రెస్టారెంట్ బయట గొడవ, పక్కన మృతి చెందిన లా విద్యార్థి దిలీప్(ఫైల్ ఫొటో)
అలహాబాద్ : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒకరి కాలు మరొకరికి తగలిందని మొదలైన చిన్న గొడవ చివరికి ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. అలహాబాద్‌లోని కాలికా రెస్టారెంట్‌లో గత శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన సంబంధించిన సీసీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దిలీప్ అనే లా సెకండియర్ విద్యార్థి తన స్నేహితులతో డిన్నర్ చేయడానికి కాలికా రెస్టారెంట్‌కు వెళ్లాడు. విజయ్ శంకర్ అనే వ్యక్తికి దిలీప్ కాలు తగిలిందన్న విషయంలో చిన్నగొడవ మెదలైంది. డిన్నర్ అనంతరం మరో సారి వీరి మధ్య గొడవ జరగడంతో రెస్టారెంట్ బయట కొట్టుకున్నారు. ఈ సమయంలో రెస్టారెంట్ వేయిటర్ మున్నా చౌహన్ ఐరన్ రాడ్‌తో దిలీప్‌పై దాడి చేశాడు. దీంతో అతను కుప్పుకూలిపోవడంతో వెంటనే బైక్‌పై ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
ఈ ఘటనంతా బయట ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. అయితే ఆ రెస్టారెంట్ యజమాని పోలీసులకు డయల్ 100 ద్వారా సంప్రదించగా దగ్గరల్లో ఉన్న గస్తీ వాహనం సమయానికి అక్కడకు చేరుకోలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు విజయ్ శంకర్, మున్నాచౌహన్‌లను అదుపులోకి తీసుకున్నారు. సమయానికి అప్రమత్తం కానీ ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు.
గొడవ దిలీప్-విజయ్ శంకర్‌కైతే వెయిటర్ ఎందుకొచ్చాడనేది పోలీసులకు అంతు చిక్కడంలేదు. వెయిటర్‌ను విచారించగా కూరగాయలతో తీసుకొస్తున్న తనను దిలీప్ కొట్టడంతో ఆగ్రహానికి లోనై రాడ్‌తో దాడిచేసానని అతను తెలిపాడని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment