law student
-
లా విద్యార్థినిపై దారుణం.. పోలీస్ కస్టడీకి నిందితులు?
సాక్షి, విశాఖపట్నం: లా విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దారుణానికి ఒడిగిట్టిన నలుగురు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.బుధవారం దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీజ్ చేసిన వారి ఫోన్లను ఫోరెన్సిక్ కి పంపించారు. బాధితురాలి నగ్నంగా ఉన్న వీడియోలని ఎవరికి పంపించారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. దారుణ ఘటనలో ఏ2గా ఉన్న జగదీష్ తన ఫోన్లో ఉన్న బాధితురాలి నగ్న వీడియోల్ని రికార్డ్ చేసి ఏ1గా ఉన్న వంశీకి షేర్ చేశాడు. వంశీ ఏ3 ఆనంద్, ఏ4 రాజేష్‌కి పంపించాడు. అయితే, బాధితురాలి వీడియోలను ఈ నలుగురు ఇంకెవరికైనా పంపారా? అన్న కోణంలో ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ పరిశీలించిన అనంతరం రిపోర్ట్ ఇవ్వనుంది. -
విశాఖపట్నంలో న్యాయ విద్యార్థిపై సామూహిక అత్యాచారం
-
విశాఖలో దారుణం.. లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైంది. విశాఖలో దారుణం జరిగింది. విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. న్యాయ విద్యార్థినిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని నగ్నంగా వీడియోలు తీసి నిందితులు బెదిరించారు.రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్షితో విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి మాట్లాడుతూ, ఈ కేసులో బాధితురాలికి నిందితులలో ఒకరికి రెండు నెలల నుంచి పరిచయం ఉందని.. విచారణ జరుగుతుందని తెలిపారు. -
గుండెపోటుతో డిగ్రీ విద్యార్థిని మృతి
ఉత్తరప్రదేశ్ లక్నోలో విషాదం చోటు చేసుకుంది. గుండె పోటుతో 19 ఏళ్ల విద్యార్థిని మరణించింది. అనికా రస్తోగి రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ విద్యార్థిని. హాస్టల్లో ఉండి చదువుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి హాస్టల్ రూమ్‌లో గుండెపోటుతో మరణించారు. ఆదివారం ఉదయం హాస్టల్ రూంలో నిద్రిస్తున్న అనికాతో మాట్లాడేందుకు ఆమె స్నేహితురాలు వెళ్లింది. అయితే ఆపస్మారక స్థితిలో ఉండడం గమనించింది. హుటాహుటీనా ఆస్పత్రికి తరలించింది. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె అప్పటికే మృతి చెందినట్లు పోటీసులు ప్రకటించారు.మూడవ సంవత్సరం బీఏ ఎల్ఎల్బీ చదువుతున్న రస్తోగి తండ్రి మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 1998 ఐపీఎస్ అధికారి సంజయ్ రస్తోగి. ప్రస్తుతం ఢిల్లీలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)లో ఇన్స్పెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె మరణించినట్లు సంజయ్ రస్తోగికి పోలీసులు సమాచారం అందించారు. -
హీరోయిన్‌తో అనుచిత ప్రవర్తన, విద్యార్థిపై సస్పెన్షన్ వేటు
అభిమానం శృతి మించితే మొదటికే మోసం వస్తుంది. ఇటీవల నటుడు అజిత్ అభిమానులు ఇద్దరు అత్యుత్సాహంతో ప్రాణాలను కోల్పోయారు. తాజాగా మరో అభిమాని భవిష్యత్తునే నాశనం చేసుకుంటున్నాడు. ఈ ఘటన కేరళలో జరిగింది. వివరాలు.. దక్షిణాదిలో క థానాయకిగా మంచి పేరు తెచ్చుకుంటున్న నటి అపర్ణ బాలమురళి. ఈ మలయాళీ కుట్టి 8 తూట్టాక్కల్ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని చిత్రాలు నటించినా, సూర్యతో జతకట్టిన సూరరై పోట్రు చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదేవిధంగా ఇటీవల అ శోక్ సెల్వన్ సరసన నటించిన నిత్తం ఒరు వానం చిత్రంలోని నటనకు మంచి ప్రశంసలను అందుకుంది. ఇలా త మిళం, మలయాళం భాషల్లో నటిస్తున్న అపర్ణ బాల ముర ళి తాజాగా నటించిన తంగం అనే మలయాళ చిత్రం ని ర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో అపర్ణ బాలమురళి పాల్గొంటుంది. అలా ఇటీవల కేరళ రాష్ట్రం, ఎర్నాకులంలోని లా కళాశాలలో జరిగిన చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది. అప్పుడు ఆ కళాశాల విద్యార్థి ఒకరు నటి అపర్ణ బాలమురళికి పుష్పగుత్తితో స్వాగతం పలికే క్రమంలో ఆమె భుజంపై చేయి వేశాడు. అతని ప్రవర్తనకు అపర్ణ బాలమురళి సిగ్గుతో పక్కకు జరిగింది. అనంతరం ఆ విద్యార్థి అనాగరిక చర్యకు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆ విద్యార్థి మీరంటే చాలా అభిమానం అని, అలాంటి అత్యుత్సాహంతోనే అలా ప్రవర్తించినట్లు సంజాయిషీ ఇచ్చుకుని క్షమాపణ కోరాడు. అయినప్పటికీ ఆ లా కళాశాల నిర్వాహకులు కూడా జరిగిన ఘటనపై నటి అపర్ణ బాలమురళికి క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా ఆ విద్యార్థిపై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో అపర్ణతో ఆటలా? చేయి వేస్తే సస్పెండే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా నటి అపర్ణపై జరిగిన అనాగరిక చర్యను నటి మంజిమ మోహన్, మొదలగు పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. A college student misbehaved with actress Aparna Balamurali during the promotion function of Thangam movie. @Vineeth_Sree I'm surprised about your silence 🙏 What the hell #Thankam film crew doing there. @Aparnabala2 #AparnaBalamurali pic.twitter.com/icGvn4wVS8 — Mollywood Exclusive (@Mollywoodfilms) January 18, 2023 -
లా స్టూడెంట్ పై ఎమ్మెల్యే పీఏ అత్యాచారం
-
లా విద్యార్థిని బలవంతంగా కామాంధుల వద్దకు.. ఎమ్మెల్యే ప్రైవేటు పీఏతోపాటు
సాక్షి, వరంగల్ క్రైం: న్యాయ విద్య చదువుతున్న ఓ విద్యార్థినికి తీరని అన్యాయం జరిగింది. కాసుల కక్కుర్తితో ఓ హాస్టల్ నిర్వాహకురాలు.. ఆ విద్యార్థిని జీవితంతో చెలగాటం ఆడింది. కొన్నిరోజులుగా తనకు పరిచయమున్న వారి కామవాంఛ తీర్చేందుకు బాధితురాలిని బలవంతంగా వారి వద్దకు పంపింది. ఈ వేధింపులు భరించలేని విద్యార్థిని చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ప్రైవేటు పీఏ ఉండటం గమనార్హం. హనుమకొండలోని ఓ ప్రైవేటు న్యాయ కళాశాలలో ఎల్ఎల్బీ నాలుగో సంవత్సరం చదువుతున్న సిద్దిపేటకు చెందిన ఓ విద్యార్థిని.. కళాశాలకు సమీపంలోని ప్రైవేటు హాస్టల్లో ఉంటోంది. హాస్టల్ నిర్వాహకురాలు వేముల శోభ ఆ విద్యార్థినిని తనకు పరిచయం ఉన్న వ్యక్తుల వద్దకు కొన్నిరోజులుగా బలవంతంగా పంపుతోంది. చదవండి: (ఆర్ఎంపీ వైద్యం చేస్తూ.. యువతులతో వ్యభిచారం) ఈ దారుణాన్ని భరించలేని బాధితురాలు రెండు రోజుల క్రితం హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హాస్టల్ నిర్వాహకురాలి మరిది, అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ప్రైవేటు పీఏ అయిన వేముల శివకుమార్, హనుమకొండ చౌరస్తా సమీపంలో మెడికల్ షాపు నిర్వహించే కోట విజయ్‌కుమార్ అనే వ్యక్తి తనపై లైంగికదాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అలాగే నగరంలోని పలుచోట్లకు సైతం హాస్టల్ నిర్వాహకురాలు తనను బలవంతంగా పంపించిందని విద్యార్థిని పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసుల కింద హాస్టల్ నిర్వాహకురాలు వేముల శోభ, వేముల శివకుమార్, కోట విజయ్‌కుమార్‌లను గురువారం రాత్రి అరెస్టు చేసినట్లు హనుమకొండ ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. నిందితులను శుక్రవారం రిమాండ్‌కు తరలిస్తామన్నారు. బాధితురాలిని వైద్యపరీక్షలకు పంపుతామని చెప్పారు. -
Kochi: మొదట బుల్లెట్.. ఇప్పుడు బస్! స్టీరింగ్ ఏదైనా ‘లా’గించేస్తుంది!
ఇప్పటి తరం అంతా అపారమైన టెక్నాలజీని అందిపుచ్చుకుని అద్భుతాలు సృష్టిస్తుంటే.. యాన్ మేరి అన్సెలెన్ అనే యువ న్యాయ విద్యార్థి మాత్రం తనకు భారీ వాహనాలు నడపడం ఇష్టమని చెబుతూ ఏకంగా బస్సు స్టీరింగ్‌ను అవలీలగా తిప్పేస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. కొచ్చిలోని పీజీ అన్సెలెన్, స్మితా జార్జ్ల ముద్దుల కూతురే 21 ఏళ్ల యాన్ మేరి అన్సెలెన్. తండ్రి కాంట్రాక్టర్‌గా, తల్లి పాలక్కడ్ జిల్లా అడిషనల్ జడ్జ్‌గా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఎంతో చురుకుగా ఉండే మేరీ టెంత్, ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పాసైంది. ప్రస్తుతం ఎర్నాకులం లా కాలేజీలో నాలుగో సంవత్సరం చదువుతోంది. బుల్లెట్ నుంచి బస్ దాకా... జడ్జ్ కావాలన్నదే మేరి జీవిత లక్ష్యం. కానీ పదిహేనేళ్ల వయసులో డ్రైవింగ్ నేర్చుకోవాలన్న ఆసక్తి కలగడంతో బైక్ నడపడం నేర్చుకుని పదోతరగతిలో ఉండగానే ఏకంగా తన తండ్రి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్‌ని నడిపింది. పద్దెనిమిదేళ్లు నిండాక టూవీలర్, ఫోర్ వీలర్ లైసెన్స్ తీసుకుంది. లైసెన్స్ రాగానే తనకంటూ సొంత క్లాసిక్ బుల్లెట్ బండిని కొనిపించుకుంది. అప్పటి నుంచి ఆ బండి మీద చెల్లిని ఎక్కించుకుని స్కూల్లో దింపి, తను కాలేజీకి వెళుతోంది. 21వ పుట్టినరోజున నాలుగు చక్రాల భారీ వాహనాల డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకునేందుకు ట్రైనింగ్‌లో చేరింది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని గతేడాది ఫిబ్రవరిలో భారీవాహనాల లైసెన్స్‌ను కూడా తీసుకుంది. బస్ డ్రైవర్‌గా... లైసెన్స్ రాగానే మేరి ఇంటిపక్కనే ఉండే ప్రైవేట్ బస్ యజమాని శరత్‌తో మాట్లాడి అతని బస్సుని నడిపేది. మేరీ ధైర్యాన్ని చూసి ముచ్చటపడ్డ శరత్ బస్సుని రోడ్డు మీద నడపడానికి మేరీకి అనుమతిచ్చాడు. మరికాస్త నమ్మకం ఏర్పడిన తరువాత ప్రయాణీకుల్ని ఎక్కించుకుని బస్సును నడిపేందుకు ప్రోత్సహించాడు. దీంతో కక్కానాడ్–పెరుంబదాప్పు మార్గంలో ఉదయం ఆరున్నర గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చే బస్‌డ్రైవర్‌గా పనిచేస్తోంది. ఆదివారం వచ్చిందంటే మేరీ ఈ రూట్లో ఉచితంగా బస్సుని నడుపుతూ అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటిదాకా లా విద్యార్థి, పవర్ లిఫ్టర్, కీబోర్డు ఆర్టిస్ట్‌గా మంచిపేరు తెచ్చుకున్న మేరీ తాజాగా డ్రైవర్‌గా మన్నన లు పొందుతోంది. జేసీబీలు, పెద్దపెద్ద కంటైనర్లు నడపడం నేర్చుకోవాలని ప్రస్తుతం మేరీ శిక్షణ తీసుకుంటోంది. వారం మొత్తం లా చదువుకు సమయం కేటాయించి, ఆదివారం మాత్రమే ప్రైవేటు బస్ డ్రైవర్‌గా పనిచేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. భయపడినవారంతా ఫ్రెండ్స్ అయ్యారు! ‘‘తొలిసారి నేను బస్సు నడపడం చూసిన వారంతా ..‘‘ఈ అమ్మాయి కచ్చితంగా యాక్సిడెంట్ చేస్తుంది. ఈ బస్సు ఎక్కితే మనం అయిపోయినట్లే అనుకునేవారు’’. అయితే వారం వారం అదే రూట్లో నేను బస్సు జాగ్రత్తగా నపడడం చూసిన వారందరికి క్రమంగా నా మీద నమ్మకం ఏర్పడి బస్సు ఎక్కేవారు. ఏ రంగంలోనైనా మంచి, చెడు రెండూ ఉంటాయి. వాటిని దాటుకుని ముందుకు సాగినప్పుడే కదా కలలు నెరవేరేది’’. – యాన్ మేరి అన్సెలెన్. చదవండి: Mittal Gohil: మేడం దీదీలా ఎదగాలి -
అంత బలుపేంటి భయ్యా.. కారు ఉంటే ఇంట్లో పెట్టుకో చౌదరి సాబ్..
తనకే కారు ఉందని రెచ్చిపోయాడు.. రోడ్డు మీద స్పీడ్ పెంచి కారు నడిపి.. బైకర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైకర్ తీవ్రంగా గాయపడగా.. పోలీసులు కేసు నమోదు చేసి సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇక.. ట్విస్ట్ ఏంటంటే అతనో ‘లా’ విద్యార్థి కావడం విశేషం. వివరాల ప్రకారం.. అర్జంఘర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ బైకర్, కారు డ్రైవర్ల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో స్కార్పియో డ్రైవ్ చేస్తున్న అనుజ్ చౌదరి.. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై వెళ్తున్న శ్రేయాన్ష్‌ను హై స్పీడ్‌లో కారుతో ఢీకొట్టాడు. అంతకు ముందు బైకర్‌ను బూతులు తిడుతూ.. కారుతో తొక్కించి చంపేస్తానంటూ బైకర్లను హెచ్చరించాడు. ఈ క్రమంలో ఓ బైకర్‌ను వెనుక నుంచి కారుతో వేగంగా ఢీకొట్టాడు. కారు ఢీకొట్టడంతో కింద పడిపోయిన బైకర్.. శ్రీయాన్ష్ తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను అనురాగ్ అయ్యర్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అనంతరం, పీఎంవో ఇండియా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డీసీపీ న్యూఢిల్లీలను ట్యాగ్ చేశాడు. ఈ సందర్భంగా బాధితుడు శ్రేయాన్ష్ మాట్లాడుతూ.. తాను, తన స్నేహితులు కలిసి ఆరావళిలోని టెంపుల్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న అనుజ్‌తో వాగ్వాదం జరిగిందన్నాడు. ట్విట్టర్ వీడియోతో రంగంలోకి దిగిన పోలీసులు.. అనుజ్ చౌదరిపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అతడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. కారును సీజ్ చేసినట్టు చెప్పారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. @PMOIndia @ArvindKejriwal @DCPNewDelhi Please help us , the Scorpio Car driver almost killed a few of our riders and threatened to kill us by crushing us under the car. This is not what we vote for or pay taxes for no one was severely injured Gears respect riders pic.twitter.com/rcZIZvP7q4 — ANURAG R IYER (@anuragiyer) June 5, 2022 ఇది కూడా చదవండి: మ్యూజియం పై దాడి చేసిన యువకుడు... కారణం విని షాక్ అయిన పోలీసులు -
పరీక్షలో ఫెయిల్ చేశారని పోలీసులకు ఫిర్యాదు!
ఎచ్చెర్ల క్యాంపస్(శ్రీకాకుళం): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం న్యాయ విభాగంలో దురుద్దేశంతో తనతో పాటు కొందరు విద్యార్థులను పరీక్షల్లో ఫెయిల్ చేశారని, ఇందుకు బాధ్యులైన ఇద్దరు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విద్యార్థి రంగరాజుల గోపీనాథ్ తెలిపారు. సిలబస్‌లో లేని ప్రశ్నలు 50 శాతం ప్రశ్నపత్రంలో రావడంతో బోధకులను నిలదీశామని, దీనిపై కక్ష పెట్టుకొని ఫెయిల్ చేశారని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేయడం యూజీసీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. పోలీసులు కేసునమోదు చేసి విచారణ నిర్వహించాలని కోరారు. విశ్వవిద్యాలయం అధికారులు స్పందించి ప్రత్యేక కమిటీ వేయాలని, జవాబు పత్రాలను ఇతర విశ్వవిద్యాలయాలకు చెందిన అర్హులైన బోధకులతో పునఃమూల్యాంకనం చేయాలని విన్నవించారు. ఈ విషయమై ఎచ్చెర్ల ఎస్సై కె.రాము వద్ద ప్రస్తావించగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. చదవండి: Kirru Cheppulu: ట్రెండ్ మారింది.. కిర్రు చెప్పుల ‘సోగ్గాడు’ -
Tempus Law Associates: న్యాయ మార్గదర్శనం
అది 1988. బెంగళూరులో ఉన్న ‘నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ’లో అప్పుడే ప్రవేశ పెట్టిన ఐదేళ్ల న్యాయశాస్త్రం కోర్సులో చేరింది ఓ అనంతపూరమ్మాయి. 1993 తొలి బ్యాచ్ బయటకు వస్తున్న వేడుకలవి. ఐదు బంగారు పతకాలతో కాలేజ్ టాపర్‌గా నిలిచింది అదే అమ్మాయి. ఆమె సెవెన్త్, టెన్త్, ఇంటర్లో స్టేట్ ర్యాంకర్. ఎల్ఎల్బీలో ఐదు బంగారు పతకాలతో టాపర్. ఏడుకి ఆరు పాయింట్ ఎనిమిది సీజీపీఏతో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ టాపర్స్ బోర్డులో ఇప్పటికీ ఆమె రికార్డు అలాగే ఉంది. చదువుకు అంతం లేదని నిరూపిస్తూ నిరంతరం చదువుతూనే ఉన్న సుందరి పిశుపాటి న్యాయశాస్త్రం మనిషిని నిత్యవిద్యార్థిగా మారుస్తుందంటారు. మహిళలకు అవకాశాలు మెరుగయ్యాయి. అన్ని రంగాలూ మహిళల కోసం ఎదురు చూస్తున్నాయి. సమాజ ధోరణి కూడా మారుతోంది. ఒకప్పుడు మహిళ గృహిణి పరిధి దాటి తనకంటూ ఒక గుర్తింపును కోరుకుందీ అంటే... అది టీచర్, డాక్టర్ వరకే పరిమితం. ఆ తర్వాత లాయర్ గౌన్‌కు కూడా క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ రంగం ఆ రంగం అనే పరిధులు లేవు. ఇంతవరకు చూడని రంగంలో మహిళను చూసినా కూడా ఒకింత ఆశ్చర్యానికి మరింత ఆనందానికి లోనవుతోంది తప్ప... సమాజం ఒకప్పటిలాగా తేలికగా చూడడం లేదు. సమాజం ఆలోచన విస్తృతమైంది. ఈ మార్పు కూడా మహిళ సాధించిన ప్రగతి అనే చెప్పాలి. ఎందుకంటే గడచిన తరాల తల్లులు తమకు అడ్డుగోడలుగా ఉన్న ఆంక్షల పరిధులను తన పిల్లల మెదళ్లలో ఇంకనివ్వకుండా జాగ్రత్తపడడమే. ఇవన్నీ మగవాళ్ల రంగాలు అనే దురభిప్రాయాన్ని చెరిపివేస్తూ సాగుతున్న మహిళ విజయ ప్రస్థానంలో సుందరి పిశుపాటి లా ఫర్మ్ స్థాపించి తక్కెడను సమం చేశారు. ఈ రంగంలో మహిళలను న్యాయవాదులుగా లేదా జడ్జిలుగా మాత్రమే చూస్తుంటాం. సుందరి స్థాపించిన టెంపస్ లా అసోసియేట్స్ ఇప్పుడు పాతికమంది లాయర్లు మరో ఐదుగురు న్యాయేతర సిబ్బందితో నడుస్తోంది. సమాజంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ముందడుగు వేయవలసిందిగా స్టార్టప్ ఆలోచనలు ఉన్న మహిళలకు ఆహ్వానం పలుకుతున్నారు సుందరి. అవకాశం తలుపుతట్టింది ‘‘నేను పుట్టింది అనంతపురం జిల్లా గుత్తిలో. పెరిగింది చిత్తూరు, చెన్నైలలో. మా తాత లాయర్. మా నాన్న హిందుస్థాన్ యాంటీబయాటిక్స్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్. నాకు న్యాయవాద వృత్తి కచ్చితంగా సూటవుతుందనుకున్నారాయన. అలాగే ప్రోత్సహించారు. నేను లా పట్టాతో హైదరాబాద్‌కి వచ్చి హైకోర్టులో ఓ సీనియర్ లాయర్ దగ్గర అప్రెంటీస్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టాను. మూడేళ్ల తర్వాత నాకు యూఎస్‌లో మాస్టర్స్ చేసే అవకాశం వచ్చింది. అప్పటికి మా అబ్బాయి ఏడు నెలల బిడ్డ. నిజానికి నా కెరీర్లో అసలైన మలుపు అదే. ఆ క్షణంలో ఇంట్లో వాళ్లు ‘చంటిబిడ్డను వదిలి ఎలా వెళ్తావు’ అంటే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. ‘బాబుని చూసుకుంటాం’ అని అమ్మానాన్న సపోర్టుగా నిలిచారు. ‘అవకాశం ఒక్కసారే వస్తుంది. అప్పుడే అందిపుచ్చుకోవాలి. వదులుకోవద్దు’ అని మామగారు ధైర్యం చెప్పారు. అత్తగారు, మా వారు కూడా అదే మాటన్నారు. అలా కొలంబియా యూనివర్సిటీ నుంచి 1998లో ఎల్ఎల్ఎమ్ పూర్తి చేయడం, కఠినమైన న్యూయార్క్ బార్ ఎగ్జామ్ పూర్తి చేయడంతోపాటు అక్కడే ప్రాక్టీస్ కూడా చేశాను. సిడ్లీ – ఆస్టిన్ బ్రౌన్ అండ్ ఉడ్ లా ఫర్మ్ యూఎస్‌లోని అతి పెద్ద లా ఫర్మ్‌లలో ఒకటి. రెండు వేల ఐదు వందల మంది లాయర్లు ఉంటారు. అందులో ప్రాక్టీస్ చేయడం నాకు బాగా ఉపయోగపడింది. సొంత ఫర్మ్ ఇండియాకి 2003లో వచ్చాను. ఆ తర్వాత ఐదేళ్లకు నేను కో మేనేజింగ్ పార్టనర్‌గా, నా భర్త రవిప్రసాద్ పార్టనర్‌గా టెంపస్ లా అసోసియేట్స్ మల్టీ స్పెషాలిటీ లా ఫర్మ్ స్థాపించాం. బెంగళూరు, కాలిఫోర్నియాలో బ్రాంచ్‌లు కూడా స్వయంగా చూసుకుంటున్నాం. టెంపస్ అంటే ‘అంది వచ్చిన అవకాశం, మంచి అదృష్టం’ అని అర్థం. నా జర్నీ చాలా సక్సెస్‌ఫుల్‌గా సాగుతోందని చెప్పడానికి ఎటువంటి సందేహమూ అక్కర్లేదు. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇంటర్నేషనల్ ఫండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బయో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ కంపెనీలు... ఇలా మా క్లయింట్ల జాబితా చాలా విస్తృతమైనది. కార్పొరేట్, రియల్ ఎస్టేట్, లిటిగేషన్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, కమర్షియల్ లాస్... ఏరియాలో ఎక్కువగా పని చేస్తున్నాను. అందుకే నేను కొత్త తరం మహిళలకు న్యాయసేవ మీద దృష్టి కేంద్రీకరించాను. ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపిస్తున్న వాళ్లకు మా అవసరం ఉండదు. కానీ ఈ తరం మహిళల్లో సొంతంగా పరిశ్రమ స్థాపించి నిర్వహించాలనే ఆకాంక్ష ఉన్న వాళ్లు ఎక్కువవుతున్నారు. ఇది మంచి పరిణామం కూడా. అయితే వాళ్లకు తమ ప్రాజెక్టు ఎలా స్థాపించాలో, ప్రభుత్వ పరమైన చట్టాలు ఎలా ఉన్నాయో, విదేశీ చట్టాల పరిధిలో ఇబ్బందులు ఎదురు కాకుండా కంపెనీ స్థాపించేటప్పుడే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం ఒక మహిళగా నా బాధ్యత అనుకున్నాను. ఎక్కడ నా సేవ అవసరమవుతుందో అక్కడ మహిళలకు మార్గదర్శనం చేయడానికి ముందుంటున్నాను. ట్యాక్స్ మినహాయింపులు, సీడ్ క్యాపిటల్ అరేంజ్మెంట్, జాయింట్ వెంచర్ నిర్వహణ, ప్రైవేట్ లిమిటెడ్ స్థాపన, ఐపీవో వంటివన్నీ వివరిస్తాం. ఈ సర్వీస్ పూర్తిగా ఉచితం. ఇలా నేను కోవె, ఫిక్కీ ఎఫ్ఎల్వో ద్వారా మహిళలకు న్యాయ సేవలందిస్తున్నాను. అలాగే టీ హబ్ ద్వారా కూడా నా వంతు సర్వీస్ ఇస్తున్నాను. మహిళల విషయానికి వచ్చేటప్పటికి ప్రభుత్వాలు చాలా ధారాళంగా పథకాలు రూపొందిస్తున్నాయి. కానీ బ్యాంకులు నాన్ కొలాటరల్ లోన్ ఇవ్వడంలో అంతగా చొరవ చూపించడం లేదు. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి మేము వెంచర్ క్యాపిటలిస్టులతో అనుసంధానం చేస్తున్నాం. మహిళలను ప్రోత్సహించడానికి మహిళలే స్థాపించి మహిళలే నిర్వహిస్తున్న స్టార్టప్‌లే లక్ష్యంగా ‘షీ క్యాపిటల్’ ఫండ్ ద్వారా ఒక వేదిక మీదకు వచ్చిన క్యాపిటలిస్టుల సహకారం తీసుకుంటున్నాం. మహిళలకు మెంటార్షిప్ చేయడంలో సంతృప్తి ఉంది. ఎందుకంటే... న్యాయవాద వృత్తి ట్వంటీఫోర్ బై సెవెన్ డ్యూటీ, ఎప్పుడూ సబ్జెక్టుకు దగ్గరగా ఉండాలి, క్లయింట్‌కు రెస్పాండ్ అవుతూ ఉండాలి. ఇంతటి ఒత్తిడి ఉండే వృత్తిలో సాటి మహిళల కోసం చేస్తున్న ఈ సర్వీస్ సంతోషాన్నిస్తుంది’’ అన్నారు సుందరి పిశుపాటి. విజయానికి తొలిమెట్టు ప్రొఫెషన్లో నిలదొక్కుకోవడంలో మహిళ అయిన కారణంగా ప్రత్యేకంగా ఎదురైన ఇబ్బందులేమీ లేవు. కానీ లాయర్‌గానే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. గుడ్ క్వాలిటీ వర్క్, గుడ్ క్వాలిటీ క్లయింట్లను నిలుపుకోగలిగితే అదే విజయానికి తొలిమెట్టు... మలిమెట్టు కూడా. కుటుంబాన్ని, ప్రొఫెషన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది ప్రతి వర్కింగ్ ఉమన్కీ తప్పదు. నాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరూ లాయర్లే. ఇంత స్థాయిలో ఒత్తిడి అవసరమా అని మా పిల్లల విషయంలో అనిపించింది. కానీ వాళ్లు మమ్మల్ని చూసి మా దారిలోనే నడుస్తున్నారు. మాది లాయర్ల ఫ్యామిలీ అయిపోయింది. మా సొంత ఫర్మ్ ఉన్నప్పటికీ మా అబ్బాయిని సొంతంగా అప్రంటీస్‌గా బయట ప్రాక్టీస్ చేయమని చెప్పాం. పని ఒంటబట్టాలంటే పనిని పనిలాగానే నేర్చుకోవాలి. – సుందరి ఆర్ పిశుపాటి, టెంపస్ లా అసోసియేట్స్, హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి ఫొటో: నోముల రాజేశ్ రెడ్డి -
జర్నలిస్టుకు బెదిరింపులు: లా స్టూడెంట్ అరెస్ట్
జైపూర్: ఢిల్లీకి చెందిన మహిళా జర్నలిస్ట్‌ను అత్యాచారం చేసి చంపుతానంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు దిగాడు. సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడ్డ సదరు వ్యక్తిని రాజస్తాన్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు రోడ్లెక్కిన విషయం తెలిసిందే. రోహిని సింగ్ అనే పాత్రికేయురాలు వారి ఆందోళనను రిపోర్టింగ్ చేసింది. న్యాయ విద్యను అభ్యసిస్తున్న 26 ఏళ్ల కపిల్ సింగ్‌కు ఆమె రిపోర్టింగ్ నచ్చలేదు. దీంతో సదరు పాత్రికేయురాలిపై బెదిరింపులకు దిగాడు. అత్యాచారం చేసి ప్రాణాలు తీస్తానని హెచ్చరించాడు. దీంతో రోహిని అతడి మీద చర్యలు తీసుకోమని కోరుతూ ఉదయ్‌పూర్ పోలీసులు, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌ను ట్యాగ్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఉదయ్‌పూర్‌లోని సెమారీకి చెందిన కపిల్‌ను అరెస్ట్ చేశారు. (చదవండి: బెంగుళూరులో చంపారు.. రావూరులో పూడ్చారు..) -
చిన్మయానంద కేసులో భారీ ట్విస్ట్
లక్నో: కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద లైంగిక దాడి కేసు కీలక మలుపు తిరిగింది.. చిన్మయానంద తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ గతేడాది ఆరోపించిన లా విద్యార్థిని తాజాగా యూటర్న్ తీసుకుంది. ఆయన తనపై లైంగిక దాడికి పాల్పడలేదని కోర్టు ముందు పేర్కొంది. దాంతోపాటు ఆయనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది. అయితే ఆమె కేసు వాపస్ తీసుకోవడానికి గల కారణాలు మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. షహజాన్‌పూర్‌లో చదువుతున్న లా విద్యార్థిని గతేడాది ఆగస్టులో కనిపించకుండా పోయింది. తరువాత తిరిగి వచ్చిన ఆమె మాజీ మంత్రి చిన్మయానందపై లైంగిక ఆరోపణలు చేసింది. చాలా పోరాటాలు జరిగిన తరువాత గతేడాది సెప్టెంబర్‌లో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అలహాబాద్ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక బ్రాంచ్ ఈ కేసు విచారణను చేపట్టింది. ఫిబ్రవరిలో చిన్మయానంద బెయిల్‌పై బయటకు వచ్చారు. మంగళవారం ఈ కేసు విచారణకు రాగా, చిన్మయానంద తనపై ఎలాంటి లైంగిక దాడికి పాల్పడలేదని విద్యార్థిని కోర్టుకు తెలిపింది. అయితే మాజీ మంత్రి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ గతంలో ఆరోపించిన విద్యార్థిని తాజాగా మాట మార్చడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆమెపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. న్యాయ విద్యార్థిని మాట మార్చడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: బెయిల్‌పై వచ్చి ఘనంగా బర్త్‌డే -
లా విద్యార్థికి ఆరు నెలల జైలు
ఇబ్రహీంపట్నంరూరల్: గంజాయితో పట్టబడ్డ విద్యార్థికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ ఇబ్రహీంపట్నం 25వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తీర్పు వెల్లడించారని ఆదిబట్ల సీఐ నరేందర్ శుక్రవారం తెలిపారు. హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లో నివాసం ఉంటున్న సాయిని అరవింద్ అనే విద్యార్థి గంజాయితో పట్టుబడ్డాడు. ఇతని స్వస్థలం కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలం చందోలి. నగరంలోని దోమల్‌గూడలోని ఏవీ కళాశాలలో న్యాయవాద విద్య మూడో సంవత్సరం చదువుతున్నాడు. కరీంనగర్‌లోని చెడు వ్యసనాల వల్ల అతనికి గంజాయి అలవాటైంది. ఈ క్రమంలో 17– 7– 2017వ తేదీన సాయంత్రం 5:30 గంటలకు సిల్వర్ కలర్ ఆల్టో కారులో గంజాయి పొట్లాలతో వస్తూ ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగ్లూర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అప్పటి సీఐ గోవింద్‌రెడ్డికి పట్టుబడ్డారు. దీంతో అతన్ని అరెస్టు చేసి గంజాయి, వాహనం, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ మంగళ్‌హాట్ దూళ్‌పేట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గంజాయిని కొనుగోలు చేశానని, తనకు గంజాయి తాగే అలవాటు ఉందని పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఈ కేసును విచారణ జరిపిన ఇబ్రహీంపట్నం 25వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ నిందితుడిని దోషిగా గుర్తిస్తూ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు తెలిపారు. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గోవింద్‌రెడ్డి, వరలక్ష్మి, శేఖర్ ఈ విచారణలో ఉన్నట్లు సీఐ నరేందర్ తెలిపారు. -
ఇయర్ ఫోన్స్ పెట్టుకుని.. మొబైల్ చూస్తూ..
సెల్‌ఫోన్.. ఇది మనిషికి ప్రస్తుతం ఎంతో అత్యవసరమైన, ఇష్టమైన వస్తువు. చాలా పనులు దీని ద్వారానే చేసుకుంటున్నారు. ఒక్కోసారి ఇది ప్రాణం మీదకు తెస్తోంది. మొబైల్ చూస్తూ రోడ్డు, రైలు పట్టాలు దాటుతూ ప్రమాదాల బారిన పడిన వారెందరో. జాగ్రత్తగా ఉండాల్సిందిపోయి మరింత నిర్లక్ష్యంగా ఉంటూ కొందరు ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. అలాంటి ఘటనే నెల్లూరులో చోటుచేసుకుంది. నెల్లూరు(క్రైమ్): చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పట్టాలు దాటే సమయంలో రైలు ఢీకొని వీఆర్ లా కళాశాల విద్యార్థి మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని విజయమహాల్‌గేటు సమీపంలో చెన్నై వైపు వెళ్లే రైలుపట్టాలపై సోమవారం చోటుచేసుకుంది. దీంతో బాధిత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. రైల్వే పోలీసులు, సంఘటనా స్థలంలోని వారి కథనం మేరకు.. సంగం తూర్పువీధిలో ఉపాధ్యాయడు డి.నరసింహారెడ్డి కుటుంబం నివాసం ఉంటోంది. ఆయనకు భార్య, కుమారుడు రామ్‌ప్రతాప్‌రెడ్డి (23), కుమార్తె ఉన్నారు. పత్రాప్‌రెడ్డి నెల్లూరు వీఆర్ లా కళాశాలలో లా రెండో సంవత్సరం చదువుతున్నాడు. ప్రతిరోజూ కళాశాలకు వచ్చి వెళ్లేవాడు. ఎప్పటిలాగే సోమవారం అతను ఇంటినుంచి బస్సులో నెల్లూరుకు చేరుకున్నాడు. మినీబైపాస్‌లో బస్సు దిగి నడుచుకుంటూ కళాశాలకు బయలుదేరాడు. విజయమహాల్‌గేట్ సమీపంలో చెన్నై వైపు వెళ్లే రైలుపట్టాలు దాటసాగాడు. చెవులకు ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని మొబైల్లో మాట్లాడుతున్నాడో? లేదా సంగీతం వింటున్నాడో తెలియదుకానీ రైలు రావడాన్ని గమనించలేదు. దీంతో అతడిని వేగంగా రైలు ఢీకొంది. ప్రతాప్‌రెడ్డి రెండు కాళ్లు మోకాళ్ల వద్దకు తెగిపోయి వేరుగా పడిపోయాయి. తలకి తీవ్రగాయమైంది. రెండు చేతులు విరిగిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై డీసీ వెంకయ్య సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద లభ్యమైన ఆధారాల ద్వారా బాధిత కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. అనంతరం ప్రభుత్వ వైద్యులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులుకు అప్పగించారు. చేతికందివచ్చిన కుమారుడు విగతజీవిగా మారిపోవడం చూసి బాధిత తండ్రి గుండెలవిసేలా రోదించారు. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంగంలో విషాదఛాయలు సంగం: రామ్‌ప్రతాప్‌రెడ్డి మృతితో సంగంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి విష యం తెలియగానే తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, మండల వైఎస్సార్సీపీ నేతలు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ప్రతాప్ సంగంలో ఇంటర్ చదివాడు. -
‘ఢిల్లీకి వచ్చి పెద్ద తప్పు చేశాను’
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి వచ్చి చాలా పెద్ద తప్పు చేశానని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో న్యాయవిద్యను అభ్యసిస్తున్న విద్యార్థి మిన్హాజుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 15న జామియా యూనివర్సిటీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనల్లో పోలీసులు విచక్షణరహితంగా విద్యార్థులపై లాఠీఛార్జి చేసిన విషయం తెలిసిందే. ఈ పోలీసుల దాడిలో మిన్హాజుద్దీన్ కంటికి తీవ్రంగా గాయం కావటంతో పాక్షికంగా చూపు కోల్పోయారు. లైబ్రరీలో చదువుకుంటున్న సమయంలో అకారణంగా పోలీసులు తనపై లాఠీచార్జ్ చేశారని తెలిపారు. నిరసనలు ఏడో గేటు వద్ద జరుగుతుంటే పోలీసులు లైబ్రరీలోకి చొరబడి దాడి చేశారని పేర్కొన్నారు. తాను అసలు నిరసన కార్యక్రమంలో పాల్గొనలేదని మిన్హాజుద్దీన్ వెల్లడించారు. తనకు శాంతి భద్రతలపై పూర్తి నమ్మకం ఉందని.. ‘నేను చేసిన నేరం ఏంటి’ అని మిన్హాజుద్దీన్ సూటిగా ప్రశ్నించారు. పోలీసుల లాఠీచార్జ్‌లో తన కంటికి గాయం అయిందని దీంతో మరో కంటికి కూడా ఇన్ఫెక్షన్ సోకుతుందని వైద్యులు చెప్పినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ ఘటనతో నాకు చాలా భయంగా ఉంది. అలాగే ఇకనుంచి లైబ్రరీలో చదుకోమని ఏ విద్యార్థికి నేను చెప్పలేను. ఆ భయంతో నేను లైబ్రరీలోకి చదుకోవడానికి వెళ్లలేను. విశ్వవిద్యాలయంలో భద్రత లేదు. ఈ ఘటనతో నా తల్లిదండ్రులు బిహార్‌కి వచ్చేయాలని కోరుతున్నారు’ అని మిన్హాజుద్దీన్ తెలిపారు. తాను న్యాయ విద్యను అభ్యసించి, శిక్షణ తీసుకునేందుకు ఢిల్లీకి వచ్చినట్లు తెలిపారు. అది పూర్తైన తర్వాతే బిహార్‌కి వెళ్తానని... అయితే. ఈ ఘటనతో తాను ఎందుకు ఢిల్లీకి వచ్చానా? అని బాధ పడుతున్నానని తెలిపారు. ఎందుకో ఢిల్లీని సురక్షితమైన నగరంగా తాను భావించటం లేదని.. ఇక్కడికి వచ్చి పెద్ద తప్పుచేశానని మిన్హాజుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. -
యువతిని అపహరించి లైంగిక దాడి..
రాంచీ : హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యాచార ఘటన మరువకముందే రాంచీలో లా విద్యార్ధిని (25)ని అపహరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. ఈ దారుణానికి పాల్పడిన 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాంచీ శివార్లలో ఈనెల 26న సాయంత్రం 5.30 గంటలకు యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులు ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను చితకబాది బాధితురాలిని బలవంతంగా సమీపంలోని ఇటుకల బట్టీ వద్దకు తీసుకువెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితులందరినీ అరెస్ట్ చేసి వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎస్పీ రిషబ్ కుమార్ ఝా తెలిపారు. నిందితుల నుంచి కారు,బైక్, పిస్టల్, ఎనిమిది మొబైల్ ఫోన్లు, బాధితురాలి నుంచి లాక్కున్న ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. -
నిందితుడు ఆస్పత్రిలో బాధితురాలు జైల్లో!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ 2017లో ఓ టీనేజర్‌ను రేప్ చేశారన్న కేసును ఎలా మసి పూసి మారేడు కాయ చేయాలని రాష్ట్ర అధికార యంత్రాంగం ప్రయత్నించిందో ఇప్పుడు 23 ఏళ్ల అమ్మాయిని రేప్ చేశారన్న కేసులో చిక్కుకున్న కేంద్ర మాజీ సహాయ మంత్రి, మూడు సార్లు బీజేపీగా ఎంపీగా ఉన్న చిన్మయానంద్ విషయంలో అదే చేయడానికి అధికార యంత్రాంగం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయనపై రేప్ అభియోగాలను దాఖలు చేయాల్సిన యూపీ పోలీసులు, ‘సెక్సువల్ అసాల్ట్’ అభియోగాలను దాఖలు చేశారు. రేప్ కేసులో నేరం రుజువైతే దోషికి ఏడేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష వరకు పడుతుంది. అదే సెక్సువల్ అసాల్ట్ కేసులో అయితే ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. పైగా జైల్లో ఉండాల్సిన చిన్మయానంద్ ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారు. ఆరోగ్యం అంత సవ్యంగా ఉందని ఆస్పత్రి వర్గాలు స్పష్టంగా చెబుతున్నప్పటికీ పోలీసుల అండదండలతో ఆయన ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకుంటుండం విడ్డూరం. ఆయన తనను రేప్ చేశారంటూ కేసు పెట్టిన 23 ఏళ్ల లా విద్యార్థినినేమో జైలుకు పంపించారు. తన క్లైంట్ నుంచి డబ్బు గుంజేందుకు ప్రయత్నించిందంటూ చిన్మయానంద్ న్యాయవాది ఆ విద్యార్థినిపె ఎదురు కేసు పెట్టడంతో యూపీ పోలీసులు అతిగా వ్యవహరించారు. ఆమెకు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాధారలు కూడా ఉన్నాయంటూ పోలీసులు కోర్టు ముందు చెప్పడంతో ఆ యువతిని 14 రోజులపాటు జుడీషియల్ కస్టడీకి పంపించారు. ఆమెకు బెయిల్ ఇవ్వడానికి కూడా కోర్టు నిరాకరించింది. చిన్మయానంద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న లా కళాశాలలో చదువుతున్న 23 ఏళ్ల విద్యార్థిని, చిన్మయానంద్ తనను రేప్ చేశారంటూ ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు కేసు నమోదు చేసుకోవడానికి నిరాకరించారు. లా చదువుతున్న విద్యార్థులే తమకు జరుగుతున్న అన్యాయంపై పోరాడకపోతే ఎలా అన్న మనస్తత్వం కలిగిన ఆ లా విద్యార్థిని మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన ఘోరం గురించి చెప్పడం, ఆ నేపథ్యంలో వివిధ వర్గాల నుంచి ఒత్తిడి రావడంతో ఆయనపై పోలీసులు ఫిర్యాదు తీసుకోక తప్పలేదు. చిన్మయానంద్ తన ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలల నుంచి విద్యార్థినులను పిలిపించి వారిని లైంగికంగా లోబర్చుకునే వాడనే ఆరోపణలు కూడా ఆయనపై ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఆ విషయంలో బాధితులెవరూ ముందుకు రాలేదు. మొదటి సారి ఓ లా విద్యార్థిని ముందుకు వస్తే ఆమెపై ఎదురు కేసును పోలీసులు బనాయించారు. చిన్మయానంద్ కేసులో ప్రత్యేక దర్యాప్తు అధికారిని కూడా యోగి ప్రభుత్వం నియమించింది. తన విచారణలో చిన్మయానంద్ నేరం అంగీకరించారని, తాను చేసిన పనికి సిగ్గు పడుతున్నానని, ఇంతకు మించే తానేమీ మాట్లాడలేనంటూ వాంగ్మూలం ఇచ్చారని కేసు ప్రత్యేక దర్యాప్తు అధికారి నవీన్ అరోరా ఇప్పటికే విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అయినప్పటికీ చిన్మయానంద్‌పై రేప్ కేసు కాకుండా భారతీయ శిక్షాస్మృతిలోని 376 సీ సెక్షన్ కింద కేసు పెట్టడం పట్ల సామాజిక కార్యకర్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తనకున్న అధికారాన్ని ఉపయోగించి అమ్మాయిలను లోబర్చుకోవడం ఈ సెక్షన్ అభియోగం. ఈ కేసులో నేరం రుజువైతే ఐదు నుంచి పదేళ్ల వరకు మాత్రమే దోషికి జైలు శిక్ష పడుతుంది. ఇలాంటి కేసుల్లో నేరస్థులు శిక్ష పడకుండా తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. పరస్పర అంగీకారంతోనే సెక్స్‌లో పాల్గొన్నామని నిరూపిస్తే చాలు. అందుకు బాధితురాలిని బెదిరించో, భయపెట్టో ఒప్పిస్తే చాలు. అందుకనే తన క్లైంట్ వద్ద డబ్బులు గుంజేందుకు వల విసిరిందంటూ చిన్మయానంద్ న్యాయవాది ఆ లా విద్యార్థినిపై ఎదురు కేసు పెట్టారు. కేసును ఉపసంహరించుకునేలా చేయడం కోసమో లేదా పరస్పర అంగీకారంతో సెక్స్‌లో పాల్గొన్నామని చెప్పడం ద్వారా కేసు నుంచి తప్పించుకునేందుకు ఇది ఎత్తుగడ అని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. 23 ఏళ్ల లా విద్యార్థిని ఎక్కడైనా 72 ఏళ్ల చిన్మయానంద్తో ఇష్టపూర్వకంగా సెక్స్‌లో పొల్గొందంటే ఎవరు నమ్మగలరు? అందుకే చిన్మయానంద్ న్యాయవాది కేసు మధ్యలోకి డబ్బుల వ్యవహారం తీసుకొచ్చి ఉండవచ్చు! -
రేప్ కేసులో చిన్మయానంద అరెస్ట్
షహజాన్‌పూర్: న్యాయ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన అభియోగంపై కేంద్ర మాజీ మంత్రి స్వామీ చిన్మయానంద (72) అరెస్టయ్యారు. జిల్లా కోర్టు ఆయనకు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించిందని పోలీసులు వెల్లడించారు. తన ప్రవర్తన పట్ల ఆయన క్షమాపణలు తెలిపారు. శుక్రవారం ఉదయం 8.50 గంటలకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. భారీ బందోబస్తు నడుమ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించి కోర్టులో హాజరుపరిచారు. ‘ప్రత్యేక విచారణ బృందం (సిట్) ప్రతి విషయాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తోంది. ఇందులో జాప్యమేమీ లేదు. బాధితురాలు కేసు నమోదు చేయించే సమయంలో, ఆమె వద్ద ఉన్న వీడియో ఆధారాలను ఇచ్చింది. అవి నిజమైనవని నిర్థారించుకున్నాకే, ఆయన్ను అరెస్ట్ చేశాం’ అని డీజీపీ ఓపీ సింగ్ వెల్లడించారు. సిట్ అధికారి నవీన్ ఆరోరా మాట్లాడుతూ.. బాధితురాలు, నిందితుల కాల్ డేటాను పరిశీలించామని తెలిపారు. బాధితురాలు ఓ పెన్‌డ్రైవ్‌లో 43 వీడియోలను సిట్‌కు సమర్పించింది. చిన్మయానందకు చెందిన ఓ సంస్థలో న్యాయ విద్య అభ్యసిస్తుండగా పలుమార్లు ఆయన తనపై అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. -
‘సిట్ ఆయనను రక్షించాలని చూస్తోందా?’
లక్నో: తనపై లైంగికదాడి చేసిన బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) కేసు నమోదు చేయకుండా ఎందుకు జాప్యం చేస్తోందని బాధిత న్యాయ విద్యార్థిని ప్రశ్నించింది. కాగా సెక్షన్ 164 కింద తన వాంగ్మూలాన్ని15రోజుల నుంచి దర్యాప్తు చేస్తున్నప్పటికి చిన్మయానంద్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని ఆమె సిట్‌పై మండిపడింది. సిట్ బృందం నిందితుడిని రక్షించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోందని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా ఆధారాలు చూపించి కేసును తప్పుదోవ పట్టించాలని సిట్ చూస్తోందన్నారు. కేసు దర్యాప్తు పురోగతిపై నిరాశ వ్యక్తం చేస్తూ.. నిందితుడిపై చర్యలు ప్రారంభించడానికి తన జీవితాన్ని ముగిసే వరకు సంబంధిత అధికారులు ఎదురుచూస్తున్నారా? అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘నేను ఆత్మహత్య చేసుకుంటానంటే అధికారులు నమ్ముతారా? ప్రభుత్వం నా జీవితాన్ని ముగించే వరకు నిందితుడిపై చర్యలు తీసుకోదా? ఢిల్లీ మెజిస్ట్రేట్‌కు అత్యాచారంపై ఫిర్యాదు చేశాను. పోలీసులకు చిన్మయానంద్ గదిలో ఉన్న మద్యం సీసాల సమాచారం అందించాను. కేసుకు సంబంధించిన ఓ పెన్‌డ్రైవ్‌ను సిట్‌కు అప్పగించాను. కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను పోలీసులకు అందజేశాను. కానీ ఇప్పటివరకు కేసులో పురోగతి లేదు. సిట్ పూర్తిగా చిన్మయానంద్‌కు సహకరిస్తోందని నా అనుమానం. నాకు న్యాయం జరిగే వరకు పోరాడతా‘ అని బాధితురాలు పేర్కొన్నారు. అయితే చిన్మయానంద్ అస్వస్థతకు లోనుకావడంతో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా సిట్ బృందం దర్యాప్తులో భాగంగా పలు ఆధారాల సేకరణ కోసం బాధిత విద్యార్థిని శుక్రవారం చిన్మయానంద్ గదికి తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. -
ఆ ‘లా’ విద్యార్థిని ఆచూకీ లభ్యం
లక్నో: కేంద్ర హోంశాఖ మాజీ సహాయమంత్రి స్వామి చిన్మయానంద్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నాటి నుంచి కనిపించకుండా పోయినా షాజహన్‌పూర్ లా విద్యార్థిని ఆచూకీ లభ్యం అయ్యింది. వారం రోజుల నుంచి కనిపించకుండా పోయినా యువతి రాజస్తాన్‌లో ప్రత్యక్షం అయ్యింది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. యువతి క్షేమంగా ఉందని తెలిపారు. యువతి తన ఇష్టం మేరకే ఇంటి నుంచి వెళ్లి పోయిందన్నారు. ఆమెను రాజస్తాన్‌లో గుర్తించామని తెలిపారు. ఆమెతో పాటు మరో స్నేహితురాలు కూడా ఉందన్నారు. ఈ కేసులో తదుపరి విచారణను ప్రారంభిస్తామని తెలిపారు. వారం రోజుల క్రితం షాజహన్‌పూర్‌కు చెందిన సదరు లా విద్యార్థిని స్వామి చిన్మయానంద్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సంత్ సమాజ్‌కు చెందిన ఓ పెద్దమనిషి చాలా మంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేశాడని.. తనను కూడా చంపడానికి ప్రయత్నించాడని ఆరోపించింది. తనను కాపాడాల్సిందిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను, ప్రధాని నరేంద్ర మోదీని ఫేస్బుక్ లైవ్‌లో కోరింది. ఆ తర్వాత నుంచి సదరు యువతి కనిపించకుండా పోయింది. ఈ వీడియో యూపీలో సంచలనం సృష్టించింది. దీని ఆధారంగా యువతి తండ్రి స్వామి చిన్మయానంద్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు మాత్రం మూడు రోజుల తర్వాత చిన్మయానంద్ మీద కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ‘యువతి తండ్రి ఫిర్యాదు మేరకు స్వామి చిన్మయానంద్ ఆశ్రయంలో సోదాలు చేశాం. ఆశ్రమంలో ఉన్న కొందరితో మాట్లాడాం. యువతిని క్షేమంగా ఇంటికి చేర్చడం మా ప్రథమ కర్తవ్యం. దాన్ని పూర్తి చేశాం. ఇక ఈ కేసులో తదుపరి విచారణను ప్రారంభిస్తాం’ అన్నారు. -
లా విద్యార్థినిపై న్యాయవాది లైంగిక దాడి
చిలకలగూడ : లా కాలేజీ విద్యార్థినిపై ఓ న్యాయవాది లైంగికదాడికి పాల్పడిన సంఘటన శుక్రవారం చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.పద్మారావునగర్ వెంకటాపురంకాలనీకి చెందిన ఇమ్మినేని రామారావు న్యాయవాదిగా పని చేస్తున్నాడు. ఎల్ఎల్బీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఛాదర్ఘాట్కు చెందిన చదువులో భాగంగా సిటీ సివిల్‌కోర్టులో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. ఈ నేపథ్యవలో ఆమెకు అదే కోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్న రామారావుతో పరిచయం ఏర్పడింది. ఈ సదర్భంగా ఆమెకు తన విజిటింగ్ కార్డు ఇచ్చిన రామారావు ఏమైనా సందేహాలు ఉంటే సహాయం చేస్తానని చెప్పి ఆమె ఫోన్ నంబరు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఈనెల 21న సదరు యువతికి ఫోన్ చేసి తన ఇంటికి పిలిపించిన అతను ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషచయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. ఈనెల 25న రాత్రి మరోమారు ఆమెకు ఫోన్ చేసి తన వద్ద నగ్నచిత్రాలు, వీడియోలు ఉన్నాయని, డబ్బులు ఇవ్వాలని బెదిరించడంతో బాధితురాలు అతడి ఇంటికి వచ్చి గొడవ చేసింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన రామారావు భార్య సుప్రజ బాధితురాలిపై దాడికి దిగడంతో ఆమె డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించింది. ఆత్మహత్యాయత్నం డ్రామా చిలకలగూడ పోలీసులు అక్కడికి రావడంతో తనను అరెస్టు చేస్తారనే భయంతో రామారావు బాత్రూంలోకి వెళ్లి హార్పిక్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు నటించాడు. అయితే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఓ కార్పోరేట్ ఆస్పత్రికి తరలించగా, అతడికి ఎలాంటి ప్రాణాపాయంలేదని వైద్యులు ధృవీకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు రామారావుతోపాటు అతడి భార్య సుప్రజపై కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం రామారావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న అతడి భార్య సుప్రజ కోసం గాలిస్తున్నారు. చిలకలగూడ ఠాణాలో రామారావుపై 2016లోనే రౌడీషీట్ నమోదైఉందని, 16 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు సీఐ తెలిపారు. -
లా విద్యార్థి బలవన్మరణం
కర్నూలు, శిరివెళ్ల: కడుపునొప్పి తాళలేక లా విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్ఐ తిమ్మారెడ్డి తెలిపిన వివరాలు..మండల పరిధిలోని గోవిందపల్లెకు చెందిన గంగదాసరి చిన్న ఓబుల కొండారెడ్డి కుమారుడు రమేష్ రెడ్డి (21) జిల్లా కేంద్రంలోని ప్రసూన లా కళాశాలలో ఎల్ఎల్బీ చదువుతున్నాడు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం బంద్ ఉండటంతో కళాశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉన్నాడు. కుటుంబ సభ్యులు పనులకు వెళ్లిన తర్వాత వరండా పైకప్పునకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృత దేహాన్ని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
లా విద్యార్థిని ఆత్మహత్య
తిరుపతి క్రైం : శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీలో లా ఆఖరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని నగరంలోని ప్రైవేట్ హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఎస్వీ యూనివర్సిటీ సీఐ చంద్రశేఖర్ వివరాల మేరకు.. కడప జిల్లా శేషయ్యగారిపల్లెకు చెందిన శ్రీనివాసులు, రాజేశ్వరి కుమార్తె బి.సుస్మిత(24) పద్మావతి మహిళా యూనివర్సిటీలో లా ఆఖరి సం వత్సరం చదువుతోంది. మూడేళ్లుగా యూని వర్సిటీ సమీపంలోని ఎస్కే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటోంది. గురువారం సాయంత్రం ఆమెతో పాటుగదిలో ఉంటున్న యువతులు వచ్చి తలుపు తెరిచేందుకు ప్రయత్నించగా, గడియ పెట్టి ఉంది. అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా సుస్మిత ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కన్పించింది. తెలుసుకున్న హాస్టల్ యాజమాన్యం ఎస్వీయూ పోలీసులకు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలి గదిని పరిశీలించి, ఆమె తండ్రికి సమాచారం అందించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. -
'నన్ను, నాచెల్లిని చంపేస్తామంటున్నారు..'
సాక్షి, తిరువనంతపురం : రుతుస్రావం అనే అంశంపై ఓ పద్యాన్ని రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు కొందరు వ్యక్తులు తనను తీవ్రంగా బెదిరిస్తున్నారంటూ కేరళకు చెందిన ఓ న్యాయశాస్త్ర విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను, తనతోపాటు తన సోదరిని కూడా కొంతమంతి దుండగులు విడిచిపెట్టడం లేదని, తమను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆమె పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని పతానంతిట్ట అనే జిల్లాకు చెందిన మల్లపల్లీ అనే గ్రామానికి చెందిన నవామి రామచంద్రన్ (18) అనే యువతి నెలసరి గురించి పద్యం రూపంలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే, కొంతమంది సోషల్ మీడియా ద్వారా ఆమెను బెదిరించడమే కాకుండా స్కూల్‌కు వెళుతున్న తన సోదరి వెంట పడి తరుముతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఓ అమ్మాయి ఇప్పటికే ఇలాంటి అంశాలనే సోషల్ మీడియాలో పంచుకోగా ఆమెపై కొంతమంది దాడికి ప్రయత్నించడంతో ఆమెకు అండగా నవామి అదే అంశాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. అయితే, నవామిపై కూడా తన స్నేహితురాలిపై లాంటి దాడి మాదిరిగానే మరోదాడిని ప్రారంభించారు. 'గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా ఇది కచ్చితంగా ఆరెస్సెస్ వారిపనే అయింటుంది' అని నవామి ఆరోపించింది. కాగా, తమ మనోభావాలు దెబ్బతీయొద్దంటూ నవామిపై ఆ వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. నవామి ఎస్ఎఫ్ఐ విద్యార్థి.