సాక్షి,హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో మరణించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు నల్లపురెడ్డి సుహారిక(38) మృతి ఘటనలో అసలు ఏం జరిగిందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. సుహారిక మృతిలో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. దీంతో ఆ నివేదిక వచ్చిన తర్వాతే ఈ కేసు విచారణలో స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. నివేదిక వచ్చిన తర్వాతే పోలీసులు సుహారిక నివాసంతో పాటు, ఆమె పార్టీకి వెళ్లిన స్నేహితుల ఇళ్ల పరిశీలనతోపాటుగా పలువురిని ప్రశ్నించనున్నారు. (కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద మృతి)
సుహారిక వయస్సు చిన్నదే కావటం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలేమీ లేకపోయినా ఆమెకు గుండెపోటుకు దారితీసిన కారణాలపై పోలీసు విచారణ కొనసాగనుంది. అయితే, ఉస్మానియా ఆస్పత్రి సూపరిండెంట్ రఫీ మీడియాతో మాట్లాడుతూ.. సుహారిక మరణానికి గుండెపోటు కారణమని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా, జూబ్లిహిల్స్‌లోని మహా ప్రస్థానంలో కన్నా కుటుంబసభ్యుల సమక్షంలో సుహారిక అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలోని వైద్య బృందం సుహారిక భౌతికకాయానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment