
సాక్షి, విశాఖపట్నం: లా విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దారుణానికి ఒడిగిట్టిన నలుగురు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
బుధవారం దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీజ్ చేసిన వారి ఫోన్‌లను ఫోరెన్సిక్ కి పంపించారు. బాధితురాలి నగ్నంగా ఉన్న వీడియోలని ఎవరికి పంపించారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.
దారుణ ఘటనలో ఏ2గా ఉన్న జగదీష్ తన ఫోన్‌లో ఉన్న బాధితురాలి నగ్న వీడియోల్ని రికార్డ్ చేసి ఏ1గా ఉన్న వంశీకి షేర్ చేశాడు. వంశీ ఏ3 ఆనంద్, ఏ4 రాజేష్‌కి పంపించాడు. అయితే, బాధితురాలి వీడియోలను ఈ నలుగురు ఇంకెవరికైనా పంపారా? అన్న కోణంలో ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ పరిశీలించిన అనంతరం రిపోర్ట్ ఇవ్వనుంది.

Comments
Please login to add a commentAdd a comment