఈ ఘరానా మోసంపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. సంతకాలు ఫోర్జరీ చేసి రిత్విక్ స్వాతి అనే బోగస్ కంపెనీ పేరిట సబ్‌కాంట్రాక్టు ఒప్పంద పత్రాలు సృష్టించి మరీ ఈ మోసానికి తెగబడ్డారు. ఈ మేరకు ప్రముఖ సినీ నటుడు, పీసీఎల్ ఇంటర్‌టెక్ లెన్హైడ్రో కాన్సార్షియం జాయింట్ వెంచర్ ఆథరైజ్డ్ సిగ్నేచరీగా ఉన్న తొట్టెంపూడి వేణు, కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు కుమారుడు కావూరి భాస్కర్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు గత ఏడాదే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 420, 468, 471 కింద కేసు నమోదు చేశారు. ఫోర్జరీ సంతకాలతో సీఎం రమేశ్ పాల్పడిన ఈ మోసానికి సంబంధించిన మరిన్ని కీలక ఆధారాలను తొట్టెంపూడి వేణు, కావూరి భాస్కర్‌రావు హైదరాబాద్ పోలీసులకు శనివారం అందించారు. కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని కోరారు. ఈ ఘరానా మోసం వివరాలిలా ఉన్నాయి.. పీసీఎల్ కన్సార్షియంకు తెహ్రీ హైడ్రో ప్రాజెక్టు.. ఉత్తరాఖండ్‌లో తెహ్రీ హైడ్రో ప్రాజెక్టు వద్ద సివిల్ ప్రాజెక్టు కాంట్రాక్టును పీసీఎల్ ఇంటర్‌టెక్ కన్సార్షియం దక్కించుకుంది. ఈ మేరకు తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీహెచ్‌డీసీ)తో 2002లో ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం ఆ ప్రాజెక్టు వ్యవహారాలను నిర్వహించేందుకు పీసీఎల్ కన్సార్షియం తమ ప్రతినిధిగా కావూరి భాస్కర్‌రావును జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ (జీపీఏ) ద్వారా నియమించింది. కొంతకాలం ప్రాజెక్టు పనులు చేపట్టిన తరువాత పీసీఎల్ కన్సార్షియంకు టీహెచ్డీసీతో విభేదాలు తలెత్తాయి. దీంతో ఆ వ్యవహారం న్యాయస్థానం ఆర్బిట్రేషన్‌కే చేరింది. ఢిల్లీ కోర్టులో ప్రస్తుతం వ్యాజ్యం కొనసాగుతోంది. పీసీఎల్ కన్సార్షియంకు చెల్లించాల్సిన బిల్లుల మొత్తాన్ని టీహెచ్‌డీఏ న్యాయస్థానంలో డిపాజిట్ చేసింది. ఫోర్జరీ సంతకాలతో సీఎం రమేశ్ మోసం.. ఇలా ఓ వైపు ఈ న్యాయ వివాదం కొనసాగుతుండగా.. సీఎం రమేశ్ గుట్టుచప్పుడు కాకుండా ఓ కథ నడిపించారు. పి. నాగేశ్వరరావు అనే వ్యక్తి తమ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని పీసీఎల్ కన్సార్షియం 2011లో గుర్తించింది. ఆ మేరకు ఆయన ఓ జీపీఏను కూడా సృష్టించారని తెలుసుకుని షాక్‌కు గురైంది. అంతేకాదు.. తమ కన్సార్షియం ప్రతినిధిగా చెప్పుకుంటూ ఆయన సీఎం రమేశ్‌కు చెందిన బోగస్ కంపెనీ రిత్విక్ స్వాతికి టీహెచ్‌డీఏ ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టును ఇచ్చినట్లు పత్రాలు సృష్టించారు. వాటిని చూపిస్తూ టీహెచ్‌డీఏ ప్రాజెక్టు బిల్లులు పొందేందుకు సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ స్వాతి కంపెనీ వ్యవహారం నడిపింది. పి. నాగేశ్వరరావు అనే వ్యక్తి కేవలం పరిమిత కాల జీపీఏతో పీసీఎల్ కన్సార్షియం ప్రతినిధిగా టీహెచ్‌డీఏ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు. కానీ, ఆయన వ్యవహారశైలి నచ్చక ఆ జీపీఏ కాలపరిమితి ముగియగానే ఆయన్ని తొలగించారు. అయినాసరే.. తమ సంతకాలు ఫోర్జరీ చేసి మరోజీపీఏ సృష్టించుకోవడంతోపాటు.. సీఎం రమేశ్‌కు చెందిన బోగస్ కంపెనీ రిత్విక్ స్వాతితో తమ కంపెనీ పేరుతో సబ్ కాంట్రాక్టు ఒప్పందం చేసుకున్నట్లుగా పీసీఎల్ కన్సార్షియం గుర్తించింది. ఈ ఒప్పందంలో పి.నాగేశ్వరరావు తన చిరునామాలో ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేటను పేర్కొన్నారు. దీనిపై పీసీఎల్ కన్సార్షియం చిలకలూరిపేట పోలీసులను ఆశ్రయించగా ఆయన తప్పుడు చిరునామా ఇచ్చారని గుర్తించారు. అసలు చిరునామాను కూడా గుర్తించి వెల్లడించారు. షెల్ కంపెనీ ద్వారా నిధులు కొల్లగొట్టేందుకు ఉద్దేశించిన ఆ బోగస్ సబ్ కాంట్రాక్టు ఒప్పందం ద్వారా సీఎం రమేశ్, పి.నాగేశ్వరరావు ఈ మోసానికి పాల్పడ్డట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో పీసీఎల్ కన్సార్షియం ఈ విషయాన్ని ఈ–మెయిల్ ద్వారా టీహెచ్‌డీఏ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందిందని టీహెచ్‌డీఏ ఉన్నతాధికారులు నిర్ధారించారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో ఫోర్జరీ నిర్ధారణ.. మరోవైపు.. ఆ సబ్ కాంట్రాక్టు ఒప్పంద పత్రాలను కావూరి భాస్కర్‌రావు ట్రూత్‌ల్యాబ్ అనే ప్రైవేటు సంస్థ ద్వారా ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించారు. పి. నాగేశ్వరరావు, రిత్విక్ స్వాతి కంపెనీ ఉద్దేశపూర్వకంగా సంతకాలు ఫోర్జరీ చేసినట్లు ఆ పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. ఈ అంశాన్ని పీసీఎల్ కన్సార్షియం ప్రతినిధులైన తొట్టెంపూడి వేణు, కావూరి భాస్కర్‌రావు హైదరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ స్వాతి కంపెనీ ప్రధాన కార్యాలయంలోనే ఫోర్జరీ సంతకాలతో బోగస్ సబ్ కాంట్రాక్టు ఒప్పందం చేసుకున్నారని తేలింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులకు గత ఏడాది నవంబరు 4న ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించి ఫోర్జరీ సంతకాల విషయాన్ని నిర్ధారించాలని కోరారు. తప్పుడు ఒప్పందంతో తమ కంపెనీని మోసం చేసిన సీఎం రమేశ్, పి. నాగేశ్వరరావులపై చట్ట ప్రకా రం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీరి మోసానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉండటంతో వారిపై హైదరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో.. తొట్టెంపూడి వేణు, కావూరి భాస్కర్‌రావు హైద రాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డిని శని వారం కలిసి ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కేసు కు సంబంధించి తాము సేకరించిన మరిన్ని కీలకపత్రాలను కూడా పోలీసులకు అందించారు. సీఎం రమేశ్ రూ.450 కోట్లు కొల్లగొట్టారు : కావూరి భాస్కర్‌రావు ‘పీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీకి సంబంధించి సీఎం రమేశ్ ఫోర్జరీకి పాల్పడ్డారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీపీ ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చాను. దాదాపు అరగంట పాటు నా స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. ఈ ఫోర్జరీ ద్వారా సీఎం రమేశ్ దాదాపు రూ.450 కోట్లు స్వాహా చేశారు. దీనికి సంబంధించి కోర్టులోనూ ఓ కేసు నడుస్తోంది. సీఎం రమేశ్‌పై సీబీఐ దర్యాప్తు జరిగితే రూ.వేల కోట్ల స్కాంలకు సంబంధించిన విషయాలు బయటకొస్తాయి’.. అని కావూరి భాస్కర్‌రావు మీడియాకు చెప్పారు. -
ఫోరెన్సిక్ నివేదికలో సంచలన విషయాలు
-
ప్రీతి కేసు: ఫోరెన్సిక్ రిపోర్ట్‌పై ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ర్యాగింగ్ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసి.. చికిత్స పొందుతూ కన్నుమూసింది మెడికో ధరావత్ ప్రీతి(26). ఈ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రీతి మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా.. ఆ నివేదిక ఇప్పుడు వరంగల్ పోలీసులకు చేరింది. ప్రీతి ఉదంతంలో ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంజెక్షన్లతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని తొలుత చికిత్స అందించిన వైద్యులు ప్రకటించారు. అయితే.. ప్రీతి తల్లిదండ్రులు మాత్రం ఇది హత్యేనని, ఎవరో ఇంజెక్షన్లు చేశారంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రీతి బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్‌లను సైతం వరంగల్ పోలీసులు తెప్పించుకున్నారు. ఇక ఫోరెన్సిక్ నివేదికలో ఏం ఉంది, పోలీసులు ఏం ప్రకటిస్తారనే అంశాలు ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. గాంధీ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించగా.. ఈ నివేదిక ఆధారంగా స్పష్టమైన ప్రకటనతో అనుమానాలకు తెర దించనున్నారు వరంగల్ పోలీసులు. సాక్షి, వరంగల్: మరోవైపు.. మెడికో ప్రీతి కేసులో ప్రధాన నిందితుడు సైఫ్ పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు. మొత్తం 9 మంది అందించిన కీలక ఆధారాలతో నిందితుడు సైఫ్ ను విచారిస్తున్నారు ఏసీపీ బోనాల కిషన్. రెండు రోజుల విచారణలో కీలకాంశాలే సేకరించినట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ క్రమంలో వాట్సాప్ ఛాటింగ్ కీలకంగా మారినట్లు తెలుస్తోంది. వాట్సాప్‌లో 27 స్క్రీన్ షాట్స్, మెసేజ్‌లను.. సాంకేతిక ఆధారాలను సరిపోల్చుతూ సైఫ్‌ను విచారిస్తున్నారు. కస్టడీ గడువు ముగిసేలోపు నిందితుడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు యత్నిస్తున్నారు. -
కు.ని. మరణాలపై ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాకే..
సాక్షి, హైదరాబాద్: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో డీపీఎల్ ఆపరేషన్ల ఘటనపై విచారణ అత్యంత పారదర్శ కంగా చేస్తున్నట్లు ప్రజారోగ్య విభాగంసంచాలకుడు జి.శ్రీనివాసరావు తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్టు వచ్చిన తర్వాతే తుది నివేదికను రూపొందించనున్నట్లు వివరించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకు నేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నా రు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 12 లక్షల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. దురదృష్టవశాత్తూ తొలిసారిగా ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో కుటుంబ నియంత్రణ చికిత్స చేయించుకున్న వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయా రని, ఇది అత్యంత బాధాకరమని అన్నా రు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకుందని, సర్జరీలు నిర్వహించిన ఆస్పత్రి వైద్య విధాన పరి షత్ పరిధిలో ఉండగా, ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రాం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనరేట్ పరిధిలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో విచారణ నిష్పక్షపాతంగా జరగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం, ఆ రెండు విభాగాలకు కాకుండా ప్రజారోగ్య విభాగానికి విచారణ బాధ్యతలను అప్పగించిందని పేర్కొన్నా రు. ప్రాథమిక చర్యల్లో భాగంగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేసినట్లు వివరించారు. అదేవిధంగా చికిత్స చేసిన వైద్యుడికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నోటీసులు ఇచ్చిందని, వైద్యుడి లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేశామని వెల్లడించారు. స్టెరిలైజేషన్‌లో జరిగిన లోపాల వల్లే బాధి తులు ఇన్ఫెక్షన్కు గురైనట్లు ప్రాథమికంగా భావి స్తున్నామని తెలిపారు. ప్రభుత్వ అనుమతితో ఆ నివేదికను మీడియాకు సైతం ఇస్తామన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా చర్య లు తీసుకోవాలని ప్రభుత్వం కుటుంబ సంక్షేమ కమిషనర్‌ను ఆదేశించిందన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్యాంపులో చికిత్స చేయించు కున్న మిగతా వారిని నిమ్స్, అపోలో ఆస్పత్రులకు తరలించి ఉచితంగా చికిత్స అందిస్తున్నట్లు వివ రించారు. వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా అక్కడ వైద్యాధికారులను నియమించిందని, చికిత్స పొందుతున్న వారంతా ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉండగా, ఇప్పటికే 12 మందిని డిశ్చార్జ్ చేశామని వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో మిగతావారిని కూడా డిశ్చార్జ్ చేస్తామని శ్రీనివాసరావు తెలిపారు. -
ఆ కేసుల్లో ఫోరెన్సిక్ దర్యాప్తు తప్పనిసరి
గాంధీనగర్: దేశంలో నేర న్యాయ వ్యవస్థను, ఫోరెన్సిక్ సైన్స్ దర్యాప్తును మిళితం చేయాలని భావిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల కంటే అధికంగా మన దేశంలో నేర నిరూపణల శాతాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆరేళ్లకుపైగా జైలుశిక్ష పడేందుకు అవకాశం ఉన్న కేసుల్లో ఫోరెన్సిక్ దర్యాప్తును తప్పనిసరి, చట్టబద్ధం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. అమిత్ షా ఆదివారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ(ఎన్ఎఫ్ఎస్యూ) మొదటి స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రతిజిల్లాలో ఫోరెన్సిక్ మొబైల్ దర్యాప్తు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. ఫోరెన్సిక్ దర్యాప్తు స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ), ఎవిడెన్స్ యాక్ట్‌లో మార్పులు తీసుకురానున్నట్లు వెల్లడించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ చట్టాలను ఎవరూ భారతీయ దృష్టికోణంలో చూడడం లేదన్నారు. -
మౌనిక ఆత్మహత్య కేసు: ఫోరెన్సిక్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ఎంటెక్ నానోసైన్స్ రెండో సంవత్సరం చదువుతున్న ఆర్.మౌనిక(27) గత నెల 22న ఆత్మహత్య చేసుకునేందుకు కారణం ఏంటనే విషయాన్ని లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు కీలక సమాచారం లభ్యమైనట్లు తెలిసింది. హాస్టల్లోని ఆమె గదిలోంచి స్వా«దీనం చేసుకున్న సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)కు పంపిన పోలీసులకు.. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్‌లో విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఆమె సెల్‌ఫోన్ నుంచి బట్టబయలైన పర్సనల్ చాటింగ్‌తో పాటు పలువురు సన్నిహిత స్నేహితులను విచారించిన పోలీసులు.. మౌనిక ఆత్మహత్యకు సంబంధించిన కీలక సమాచారాన్ని గుర్తించినట్లు తెలిసింది. రెండు మూడు రోజుల్లో మృతురాలి తల్లిదండ్రులతో నిర్ధారించుకున్న తర్వాత.. పూర్తి వివరాలను మీడియాకు వివరిస్తామని ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. చదవండి: మ్మల్ని సాదుతానని మధ్యలోనే వెళ్లిపోయింది ఐటీ ‘రిటర్న్స్’నూ మళ్లించేశారు..! -
సుశాంత్‌ది ఆత్మహత్యే: ఎయిమ్స్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ మెడికల్ బోర్డ్ స్పష్టతనిచ్చింది. ఆయన ఉరివేసుకోవడం వల్లే మరణిం చారని, హత్య కాదని ఎయిమ్స్ ఫోరెన్సిక్ వైద్యుల బృందం ధృవీకరించింది. సుశాంత్ మృతికి విషప్రయోగం, లేదా గొంతు నులిమి చంపడం కారణమన్న వాదనని, ఆరుగురు సభ్యుల ఫోరెన్సిక్ వైద్యుల బృందం తోసిపుచ్చింది. ఇది కచ్చితంగా ఆత్మహత్యేనంటూ తమ నివేదికను సీబీఐకి అందజేసినట్లు ఎయిమ్స్ ఫోరెన్సిక్ చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా చెప్పారు. ఇదే తమ బృందం ఇచ్చే చివరి నివేదిక అని పేర్కొన్నారు. ఉరివేసుకోవడం వల్ల గొంతు దగ్గర రాపిడి తప్ప, సుశాంత్ శరీరంపై గాయాలు లేవని, పెనుగులాటకు సంబంధించిన గుర్తులు లేవని ఫోరెన్సిక్ మెడికల్ బోర్డ్ ఛైర్మన్ గుప్తా వెల్లడించారు. -
అత్యాచారం జరగలేదు
లక్నో: హాథ్రస్ బాధిత యువతిపై అత్యాచారం జరగలేదని యూపీ పోలీసులు ప్రకటించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలో కూడా అదే విషయం స్పష్టమైందని గురువారం యూపీ ఏడీజీ(శాంతి భద్రతలు) ప్రశాంత్ కుమార్ తెలిపారు. మెడపై అయిన తీవ్రస్థాయి గాయం కారణంగా ఆమె చనిపోయిందన్నారు. ‘ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. అత్యాచారం కానీ, గ్యాంగ్ రేప్ కానీ జరగలేదని అందులో స్పష్టంగా ఉంది’ అన్నారు. ‘చనిపోకముందు, పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలోనూ.. నిందితులు తనను కొట్టారనే బాధితురాలు చెప్పింది కానీ, అత్యాచారం చేసినట్లు చెప్పలేదు’ అని వివరించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారన్నారు. అయితే, నలుగురు నిందితులు సందీప్, రాము, లవ్‌కుశ్, రవి తనను గ్యాంగ్ రేప్ చేశారని బాధిత యువతి వాంగ్మూలం ఇచ్చినట్లు గతంలో ఎస్పీ విక్రాంత్ వీర్ వెల్లడించడం గమనార్హం. వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో తన మెడను గట్టిగా నులిమారని, ఆ సమయంలో తన నాలుక తెగిపోయిందని ఆమె వివరించినట్లు ఎస్పీ చెప్పారు. కలెక్టర్ బెదిరింపు బాధితురాలి తండ్రిని హాథ్రస్ జిల్లా కలెక్టర్ బెదిరిస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ‘మీడియా వాళ్లలో సగం మంది ఈరోజు వెళ్లి పోయారు. మిగతా సగం రేపు వెళ్లిపోతారు. ఇక్కడ స్థానికంగా మీతో ఉండేది మేమే. నీ స్టేట్మెంట్ను మారుస్తావా?లేదా? అనేది నువ్వే ఆలోచించుకుని నిర్ణయించుకో’ అంటూ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ బాధితురాలి తండ్రితో బెదిరింపు స్వరంతో చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు ప్రవీణ్ కుమార్ బదులివ్వలేదు. ఈ ఘటన విషయంలో అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అధికారులు చెప్పినట్లు వినకపోతే, సమస్యలు ఎదుర్కొంటారని జాయింట్ కలెక్టర్ కూడా బాధితురాలి కుటుంబ సభ్యులను బెదిరించినట్లు స్థానికులు వెల్లడించారు. ఒత్తిడి చేస్తున్నారు తన స్టేట్మెంట్ను మార్చుకోవాలని అధికారులు, పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలి తండ్రి పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌కు బలవంతంగా తీసుకువెళ్లి, తనతో పాటు తన కుటుంబ సభ్యులతో కొన్ని కాగితాలపై సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. తన కూతురి హత్యాచారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. యూపీలో మరో కిరాతకం బలరాంపూర్: యూపీలోని బలరాంపూర్ జిల్లాలో 22 ఏళ్ల మరో దళిత యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందగా, బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. యువతిపై అత్యాచారం ఘటనలో షాహిద్, సాహిల్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. దుండగుల దాడిలో తన కుమార్తె కాళ్లు, వెన్నెముక విరిగిపోయాయని బాధితురాలి తల్లి తెలిపారు. మంగళవారం కాలేజీలో ప్రవేశం కోసం వెళ్లివస్తున్న తన బిడ్డను నలుగురు వ్యక్తులు అపహరించారని, మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, దురాగతానికి పాల్పడ్డారని, తర్వాత రిక్షాలో తీసుకొచ్చి, తమ ఇంటి ముందు పడేశారని పేర్కొన్నారు. బాధితురాలి కాళ్లు, వెన్నుముక విరిగినట్లు పోస్టుమార్టంలో బయట పడలేదని జిల్లా ఎస్పీ దేవ్‌రంజన్ అన్నారు. -
హత్రాస్ బాధితురాలిపై రేప్ జరగలేదు..
-
హత్రాస్ బాధితురాలిపై రేప్ జరగలేదు..
లక్నో: దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగిలించిన హత్రాస్ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోస్టు మార్టం నివేదిక విడుదలయ్యింది. ఇక ఫోరెన్సిక్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఈ నివేదిక వెల్లడించడం గమనార్హం. గత నెల 14న పొలంలో పని చేస్తున్న యువతిపై నలుగురు మృగాళ్లు పాశవీకంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో రెండు వారాల పాటు మృత్యువుతో పొరాడుతూ మరణించింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ఏడీజీ లా అండ్ ఆర్డర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఫోరెన్సిక్ నివేదికలో వీర్యం కనుగొనడబలేదు. బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇప్పటికే స్పష్టం చేసింది. దీన్ని బట్టి రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి తప్పుడు సమాచారం ప్రచారం చేశారని స్పష్టం అవుతోంది. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం’ అన్నారు. (చదవండి: బాధితురాలిని చిత్రహింసలకు గురిచేశారు..) అలానే గురువారం నాడు బాధితురాలికి సంబంధించి ఓ వీడియో విడుదలయ్యిందని.. ఆమె నాలుక కత్తిరించబడలేదని దీనిలో స్పష్టంగా తెలుస్తుందన్నారు ప్రశాంత్ కుమార్. ఓ వైపు బాధితురాలిపై గ్యాంగ్‌రేప్ జరిగిందంటూ ప్రచారం జరుగుతుండగా.. ఏడీజీ ఈ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఇక పోస్టు మార్టం నివేదికలో యువతి ఒంటిపై తీవ్రమైన గాయాలున్నట్లు మాత్రమే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక మరోవైపు ఈ ఘటనను ప్రతిపక్షాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు గురువారం మధ్యాహ్నం పాదయాత్రగా వెళుతున్న కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగ్రనేతల అరెస్ట్‌తో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. -
శ్రీశైలం ఘటనపై ఫోరెన్సిక్ నివేదిక సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: తొమ్మిది మందిని బలి తీసుకున్న శ్రీశైలం పవర్ ప్లాంట్ దుర్ఘటన విచారణలో మరో ముందడుగు పడింది. ఈ కేసును సీఎం ఆదేశాలతో సీఐడీ చీఫ్ ఏడీజీ గోవింద్ సింగ్ స్వయంగా విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు సీఐడీ ప్రత్యేక బృందాలు ఘటనాస్థలాన్ని సందర్శించారు. ఈ కేసులో కీలకంగా మారిన ఫోరెన్సిక్ నివేదిక సిద్ధమైనట్లుగా సమాచారం. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం దుర్ఘటనకు అసలు కారణాలేమై ఉంటాయన్న విషయంలో సీఐడీ నిర్ధారణకు రానుంది. ఈ కేసులో మొదటి నుంచి కుట్ర కోణంపై ఎలాంటి ఆధారాలు లేవు. ఇది మానవ తప్పిదమా..? సాంకేతిక లోపమా? అన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటనా స్థలంలో పర్యటించిన సమయంలో ఫోరెన్సిక్ విభాగ నిపుణులు పలు కీలక ఆధారాలు సేకరించారు. వాటిని పూర్తిగా విశ్లేషించిన అనంతరం నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. సీఐడీ తాను దర్యాప్తులో సేకరించిన అంశాలు, ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడైన సాంకేతిక అంశాలను ఆధారంగా ప్రాథమిక నివేదిక సిద్ధం చేయనుంది. మరోవైపు ఈ కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరో నిపుణుల కమిటీ కూడా తన పనిని వేగవంతం చేసింది. -
సుశాంత్ కేసు : ఫోరెన్సిక్ నివేదికలో కీలక విషయాలు
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని ఫోరెన్సిక్ పరీక్షల తుది నివేదికలు పేర్కొన్నాయి. టాక్సికాలజీ, గోళ్ల నమూనాలు వంటి పలు రిపోర్ట్స్‌తో పాటు ఫోరెన్సిక్ తుది నివేదికలను ముంబై పోలీసులు మంగళవారం సుప్రీంకోర్టుకు సమర్పించారు. సుశాంత్‌పై విషప్రయోగం జరగలేదని సుశాంత్ సైతం తనకు తానుగా విషం సేవించలేదని ఈ నివేదికలు స్పష్టం చేశాయి. సుశాంత్ మరణించే క్రమంలో ఎలాంటి పెనుగులాట జరగలేదని గోళ్ల నమూనా నివేదిక పేర్కొంది. సుశాంత్‌కు ఎలాంటి గాయం కాలేదని కూడా ఈ నివేదికల్లో స్పష్టమైంది. ఇక జులై 27న ముంబై పోలీసులకు అందిన సుశాంత్ కీలక అవయవాల నివేదిక (విసెరా రిపోర్ట్) కూడా ఆయన మరణంలో ఎలాంటి అనుమానాస్పద కోణం లేదని తోసిపుచ్చింది. పోస్ట్‌మార్టం నివేదిక సైతం సుశాంత్ ఉరివేసుకోవడంతో ఊపిరాడక మరణించారని పేర్కొన్న సంగతి తెలిసిందే. సుశాంత్ మృతిపై ముంబై పోలీసులు ఫోరెన్సిక్ బృందం సభ్యులను విచారించారు. ఫోరెన్సిక్ బృందంతో మాట్లాడిన అనంతరం ఈ కేసులో ఎలాంటి సంచలన విషయాలనూ ముంబై పోలీసులు గుర్తించలేదు. కాగా జూన్ 14న సుశాంత్ ముంబైలోని బాంద్రా నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. సుశాంత్ మృతి కేసుపై ప్రస్తుతం సీబీఐ విచారణ సాగుతోంది. చదవండి : అన్ని విషయాల్లో రియాదే నిర్ణయం -
కన్నా కోడలి మృతిపై వీడని గుట్టు
సాక్షి,హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో మరణించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు నల్లపురెడ్డి సుహారిక(38) మృతి ఘటనలో అసలు ఏం జరిగిందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. సుహారిక మృతిలో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. దీంతో ఆ నివేదిక వచ్చిన తర్వాతే ఈ కేసు విచారణలో స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. నివేదిక వచ్చిన తర్వాతే పోలీసులు సుహారిక నివాసంతో పాటు, ఆమె పార్టీకి వెళ్లిన స్నేహితుల ఇళ్ల పరిశీలనతోపాటుగా పలువురిని ప్రశ్నించనున్నారు. (కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద మృతి) సుహారిక వయస్సు చిన్నదే కావటం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలేమీ లేకపోయినా ఆమెకు గుండెపోటుకు దారితీసిన కారణాలపై పోలీసు విచారణ కొనసాగనుంది. అయితే, ఉస్మానియా ఆస్పత్రి సూపరిండెంట్ రఫీ మీడియాతో మాట్లాడుతూ.. సుహారిక మరణానికి గుండెపోటు కారణమని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా, జూబ్లిహిల్స్‌లోని మహా ప్రస్థానంలో కన్నా కుటుంబసభ్యుల సమక్షంలో సుహారిక అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలోని వైద్య బృందం సుహారిక భౌతికకాయానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. -
గొర్రెకుంట మృతుల కేసులో వీడని మిస్టరీ
-
గొర్రెకుంట మృతుల కేసులో కొత్త ట్విస్ట్..
సాక్షి, వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన తొమ్మిది మంది వలస కార్మికులది హత్యా.. ఆత్మహత్యా.. ఒకవేళ హత్యకు గురైతే చంపిందెవరు.. ఆత్మహత్యకు పాల్పడితే అందుకు కారణమేమిటి.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు, ఇద్దరు బీహార్ కార్మికులు, ఓ డ్రైవర్ సహా మొత్తం తొమ్మిది మంది మృతి వెనుక అసలు విషయమేమిటి... ఇలా అనేక సందేహాలకు ఇంకా సమాధానాలు దొరకలేదు. అయితే బావిలో నీరు ఊపిరితిత్తుల్లో చేరడం వల్లే వీరంతా మృతి చెందినట్లు ఫోరెన్సిక్ వైద్యులు తేల్చారు. ఏడు మృతదేహాల్లో పాయిజన్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో విష ప్రయోగం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. (పోలీసుల అదుపులో యాకూబ్.. సెల్ఫోన్లు ఎక్కడ?) కాగా వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలోని ఓ పాడుపడిన బావిలో తొమ్మిది మంది మృతి చెందిన దుర్ఘటనపై విచారణ ఇంకా కొలిక్కి రాని విషయం తెలిసిందే. పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించిన విధంగా సంచలనం కలిగించిన ఈ ఘటనపై ఏడు ప్రత్యేక పోలీసు దర్యాప్తు బృందాల(సిట్) పరిశోధన ఇంకా కొనసాగుతోంది. రాష్ట్రంలో సంచలనం కలిగించిన ఈ ఘటన వరంగల్ పోలీసులకు సవాల్‌గా మారగా, త్వరలోనే ఆ తొమ్మిది మంది కార్మికుల మృతిపై మిస్టరీ వీడనుందని అంటున్నారు. పోలీసుల అదుపులో కీలక వ్యక్తులు అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు కొద్దిపాటి పురోగతి సాధించారు. ఇప్పటికే మహ్మద్ మక్సూద్ ఆలం కూతురు బుష్రా ఖాటూన్ ప్రియుడు యాకూబ్‌తో పాటు బీహార్‌కు చెందిన కార్మికులు సంజయ్ కుమార్ యాదవ్, మంకుషా లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వరంగల్‌కు చెందిన మరో ఇద్దరిని శనివారం పట్టుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. వరంగల్‌కు చెందిన ఆ ఇద్దరి వద్ద నుంచే మృతులలో ఇద్దరికి చెందిన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ రెండు సెల్ఫోన్లు తొమ్మది మంది మృతి చెందిన బావి సమీపంలో దొరికినట్లు ఆ ఇద్దరు వెల్లడించినట్లు తెలిసింది. సెల్ఫోన్లు చేజిక్కించుకున్న పోలీసులు ఆ ఇద్దరిని కూడా విచారిస్తున్నట్లు సమాచారం. (చనిపోయారా.. చంపేశారా?) కాగా ఆ రెండు సెల్ఫోన్లలో ఒకటి మక్సూద్ ఆలంకు చెందినది కాగా, మరోటి ఆయన కూతురు బుష్రా ఖాతూన్‌గా ప్రచారం ఉంది. ఆ రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్న ‘సిట్’, అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ ఫోన్‌కాల్స్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్లు తెలిసింది. బుధవారం రాత్రి 6 గంటల తరువాత మక్సూద్ వీరితో ఫోన్లో మాట్లాడాడు. పోలీసులు బీహారీ యువకులను సంఘటనా స్థలానికి తీసుకువచ్చి మరోసారి విచారణ చేపట్టారు. దీంతో ఈ కేసులో మంకుషా వాంగ్మూలం కీలకంగా మారింది. ఫోరెన్సిక్, నిఘావర్గాల ఆరా... గీసుకొండ మండలం గొర్రెకుంట సంఘటనపై ఫోరెన్సిక్, కేంద్ర, రాష్ట్ర ఇంటలిజెన్స్ వర్గాలు ఆరా తీశారు. తొమ్మిది మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్ నిపుణులు డాక్టర్ రజామాలిక్ బృందం, వారి మృతికి కారణమైన బావిని పరిశీలించింది. బార్దాన్ సంచుల గోదాము, ఆ గోదాం ఆవరణలో వారు నివాసం ఉండే క్వార్టర్లను కూడా వారు పరిశీలించారు. పాడు పడిన వ్యవసాయ బావిలో తొమ్మిది మంది మృతదేహాలు తేలిన ఘటనపై నివేదిక పంపేందుకు కేంద్ర, రాష్ట్ర నిఘావర్గాల అధికారులు సైతం సందర్శించారు. (గొర్రెకుంట: ప్రాణాలతో వుండగానే బావిలో...) సెంట్రల్ ఇంటలిజెన్స్ ఎస్పీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వ రీజనల్ ఇంటలిజెన్స్ అధికారులు వేర్వేరుగా పరిశీలించి వివరాలపై ఆరా తీశారు. ఇదిలా వుండగా ఈ ఘటనపై కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకుని రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్న ‘సిట్’ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అందులో ఇద్దరినీ శనివారం ఉదయం గొర్రెకుంటలోని 9 మంది మృతి చెందిన బావి వద్దకు తీసుకు వచ్చి పలు కోణాల్లో పరిశోధన జరిపారు. సంజయ్‌కుమార్ యాదవ్, మంకుషాలను సంఘటన వద్దకు తీసుకు వచ్చిన పోలీసులు ‘సీన్ రీ కన్స్ట్రక్షన్’ తరహాలో ఆరా తీశారు. కాగా పోలీసుల ఇన్వెస్టిగేషన్‌కు సెల్‌ఫోన్ సంభాషణలు, కాల్‌డేటా కీలకంగా మారాయి. ఫోన్ కాల్స్ వివరాలు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో మహ్మద్ మక్సూద్ తనయ బుష్రా ఖాతూన్, ఆమెతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తోన్న యాకూబ్ ఫోన్ కాల్స్‌తోపాటు ఇతరులతో మక్సూద్ ఏం మాట్లాడనే విషయాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. -
నిమ్మగడ్డ లేఖ ఎస్ఈసీ ఆఫీస్‌లో తయారు కాలేదు
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ లేఖకు సంబంధించి వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే ఈ లేఖకు సంబంధించి సీఐడీ అధికారులు అనేక విషయాలను రాబట్టారు. తాజాగా ఆ లేఖ ఎస్ఈసీ ఆఫీస్‌లో తయారుకాలేదని నిర్దారణ అయింది. ల్యాప్ టాప్, డెస్క్ టాప్‌లను పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణలు.. ఆ లేఖ ఎస్ఈసీ కార్యాలయంలో తయారు కాలేదని తేల్చారు. ఈ మేరకు సీఐడీ అధికారుల చేతికి ఫోరెన్సిక నివేదిక అందింది. (చదవండి : రమేష్ కుమార్ లేఖను లెక్కతేల్చే పనిలో సీఐడీ) ఇందుకు సంబంధించి సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ మాట్లాడుతూ.. రమేష్ కుమార్ పీఏ సాంబమూర్తి అన్ని అసత్యాలే చెప్పారని అన్నారు. ఆ లేఖను ముందుగానే తయారుచేశారని.. అది బయటి నుంచి వచ్చిందని తెలిపారు. మార్చి 18వ తేదీ ఉదయం పెన్‌డ్రైవ్‌లో ఆ లేఖ రమేష్ కుమార్ వద్దకు చేరిందన్నారు. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందో త్వరలోనే తేలుస్తామని చెప్పారు. కాగా, రమేశ్ కుమార్ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాసిన లేఖపై తొలి నుంచి అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. రాజకీయ దురుద్దేశంతో ఈ లేఖను టీడీపీ కార్యాలయంలో తయారైందని, ఆ లేఖలో ఉన్నది పోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీసీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను రమేష్ కుమార్ లేఖపై విచారణ చేపట్టాలని కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ సందర్భంగా రమేశ్ కుమార్ చేసిన సంతకానికి, కేంద్ర హోంశాఖకు లేఖలో ఉన్న సంతకానికి అసలు పొంతన లేదని విజయసాయిరెడ్డి అన్నారు. (చదవండి : నిమ్మగడ్డ నిర్ణయం ఏకపక్షం) -
‘కథువా’ కేసు; సంచలన ఆధారాలు
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కలిచివేసిన కథువా బాలిక హత్యాచారానికి సంబంధించి బలమైన ఆధారాలు లభ్యమయ్యాయి. చిన్నారి శరీర భాగాలు, దుస్తుల నుంచి సేకరించిన రక్త నమూనాలు, నిందితుల డీఎన్ఏతో సరితూగాయని ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్(డీఎఫ్ఎల్) నివేదికలో వెల్లడైనట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పేర్కొంది. దీంతో చార్జిషీట్లో పేర్కొన్న ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లైందని, కోర్టు విచారణలోనూ ఇవే అంశాలు కీలకం కానున్నాయని సిట్ అధికారులు అన్నారు. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 28న జరగనుంది. చిన్నారిపై అకృత్యం జరిగింది ఆలయంలోనే!: కథువా ఉదంతంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన వేళ ఘటన జరిగిన ప్రదేశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ‘జరిగింది ఆలయంలో కాదంటూ’ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంకూడా సాగింది. అయితే ప్రాధమిక దశలోనే ఆలయం నుంచి సేకరించిన రక్తనమూనాలు, వెంట్రుకలు.. ఇటీవల అరెస్టైన నిందితుల డీఎన్ఏతో సరితూగాయని ఫోనెన్సిక్ నివేదికలో తేలింది. హత్య తర్వాత దుస్తులు ఉతికారు!: రోజుల పాటు చిన్నారికి నరకం చూపించి, హత్యచేసిన తర్వాత సంబంధిత ఆధారాలను చెరిపేసేందుకు నిందితులు యత్నించారు. ‘హత్య తర్వాత బాధితురాలి దుస్తులు ఉతికారు, తల నుంచి పాదాల దాకా తుడిచేశారు. దీంతో ఆధారాలను నిర్ధారించడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆలయంలో లభించిన రక్తనమూనాలు, వెంటుక్రలు ఎవరివనేవి తేల్చలేకపోయాం. ఆ తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ (డీఎఫ్ఎల్) సహాయాన్ని తీసుకున్నాం. అత్యాధునిక విశ్లేషణా పద్ధతులను అవలంబించే డీఎఫ్ఎల్.. మృతురాలి శరీరభాగాలు, ఒంటిపై లభించిన రక్తపు నమూనాలను విశ్లేషించి, వాటిని నిందితుల డీఎన్ఏతో సరిపోల్చగా దాదాపు ఖచ్చితమైన ఆధారాలు లభించినట్లైంది’’ అని సిట్ అధికారులు పేర్కొన్నారు. కథువా నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దేశంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కూడా నిరసనలు జరిగాయి. -
ఇంతకీ చర్మం పులిదా.. కుక్కదా?
లక్సెట్టిపేట(మంచిర్యాల): పులిచర్మంగా రాష్ట్రంలో హల్చల్ రేపిన పులిచర్మం కథ ఇప్పటికీ సుఖాంతం కాలేదు. కుక్క చర్మానికి రంగులు దిద్ది పులిచర్మంగా అమ్ముతున్నారని భావించిన కథ ఇంకా ముగియలేదు. ఒక వేళ అది కుక్క చర్మం అయినట్లైతే పోలీసులు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు అవుతుందని పలువురు అనుకుంటున్నారు. కుక్క చర్మంతో వ్యాపారం చేస్తు పోలీసులకే పంగనామాలు పెట్టినట్లు అవుతుందని పలువురు భావిస్తున్నారు. ఫొరెనిక్స్ రిపోర్టు రాలేదని వచ్చేదాకా ఎటూ తేల్చేది లేదని పోలీసులు తెలుపుతున్నారు. పులిచర్మంగా మొదట వెల్లడి మండలంలో ఈనెల 4న స్థానిక పోలీసులు కౌటాల మండలం తాటినగర్ గ్రామానికి చెందిన శ్యాంరావు అనే వ్యక్తి పులి చర్మం తరిలిస్తున్నాడని తెలిసి స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద సీఐ శ్రీనివాస్, ఎస్సై మధుసూదన్‌రావు నిందితులను అదుపులోకి తీసుకుని మీడియాకు వెల్లడించారు. ఆ తర్వాత నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అది పులి చర్మం కాదు కుక్క చర్మం అని సోషల్ మీడియాలో పోస్టులు, సంబంధిత ఫారెస్టు అధికారులు పులిచర్మం కాదని చెప్పడంతో అనుమానంతో పోలీసులు అవాక్కయ్యారు. దీంతో పులిచర్మంగా భావిస్తున చర్మాన్ని హైద్రాబాద్‌లోని ల్యాకోన్స్ ల్యాబోరేటరీకి తరలించారు. పది రోజులు గడిచినా రిపోర్టు రాకపోవడంతో పులిచర్మం కథ ఇంకా సుఖాంతం కాలేదు. కుక్కను చంపి పులి చర్మంగా తయారు చేయడానికి హెయిర్ డై వంటి రంగులు వాడి పులి చర్మంగా పెద్ద ఎత్తున్న చీకటి వ్యాపారం సాగుతున్నట్లు బహిర్గతమవుతోంది. దీనిపై పోలీసులు నిఘా పెడితే అసలు వ్యాపారం బట్టబయలవుతుందని ఎందుకు దీనిపై పోలీసులు దృష్టిపెట్టలేదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుక్క అయితే మాత్రం చంపి దానికి రంగులు పూసి వ్యాపారం చేసే అధికార ం లేదని అటువంటి వారిని కఠినంగా శిక్షించాలని పెట్ యానిమల్స్ వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. నివేదిక కోసం ఎదురుచూపులు పులిచర్మంగా భావిస్తున్న చర్మాన్ని హైద్రాబాద్‌లోని ల్యాబోరేటరీకి పంపినట్లు పోలీసులు తెలుపుతున్నారు. చర్మం పులిదా కుక్కదా అని తేల్చేందుకు ఇంత సమయం పడుతుందా పది రోజులైన ఇంకా రిపోర్టు రాకపోవడం ఏంటి అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అది పక్కాగా కుక్క చర్మమే అని ఫారెస్టు అధికారులు ముందే కొట్టిపారేస్తున్నారు. పోలీసులు తొందరపడి పులిచర్మంగా మీడియాకు తెలియపర్చారని దీంతో ఫారెస్ట్ ఇమేజ్ డ్యామేజ్ అయినట్లుగా ఫారెస్టు అధికారులు భావిస్తున్నారు. కుక్కదా పులిదా పోలీసులే తేల్చి చెప్పాలని రిపోర్టు ఎలా వస్తుందని పోలీసులు ఏం చెప్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారు. -
రెండోసారి ఫోరెన్సిక్ నివేదిక కోరిన పబ్లిక్ ప్రాసిక్యూటర్
-
ప్రాసిక్యూషన్ ఎందుకు?
పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం.. శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబైకి తరలించేందుకు క్లియరెన్స్ వచ్చిందని యూఏఈలో భారత రాయబారి నవ్‌దీప్ సింగ్ సూరీ తెలిపారు. ఇందుకు దుబాయ్ అధికారులు అంగీకరించారని దుబాయ్‌లోని భారతమీడియాకు ఆయన ప్రకటించారు. అయితే కాసేపటికే పరిస్థితి మారిపోయింది. భారత మీడియాలో వార్తపై గల్ఫ్ న్యూస్ సూరీని సంప్రదించింది. అయితే.. పోస్టుమార్టం నివేదిక వచ్చినపుడున్న పరిస్థితుల ప్రకారం మృతదేహం తరలింపులో ఇక ఆలస్యం లేదన్నానని.. అయితే పోస్టు మార్టం నివేదిక వెల్లడవటం, అందులో శ్రీదేవి నీట మునిగి చనిపోయారని తెలియటంతో కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేశారని సూరీ తెలిపారు. దీని కారణంగా భౌతికకాయం తరలింపు మరింత ఆలస్యం కావొచ్చని ఆయన స్పష్టం చేశారు. దుబాయ్ అధికారులతో భారత దౌత్యకార్యాలయం నిరంతరం చర్చలు జరుపుతోందని.. వీలైనంత త్వరగా క్లియరెన్స్ సంపాది స్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో ముంబైలో ఆమెను కడసారి చూసేందుకు ఎదురు చూస్తున్న వారు మరో రోజు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అంటే? దుబాయ్ చట్టాల ప్రకారం ఆసుపత్రి బయట ఎవరు చని పోయినా.. తప్పనిసరిగా పోస్టుమార్టం చేయటంతో పాటు ఫొరెన్సిక్ పరీక్షలు నిర్వహించటం తప్పనిసరి. ఇందులో భాగంగానే శ్రీదేవి హోటల్ గదిలో మృతిచెందిన తర్వాత ఈ తంతు యథావిధిగానే కొనసాగింది. అయితే నివేదికలో అనుమానాస్పదంగా నీటమునిగి చనిపోయినట్లు వెల్లడవ టంతో విచారణ ముమ్మరం చేయటంతోపాటు కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించారు. ‘ఇలాంటి అనుకో కుండా మృతిచెందే కేసుల్లో పోస్టుమార్టం నివేదిక, ఫొరెన్సిక్ రిపోర్టులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేయటం సహజమే. ఇదంతా సాధారణ న్యాయ విధివిధానాల్లో భాగమే. ఈ రెండు రిపోర్టులను ప్రాసిక్యూటర్లు సమీక్షిస్తారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులకు భౌతిక కాయాన్ని అప్పజెబుతారు. అయితే.. కేసుల్లో ఏదైనా అనుమానాస్పదంగా ఉందని అనిపిస్తే ప్రాసిక్యూటర్లు విస్తృతమైన విచారణ జరుపుతారు. తదనుగుణంగా తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటారు’ అని చీఫ్ ప్రాసిక్యూటర్‌ను ఉటంకిస్తూ గల్ఫ్ న్యూస్ పేర్కొంది. వివరాలు సేకరిస్తున్నాం: దుబాయ్ పోలీసులు ప్రాథమిక విచారణ ప్రకారం శ్రీదేవి స్పృహకోల్పోయిన అనంతరం స్నానపుతొట్టిలో పడి చనిపోయారని దుబాయ్ పోలీసులు తెలిపారు. దీంతోపాటు ఫొరెన్సిక్ రిపోర్టులో.. శ్రీదేవి రక్తంలో మద్యం ఆనవాళ్లు ఉన్నాయన్నారు. ‘ఘటన జరిగిన క్రమంపై విచారణ కొనసాగుతోంది. ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో నీటమునిగి చనిపోయారంటూ ఫొరెన్సిక్ నివేదికలో తేలింది. అలాగే.. ఘటనకు ముందు గదిలో ఏం జరిగిందనే దానిపై వివరాలు సేకరిస్తున్నాం’ అని దుబాయ్ పోలీసులు చెప్పినట్లు గల్ఫ్ న్యూస్ పేర్కొంది. ప్రమాదం ఎలా జరిగింది? అంతకు ముందు శ్రీదేవితో ఎవరెవరున్నారు? తదితర అంశాలపై కూపీలాగుతున్నారు. స్తంభించిన బాలీవుడ్ శ్రీదేవి హఠాన్మరణంతో షాక్‌కు గురైన బాలీవుడ్ ఇంకా తేరుకోలేదు. నిత్యం ఏదో ఒక షూటింగ్‌తో బిజీగా ఉండే ముంబైలోని స్టూడియోలు రెండ్రోజులుగా తోటి నటీనటుల మౌనరోదనకు సాక్ష్యాలుగా నిలిచాయి. తోటి నటి ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేక.. చిత్రీకరణలో ఉన్న బాలీవుడ్ సినిమాల షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చారు. దీంతోపాటుగా హోలీ సందర్భంగా జరిగే పలు ప్రత్యేక కార్యక్రమాలను కూడా రద్దుచేసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏడాది ఘనంగా హోలీ పార్టీని ఏర్పాటుచేసే షబానా అజ్మీ, జావెద్ అక్తర్ దంపతులు.. శ్రీదేవి మృతి నేపథ్యంలో ఈసారి వేడుకలను రద్దుచేసుకుంటున్నట్లు ప్రకటించారు. మరోవైపు, దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ కూడా తన తదుపరి చిత్రం పేరు, పోస్టర్ విడుదలను వాయిదా వేసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అటు ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న 102 నాటౌట్ సినిమా పాట చిత్రీకరణ కూడా రద్దయింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రుషి కపూర్ నటిస్తున్నారు. శ్రీదేవి మృతికి గౌరవసూచకంగా షూటింగ్ వాయిదా వేసుకున్నట్లు చిత్ర దర్శకుడు వెల్లడించారు. అంత్యక్రియలకు తరలిరానున్న సినీలోకం ముంబైలోని శాంతాక్రజ్ శ్మశానవాటికలో జరగనున్న శ్రీదేవి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పెద్ద సంఖ్యలో సినీ ప్రముఖులు తరలివెళ్లనున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటీనటులంతా అనిల్ కపూర్ ఇంటికెళ్లి కపూర్ల కుటుంబానికి సంతాపం తెలిపారు. అక్కడే ఉన్న శ్రీదేవి కూతుళ్లు జాహ్నవి, ఖుషిలను పరామర్శిస్తున్నారు. దక్షిణ భారత సినీ ప్రముఖులు, పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా ముంబై వెళ్లనున్నారు. శ్రీదేవి వైన్ మాత్రమే తీసుకుంటారు శ్రీదేవి మద్యం మత్తులోనే అపస్మారక స్థితిలోకి వెళ్లి తర్వాత నీటమునిగి చనిపోయారంటూ వస్తున్న వార్తలపై సమాజ్‌వాదీ పార్టీ నేత అమర్ సింగ్ స్పందించారు. నటి కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుంటూ.. ‘శ్రీదేవి హార్డ్ లిక్కర్ (బీర్, విస్కీ మొదలైనవి) తీసుకోరు. ఆమె వైన్ మాత్రమే తీసుకుంటారు. అది కూడా అప్పుడప్పుడే. నేను అబుదాబి షేక్ అల్ నహ్యన్తో మాట్లాడాను. అధికారిక తతంగమంతా త్వరగా పూర్తిచేసుకుని శ్రీదేవి భౌతిక కాయాన్ని వీలైనంత త్వరగా ముంబై పంపిస్తామని ఆయన భరోసా ఇచ్చారు’ అని అమర్ సింగ్ పేర్కొ న్నారు. అయితే శ్రీదేవితో సాన్నిహిత్యం ఉన్న మరికొందరు కూడా శ్రీదేవి ఈ స్థాయిలో మద్యం సేవించరని తెలిపారు. -
అత్యాచారం జరిగిన మాట నిజమే
వైద్య, ఫోరెన్సిక్ నివేదికలు రుజువు చేశాయని కోర్టుకు తెలియజేసిన పోలీసులు న్యూఢిల్లీ: ఉబర్ క్యాబ్‌లో బాధిత మహిళ అత్యాచారానికి గురైన మాట నిజమేనని, ఈ విషయాన్ని వైద్య, ఫోరెన్సిక్ నివేదికలు రుజువు చేశాయని పోలీసులు మంగళవారం కోర్టుకు తెలియజేశారు. అంతేకాకుండా బాధితురాలితో అసహజ శృంగారానికి పాల్పడేందుకు నిందితుడు యత్నించాడనే విషయం కూడా నిర్ధారణ అయిందని అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజాకు తెలియజేశారు. -
అనూహ్య హత్య కేసు
సాక్షి, ముంబై: అనూహ్య హత్య కేసులో పోలీసులకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. ఇది వస్తే అసలు హత్య ఎలా జరిగింది..? ఎప్పుడు జరిగింది..? దేనితో చేశారు..? మరోవైపు ఆ మృతదేహం అనూహ్యదేనా..? అనే తదితర ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. దీంతో పోలీసులు కూడా అనేక మంది అటో డ్రైవర్లతోపాటు రికార్డులో ఉన్న నేరస్తులను విచారించిన అనంతరం ఫోరెన్సిక్ నివేదిక కోసమే ఎదురుచూస్తున్నట్టుగా కన్పిస్తోంది. దీంతో ఈ నివేదికలో ఏమి ఉండనుందనే అంశంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. మరో రెండు మూడు రోజుల్లో.... పోలీసులతోపాటు అందరు ఎదురుచూస్తున్న ఫోరెన్సిక్ రిపోర్ట్ మరో రెండు మూడు రోజుల్లో వచ్చేఅవకాశాలున్నాయి. దీని గురించి ముంబై కలీనాలోని ‘ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీస్’ డెరైక్టర్ డాక్టర్ ఎంకె మాల్వే ‘సాక్షి’కి అందించిన వివరాల మేరకు ఫోరెన్సిక్ నివేదిక ఇంకా తయారుకాలేదు. మరో రెండు, మూడు రోజుల్లో నివేదిక అందే అవకాశముందని తెలిపారు. దర్యాప్తులో కనిపించని పురోగతి... నగరంలో హత్యకు గురైన ఎస్తేర్ అనూహ్య కేసులో పోలీసుల దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదు. ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించలేదు. మరోవైపు అదుపులోకి తీసుకున్నారని చెప్పిన నిందితులనుంచి కూడా పెద్దగా ఆధారాలేవీ లభించకపోవడంతోవారిని కూడా విడిచిపెట్టినట్టు సమాచారం. ఇప్పటివరకు అందిన వివరాల మేరకు ఇంకా ఎవరిని అరెస్టు చేయలేదు.